చాలామంది ధనవంతులు ఎప్పటికప్పుడు ముంబైలోని బాంద్రా ప్రాంతాల్లో ఆస్తులను లేదా అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేస్తున్నారు.. చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్ చేరారు. ఈమె రూ.7.63 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
14వ అంతస్తు
నటి తేజస్వి ప్రకాష్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని హిరానందిని డెవలపర్స్ నిర్మాణంలో ఉన్న బే హైట్స్ ప్రాజెక్ట్‌లోని 14వ అంతస్తులో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సీఆర్ఈ మ్యాట్రిక్స్ డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది. ఈ అపార్ట్‌మెంట్ విస్తీర్ణం 1303 చదరపు అడుగులు. రెండు పార్కింగ్ స్థలాలను కూడా ఈమె కొనుగోలు చేసింది.
2030 నాటికి అప్పగింత!
ప్రస్తుతం ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణ దశలో ఉంది. కాబట్టి 2030 నవంబర్ నాటికి దీనిని ఆమెకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన లావాదేవీలు 2026 ఫిబ్రవరి 16న జరిగాయి. స్టాంప్ డ్యూటీ 38 లక్షలు కాగా.. రిజిస్ట్రేషన్ ఫీజు 30000 రూపాయలు.
బాంద్రా ప్రాంతం ముంబైలోని ఒక తీరప్రాంతం. ఇక్కడ ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రాపర్టీలు, అపార్ట్‌మెంట్‌లు కూడా కొనుగోలు చేశారు. సముద్ర దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగా పలువురు ప్రముఖులు ప్రత్యేకించి ఇక్కడ ఆస్తులను అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేయడానికి ఎగబడతారు.
ఎవరీ తేజస్వి ప్రకాష్?
తేజస్వి ప్రకాష్ గురించి బహుశా చాలామంది తెలుగు వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. ఈమె హిందీ టెలివిజన్ (టీవీ) నటి. టీవీ షోలు, రియాలిటీ షోలు ద్వారా పాపులారిటీ పొందిన ఈమె.. బిగ్‌బాస్ 15 హిందీ విజేతగా నిలిచిన తరువాత మరింత ఫేమస్ అయిపోయింది. కాగా ఈమె ఇండియన్ టెల్లీ అవార్డు, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును దక్కించుకుంది. కొన్ని మరాఠి సినిమాల్లో కూడా తేజస్వి కనిపించింది.
ముంబైలో ఆస్తులున్న సెలబ్రిటీలు
దేశ ఆర్ధిక రాజధాని నగరమైన ముంబైలో ముఖేష్ అంబానీ అత్యంత ఖరీదైన యాంటాలియా ఉంది. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ & అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్ & మీరా కపూర్, దీపికా పదుకొనె & రణవీర్ సింగ్, జాన్ అబ్రహం, సైఫ్ అలీ ఖాన్ & కరీనా కపూర్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ & కాజోల్ వంటి వారు ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ కలిగి ఉన్నారు. కాగా కార్తీక్ ఆర్యన్ & సారా అలీ ఖాన్ వంటి వారు ఆఫీస్ / అపార్ట్‌మెంట్ కోసం పెట్టుబడులు పెట్టారు. సోనూసూద్ ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు సినీతారలకు కూడా ముంబైలో ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
నిజానికి రియల్ ఎస్టేట్ రంగంలో రోజు రోజుకు వేగంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. కాబట్టి ప్రస్తుతం చాలామంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ముంబైలో మాత్రమే కాకుండా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో కూడా భూములు, ఇల్లు ధరలు భారీగా పెరిగాయి. ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. నగరాల్లో కొనుగోలుదారుల సంఖ్య పెరగడమే. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు కూడా చెబుతున్నారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.