పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ కానుక: 10వేల మందికి..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు సందర్భానుసారంగా కానుకలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రజలకు తన తోటలో పండిన మామిడి పళ్ళను అందించారు. అంతే కాకుండా చెప్పులు, దుప్పట్లు వంటివి కూడా పంచిపెట్టారు. ఇప్పుడు తాజాగా పిఠాపురం మహిళలకు చీరలు పంపిణీ చేయాలనీ సంకల్పించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

10వేల మందికి చీరలు

పిఠాపురం శాసనసభ సభ్యుడు పవన్ కళ్యాణ్.. శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 10 వేలమంది ఆడపడుచులకు చీర, పసుపు, కుంకుమలు అందించనున్నారు. అమ్మవారి ఆలయంలో పూజను ఐదు సార్లు లేదా ఐదు బ్యాచ్‌లలో చేయనున్నాడు. ఈ బ్యాచ్‌లకు అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని పేర్లు పెట్టారు.

పూజ టైమ్ స్లాట్

పురుహూతిక అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూజలు ఉదయం ఐదు గంటల నుంచే ప్రారంభం కానుంది. ఈ కేటాయించిన టైమ్ ప్రకారం.. అంబిక బ్యాచ్ వరలక్ష్మి వ్రతం పూజ ఉదయం 5:00 గంటల నుంచి 6:30 గంటల వరకు, భ్రమరాంబిక బ్యాచ్ పూజ 6:30 గంటల నుంచి 8 గంటల వరకు, చాముండి బ్యాచ్ పూజ 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు, దుర్గ బ్యాచ్ పూజ 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు, ఈశ్వరి బృందం పూజ 11:00 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది.

➤అంబికా బ్యాచ్: ఉదయం 5:00 గంటల నుంచి 6:30 గంటల వరకు
➤భ్రమరాంబిక బ్యాచ్: ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు
➤చాముండి బ్యాచ్: ఉదయం 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు
➤దుర్గ బ్యాచ్: ఉదయం 9:30 గంటల నుంచి 11:00 గంటల వరకు

చీరలను ఎవరు పంపిణీ చేస్తారంటే?

వరలక్ష్మి వ్రతం పూజకు హాజరయ్యేవారికి మహిళలకు.. బ్యాచ్‌ల వారీగా టోకెన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ టోకెన్స్ పంపిణీ రేపు (గురువారం) ప్రారంభమవుతుంది. ఈ టోకెన్స్ మీదనే మహిళలు హాజరుకావాల్సిన సమయం ఉంటుంది. ఆ సమయానికి పూజకు హాజరయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేశారు. చీరలను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు పంపిణీ చేయనున్నారు.

సినిమాల్లో పవన్ కళ్యాణ్ బిజీ

ఓ వైపు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నెరవేరుస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎన్నికలు జరగడానికి ముందే.. మొదలు పెట్టిన సినిమాలను పవన్ కళ్యాణ్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశారు. ఇప్పుడు ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు వేగంగా, వరుసగా రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాల తరువాత బహుశా ఈయన సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Leave a Comment