Tuesday, January 27, 2026

అమరావతికి మహర్దశ.. రైల్వేలైన్ రూట్ క్లియర్: కేంద్రం నుంచి రూ.2047 కోట్లు

కూటమి ప్రభుత్వం పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తమ సహాయ సహకారాలను అందిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు రూ. 432.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అమరావతి రైల్వేలైన్ అనుసంధానానికి రూ. 2,047 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

అమరావతికి రైల్వేలైన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేక రైల్వేలైన్ ఏర్పాటు చేయడానికి.. కావలసిన భూమిని చెకరించడానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 57 కిమీ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 2025 – 26 బడ్జెట్‌లో రూ. 171 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమరావతి, విజయవాడలకు రైల్వే అనుసంధానం పెంచడానికి కావలసిన ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

తీర ప్రాంతాలకు కూడా పెంచడానికి కావలసిన ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే.. కోటిపల్లి, నరసాపురం మధ్య 57 కిమీ రైల్వే నిర్మాణాన్ని రూ. 2120 కోట్లతో ప్రారంభించినట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద రైల్వే పనులన్నీ వేగవంతం అవుతున్నాయి.

సాగర తీరంలో డేటా సెంటర్

విశాఖపట్టణంలో డేటా సెంటర్ నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించిందని.. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రారభించాలనుకుంటున్న డేటా సెంటర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఆ అంశం మీద ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఈ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే.. ఎక్కువ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఢిల్లీ పెద్దలను కలిసిన నారా లోకేష్

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అక్కడ.. నితిన్ గడ్కరీ, నిర్మల సీతారామన్, అశ్వని వైష్ణవ్, పియూష్ గోయల్, జేపీ నడ్డా, జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి మొదలైనవారిని కలిశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, మరింత అభివృద్ధి కోసం కేంద్రం కూడా సహకరించాలని.. వారికి విజ్ఞప్తి చేశారు. లోకేష్ విజ్ఞప్తికి.. కేంద్ర మంత్రులు కూడా సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధికి కేంద్రం నిధులను మంజూరు చేసింది.

అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటివి ఇప్పటికే అమలు చేశారు. ఈ మధ్య కాలంలోనే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అందించడానికి స్త్రీ శక్తి పేరుతో.. ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ప్రారంభమైనప్పటి నుంచి లక్షలమంది మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి ఏడాది రూ. 15000 అని చెప్పినట్లుగానే అందించారు. అయితే ప్రతి మహిళకు నెలకు రూ. 1500, చదువుకుని ఉద్యోగం లేనివారికి నెలకు రూ. 3000 నిరుద్యోగభృతి వంటివి ఇంకా అమలు చేయాల్సి ఉంది. వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని భావిస్తున్నాము.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here