37.2 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 10

హైస్పీడ్ కారులో నితిన్ గడ్కరీ – వైరల్ అవుతున్న వీడియో

0

Nitin Gadkari In High Speed Car Ferrari Roma: ఆటోమొబైల్ రంగం వృద్ధికి, దేశంలో నేషనల్ హైవేలు వేగంగా అభివృద్ధి చెందటానికి ప్రధాన కారకులలో ఒకరు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ” (Nitin Gadkari). దేశంలో ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) కార్లను ప్రత్యామ్నాయ వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పుడూ సంస్థలను ప్రోత్సహిస్తూ ఉండే ఈయన.. ఇటీవల ఓ హై స్పీడ్ సూపర్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. మధ్యప్రదేశ్‌లోని నాట్రక్స్ (Natrax) హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్‌కు ఖరీదైన సూపర్ కార్లు చేరుకోవడం చూడవద్దు. ఆ సమయంలో నితిన్ గడ్కరీ.. సూపర్ కార్ల యజమానులతో సంభాషించారు. తరువాత ఫెరారీ రోమా (Ferrari Roma) కారులో ఆయన కూర్చున్నారు.

నితిన్ గడ్కరీ కూర్చున్న ఫెరారీ కారు నీలి రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారుతో పాటు పోర్స్చే 911, లంబోర్ఘిని హురాకాన్ వంటి కార్లు రావడం కూడా చూడవచ్చు. మంత్రి ప్రయాణిస్తున్న ఫెరారీ కారును అవి అధిగమించడం కూడా వీడియోలో చూడవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. కారును నితిన్ గడ్కరీ డ్రైవ్ చేయడం లేదు. ఆయన కేవలం రైడ్‌ను ఆస్వాదిస్తున్నట్లు చూడవచ్చు.

NATRAX (నాట్రక్స్)

నాట్రక్స్ (NATRAX) అనేది నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్. ఇది మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా పితంపూర్‌లో ఉంది. ఇది భారతదేశంలో అత్యంత అధునాతమైన హై-స్పీడ్ ట్రాక్‌లలో ఒకరి మరియు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ట్రాక్. దీనిని ఆటోమోటివ్ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు. సూపర్ కార్లను చాలా వేగంగా డ్రైవ్ చేయడానికి ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

హైవేల నిర్మాణంపై గడ్కరీ శ్రద్ద

భారతదేశంలోని హైవేలను.. ప్రపంచ స్థాయి హైవేల మాదిరిగా తీర్చి దిద్దటానికి మరియు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి కంకణం కట్టుకున్న నితిన్ గడ్కరీ.. ఇప్పటికే అనేక ఎక్స్‌ప్రెస్‌వేలు, విశాలమైన రహదారుల నిర్మాణానికి కారణమయ్యారు. ఈ రహదారులకు సంబంధించిన అభివృద్ధి పనులను కూడా ఆయన తరచూ పర్యవేక్షిస్తుంటారు. అంతే కాకుండా హైవే పనులను సక్రమంగా నిర్వహించని కాంట్రాక్టర్లపైన గడ్కరీ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి.

మన దేశంలో హైవేలపై జరుగుతున్న ప్రమాదాలను తగ్గించడానికి.. భారీ వాహనాలకు సైతం భద్రతా ఫీచర్స్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగానే MORTH డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి భారీ వాహనాల్లో కూడా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి. అంతే కాకుండా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు మరియు ఆటోమేటెడ్ టెస్టింగ్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయడానికి భారీ కమర్షియల్ వాహనాల డ్రైవర్‌లకు ట్రైనింగ్ ఇవ్వడానికి మరియు సురక్షితమైన డ్రైవింగ్ ప్రవేశపెట్టడానికి ఏకంగా 4500 కోట్ల రూపాయలతో కేంద్రం ఓ కొత్త స్కీమ్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

ఫెరారీ రోమా

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన ఫెరారీ కంపెనీకి చెందిన ‘రోమా’ కారు ధర రూ. 3.76 కోట్ల కంటే ఎక్కువే. 2019లో ప్రారంభమైన ఈ కారు 3.9 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 690 పీఎస్ పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

Also Read: నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!

ఇండియన్ మార్కెట్లో ఫెరారీ కార్లకు మంచి ఆదరణ ఉంది. అయితే వీటి ధర కోట్ల రూపాయలలో ఉండటం వల్ల.. సెలబ్రిటీలు, క్రీడాకారులు లేదా పారిశ్రామికవేత్తల వంటి ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ కార్లు సాధారణ రోజువారీ ప్రయాణానికంటే కూడా రేసింగ్ లేదా లాంగ్ డ్రైవ్ వంటి వాటికోసం చాలా అనుకూలంగా ఉంటాయి. మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఈ కారణంగానే చాలామంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఫెరారీ కారు లేదు.

కొడుకంటే ఇలా ఉండాలి.. నెట్టింట్లో ఇదే ట్రేండింగ్ టాపిక్! – ఎందుకో తెలుసా?

0

Son Gift Royal Enfield Super Meteor 650 To Dad: కాళ్లు తడవకుండా సముద్రాన్ని అయినా ఈదవచ్చు.. కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని ఈదలేరు అని ఓ మహానుభావుడు చెప్పిన మాటలు బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, ఛీత్కారాలు.. ఇలా అన్నింటింది దాటుకుంటూ పోతేనే జీవితం. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురైతే.. వాటిని తీర్చే పిల్లలు ఆధునిక కాలంలో కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి ఓ సంఘటన గురించే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం.

ఒక తండ్రి.. తన భార్య ఆరోగ్యం సరిగా లేని సమయంలో, ఆమెకు చికిత్స చేయించడానికి అయన దగ్గర ఉన్న స్కూటర్ అమ్మేయాల్సి వచ్చింది. స్కూటర్ విక్రయించిన తరువాత ఆయన తన రోజువారీ పనికి సైకిల్ మీద లేదా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఇది అతనకి కొంత కష్టంగా అనిపించినా.. కొడుక్కి తెలియనిచ్చేవాడు కాదు. అయినా ఆ తండ్రి కష్టాన్ని తెలుసుకున్న కొడుకు ఏకంగా ఓ ఖరీదైన బైక్ గోని గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కొడుకు ఇచ్చిన గిఫ్ట్

కొడుకు తన తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650’ (Royal Enfield Meteor 650). దీనికి సంబంధించిన వీడియోలో గమనిస్తే.. కొడుకు తండ్రిని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌కు తీసుకెళ్తాడు. అక్కడ బైక్ కొనుగోలు చేయడానికి కావలసిన పేపర్ వర్క్ పూర్తి చేసి.. డబ్బు లెక్కించడం కూడా చూడవచ్చు. చివరకు బైక్ డెలివరీ తీసుకుంటారు. ఆ తరువాత అతని తండ్రి బైక్ రైడ్ చేయడం కూడా చూడవచ్చు.

తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. తండ్రి కోసం కొడుకు చేసిన పనిని చాలామంది మెచ్చుకుంటున్నారు. అతనిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తండ్రి కూడా కొడుకు ఇచ్చిన గిఫ్ట్ చూసి తెగ మురిసిపోయారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఖరీదైన మరియు గొప్ప రైడింగ్ అనుభూతిని అందించే బైకుల జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 3.64 లక్షల నుంచి రూ. 3.95 లక్షల మధ్య ఉంది. లాంగ్ రైడ్ చేయడానికి ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ టూరింగ్ మోటార్‌సైకిల్​ను ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

650 సీసీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మీటియోర్ 650 బైక్.. 648 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 Bhp పవర్, 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజన్ రివైజ్డ్ మ్యాపింగ్ అండ్ గేరింగ్‌ను పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

ప్రస్తుతం మార్కెట్లో 650 సీసీ విభాగంలో చాలా బైకులు ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 బైకుకు మంచి ఆదరణ ఉంది. చూడగానే ఆకట్టుకునే డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ లభించడం మాత్రమే కాకుండా, ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. ధర కొంత ఎక్కువే అయినప్పటికీ.. ధరకు తగ్గ పనితీరును ఇది అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read: 2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఎంతమంది కొన్నారో తెలిస్తే.. షాకవవుతారు!

తండ్రికి గిఫ్ట్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు

తండ్రులకు లేదా తండ్రికి గిఫ్ట్స్ ఇచ్చిన సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది కుమార్తెలు కూడా వారి తండ్రికి అద్భుతమైన గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచిన సంఘటనలు కోకొల్లలు. పిల్లలు వారి తల్లి తండ్రులకు ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా.. వారు ఎంతో సంతోషపడిపోతుంటారు. ఆ సంతోషం వారి కళ్ళలో చూడటానికైనా పిల్లలు వారికి తప్పకుండా అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి. పిల్లలకు తల్లి దండ్రులు గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. అది ఎప్పుడూ వారికి మనమీద ఉన్న ప్రేమకు నిదర్శనం. కానీ తమ పిల్లలు ఎప్పుడైనా ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చినా.. వారు చాలా ఆనందపడిపోతుంటారు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని కొత్త బైక్స్ – ఇది కదా పండగంటే!

