‘ఆషు రెడ్డి’ ఉపయోగించే లగ్జరీ కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

Actress Ashu Reddy Car Collection: సోషల్ మీడియా ద్వారా పరిచయమై బిగ్‌బాస్ సీజన్ 3లో మరింత పాపులర్ అయిన ‘ఆషు రెడ్డి’ (Ashu Reddy) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ఎంతోమంది ఫాలోవర్లను ఆకట్టుకున్న ఆషు రెడ్డి ఆ తరువాత చల్ మోహన రంగా సినిమాతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.

నటి ఆషు రెడ్డి.. డైరెక్టర్ రాం గోపాల్ వర్మను ఉంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ తరువాత కొత్త కారు కొనుగోలు చేసి వెనుస్వామితో పూజ చేయించుకుని మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆషు రెడ్డి సినిమాల గురించి.. ఇతరత్రా విషయాలు తెలిసిన చాలామందికి.. ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది. వాటి ధర ఎంతవరకు ఉండవచ్చు అనే వివరాలు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఈ వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం..

ఆషు రెడ్డి దగ్గర రెండు ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్‌సీ300డీ, మరొకటి రేంజ్ రోవర్.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ300డీ (Mercedes Benz GLC300D)

అషు రెడ్డి ఉపయోగించే ఈ బెంజ్ కారును 2022లో తన పుట్టిన రోజుకు సందర్భంగా ఆమె తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు రేటు ఏకంగా రూ. 70 లక్షల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. నిజానికి ఇదే ఆషు రెడ్డి మొదటి ఖరీదైన లగ్జరీ కారు. ఆషు రెడ్డి ఈ కారు ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ300డీ అనేది భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసిన లగ్జరీ కార్లలో ఒకటి. ఇది మంచి డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఈ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్, డీఆర్ఎల్ మరియు ఫాగ్‌లైట్ వంటివి పొందుతుంది. కాబట్టి ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

బెంజ్ జీఎల్‌సీ300డీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులోని 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ కంట్రోల్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు అనుకూలమైన సీటింగ్ వంటివి పొందుతుంది. ఈ కారులోని 1993 సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 4200 ఆర్‌పీఎమ్ వద్ద 261 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 1800 ఆర్‌పీఎమ్ వద్ద 550 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 20.3 కిమీ మైలేజ్ అందిస్తుంది.

రేంజ్ రోవర్ (Range Rover)

ఆషు రెడ్డి ఉపయోగించే మరోకారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ అని తెలుస్తోంది. దీనిని స్వయంగా ఈమె కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 75 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారుకు జ్యోతిష్కుడు వెనుస్వామి చేత పూజలు చేయించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నిజానికి సినీ పరిశ్రమలో చాలామంది ఉపయోగించే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లే ఉన్నాయి. ఈ జాబితాలో అషు రెడ్డి కూడా ఒకరు. ఈ కారు విలాసవంతమైన డిజైన్, వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. దీనిని ఎక్కువమంది సెలబ్రిటీలు కొనుగోలు చేస్తూ ఉంటారు.

Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రూ.3.5 కోట్ల కారు ఇదే!.. మొన్న ఫెరారీ.. ఇప్పుడు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ అనే మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఆషు రెడ్డి కొనుగోలు చేసిన కారు ఏ ఇంజిన్ కలిగి ఉందనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఏ ఇంజిన్ అయినా ఈ కారు పర్ఫామెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని మాత్రం చెప్పవచ్చు.