తెలుగు సినిమాల్లో నటీ నటులకు మాత్రమే కాకుండా.. అందులో ఉపయోగించే వాహనాలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంది. శ్రీమంతుడు సైకిల్, పాత సినిమాల్లో అంబాసిడర్ కార్లు ఇలా. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా కోసం.. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక ప్రత్యేకమైన కారును ఆవిష్కరించారు. ఈ కారుకు సంబంధించిన వివరాలతో.. సినిమాకు సంబంధించిన విషయాలను కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.
బాలయ్యకు తగ్గ కారు!
అఖండ 2 సినిమా కోసం.. బాలయ్యకు సరిగ్గా సూటయ్యేలా, చిత్ర బృందం కారును డిజైన్ చేయించారు. ఇది చూడటానికి మహీంద్రా థార్ మాదిరిగా అనిపిస్తోంది. కానీ అఖండ 2 సినిమా యూనిట్.. దీనికి అఖండ రాక్స్ అని పేరు పెట్టింది. అయితే ఈ కారును పూర్తిగా కస్టమైజ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. లైటింగ్ సెటప్, ఒక చిన్న ల్యాడర్, ముందు భాగంలో సింహం గుర్తు వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కాగా దీనిని కస్టమైజ్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అయిందనే వివరాలను చిత్ర బృందం వెల్లడించలేదు.
ఈ కారు గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. కారును అద్భుతంగా తీర్చి దిద్దారని అన్నారు. ఒక పవర్ క్యారెక్టర్ వస్తున్నప్పుడు.. దానికి తగిన వాహనం ఉంటేనే బాగుంటుంది. ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి నాలుగు రోజులు పగలు, రాత్రి పట్టిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కారును తెరపై చూస్తే.. అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.
బాలయ్య అఖండ
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిశారంటే బ్లాక్ బస్టర్ ఖాయం అని అందరూ చెబుతారు. ఈ మాటలు నిజమయ్యాయి కూడా. ఇప్పటికే అఖండ సినిమా భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 పేరుతో మరో సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
అఖండ 2 సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే.. పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమాపై హైప్ భారీగా పెరిగిపోయింది. అఖండ 2 కేవలం సినిమా కాదు, ఇది భారతదేశపు ఆత్మ అని అన్నారు. ఈ సినిమా తప్పకుండా గొప్ప సక్సెస్ సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభవం వ్యక్తం చేసింది.
సినిమాలో నటీనటులు
ఇప్పటికే రిలీజైన అఖండ 2 ట్రైలర్.. బాలయ్య అభిమానులను ఫిదా చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక అఘోర రూపంలో, చేతిలో త్రిశూలం పట్టుకుని, సనాతన ధర్మం కాపాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్, ఝాన్సీ, తరుణ్ కన్నా, మురళి మోహన్, రచ్చ రవి మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమాకు గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, నందమూరి తేజస్విని, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. కాబట్టి అది కేవలం అంచనా మాత్రమే. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఇది ఎంత కలెక్షన్స్ రాబడుతుందనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.