2024 Tata Punch Launched in India: ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలు పొందుతున్న ‘టాటా మోటార్స్’ (Tata Motors) యొక్క ‘పంచ్’ (Punch) మైక్రో ఎస్‌యూవీ ఇప్పుడు ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్‌యూవీ.. ఇప్పటికే విక్రయానికి ఉన్న స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఆధునిక అప్డేట్స్ పొందుతుంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ అప్డేటెడ్ టాటా పంచ్ గురించి మొత్తం వివరాలు ఇక్కడ చూసేద్దాం..
ప్రారంభ ధర
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 6.13 లక్షలు కాగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 10.20 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ మరియు మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ఈ అప్డేటెడ్ టాటా పంచ్ వాహన వినియోగదారులు తప్పకుండా ఆకర్శించగలదని భావిస్తున్నాము.
కొత్త అప్డేట్స్
కొత్త టాటా పంచ్ ఇప్పుడు అనేక అప్డేట్స్ పొందుతుంది. ఇందులో చెప్పుకోదగ్గది 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్.. ఇది మాత్రమే కాకుండా వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ టాప్ వేరియంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.సెంటర్ కన్సోల్ ఇప్పుడు అప్డేట్ చేయబడిన కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పొందుతుంది.
అప్డేటెడ్ టాటా పంచ్ యొక్క బేస్ వేరియంట్ దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ టాప్ వేరియంట్ మాత్రం ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు చూడవచ్చు. కాబట్టి ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఫ్రంట్ పవర్ విండోస్ మొదలైనవి ఉన్నాయి. ఈ కొత్త కారులో ప్యూర్ రిథమ్ ప్యాక్ లేదు, కాబటికి దాని స్థానాల్లో రియర్ పవర్ విండోస్, పవర్ అడ్జస్ట్ వింగ్ మిర్రర్స్ ఉంటాయి.
టాటా పంచ్ అడ్వెంచర్ ట్రిమ్.. మునుపటి మాదిరిగానే అదే 3.5 ఇంచెస్ డిస్‌ప్లేతో కూడిన ఆడియో సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, యాంటీ గ్లేర్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్, పార్సెల్ ట్రే మరియు ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. రిథమ్ ప్యాక్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేసే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ అందిస్తుంది. ఇందులో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది.
కొత్త టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ మరియు అడ్వెంచర్ ప్లస్ ఎస్ వేరియంట్ల విషయానికి వస్తే.. ఈ రెండు వేరియంట్లు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ పొందుతాయి. రియర్ ఏసీ వెంట్స్, ఆటో హెడ్‌ల్యాంప్, అప్డేటెడ్ సెంటర్ కన్సోల్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి వాటితో పాటు కీలెస్ ఎంట్రీ, టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అన్నీ కూడా ఈ వేరియంట్లలో ఉన్నాయి.
ఇక అకాంప్లిష్డ్ మరియు అకాంప్లిష్డ్ ప్లస్ విషయానికి వస్తే.. ఇవి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీస్ పొందుతాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, టెయిల్ లాంప్, ఫాగ్ లాంప్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్, హైపర్ స్టైల్ వీల్స్, రియర్ వైపర్, డీఫాగర్ మరియు కూల్డ్ గ్లోవ్‌బాక్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి.
టాప్ స్పెక్ క్రియేటివ్ ప్లస్ వేరియంట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆటో హెడ్‌ల్యాంప్ మరియు వైపర్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, సన్‌రూఫ్ మొదలైనవి పొందుతాయి. మొత్తం మీద అప్డేటెడ్ పంచ్ ఆధునిక డిజైన్ మాత్రమే కాకుండా అధునాతన ఫీచర్స్ పొందుతాయి.
Don’t Miss: కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన Revolt.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
ఇంజిన్ వివరాలు
టాటా పంచ్ అప్డేటెడ్ మోడల్ అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులోని 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ బై-ఫ్యూయెల్ సీఎన్‌జీ ఇంజిన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 86.5 Bhp మరియు 115 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. సీఎన్‌జీ మోడల్ 72.5 Bhp మరియు 103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది. ఇంజిన్ ఎటువంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి పనితీరులో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది.