ఈ మధ్య కాలంలో సంక్రాతి సందర్బంగా చాలా సినిమాలు వెంటవెంటనే థియేటర్లలో విడుదలయ్యాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, ప్రభాస్ రాజాసాబ్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
మన శంకరవరప్రసాద్ గారు భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, రాజాసాబ్ నిరాశపరిచింది, ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి యావరేజ్‌గా ఆడింది, అనగనగా ఒకరాజు సైలెంట్‌గా వచ్చి డీసెంట్ హిట్ అందుకుంది. వీటన్నిటి మధ్యలో శర్వానంద్ హీరోగా తీసిన సినిమా నారీ నారీ నడుమ మురారీ కూడా చాలా నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్ని సినిమాలు పోటీగా ఉన్నా కూడా సంక్రాతి విన్నర్‌గా నిలిచింది.
శర్వానంద్‌కు సక్సెస్
సినిమా విడుదల అయిన మొదటలో థియేటర్స్ చాలా తక్కువ ఉండటం, మిగిలిన చిత్రాలు కూడా రిలీజ్ అవ్వడంతో అంత కలెక్షన్స్ అయితే రాలేదనే చెప్పాలి. వారం చివరలో మంచి పాజిటివ్ టాక్‌తో లాభాల బాటపట్టింది. దీంతో శర్వానంద్‌కు బిగ్ రిలీఫ్ దొరికినట్టు అయింది. ఎందుకంటే శతమానం భవతి చిత్రం తరువాత శర్వకి చెప్పుకోదగిన విజయాలేవి లేవు.
నారీ నారీ నడుమ మురారి సక్సెస్ అయిన సందర్బంగా.. మూవీ టీమ్ ఒక యూట్యూబ్ ఛానల్లో చిన్న చిట్ చాట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇందులో శర్వానంద్ తన ఆవేదను వెళ్ళగక్కాడు. దాదాపు ఏడు, ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడా చెప్పుకోదగినటువంటి బలమైన గెలుపు ఒక్కటీ కూడా లేదు.
నన్ను వాడుకుని వదిలేశారు!
2017 తర్వాత శర్వ సినిమాల జాబితా చూసుకుంటే.. 2018లో పడి పడి లేచే మనసు డబ్బులు పరంగా భారీగా విఫలం అయినట్టు సమాచారం, ఆ తర్వాత 2020లో తమిళంలో మంచి క్లాసికల్ హిట్ ఇచ్చిన విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96ని తెలుగులో సమంతతో కలిసి జాను పేరుతో రీమేక్ చేశారు. అది బిలో యావరేజ్ ఆడింది. 2021లో వచ్చిన శ్రీకారం, మహా సముద్రం రెండు చిత్రాలు ఫ్లాప్ అయినట్టుగా మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఒకే ఒక జీవితం ఇది పర్వాలేదు అనిపించింది.. కానీ చెప్పుకోదగ్గ సినిమా కాలేకపోయింది. 2024లో మనమే ఇది కూడా రీమేక్ సినిమా యావరేజ్ ఆడిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఒకరకంగా చెప్పాలంటే శర్వానంద్‌కు విజయాలు లేక నిరాశే మిగిలింది. నారీ నారీ నడుమ మురారీ విజయంతో చిట్ చాట్ మధ్యలో శర్వానంద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను హెల్ప్ చేసిన ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. అందరూ నన్ను వాడుకుని వదిలేసిన వాల్లే గానీ తిరిగి నాకు ఎవరు సహాయపడలేదు అన్నారు. అంతేకాకుండా ఇంకా మాట్లాడుతూ ఒకరికి మనం హెల్ప్ చేసినప్పుడు మనం మన వాడు అనుకుంటాము కదా అలాంటప్పుడు వాళ్లు తిరిగి సాయపడాలి కదా, కానీ అలా జరగలేదు. నేను హిట్ చూసి దాదాపు ఆరు, ఏడు సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మోసం చేసే వాల్లే ఎక్కువైపోయారు. ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదని తన మనసులో ఉన్న బాధని చెప్పుకొచ్చాడు.
త్వరలో బైకర్
దీని తరువాత ఇప్పుడు బైకర్ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. 2025లోనే విడుదల అవుతుంది అనే ప్రచారం అయితే జరిగింది. కానీ నారీ నారీ నడుమ మురారీ సినిమా కోసమేమో ఆగినట్టు ఉంది. బైకర్.. ఇది ఒక బైక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ట్రైలర్ అత్యంత అద్భుతంగా వచ్చింది. ఆ చిత్రం పట్ల తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉన్నది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