0

Two Wheeler Companies To Be Seen at Auto Expo 2025: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆటో ఎక్స్‌పో (Auto Expo) లేదా ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ (Bharat Mobility Global Expo 2025) జనవరి 17 నుంచి 22 వరకు జరగనుంది. ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ వాహన తయారీ సంస్థలు కూడా హాజరు కానున్నాయి. తమ కొత్త వాహనాలను ఆవిక్షరించనున్నాయి లేదా ప్రదర్శించనున్నాయి. అయితే ఈ కథనంలో ఆటో ఎక్స్‌పో 2025లో కనిపించనున్న టూ వీలర్ బ్రాండ్స్ ఏవి? అవి ప్రదర్శించనున్న వెహికల్స్ ఏవి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

2025 ఆటో ఎక్స్‌పోలో కనిపించే టూ వీలర్ బ్రాండ్స్

ఏథర్ ఎనర్జీ (Ather Energy): బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన ‘ఏథర్ ఎనర్జీ’ ఇప్పటికే 450, 450 ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే త్వరలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో మరిన్ని కొత్త లేదా అప్డేటెడ్ మోడల్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో ఏథర్ 450ఎక్స్ అప్డేటెడ్ మోడల్, ఇతర కాన్సెప్ట్ మోడల్స్ ఉండనున్నాయి.

బజాజ్ ఆటో (Bajaj Auto): ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కూడా 2025 ఆటో ఎక్స్‌పోలో తన కొత్త మోడల్స్ పరిచయం చేయనుంది. ఇందులో పల్సర్ ఆర్ఎస్200 లేటెస్ట్ మోడల్ ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా కేటీఎమ్ 390 అడ్వెంచర్ మరియు కొన్ని కొత్త ట్రయంఫ్ మోడల్స్ కూడా ప్రదర్శించనుంది.

బీఎండబ్ల్యూ ఇండియా (BMW India): లగ్జరీ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. దేశీయ విఫణిలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఆర్ 1300 జీఎస్ అడ్వెంచర్, ఎఫ్ 450 జీఎస్ వంటి వాటితో పాటు ఎస్ 1000 ఆర్ఆర్, ఎమ్ 1000 ఆర్ఆర్ వంటి అప్డేటెడ్ మోడళ్లను ఆటో ఎక్స్‌పో వేదికపై ప్రదర్శించనుంది. వీటితో పాటు ఈ కంపెనీ సీఈ 02, సీఈ 04 వంటి ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp): అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులు, స్కూటర్లను లాంచ్ చేస్తోంది. కాగా త్వరలో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికపై ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, ఎక్స్ఎమ్ఆర్ 250 వంటి వాటితో పాటు ఎక్స్‌పల్స్ 210ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ విడా ఎలక్ట్రిక్ స్కూటర్, ఎక్స్‌పల్స్ 421 యొక్క కాన్సెప్ట్ మోడల్‌ను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. కంపెనీ హార్లే డేవిడ్‌సన్ సంస్థతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది.. కాబట్టి హార్లే డేవిడ్‌సన్ బైకులను కూడా కంపెనీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది.

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (Honda Motorcycle & Scooter India): హోండా మోటార్‌సైకిల్ కంపెనీ 2025 ఆటో ఎక్స్‌పోలో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యాక్టివా ఈ (Honda Activa e) మరియు హోండా క్యూసీ 1 (Honda QC 1) లను ప్రదర్శించనుంది. కంపెనీ ఇప్పటికీ ఈ స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇవి కాకుండా సంస్థ మరి కొన్ని కొత్త మోడల్స్ కూడా ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం.

యమహా (Yamaha): స్టైలిష్ బైకులకు, స్కూటర్లకు చెందిన యమహా కూడా ఆటో ఎక్స్‌పో 2025లో కొత్త వెహికల్స్ లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సంస్థ ఏ బైకులను లాంచ్ చేయనుందనే విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India): సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జీఎస్ఎక్స్-8ఆర్ మరియు వీ-స్ట్రోమ్ 800 డీఈ వంటి వాటిని ప్రదర్శించే అవకాశం ఉంది. అంతే కాకుండా జీఎస్ఎక్స్-8ఎస్ బైకును కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.

టీవీఎస్ మోటార్ (TVS Motor): ఈ ఏడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఆర్టీఎక్స్ 310 అడ్వెంచర్ (RTX 310 Adventure) బైకును ప్రదర్శించే అవకాశం ఉంది. దీనితో పాటు ఆర్‌డీఎక్స్‌డీ-4 ఇంజిన్‌తో పాటు ఇతర వస్తువులను కూడా కంపెనీ పరిచయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Also Read: 2025 Auto Expo: డేట్స్, బ్రాండ్స్ & పూర్తి వివరాలు ఇవే

గ్రీవ్స్ కాటన్ (Greaves Cotton): ఆంపియర్ ఎలక్ట్రిక్ యొక్క మాతృ సంస్థ గ్రీవ్స్ కాటన్.. నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు, మరికొన్ని కొత్త మోడల్స్ లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఏ మోడల్స్ లాంచ్ చేస్తుందనే వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము.

