భారతదేశంలోని మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకరైన ‘సంజయ్ దత్‘ గణేష్ చతుర్థి సందర్భంగా.. ఓ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ సంజయ్ దత్ కొన్న కారు ఏది?, దాని ధర ఎంత? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
సంజయ్ దత్ కొత్త కారు
నటుడు సంజయ్ దత్ కొనుగోలు చేసిన కొత్త కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్. దీని ధర రూ. 3.39 కోట్లు (ఎక్స్ షోరూం). ఇది భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు అత్యాధునిక డిజైన్, సరికొత్త ఫీచర్స్ పొందుతుంది.
సంజయ్ దత్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు డ్యూయెల్ టోన్ కలర్ పెయింట్ స్కీమ్ పొందింది. ఇది అబ్సిడియన్ బ్లాక్ & రూబెల్లైట్ కలయికలో చాలా అద్భుతంగా ఉంది. ఈ స్పెషల్ పెయింట్ స్కీమ్ ధర రూ. 18.64 లక్షలు. దీన్నిబట్టి చూస్తే ఎంచుకునే రంగును బట్టి కారు ధర ఉంటుందని స్పష్టమవుతోంది.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ గురించి
కొత్త బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు వాహన వినియోగదారులకు కావలసిన అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రిక్లైనింగ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 27 స్పీకర్ సౌండ్ సిస్టం, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్.. 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడిన 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్, 730 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా హైబ్రిడ్ ఇంజిన్ 250 ఎన్ఎమ్ టార్క్, 22 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ రావరకు వేగవంతం అవుతుంది.
బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కలిగిన సెలబ్రిటీలు
ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారును కలిగిన సెలబ్రిటీల జాబితాలో.. రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, కృతి సనన్, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, శిల్పా శెట్టి, షాహిద్ కపూర్, రామ్ చరణ్, టాప్సీ పన్ను మొదలైనవారు ఉన్నారు.
సంజయ్ దత్ కార్ కలెక్షన్
నటుడు సంజయ్ దత్ ఇప్పటికే ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఫెరారీ 599 జీటీబీ, రేంజ్ రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, రోల్స్ రాయిస్ ఘోస్ట్ వంటి కార్లను కలిగి ఉన్నారు. ఇప్పుడు తాజాగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 4 మ్యాటిక్ కారు ఈయన గ్యారేజిలో చేరింది.
సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే సంజయ్ దత్ ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు అత్యధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఎక్కువమంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.