తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బిగ్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన సందోహాన్ని ఏర్పరచుకున్నాడు. అతి తక్కువ సమయంలో కథ రాసుకోవడం, అంతే తక్కువ టైంలో సినిమా తీసి రిలీజ్ చేయడం అతనికి ఉన్న నైపుణ్యం. పూరీ సినిమాలో రాసే రాతలకే కాదు, సమాజంలో జరిగే అనేక విషయాల పట్ల ఆయన సోషల్ మీడియాలో పంచుకునే తనదైన విశ్లేషనాత్మక మాటలకు కూడా విపరీతమైన ప్రేక్షక ఘనం ఉంది. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలు అంతగా అలరించడంలేదు, డబ్బుల పరంగా కూడా పెద్ద ప్రభావం చూపించలేదు. అందుకే ఇప్పుడు తనను తాను పరీక్షించుకోవడానికి ఒక కొత్త సినిమాతో మన ముందుకొస్తున్నాడు.
సినిమా పేరు ఏమిటంటే?
గత సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా భాగం పూర్తి చేసుకుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నట్టు సమాచారం. కొత్త సినిమా పేరును ప్రకటించడంలో కొంతకాలం సస్పెన్స్ కొనసాగించి చివరికి ఈ రోజు (2026 జనవరి 16) 2026న విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా న్యూ మూవీ పేరు స్లమ్ డాగ్గా నిర్ధారించడం జరిగింది. దానికి 33 టెంపుల్స్ రోడ్ అనే ఉప శీర్షిక అయితే పెట్టారు. ఇంతకు ముందు బెగ్గర్ అనే పేరు పెడతారనే వార్త ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నేటితో ఆ పూకార్లకు చెల్లుచీటీ పాడారు.
పేరుతో పాటు.. పోస్టర్ కూడా!
సినిమా పేరుతో పాటుగా ఒకేసారి పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. ఆయన జన్మదినం రోజున మరియు పండుగ పూట అభిమానులందరికి ఒక మంచి వార్తను అయితే అందించారు. దీంతో సేతుపతి ఫ్యాన్స్ ముఖాల్లో ఉత్సాహం నెలకొంది. మూవీ పేరుకు తగినట్టే పోస్టర్‌ను కూడా బాగా డిజైన్ చేశారు. ఒక బిచ్చగాడి దుస్తుల్లో.. రక్తం పూసిన కత్తిని చేతిలో పట్టుకుని, నల్ల కళ్లద్దాలు వేసుకొని నిలబడ్డాడు. అతని చుట్టూ పూర్తి డబ్బులు నిండిన కొన్ని పెట్టెలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా మొత్తం మాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్ సేతుపతిని చూపించారు. దీన్ని బట్టి పూరి – సేతుపతి కాంబినేషన్‌లో చిత్రం విజయం సాధించేవిధంగానే కనిపిస్తోంది.
పవర్‌ఫుల్ బెగ్గర్‌గా విజయ్ సేతుపతి!
సినిమా లీడ్ రోల్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తుంటే, మిగిలిన పాత్రల్లో సంయుక్త మీనన్, టబు, బ్రహ్మానందం, దునియా విజయ్, వీటీవీ గణేష్ కనిపించనున్నారు. ఛార్మి సమర్పణలో పూరి కనెక్ట్స్ మరియు జేబీ మోషన్ పిక్చర్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాడు. ఒక స్లమ్ ఏరియాలో ఒక పవర్‌ఫుల్ బెగ్గర్‌గా విజయ్ సేతుపతి కనిపిస్తాడు అని తెలుస్తోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ చిత్రాన్ని ఇండియా (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో) మొత్తం విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. సినిమా చిత్రీకరణ దశలోనే ఉండటం కారణంగా రిలీజ్ డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు. పూరి – ఛార్మీలు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






