కేంద్ర ఆర్ధిక మంత్రి ‘నిర్మలా సీతారామన్‘ జీఎస్టీలో కొత్త స్లాబులను ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానుంది. దీంతో భారతదేశంలో చాలా కంపెనీల కార్ల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ విషయాన్ని హ్యుందాయ్, టయోటా వెల్లడించాయి.
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తామని కంపెనీలు వెల్లడిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ 22 తరువాత కొత్త ధరలు కస్టమర్లకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 3న నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత ప్రజలకు ఈ ప్రయోజనాలు లభించాయి.
చారిత్రాత్మక సంస్కరణ
ఈ చారిత్రాత్మక సంస్కరణ చేసిన భారత ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని.. టయోటా సేల్స్ అండ్ సర్వీస్ యూజ్డ్ కార్ బిజినెస్ అండ్ ప్రాఫిట్ ఎన్‌హాన్స్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన జీఎస్టీ 2.0 కార్ల ధరలను తగ్గించడంతో.. ప్రజలకు చేరువవుతాయని, ఆటోమొబైల్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పండుగ సీజన్‌కు ముందు.. ధర తగ్గింపు అమ్మకాలను వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు.
వికసిత భారత్ లక్ష్య సాధన..
జీఎస్టీ తగ్గించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమోఘం, దీనిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ అన్సూ కిమ్ పేర్కొన్నారు. ఇది ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా.. వాహనాల అమ్మకాలను గణనీయంగా పెంచుతాయని అన్నారు. ఇది వికసిత భారత్ లక్ష్య సాధనకు కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కొత్త ధరలను ఇప్పుడు అధికారికంగా ప్రకటించాము. ఇవి 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులో ఉంటాయని ఆయన అన్నారు.
టయోటా కార్ల ధరలపై తగ్గింపు
➤టయోటా గ్లాంజా: రూ. 85,300
➤టయోటా టైసర్: రూ. 1,11,100
➤టయోటా రూమియన్: రూ. 48,700
➤టయోటా హైరైడర్: రూ. 65,000
➤టయోటా ఇన్నోవా క్రిస్టా: రూ. 1,80,600
➤టయోటా ఇన్నోవా హైక్రాస్: రూ. 1,15,800
➤టయోటా ఫార్చ్యూనర్: రూ. 3,49,000
➤టయోటా లెజెండర్: రూ. 3,34,000
➤టయోటా హైలక్స్: రూ. 2,52,700
➤టయోటా క్యామ్రీ: రూ. 1,01,800
➤టయోటా వెల్‌ఫైర్: రూ. 2,78,000
హ్యుందాయ్ కార్ల ధరలపై తగ్గింపు
➤హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: రూ. 73,808
➤హ్యుందాయ్ ఆరా: రూ. 78,465
➤హ్యుందాయ్ఎక్స్‌టర్: రూ. 89,209
➤హ్యుందాయ్ ఐ20: రూ. 98,053
➤హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్: రూ. 1,08,116
➤హ్యుందాయ్ వెన్యూ: రూ. 1,23,659
➤హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్: రూ. 1,19,390
➤హ్యుందాయ్ వెర్నా: రూ. 60,640
➤హ్యుందాయ్ క్రెటా: రూ. 72,145
➤హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్: రూ. 71,762
➤హ్యుందాయ్ ఆల్కజార్: రూ. 75,379
➤హ్యుందాయ్ టక్సన్: రూ. 2,40,303
టయోటా, హ్యుందాయ్ కంపెనీలు మాత్రమే కాకుండా.. స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీల కార్ల ధరలు కూడా తగ్గుతాయి. కార్లను ధరలు మాత్రమే కాకుండా.. బైక్స్ ధరలు కూడా తగ్గుతాయి. తగ్గినా ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. ఈ ఏడాది దసరా, దీపావళికి కొత్త వెహికల్స్ కొనుగోలు చేయాలనుకునే వారు కొంత మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది, పండుగ సీజన్ సమయంలో కంపెనీల ఆఫర్స్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.
గమనిక: హ్యుందాయ్, టయోటా కంపెనీలు రెండూ కూడా తమ కార్ల ధరలను తగ్గించాయి. ఈ ధరలకు సంబంధించిన ఖచ్చితమైన విషయాలను తెలుసుకోవడానికి కస్టమర్లు.. బ్రాండ్ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో తెలుసుకోవడం మంచిది. బహుశా ధరలలో స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం ఉండొచ్చు.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.