ఒకప్పుడు కేవలం దీపాల వెలుగులో మాత్రమే మనుషులు ఉపయోగించుకునేవారు. అయితే విద్యుత్ వచ్చిన తరువాత.. ఎడిషన్ బల్బ్ తయారు చేసిన తరువాత, ఎలక్ట్రిసిటీ వినియోగం భారీగా పెరిగింది. నేడు ఒక్కో ఇంట్లో కనీసం నెలకు 100 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ ఉపయోగిస్తోంది. దీనికోసం ప్రతినెలా కరెంట్ బిల్ కట్టుకోవాల్సి వస్తుంది. ఈ కరెంట్ బిల్ కట్టడం అనేది కొంతమందికి సమస్యగా మారొచ్చు. కాబట్టి ఈ కథనంలో కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేని ఒక విధానం గురించి తెలుసుకుందాం.
సబ్సిడీ కూడా..
కరెంట్ బిల్ కట్టకుండానే.. విద్యుత్ ఎలా వస్తుందని చాలామందికి సందేహం కలుగవచ్చు. కానీ మీరు సోలార్ ఎనర్జీ ద్వారా డబ్బు చెల్లించకుండానే మీరు విద్యుత్ వినియోగించుకోవచ్చు. దీనికోసమే కేంద్రప్రభుత్వం ”పీఎమ్ సూర్య ఘర్: మఫ్ట్ బిజిలీ యోజన” అనే స్కీమ్ ప్రారంభించింది. దీనికి ప్రభుత్వమే కొంత సబ్సిడీ కూడా అందిస్తుంది.
గరిష్టంగా రూ. 78000!
ప్రధానమంత్రి సూర్య ఘర్: మఫ్ట్ బిజిలీ యోజన కింద సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకంగా స్థలం అవసరం లేదు. ఎందుకంటే ఇంటి రూఫ్ మీదనే దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం గరిష్టంగా రూ. 78వేలు వరకు సబ్సిడీ కూడా అందిస్తుంది. దీంతో మీరు ఇంటికి కావలసిన విద్యుత్ మీరే ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి నెలా.. కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతుంది.
మీ ఇంట్లోనే.. కరెంట్!
కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించడం.. ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ అందించాలని కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం సూర్య ఘర్ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చాలామంది దీనిని వినియోగించుకున్నారు, వినియోగించుకుంటున్నారు కూడా. ఈ స్కీమ్ ద్వారా మీ ఇంట్లోనే.. కరెంట్ తయారు చేసుకోవచ్చన్న మాట.
దేశంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు అమాంతం పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే.. పీఎం సూర్య ఘర్ యోజన కింద.. రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ప్రారంభించారు. ఈ పథకం కింద.. భారతదేశంలో నివసిస్తున్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ ద్వారా మీకు సరిపడా విద్యుత్ ఉపయోగించి.. ఇంకా కొంత మిగిలినట్లయితే.. దానిని అమ్ముకోవచ్చు కూడా.
అర్హులు ఎవరంటే?
సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడానికి.. కేంద్రం అందించే సబ్సిడీ.. సోలార్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే గరిష్ట సబ్సిడీ రూ. 78వేలు మాత్రమే. సొంత ఇల్లు ఉండి, భారత పౌరులైన వారు.. సరైన రూఫ్ టాప్ స్పేస్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది వరకు మీరు ఎటువంటి సోలార్ సబ్సిడీ తీసుకుని ఉండకూడదు. ఈ స్కీమ్ రూరల్, అర్బన్ ప్రాంతాలకు వర్తిస్తుంది.
కావలసిన డాక్యుమెంట్స్
పీఎం సూర్య ఘర్ యోజన కింద.. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దీనికోసం కావలసినవి..
- ఆధార్ కార్డు
- మునుపటి ఎలక్ట్రిక్ బిల్
- కబ్యాంక్ అకౌంట్ వివరాలు
- సొంత ఇంటి ధ్రువీకరణ
- మొబైల్ నెంబర్
ఉపయోగాలివే!
- ఇంటిదగ్గరే సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల.. ప్రతినెలా కరెంట్ బిల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఇంటి విలువ పెరుగుతుంది.
- సుమారు 20ఏళ్ల వరకు.. డబ్బు ఖర్చు చేయకుండా కరెంట్ ఉపయోగించుకోవచ్చు. మిగిలిన కరెంట్ అమ్ముకోవచ్చు.
- పొల్యూషన్ తగ్గుతుంది. పర్యావరణ హితం కూడా.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.