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric): దేశీయ టూ వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసి, గొప్ప అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. కాగా ఈ కంపెనీ 2025 ఆటో ఎక్స్‌పోలో కూడా కొత్త మోడల్స్ పరిచయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఈ సంస్థ ఏ వాహనాలను ప్రదర్శిస్తుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

రివోల్ట్ మోటార్స్ (Revolt Motors): రేవోల్ట్స్ మోటార్ కంపెనీ 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కనిపించనుంది. అయితే ఈ సంస్థ ఏ బైకులను ప్రదర్శిస్తుంది అనే విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద దిగ్గజ కంపెనీలు తమ కొత్త మోడల్స్ లాంచ్ చేయడానికి ఇప్పటికీ పూర్తిగా సిద్దమైపోయాయని స్పష్టమవుతోంది.

2024లో ఎక్కువమంది గూగుల్‌లో వీటి కోసమే సెర్చ్ చేశారు

0

Most People Searched For These on Google in 2024: ఎంతోమంది ప్రముఖుల పెళ్లి, మరెంతోమంది దిగ్గజాల మరణం, ఎన్నో కొత్త సంఘటనలు, మరెన్నో మరచిపోలేని ఘటనలు.. ఇలా 2024 గడిచిపోయింది. 2025 మొదలైపోయింది. ఏదేమైనా.. ఎవరెలా ఉన్నా.. గూగుల్ మాత్రం, ఎవరు ఏమి చేస్తున్నారు (సెర్చ్) అనే విషయాన్ని మాత్రం కనిపెడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 2024లో ఎక్కువ మంది గూగుల్(Google)లో వీటి కోసం సెర్చ్ చేసారో కూడా వెల్లడించింది. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అర్థాల కోసం సెర్చ్ చేసిన పదాలు (Word Meaning)

గూగుల్‌లో ఎక్కువమంది రాఫా (Rafah), అకాయ్ (Akaay), గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer), డెమ్యూర్ (Demure), పూకీ (Pookie), స్టాంపెడ్ (Stampede), మోయె మోయె (Moye Moye), కాన్సెక్రేషన్ (Consecration) మరియు గుడ్ ఫ్రైడే (Good Friday) వంటి పడాల అర్థాల కోసం సెర్చ్ చేశారు.

సమీపంలో ఏమున్నాయి (Near Me Search)

AQI నియర్ మీ, ఓనం సంధ్య నియర్ మీ, రామ్ మందిర్ నియర్ మీ, స్పోర్ట్స్ బార్స్ నియర్ మీ, బెస్ట్ బేకరీ నియర్ మీ, ట్రెండీ కేప్స్ నియర్ మీ, పోలియో డ్రాప్స్ నియర్ మీ, శివ టెంపుల్ నియర్ మీ, బెస్ట్ కాఫీ నియర్ మీ మరియు హనుమాన్ మూవీ నియర్ మీ అనే వాటిని 2024లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు.

వీరికోసం సెర్చ్ (Searched People on Google)

వినేష్ ఫోగాట్ (Vinesh Phogat), నితీష్ కుమార్ (Nitish Kumar), చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan), హార్దిక్ పాండ్య (Hardik Pandya), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), శశాంక్ సింగ్ (Shashank Singh), పూనమ్ పాండే (Poonam Pandey), రాధికా మర్చెంట్ (Radhika Merchant), అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరియు లక్ష్య సేన్ (Lakshya Sen) వంటివారి కోసం చాలామంది గూగుల్‌లో వెతికారు.

ఈ సినిమాల కోసం సెర్చ్

స్ట్రీ 2 (Stree 2), కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD), 12 ఫెయిల్ (12th Fail), లపతా లేడీస్ (Laapataa Ladies), హనుమాన్ (Hanu-Man), మహరాజ్ (Maharaj), మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys), ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time), సలార్ (Salaar) మరియు ఆవేశం (Aavesham) వంటి సినిమాల కోసం ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్ చేశారు.

ఈ కార్ల కోసం సెర్చ్

ఎక్కువ మంది హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్, మారుతి సుజుకి డిజైర్, మారుతి స్విఫ్ట్, టాటా పంచ్, మహీంద్రా స్కార్పియో, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి బ్రెజ్జా, మారుతి ఎర్టిగా మరియు మహీంద్రా థార్ వంటి కార్ల కోసం గూగుల్‌లో పలువురు సెర్చ్ చేసినట్లు సమాచారం.

ఈ సినీతారల కోసం సెర్చ్

చాలామంది 2024లో కాట్ విలియమ్స్, పవన్ కళ్యాణ్, ఆడమ్ బ్రాడీ, ఎల్లా పూర్నెల్, హీనా ఖాన్, కీరన్ కల్కిన్ మరియు టెరెన్స్ హోవార్డ్ మొదలైన సెలబ్రిటీలు లేదా సినీ తారల కోసం సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండటం గొప్ప విషయం.

Also Read: ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..

