2024 Hero Glamour 125 Launched in India: దేశీయ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూల ఏదో ఓ వాహనం లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో సరసమైన వాహనాలు మాత్రమే కాకుండా ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనికి దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్స్ వంటి కంపెనీలు ఈ విభాగంలో బైకులను లాంచ్ చేస్తూ ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) అప్డేటెడ్ గ్లామర్ 125 బైక్ లాంచ్ చేసింది.
రేటు (Price)
భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 2024 గ్లామర్ 125 (2024 Glamour 125) లాంచ్ చేసింది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ బ్రేక్ వేరియంట్ (రూ. 83598), రెండు డిస్క్ బ్రేక్ వేరియంట్ (రూ. 87598) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్.
కలర్ ఆప్షన్స్ (Colour Options)
కొత్త 2024 హీరో గ్లామర్ 125 కమ్యూటర్ బైక్ ఇప్పుడు కొత్త బ్లాక్ మెటాలిక్ సిల్వర్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. అయితే ఈ కలర్ బైక్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ – బ్లాక్, స్పోర్ట్ రెడ్ బ్లాక్ వంటి పెయింట్ స్కీమ్ కలిగిన బైకుల ధర కంటే రూ. 1000 ఎక్కువ ఖరీదైనది.
డిజైన్ (Design)
2024 హీరో గ్లామర్ 125 బైక్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ బైకు మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది కొత్త కలర్ ఆప్షన్ పొందింది కాబట్టి ఫ్రంట్ కౌల్, ఫ్యూయెల్ ట్యాంక్ మీద చెక్డ్ గ్రాఫిక్స్ డిజైన్ పొందుతుంది. కాబట్టి చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇక ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు గ్రాబ్ రెయిల్ అన్నీ కూడా సాధారణ మోడల్ మాదిరిగానే ఉన్నాయి.
ఫీచర్స్ (Features)
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో స్టాండర్డ్ బైకులోని అదే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు.. హీరో మోటోకార్ప్ యొక్క ఐ3ఎస్ సిస్టం ఉంటాయి. ఈ సిస్టం (i3S) వల్ల బైక్ స్థిరంగా ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. తద్వారా ఇంధనం (ఫ్యూయెల్) ఆదా అవుతుంది. తద్వారా రైడర్ ఇంకొంత ఎక్కువ మైలేజ్ పొందవచ్చు.
ఇంజిన్ (Engine)
2024 హీరో గ్లామర్ బైక్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో అదే 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 10.3 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 10.4 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరులో కూడా ఎటువంటి మార్పు లేదు.
సస్పెన్షన్ & బ్రేకింగ్ సిస్టం (Suspension & Braking System)
కొత్త హీరో గ్లామర్ 125 బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. అయితే డిస్క్ వేరియంట్ మాత్రం ముందు భాగంలో డిస్క్ బ్రేక్ పొందుతుంది. కాబట్టి రైడింగ్ సమయంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Don’t Miss: భారత్‌లో లాంచ్ అయిన ‘ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్’ ఇదే.. ధర ఎంతో తెలుసా?
హీరో గ్లామర్ 125 మైలేజ్ (Hero Glamour 125 Mileage)
కొత్త హీరో గ్లామర్ 125 బైక్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే.. ఇది 55 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. హీరో మోటకార్ప్ లాంచ్ చేసిన ఈ బైక్ కేవలం అప్డేటెడ్ వెర్షన్ మాత్రమే. అంటే ఇప్పటికే ఈ బైక్ దేశీయ విఫణిలో గొప్ప అమ్మకాలను పొందుతుతూ ఎంతో మంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధించింది. 2024 గ్లామర్ 125 బైక్ కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.