ప్రముఖ నటుడు శర్వానంద్.. ఇటీవల ఒక ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ కారు గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు కూడా నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.
కొత్త లగ్జరీ కారు
శర్వానంద్ కొనుగోలు చేసిన కారు.. జపాన్ కంపెనీకి అయిన లెక్సస్ బ్రాండ్. ఇది ‘ఎల్ఎమ్ 350హెచ్‘ మోడల్. దీని ధర రూ. 2.5 కోట్లు ఉంటుందని సమాచారం. అయితే ఆన్ రోడ్ ధర ఎంత అనేది వెల్లడికాలేదు. నలుపు రంగులో ఉన్న ఈ కారు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. సల్వార్ డ్రెస్ వేసుకుని, పోనీ టెయిల్‌తో నటుడు స్టైలిష్‌గా కనిపించారు.
లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్
కారు విషయానికి వస్తే.. లెక్సస్ కంపెనీకి చెందిన ఎల్ఎమ్ 350హెచ్ కారు నడిచే ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది. విశాలమైన క్యాబిన్.. విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను తలపించేలా ఉంది. అధునాతన ఫీచర్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ కారులో 48 ఇంచెస్ ఎల్ఈడీ స్క్రీన్, రెక్లైనర్ సీట్లు, మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టం వంటివి ఉన్నాయి. మసాజ్ సీట్లు, చిన్న ఫ్రిజ్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే.. లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారులో 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 190 బీహెచ్పీ పవర్, 240 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల.. పవర్ డెలివరీ నాలుగు చక్రాలకు అందుతుంది.
శర్వానంద్ కార్ కలెక్షన్స్ & ఇతర వివరాలు
నటుడు శర్వానంద్ ఇప్పటికే రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, ఆడి క్యూ5 వంటి ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో ఖరీదైన కారు లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారును కొనుగోలు చేసి.. తన గ్యారేజిలో చేర్చారు. దీన్నిబట్టి చూస్తే.. శర్వానంద్ ఖరీదైన కార్లను ఎక్కువగా ఇష్టపడతారని స్పష్టంగా అర్థమవుతోంది.
గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు మొదలైన సినిమాల్లో నటించి ఎందోమంది అభిమానులను కలిగి ఉన్న శర్వానంద్ ప్రస్తుతం.. నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు బైకర్ అనే సినిమాలో కూడా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది.
లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కలిగి ఉన్న సెలబ్రిటీలు
నటుడు శర్వానంద్ మాత్రమే కాకుండా.. అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, విజయ దేవరకొండ కూడా లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారును కలిగి ఉన్నారు. ఈ కారు ఇతర కార్ల మాదిరిగా కాకుండా చాలా విలాసవంతంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఈ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో కేవలం టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా.. ఇతర సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు అంటే.. దీనికున్న డిమాండ్ మామూలుగా లేదనే అర్థమవుతోంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.