రాజకీయంగా.. డొనాల్డ్ ట్రంప్, కేథరీన్, కమలా హారిస్, ఇమానే ఖలీఫ్, జో బైడెన్, మైక్ టైసన్, జేడీ వాన్స్, లామిన్ యమల్, సిమోన్ బైల్స్ మరియు డిడ్డీ వంటి వారి కోసం ఎక్కువమంది సెర్చ్ చేశారు. వీరితో పాటు గత ఏడాది కన్ను మూసిన లియామ్ పేన్, టోబీ కీత్, ఓజే సింప్సన్, షానెన్ డోహెర్టీ, అకిరా తోరియామా, రతన్ టాటా, అలైన్ డెలోన్, మాగీ స్మిత్ మరియు జేమ్స్ ఎర్ల్ జోన్స్ వంటి ప్రముఖుల కోసం కూడా ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. క్రీడలకు సంబంధించిన వ్యక్తుల కోసం, క్రీడల కోసం, మ్యూజిక్ కోసం, సినిమాల కోసం ఇలా వివిధ రకాల కేటగిరీలలో పలు అంశాలను, పలువురి వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి గూగుల్‌ను ఉపయోగించుకున్నారు.

2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఎంతమంది కొన్నారో తెలిస్తే.. షాకవవుతారు!

0

Royal Enfield Record Sales in India 2024: భారతదేశంలో అత్యంత ప్రజాదరణపొందిన బైక్ బ్రాండ్లలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ లాంచ్ చేస్తూ.. ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. 2024లో సంస్థ ఏకంగా 8.5 లక్షల బైకులను విక్రయించి, అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

350సీసీ బైకులే ఎక్కువ

రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ 2023 కంటే కూడా 2024లో 4 శాతం వృద్ధి చెందాయి. 2023లో కంపెనీ సేల్స్ 8.2 లక్షల యూనిట్లు. గత ఏడాది కంపెనీ విక్రయించిన మొత్తం బైకులలో 350సీసీ మోడల్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 350 సీసీ నుంచి 500 సీసీ మధ్య కేటగిరిలో ఉన్న బైకులలో గెరిల్లా 450 మరియు హిమాలయన్ అడ్వెంచర్ బైకులు మంచి సేల్స్ సాధించాయి. అదే సమయంలో 500 సీసీ మరియు 800 సీసీ మధ్య కేటగైరిలో ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల జీటీ 650 ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా.. సూపర్ మీటియోర్ 650, బేర్ 650 మరియు షాట్‌గన్ 650 వంటివి కూడా ఈ కేటగిరిలో ఉత్తమ అమ్మకాలను పొందాయి.

మూడోసారి 8 లక్షలు దాటిన సేల్స్

2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 8 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటేసింది. సంస్థ ఈ సంఖ్యను అధిగమించడం ఇదే మొదటిసారి కాదు. 2018 మరియు 2023లో కూడా కంపెనీ 8 లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. దీన్నిబట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకులకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

2025లో ఇదే టార్గెట్

2024లో మాత్రమే కాకుండా ఈ ఏడాది (2025) కూడా కంపెనీ 8 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ సరికొత్త బైకులను కూడా మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కాబట్టి.. ఈ ఏడాది తప్పకుండా తన లక్ష్యాన్ని సాధింస్తుందని భావిస్తున్నాము.

భారత్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైకులు దేశీయ విఫణిలో 13 ఉన్నాయి. అవి హంటర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350, మీటియోర్ 350, హిమాలయన్ 450, గెరిల్లా 450, సూపర్ మీటియోర్ 650, షాట్‌గన్ 650, బేర్650, స్క్రామ్ 411, కాంటినెంటల్ జీటీ 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్నాయి.

ఎలక్ట్రిక్ విభాగంలోకి రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇప్పటి వరకు పలు విభాగాల్లో బైకులను లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ విభాగంలోకి కూడా అడుగుపెట్టడానికి సన్నద్ధమైంది. ఈ విభాగంలో లాంచ్ చేయనున్న బైకును కూడా ఇప్పటికే పరిచయం చేసింది. ఇది చూడటానికి కొత్తగా.. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది 2026లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఫ్లైయింగ్ ఫ్లీ పేరుతో మార్కట్లో లాంచ్ కానున్న.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్, దశాబ్దాల క్రితం నాటి లేదా రెండో ప్రపంచ యుద్ధ సమయం నాటి బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఈ కారణంగానే ఇది చూడటానికి ఆ బైక్ మాదిరిగానే ఉంటుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 200 కిమీ నుంచి 250 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే రేంజ్ వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. ధరలకు సంబంధించిన విషయాలను కూడా కంపెనీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ దీని ధర రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా.

Also Read: భారత్‌లో అడుగెట్టిన కొత్త జపనీస్ బైక్: దీని ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

మార్కెట్లో ఇప్పటి వరకు గొప్ప అమ్మకాలను చవి చూసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బైకులను లాంచ్ చేయలేదు. మొదటిసారి ఫ్లైయింగ్ ఫ్లీ పేరుతో లాంచ్ చేయనుంది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే.. ఇంకా ఓ ఏడాది కంటే ఎక్కువ సమయం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎలక్ట్రిక్ బైక్ అంటే సౌండ్ చేయకుండా నడుస్తుంది. కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటేనే డుగ్.. డుగ్ సౌండ్. అదే లేకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లాంచ్ చేస్తే? ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. కానీ ఇది కొత్తదనాన్ని కోరుకునే వారిని తప్పకుండా ఆకర్షిస్తుందని మాత్రం చెప్పవచ్చు.

