2025 హీరో గ్లామర్ వచ్చేసింది: రూ.89999 ధర.. కొత్త ఫీచర్స్

భారతదేశంలో అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన ‘హీరో మోటోకార్ప్’ కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 125 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగాన్ని కొత్త ‘గ్లామర్ ఎక్స్‘ బైకును విడుదల చేయడంతో ముందుకు కదిలించింది. ఈ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?, అయితే ఈ కథనం మీకోసమే..

ధర & వేరియంట్స్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘హీరో గ్లామర్ ఎక్స్’ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 89,999 & రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అయితే కంపెనీ ఈ బైకులో మొదటిసారిగా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది బైకులో చెప్పుకోదగ్గ పెద్ద అప్డేట్.

➤హీరో గ్లామర్ ఎక్స్ డ్రమ్ వేరియంట్: రూ. 89,999
➤హీరో గ్లామర్ ఎక్స్ డిస్క్ వేరియంట్: రూ. 99,999

క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ అనేది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310, కేటీఎమ్ 390 డ్యూక్ లేదా పెద్ద ప్రీమియం బైకులలో మాత్రమే కనిపించేది. కానీ హీరో మోటోకార్ప్ మొదటిసారిగా ఈ ఫీచర్‌ను తన ‘గ్లామర్ ఎక్స్’లో అందిస్తోంది. ఈ ఫీచర్ టోగుల్ వేగాన్ని సెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

డిజైన్, ఫీచర్స్ & కలర్ ఆప్షన్స్

గ్లామర్ ఎక్స్ బైక్ ముందు, వెనుక భాగంలో ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉండటం గమనించవచ్చు. సింపుల్ అండ్ షార్ప్ ట్యాంక్ ష్రౌడ్‌లు.. బాడీ ప్యానెల్స్ ఉన్నాయి.

కొత్త గ్లామర్ ఎక్స్ బైకు కలర్ ఎల్‌సీడీ డాష్ బోర్డు పొందుతుంది. ఇందులో గేర్ షిఫ్ట్ ఇండికేటర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్ వంటి ఫీచర్స్ చూడవచ్చు. యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. హీరో పానిక్ బ్రేక్ అలర్ట్ అనే ఫీచర్ కూడా పొందుతుంది. ఇది ఎమర్జెన్సీ బ్రేకింగ్ పరిస్థితుల్లో రియర్ ఇండికేటర్లను ప్లాష్ చేస్తుంది.

హీరో గ్లామర్ ఎక్స్ మొత్తం ఐదు రంగులలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ మాట్టే మాగ్నెటిక్ సిల్వర్, కంది బ్లేజింగ్ రెడ్ అనే రంగులలో.. డిస్క్ వేరియంట్ మెటాలిక్ నెక్సస్ బ్లూ, బ్లాక్ టెల్ బ్లూ, బ్లాక్ పెర్ల్ రెడ్ రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

ఇంజిన్ ఆప్షన్

హీరో గ్లామర్ ఎక్స్ 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8250 rpm వద్ద 11.40 Bhp పవర్, 6500 rpm వద్ద 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ ట్యూబ్‌లెస్ వీల్స్ కలిగిన ఈ గ్లామర్ ఎక్స్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. మొత్తం మీద ఈ బైక్ దాని మునుపటి స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా చాలా అప్డేట్స్ పొందింది. అయితే ధర కూడా కొంత ఎక్కువే. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

Leave a Comment