ప్రజాకవి వేమన గురించి దాదాపు అందరికి తెలుసు. తన పద్యాలతో సామజిక అంశాలను గురించి కళ్లకు కట్టినట్లు చెప్పిన ఈ మహానుభావుడు.. నేటికీ ఎంతోమందికి ఆదర్శనీయుడనే చెప్పాలి. చదువురాని వారు కూడా వేమన పద్యాలను అలవోకగా చెప్పేస్తున్నారంటే.. ఆయన శైలి ఎంత సులభంగా ఉండేదో అందరూ అర్థం చేసుకోవచ్చు. నేటి సమాజానికి కూడా ఈయన అవసరం చాలా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త విధానానికి తెరలేపింది. టెక్నాలజీ ద్వారా వేమనను పిల్లలకు చేరువ చేశారు.
90 రోజుల పర్యటన!
జనవరి 19న వేమన జయంతి సందర్భంగా.. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని కటారుపల్లిలో ఓ కార్యక్రమం ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగానే.. రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వేమన విజ్ఞాన యాత్రను ప్రారంభించారు. దీనిని కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ దీనికోసం ఒక బస్సును ప్రారంభించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ఈ బస్సు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలను 90 రోజుల్లో పర్యటించనుంది.
ఏఐ వేమన!
కవి, సంస్కరణవాది, తత్వవేత్త అయిన వేమన గురించి విద్యార్థులకు తెలియజేయడానికి 15మంది సభ్యుల సాఫ్ట్‌వేర్ నిపుణులు & ఇతర టెక్నీకల్ బృందాలు ఈ బస్సులో ఉంటారు. బస్సులో ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. దానిపై వేమన పద్యాలను వినవచ్చు, చరిత్రను చూడవచ్చు, వినవచ్చు. విద్యార్థులు నిపుణులతో మాట్లాడవచ్చు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంటే విద్యార్థులు వేమనను చూసే భాగ్యం పొందవచ్చు అన్నమాట. ఇదంతా ఏఐ ఘనత అనే చెప్పాలి.
నిజానికి వేమన గురించి చరిత్రలో చాలా కథలు వినిపిస్తాయి. ఎన్నెన్ని కథలు వినిపించినా.. ప్రజాకవి వేమన జీవితం చాలా అద్భుతం అనే చెప్పాలి. జీవితం అంటే ఏమిటి?, మనిషి ఎలా ఉండాలి?, ఎలా ఉండకూడదు? అనే ఎన్నో విషయాలను తన అనుభవం ద్వారా వెల్లడించిన మహా మనిషి వేమన. అన్నింటిని త్యజించి.. ఇదే జీవితం అని నమ్మి ప్రజల్లోని మూఢనమ్మకాల మీద ఎన్నో పద్యాలను ఆశువుగా చెప్పారు. దశాబ్దాలు దాటినా వేమన పద్యాలు నేటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయంటే.. అప్పటి మాటలే, ఇప్పటికీ కనిపిస్తున్నాయనడానికి నిలువెత్తు నిదరదర్శనం అనే చెప్పాలి.
వేమన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది కూడా ప్రారంభించారు. అయితే ఈసారి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి, వేమనను విద్యార్థులకు చేరువ చేశారు. ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. వేమన పద్య పఠనాలు, సాహిత్య సమావేశాలు మొదలైనవి నిర్వహిస్తారు. దీని ద్వారా సమాజంలో కొంత చైతన్యం రావాలని, వేమన బోధలు ప్రజల్లోకి వెళ్లాలని చేయడం జరుగుతుంది.
ప్రజాకవి వేమన జయంతి ఉత్సవాల ఉద్దేశం ఏమిటంటే?
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో వేమన జయంతి జరుపుకుంటారు. వేమన విగ్రహాలకు పూలమాలలు సమర్పిస్తారు. సంస్కృతికి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తారు. కులభేదాలు, మూఢనమ్మకాలను అప్పట్లోనే వేమన గట్టిగా విమర్శించారు. వేమన జయంతి ఉత్సవాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆయన పద్యాల ద్వారా సామజిక అవగాహన కల్పించడం, అంతే కాకుండా.. సమానత్వం, మానవత్వం, నైతిక విలువలను ప్రచారం చేయడం.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