న్యూ ఇయర్ వేళ.. కొడుక్కి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి – నెట్టింట్లో వైరల్

0

Dad Mahindra Thar ROXX Gift To Son: తల్లిదండ్రులు తమ పిల్లలకు, పిల్లలు తమ తల్లితండ్రులకు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యపరచడం కొత్తేమీ కాదు. ఇలాంటి కథనాలు గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ సంఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2025 కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఓ తండ్రి, తన కొడుక్కి ఓ అద్భుతమైన కారును గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకీ ఆ తండ్రి ఇచ్చిన కారు ఏది? దాని ధర, వివరాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఆశయ్ ఖిరే అనే వ్యక్తికి, తన తండ్రి మహీంద్రా కంపెనీకి చెందిన థార్ రోక్స్ (Mahindra Thar Roxx) గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఖిరే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ”కల నెరవేరడంతో సంవత్సరం ముగుస్తుంది. నాన్న సరికొత్త ‘థార్ రాక్స్’తో మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచారు. మా హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది. కొత్త ప్రయాణాలు, గొప్ప జ్ఞాపకాలతో.. 2025 ప్రారంభమైంది” అని పేర్కొన్నాడు.

ఆశయ్ ఖిరేకు ఇచ్చిన మహీంద్రా థార్ రోక్స్ కారు నీలం రంగులో ఉంది. ఈ కారుతో ఆ తండ్రి, కొడుకులు ఉండటం కూడా చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. ఆ తండ్రిని ప్రశంసించేస్తున్నారు. అయితే ఇలా తండ్రి.. కొడుక్కి గిఫ్ట్ ఇచ్చిన ఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి.

మహీంద్రా థార్ రోక్స్

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్ అప్డటెడ్ మోడల్.. ఈ 5 డోర్ వెర్షన్ థార్ లేదా రోక్స్. ఇది కూడా చాలా తక్కువ రోజుల్లోనే వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధించింది. ఇప్పటికి కూడా ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 1.5 సంవత్సరాలు ఉంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో.. ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

సరికొత్త థార్ రోక్స్ కారును.. కంపెనీ చాలా అద్భుతంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇది దాని మునుపటి 3 డోర్ వెర్షన్ కంటే కూడా విశాలంగా సుమారు 18 వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీఓ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బ్యాటిల్‌షిప్ గ్రే, బర్న్ట్ సియెన్నా వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కాబట్టి థార్ రోక్స్ ప్రియులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

Also Read: అంబానీ గ్యారేజిలో కూడా లేదు!.. ఈ ఒక్క నటి దగ్గర మాత్రమే ఆ కారు ఉంది

10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కలిగిన మహీంద్రా రోక్స్.. అదే పరిమాణంలో ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పొందుతుంది. అంతే కాకుండా వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, హర్మాన్ కార్డాన్ 9 స్పీకర్ ఆడియో సిస్టం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫ్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. రోక్స్ టాప్ వేరియంట్లలో లెవెల్ 2 ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మహీంద్రా థార్ రోక్స్ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ ఎంస్టాలిన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 380 న్యూటన్ మీటర్ టార్క్, 174 బీహెచ్‌పీ పవర్ అందిస్తుంది. అదే సమయంలో 2.2 లీటర్ ఎంహాక్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 330 ఎన్ఎమ్ టార్క్, 150 బిహెచ్‌పీ పవర్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.

థార్ రోక్స్ ధరలు (Thar Roxx Price)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ రోక్స్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఎందోమంది వాహన ప్రేమికులను ఆకర్షిస్తున్న ఈ 5 డోర్ థార్ వెర్షన్.. అత్యద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది.

అంబానీ గ్యారేజిలో కూడా లేదు!.. ఈ ఒక్క నటి దగ్గర మాత్రమే ఆ కారు ఉంది

0

Bollywood Actress Krishna Shroff Hummer H3: చాలామంది సెలబ్రిటీలు బెంజ్ కార్లు లేదా ఆడి కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తారు. రోజువారీ వినియోగానికి కూడా వాటినే వినియోగిస్తుంటారు. కానీ ప్రముఖ నటుడు ‘జాకీ ష్రాఫ్’ (Jackie Shroff) .. కుమార్తె ‘కృష్ణ ష్రాఫ్’ (Krishna Shroff) భిన్నంగా పాపులర్ అమెరికన్ బ్రాండ్ కారును తన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె నటించే కారు ఏది? దాని ధర ఎంత? ఈ మోడల్ కారును కలిగి ఉన్న సెలబ్రిటీలు ఎవరనేది.. ఇక్కడ చూసేద్దాం.

