భారతదేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ప్రఖ్యాత పల్సర్ సిరీస్‌లో ఒక ముఖ్యమైన మోడల్ అయిన పల్సర్ 180ను మళ్లీ విడుదల చేసింది. 2022లో నిలిపివేసిన ఈ బైక్ ఇప్పుడు 2026 వెర్షన్‌గా మరింత అప్డేట్స్తో వినియోగదారుల ముందుకు వచ్చింది. రూ.1.22 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసిన ఈ బైక్, మధ్య తరగతి రైడర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.
పల్సర్ సిరీస్ భారతదేశంలో యూత్ అండ్ పర్ఫామెన్స్ ప్రియుల మధ్య విశేష గుర్తింపు పొందింది. అందులో భాగంగా పల్సర్ 180 కూడా ఒక క్లాసిక్ మోడల్‌గా నిలిచింది. అయితే 2022లో దీనిని నిలిపివేయడంతో చాలా మంది అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు అదే మోడల్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం కంపెనీకి వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.
ఇంజిన్ పర్ఫామెన్స్
పల్సర్ 180లో 178.61 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎమ్ వద్ద 16.77 బిహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎమ్ వద్ద 15 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సెటప్ గతంలో కూడా మంచి మిడ్-రేంజ్ పనితీరుకు ప్రసిద్ధి చెందింది. ఈ ఇంజిన్ ముఖ్యంగా నగర ప్రయాణాలు మరియు హైవే రైడింగ్‌కు సరిపడేలా డిజైన్ చేయబడింది. బలమైన పికప్ మరియు స్థిరమైన పనితీరు ఈ బైక్ ప్రత్యేకతలు.
అప్డేటెడ్ స్టైలింగ్..
డిజైన్ పరంగా బజాజ్ ఆటో పెద్ద మార్పులు చేయకుండా క్లాసిక్ పల్సర్ స్టైల్‌ను అలాగే కొనసాగించింది. మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ష్రౌడ్స్, స్పోర్టీ స్టాన్స్ వంటి అంశాలు యథాతథంగా ఉన్నాయి. అయితే 2026 మోడల్లో కొన్ని కొత్త కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి. బ్లాక్-అవుట్ పెయింట్ థీమ్, కాంట్రాస్ట్ గ్రాఫిక్స్, మరియు ఫ్రంట్ మడ్‌గార్డ్‌పై కార్బన్ ఫైబర్ స్టైల్ ఫినిష్ వంటి అప్డేట్స్ బైక్‌కు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి.
సరికొత్త టెక్నాలజీ
కొత్త పల్సర్ 180లో ముఖ్యమైన మార్పుల్లో LED హెడ్‌లైట్ ఒకటి. పాత హాలోజన్ యూనిట్ స్థానంలో LED ల్యాంప్‌ను ఉపయోగించడం ద్వారా రాత్రి ప్రయాణాల్లో మెరుగైన విజిబిలిటీ అందిస్తుంది. ఇంకా టర్న్ ఇండికేటర్లను కూడా LED యూనిట్లుగా అప్డేట్ చేశారు. ఇది బైక్ లుక్‌ను మరింత ఆధునికంగా మార్చడంతో పాటు సేఫ్టీని కూడా పెంచుతుంది.
టెక్నాలజీ అప్‌గ్రేడ్ ఇలా
ఈ బైక్‌లో పూర్తిగా డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించబడింది. ఇది పల్సర్ 150 మరియు 220F మోడళ్లలో కనిపించే విధంగా ఉంటుంది. స్పీడ్, ఫ్యూయల్ లెవల్, ట్రిప్ మీటర్ వంటి సమాచారం స్పష్టంగా చూపిస్తుంది.
ధర – మార్కెట్ పొజిషన్
బజాజ్ పల్సర్ 180ను ఒకే వేరియంట్లో రూ.1.22 లక్షల ధరకు విడుదల చేశారు. బజాజ్(bajaj) లైనప్‌లో ఇది పల్సర్ 150 మరియు పల్సర్ 220F మధ్యలో స్థానం పొందింది. ఇది రోజువారీ వినియోగానికి సరిపడే పనితీరు మరియు కొంత స్పోర్టీ అనుభవాన్ని కోరుకునే రైడర్లకు మంచి ఎంపికగా నిలుస్తోంది.
భారతదేశంలో పల్సర్ 180 రీ-లాంచ్ (Bajaj Pulsar 180 Re-launch 2026)ద్వారా బజాజ్ ఆటో తన క్లాసిక్ మోడల్‌ను కొత్త రూపంలో తీసుకురావడం గమనార్హం. కొత్త ఫీచర్లు, మెరుగైన లైటింగ్, మరియు అదే నమ్మకమైన ఇంజిన్‌తో ఈ బైక్ మళ్లీ యువతను ఆకర్షించే అవకాశం ఉంది.
Also Read: Royal Enfield Hunter 350: సరికొత్త రాయల్ బండి – ధర, పూర్తి వివరాలు

ఉమశ్రీ – నేను MarthaTelugu వెబ్సైట్లో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆటోమొబైల్, లైఫ్ స్టైల్ విభాగాల్లో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంది. ఈ విభాగాల్లో యూజర్లకు అవసరమైన అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తాను. నాకు జర్నలిజం రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉంది.
