ఒక సినిమా హిట్ కొట్టగానే.. నిర్మాతలు డైరెక్టర్లకు, హీరోలకు ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం చాన్నాళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సందర్భాల్లో హీరోలు కూడా డైరెక్టర్లకు లగ్జరీ కార్లను గిఫ్ట్స్ ఇస్తూ.. సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర ఎంత?, ఇతర వివరాలు ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మెగాస్టార్ ఖరీదైన కారు గిఫ్ట్
చిరంజీవి, నయనతార నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రిలీజై మంచి హిట్ సాధించింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 300 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ సాధించింది. సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో.. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడికి ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు.
కారును గిఫ్ట్ ఇస్తూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, సేఫ్టీ చాలా ముఖ్యమని చిరంజీవి పేర్కొన్నారు. కారు నచ్చిందా అని చిరంజీవి అడగడంతో.. నచ్చడం ఏమిటి సర్ మహదానందం అని సినిమాలోని డైలాగ్ చెబుతారు అనిల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడికి గిఫ్ట్ ఇచ్చిన కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వేలార్ అని తెలుస్తోంది. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 85 లక్షల నుంచి రూ. 95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ కారు.. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో ఒకరి. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తూ ఉంటారు.
రేంజ్ రోవర్ వేలార్ కారు డీజిల్, పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 300 పీఎస్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 240 పీఎస్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 220 కిమీ / గం వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది.
డిజైన్ మరియు ఫీచర్స్ ఇలా
స్లీక్ గ్రిల్, సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటివి కలిగి ఉండే.. రేంజ్ రోవర్ వేలార్ కారు లెదర్ సీట్లు, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో చాలా లగ్జరీగా ఉంటుంది. వాహన వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో డ్యూయెల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరిడియన్ సౌండ్ సిస్టంలాంటి ఫీచర్స్ కూడా ఈ కారులో లభిస్తాయి.
రేంజ్ రోవర్ వేలార్ కారు అత్యంత సురక్షితమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. జాబితాలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్స్ ప్రమాదం సమయంలో వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. ప్రయాణిల ప్రాణాలకు కొంత రక్షణ అందిస్తాయి.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.