లెజండరీ జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్.. ఉపయోగించే కారు ‘హమ్మర్ హెచ్3’ (Hummer H3). ముంబై విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ కారులోనే కనిపించింది. మ్యాట్ బ్లాక్ కలర్‌లో కనిపించే ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే ఈ కారు ధర ఇండియన్ మార్కెట్లో చాలా ఎక్కువే.

అమెరికన్ బ్రాండ్.. హమ్మర్ హెచ్3 కారు ధర ఎక్కువగా ఉండటం వల్ల.. ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయలేరు. ప్రస్తుతం హమ్మర్ కారును కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, మికా సింగ్, సునీల్ శెట్టి మరియు హర్భజన్ సింగ్ వంటివారు ఉన్నారు. అయితే హమ్మర్ హెచ్3 కారును కలిగిన ఏకైక నటి ‘కృష్ణ ష్రాఫ్’ కావడం గమనించదగ్గ విషయం.

జీఎమ్ఆర్ హమ్మర్ హెచ్3 (GMR Hummer H3)

భారతదేశంలో ఎక్కువ మందికి ఇష్టమైన కార్లలో ఒకటి హమ్మర్ హెచ్3. ఇది చూడటానికి భారీగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన పనితీరును కూడా అందిస్తుంది. నిజానికి జీఎమ్ఆర్ అనేది హమ్మర్ యొక్క మాతృ సంస్థ. ఇది హమ్మర్ హెచ్2 మరియు హెచ్3 కార్లను రూపొందించింది. అయితే కంపెనీ తన కార్లను అధికారికంగా విక్రయించలేదు. కానీ చాలా దేశాలలోని ప్రైవేట్ దిగుమతి దారులు.. ఈ కార్లను దిగుమతి చేసుకుని కస్టమర్లను విక్రయించారు. అప్పట్లో హమ్మర్ హెచ్3 కారు ధర రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల మధ్య ఉండేది. ఆ తరువాత ఈ కారును యూస్డ్ మార్కెట్ ద్వారా రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య విక్రయించారు.

ఇంజిన్ ఆప్షన్స్

హమ్మర్ హెచ్3 అనేది ప్రపంచ మార్కెట్లో రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తోంది. ఇందులో ఒకటి 3.7 లీటర్ ఇన్‌లైన్ 5 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 245 పీఎస్ పవర్ మరియు 328 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

ఇక రెండో ఇంజిన్.. 5.3 లీటర్ వీ8 పెట్రోల్. ఇది 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ ఇంజిన్ 305 పీఎస్ పవర్ మరియు 434 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. భారీ పరిమాణం కలిగిన ఈ కారు టైర్లు 32 ఇంచెస్ వరకు ఉంటాయి. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు లాకింగ్ డిఫరెన్షియల్‌లతో వస్తుంది. కాబట్టి గొప్ప పర్ఫామెన్స్ అందిస్తుంది.

హమ్మర్ ఈవీ (Hummer EV)

అమెరికన్ కార్ల తయారీ సంస్థ హమ్మర్.. 2010లోనే హెచ్3 ఉత్పత్తిని నిలిపివేసింది. ఆ తర్వాత కంపెనీ ఈ మోడల్ కార్లను తయారు చేయలేదు. అయితే 2021లో కంపెనీ దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఆ తరువాత కంపెనీ హమ్మర్ హెచ్3 ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేదు. కానీ దీనిని కావాలనుకుంటే.. దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి సుంకాలు మరియు ఇతర రోడ్ ట్యాక్స్ వంటివన్నీ కలిపితే దీని ధర రూ. 3.85 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

Also Read: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న కియా కొత్త కారు: మార్కెట్లో మోత మోగిస్తున్న సిరోస్

హమ్మర్ హెచ్3 ఈవీ 2ఎక్స్ మరియు 3ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. 2X వేరియంట్ డ్యూయెల్ అల్టిమేట్ మోటార్ కలిగి ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ పొందుతుంది. ఇది 625 Bhp పవర్ అందిస్తుంది. 3X వేరియంట్ 830 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 505 కంటే ఎక్కువ కిమీ మైలేజ్ ఇస్తుందని సమాచారం. సుమారు 4500 కేజీల బరువున్న ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది.

మీకు తెలుసా?.. మన్మోహన్ సింగ్‌ మనసుదోచిన కారు ఇదే!

0

Manmohan Singh Favorite Car: చాలామంది చిన్న రాజకీయ నాయకులే.. ఖరీదైన కార్లను ఉపయోగించేస్తున్నారు. అలాంటిది ఒక దేశ ప్రధాని ఎలాంటి కారు ఉపయోగిస్తారో?.. ఎలాంటి కార్లను ఉపయోగించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ని కార్లు ఉన్నా.. మన దివంగత ప్రధాని ‘మన్మోహన్ సింగ్’ (Manmohan Singh)కు ఇష్టమైన కారు ఏదో తెలిస్తే తప్పకుండా నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత? ఆ కారుకు మార్కెట్లో ఏమైనా డిమాండ్ ఉందా? అనే వివరాలు వివరంగా ఇక్కడా తెలుసుకుందాం.

