సినిమా రంగంలోకి కొత్త నటులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. ఇక్కడ కొత్త నటులు అనడం కంటే కూడా.. హీరోలు వారి వారసులను ప్రేక్షకులకు సినిమాల ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు నటి రేణూదేశాయ్.. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు తెరపై కనిపించనున్నారు అనేది చాలామంది తెలుసుకోవలసిన ప్రశ్న. దీనిపై ఇటీవల రేణూ దేశాయ్ స్పందించారు.
నేను వెయిట్ చేస్తున్నా!
నటిగా తన ప్రయాణం మొదలుపెట్టి.. పిల్లల పెంపకంలో బిజీ అయిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ తెరపై కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. మంచి కథ, మంచి పాత్ర వస్తే తప్పకుండా తాను నటిస్తానని ఈమె పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే తన కుమారుడు అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను కూడా అకీరా ఎప్పుడు హీరో అవుతాడా.. అని ఫ్యాన్స్ మాదిరిగానే చాలా వెయిట్ చేస్తున్నాను. ప్రతి రోజు దేవునికి కొబ్బరికాయ కొడుతున్నను అని పేర్కొన్నారు.
మ్యూజిక్ అంటే ఇష్టం!
అకీరాను హీరోగా చూడాలని ఆసక్తి నాకు చాలా ఉంది. అయితే ఎప్పుడు తెరపై కనిపించనున్నారు అనే విషయంపై తాను స్పష్టంగా చెప్పలేనని అన్నారు. ఎందుకంటే అకీరాకు నటనపై కంటే కూడా మ్యూజిక్ మీద ఎక్కువ ఆసక్తి. ఒక సందర్భంలో ఎస్ఎస్ థమన్ కూడా అకీరాతో మ్యూజిక్ చేస్తానని వెల్లడించారు.
ఇకపోతే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా తెరపై కనిపించాలని అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. కాగా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు అకీరాను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు టీజీ విశ్వప్రసాద్ కూడా.. తనకు అవకాశం ఇస్తే అకీరాతో పాన్ వరల్డ్ సినిమా తీస్తానని చెప్పారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు.
ఆ నిర్ణయం పూర్తిగా తనదే!
అకీరాకు హీరోగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఆసక్తి ఉందా?, లేదా అనే ప్రశ్నకు కూడా రేణూ దేశాయ్ సమాధానం ఇచ్చారు. హీరో ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా తన ఆసక్తి. ఈ విషయంలో పూర్తి నిర్ణయం అకీరాదే. కాబట్టి ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడాను అని రేణూ దేశాయ్ అన్నారు.
తాను గ్రీన్ సిగ్నెల్ ఇస్తే..
చాలామంది అభిమానులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాకు.. కంటిన్యూయేషన్‌గా సినిమాలో కనిపించనున్నారని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన.. అకీరాను పెట్టి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. అయితే అకీరా సినిమా ఎంట్రీ గురించి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పడూ బహిరంగంగా వెల్లడించలేదు. నటనపై అకీరా ఆసక్తి కనపరిచి.. యాక్ట్ చేయడానికి తాను గ్రీన్ సిగ్నెల్ ఇస్తే త్వరలోనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మాత్రం ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. అయితే అకీరా సినిమా ఎంట్రీ ఏ సినిమాతో ఉంటుంది?, ఎప్పుడు ఉంటుందనేదానిపై ఒక క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వేచి చూడకతప్పదు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.