Tuesday, January 27, 2026

రిపబ్లిక్ డేలో మోదీ ‘రేంజ్’.. ఈ కారు గురించి తెలిస్తే..

2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. దేశ రాజధానిలో వేడుకలు చాలా అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆంటోనియో కోస్టా (యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్), ఉర్సులా వాన్ డెర్ లేయర్ (యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్) హాజరయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్‌కు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రేంజ్ రోవర్ కారులో వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ సెంటినెల్ అని తెలుస్తోంది.

మోదీ రేంజ్ రోవర్ సెంటినెల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చిన రేంజ్ రోవర్ సెంటినెల్ కారు ఇతర కార్ల కంటే చాలా భిన్నంగా, పటిష్టమైన భద్రతను కలిగి ఉంటుంది. దీనిని ప్రత్యేకించి ప్రధానమంత్రి కోసం రూపొందించారు. ఇదొక భారీ ఆర్మర్డ్ వెర్షన్ (అత్యున్నత స్థాయి రక్షణ అందించడానికి రూపొందించారు). అంతే కాకుండా ఇది వీఆర్8 లెవెల్ బాలిస్టిక్ సర్టిఫికేషన్ కూడా పొందింది.

రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. 7.62 మిమీ ఆర్మర్ పియర్సింగ్ రౌండ్‌లను, పెద్ద పేలుళ్లను, గ్రెనెట్ దాడులను కూడా తట్టుకోగలదు. ఇంత సురక్షితమైన కారులో.. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేదా పొగ / గ్యాస్ వంటివి వ్యాపించినప్పుడు ఆక్సిజన్ సరఫరా అందుతుంది. అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ కోసం పబ్లిక్ అడ్రస్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో భద్రత మాత్రమే కాకుండా.. అత్యాధునిక సేఫ్టీ కూడా అందుబాటులో ఉంటుంది.

ల్యాండ్ రోవర్ సెంటినెల్ కారు లోపల టచ్ ప్రో డ్యూయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇది డ్యూయల్ 10 ఇంచెస్ హై రిజల్యూషన్ టచ్‌స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఈ సెటప్ న్యావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మొదలైన వారిని కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుంది.

ఇంజిన్ వివరాలు ఇలా ఉన్నాయి

సెంటినెల్ కారులో 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది 380 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు బరువు ఏకంగా 4.4 టన్నుల కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) కావడానికి పట్టే సమయం 10.4 సెకండ్లు మాత్రమే. ఈ కారు 193 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది కఠినమైన పరిస్థితుల్లో కూడా సజావుగా ముందుకు వెళ్లగలడు. తయారీదారులు దీనిని ఆలా తయారు చేశారు.

గతంలో బెంజ్ కారు!

ఒక దేశ ప్రధాన మంత్రి ప్రయాణించే కారు కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం దానిపై కఠినమైన నిఘా ఉంచుతుంది. అత్యవసర సమయంలో కూడా లోపల ప్రయాణించే వ్యక్తి సురక్షితంగా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేసి ఉంటారు. గతంలో రేంజ్ రోవర్ సెంటినెల్ స్థానంలో.. మెర్సిడెస్ బెంజ్ కారును ఉపయోగించేవారు. బెంజ్ కారులోనే చాలామంది ప్రధాన మంత్రులు ప్రయాణించారు. ఇప్పుడు రేంజ్ రోవర్ కారును ఉపయోగిస్తున్నారు. ప్రధాన మంత్రి కోసం ఏ కారును కేటాయించినా.. దానిని చాలా పటిష్టంగా తయారు చేస్తారు. ఇది ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కూడా.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related Articles