ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకించి ఈ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ప్రపంచానికి ఇండియా దిక్సూచి అవుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐ కృష్ణార్జునులు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇచ్చాయి.
దేశ రాజధాని నగరంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో.. అనేక కంపెనీలు తమ ఏఐ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో రిలయన్స్ కంపెనీ ఆవిష్కరించిన కృష్ణుడు, అర్జునుడు బొమ్మలు చాలామందిని ఆకట్టుకున్నయి. ఇవి హాలోగ్రామ్ చిత్రాలు అయినప్పటికీ.. ఏఐ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. ఈ హైటెక్ డిజిటల్ చిత్రాలను ప్రజలు ప్రశ్నించవచ్చు కూడా.
ప్రశ్నలకు సమాధానం!
మనిషికి అతిపెద్ద శత్రువు ఎవరు?, ధర్మం అంటే ఏమిటి?, మనం అనుకున్నదానికి జీవితంలో భిన్నంగా జరిగితే మనిషి ఏమి చేయాలి? అనే ప్రశ్నలకు ఏఐ కృష్ణార్జునులు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. కృష్ణుడు కిరీటం పెట్టుకుని, బంగారు రంగు ధోతి కట్టుకుని, చేతిలో పిల్లనగ్రోవి పట్టుకుని ప్రశాంత వదనంతో ఉండటం చూడవచ్చు. తలపై నెమలి పించం ఉండటం కూడా చూడవచ్చు. అర్జునుడు వెండి రంగు ధోతి కట్టుకుని, కవచాలు తొడుక్కుని, చేతిలో విల్లు పట్టుకుని.. యుద్దానికి సిద్ధంగా ఉన్నట్లు చూడవచ్చు.
ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026
ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఏఐ సమ్మిట్ 20వ తేదీ వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల్లోని దిగ్గజ సీఈఓలు, ఆ దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. భారతదేశంతో పాటు సుమారు 88 దేశాలు ఏఐ ఇంపాక్ట్ 2026కు సపోర్ట్ చేశాయి. సరికొత్త ఏఐ ఆవిష్కరణలు చూపరులను ఎంతగానో ఆకర్శించాయి.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చింతించాల్సిన అవసరం లేదు. ఏఐ టెక్నాలజీని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. అందులోనే నైపుణ్యం పెంచుకోవాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగులు మనగలుగుతారు. ఏదైనా ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందే సమయంలో కొన్ని ఉద్యోగాలు పోవడం సర్వసాధారణమైన అంశం. అయితే ఇలాంటి సమయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏఐ వినియోగం అవసరం లేని రంగాలు కూడా చాలానే ఉన్నాయి. ఇందులో కూడా అవకాశాలు మెండుగా లభిస్తాయి.
కృష్ణార్జునుల గురించి!
మహా భారతంలో శ్రీ కృష్ణునికి, అర్జునుని పాత్ర చాలా ప్రత్యేకమైంది. అధర్మాన్ని అణచివేయడానికి.. ధర్మాన్ని రక్షించడానికి నరనారాయణలు జన్మించారని పురాణాలు చెబుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో దుష్టులను శిక్షించడానికి పాండవుల పక్షాన నిలబడ్డాడు. అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులతో యుద్ధం చేయలేనని చెప్పిన అర్జునినికి గీతోపదేశం చేశారు. అదే నేడు ఎంతోమందికి మార్గదర్శకం అయింది.
నమ్మినవాళ్లను కాపాడటానికి రథసారధిగా మారాడు. రాయభారిగా కురుసభకు వెళ్లారు. దుర్యోధనాదుల చేత అవమానం పొందారు. నిజ జీవితంలో ఎలా ఉండాలి?, ఎలా ఉండకూడదు? అనే విషయాలు తెలుసుకోవడానికి శ్రీకృష్ణుని జీవితమే అందరికీ మార్గదర్శం. అలాంటి పురాణ పురుషుడు (కృష్ణ భగవానుడు) ఏఐ రూపంలో మళ్లీ కనిపించడం ప్రశంసనీయం.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.