Tuesday, January 27, 2026

అన్నయ్యకు పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెష్: చిరంజీవి సుదీర్ఘ ట్వీట్

తెలుగు చిత్ర సీమలో ఓ సామాన్యుడిగా మొదలై ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్‘ ప్రయాణం ప్రారంభించి మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు. 150 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ఈయన నేడు ఎంతోమందికి ఆదర్శం. ఈయన 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో.. అంజనాదేవి, వెంకట్ రావులకు జన్మించారు. నేడు అన్న జన్మదినం సందర్భంగా జనసేన అధినేత.. మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన మెగాస్టార్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

చిరంజీవి ట్వీట్

”జన సైన్యాధక్షునికి విజయోస్తు! అంటూ ప్రారంభించి.. తమ్ముడు కళ్యాణ్, నువ్వు ప్రేమతో పంపిన జన్మదిన శుభాకాంక్షలు అందాయి. అందులో నువ్వు చెప్పిన ప్రతి మాట.. ప్రతి అక్షరం నా మనసును తాకాయి. అన్నయ్యగా నన్ను చూసి నువ్వు ఎంత గర్వపడుతున్నావో.. ఒక తమ్ముడుగా నువ్వు పొందిన విజయాలు, చేసిన పోరాటాలు చూసి అంతగా గర్విస్తున్నాను. నీ కార్యదీక్ష, పట్టుదలను నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో ఒకటి చేయాలనే తపన.. నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తినిస్తుంది.

ఇప్పుడు నీ వెనుక నిన్ను అభిమానించే కోట్లమంది జనం ఉన్నారు. ఆ సైన్యాన్ని రాజువై నడిపించు. వాళ్ళ ఆశలకు.. కలలకు కొత్త శక్తిని నీకు ఇవ్వాలని భగవంతున్న కోరుతున్నాను. అభిమానుల ఆశీర్వాదం.. ప్రేమ నీకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి. ఒక అన్నయ్యగా నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలగాలని ఆశిస్తున్నాను” అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ బర్త్‌డే విషెష్

మెగాస్టార్ చిరంజీవికి.. మేనల్లుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిరంజీవి గారు అంటూ.. మేనమామతో ఉన్న ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు సైతం చిరంజీవికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ సారి బర్త్‌డే సెలబ్రేషన్స్ అక్కడేనా?

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరు కుమార్తె శ్రీజ, మానవరాలితో పాటు వెళ్లడం కనిపించింది. ఇందులో సురేఖ కూడా ఉన్నారు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు రామ్ చరణ్, ఉపాసన, క్లింకారాతో సహా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యే అవకాశం ఉంది.

చిరంజీవి విశ్వంభర

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం ‘విశ్వంభర’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తెలిశాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కూడా.. కొన్ని గ్లింప్స్ విడుదలయ్యాయి. ఈ సినిమాలో త్రిష, కునాల్ కపూర్, ఇషా చావ్లా, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, రాజీవ్ కనకాల మొదలైనవారు నటిస్తున్నారు. కాగా ఈ మూవీ 2026 ప్రారంభంలో సంక్రాంతికి వస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Mahesh
Maheshhttp://marthatelugu.com
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here