మాజీ ప్రధానమంత్రి ‘మన్మోహన్ సింగ్’ మృతికి.. యావత్ భారతదేశం సంతాపం తెలుపుతోంది. రాజకీయం నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు అందరూ.. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సహాయమంత్రి ‘అసిమ్ అరుణ్’ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. మన్మోహన్ సింగ్ చాలా నిరాడంబరమైన వ్యక్తి అని పేర్కొన్నారు.

మన్మోహన్ సింగ్‌ మనసుదోచిన కారు

దేశానికీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ.. చాలా నిరాడంబరంగా ఉండేవారని.. ఆయన కోసం అనేక భద్రతా విమానాలు, బీఎండబ్ల్యూ సెడాన్స్ వంటివి ఉన్నప్పటికీ.. మన్మోహన్ సింగ్ మాత్రం ‘మారుతి సుజుకి 800’ (Maruti Suzuki 800) కారును ఎక్కువగా ఇష్టపడేవారిని ‘అసిమ్ అరుణ్’ (Asim Arun) చెప్పారు. ఇది ఒక విధంగా మధ్యతరగతితో సింగ్‌కు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని మరియు శ్రామిక వర్గం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు.

అసిమ్ అరుణ్ సుమారు మూడేళ్లపాటు మన్మోహన్ సింగ్ స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (SPG)లో అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో చాలా సన్నిహితంగా ఉన్నారు. అప్పుడే మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వం, వినయం వంటి వాటి గురించి తెలుసుకున్నారు. ఆ సమయంలోనే విమానాలు, ఖరీదైన కార్లలో ప్రయాణించడం కంటే.. మారుతి సుజుకి 800 కారులో ప్రయాణించడం తనకు ఇష్టమని తెలుసుకున్నారు.

మన్మోహన్ సింగ్ తన వ్యక్తిగత కారుగా ‘మారుతి 800’ కారును కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే సింగ్ ప్రోటోకాల్ ప్రకారం.. అతనికి భద్రత కల్పించాలనే లక్ష్యంతో జర్మన్ బ్రాండ్ కార్లను ఉపయోగించారు. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఆయన ప్రయాణానికి ఉపయోగించారు. ఏది ఏమైనా అసిమ్ నాకు ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం ఇష్టం లేదు, నా కారు మారుతి అని చెప్పినట్లు అసిమ్ పేర్కొన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1994 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి కారు లాంచ్ సందర్భంగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మారుతి కారు మీద మన్మోహన్ సింగ్‌కు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.

మారుతి సుజుకి 800

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసిన కార్ల జాబితాలో మారుతి సుజుకి 800 ఒకటి. దశాబ్దాల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఈ కారును ఇప్పటికి కూడా కొంతమంది వాహన ప్రేమికులు.. తమ రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పాత 800 మోడల్ కారు మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో లేదు.

Also Read: చిన్నప్పుడే తల్లి మరణం.. యూనివర్సిటీలో ప్రొఫెసర్: మన్మోహన్ సింగ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

ప్రస్తుతం భారతదేశంలో మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10) రూపంలో.. మారుతి 800 వారసత్వంగా అమ్మకానికి ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు.. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, మంచి డిజైన్ కలిగి.. వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది.

మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ మారుతి ఆల్టో కే10 కారులో.. 1.0 లీటర్ త్రీ సిలిండర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 హార్స్ పవర్, 89 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. మాన్యువల్ వెర్షన్ 24.39 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. ఆటోమాటిక్ వెర్షన్ 24.90 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగా కూడా ఎక్కువమంది మారుతి కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

భారత్‌లో అడుగెట్టిన కొత్త జపనీస్ బైక్: దీని ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

0

Kawasaki KLX230 launched in India: కవాసకి బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ‘కేఎల్ఎక్స్230’ (KLX230) లాంచ్ చేసింది. ఈ బైక్ ధర, ఫీచర్స్, డిజైన్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర

కవాసకి లాంచ్ చేసిన కేఎల్ఎక్స్230 బైక్ ధర రూ. 3.30 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ఇది ప్రస్తుతం భారతదేశంలో అమ్మాయుడవుతున్న అత్యంత ఖరీదైన రోడ్ లీగల్ డ్యూయెల్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ పనితీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

కొత్త కవాసకి కేఎల్ఎక్స్230 బైక్.. 233 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 18.1 హార్స్ పవర్ మరియు 6400 rpm వద్ద 18.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ బైక్ 7.6 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

పొట్టి రైడర్లకు సైతం

కవాసకి కేఎల్ఎక్స్230 బైక్ 240 మిమీ ట్రావెల్‌తో ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ పోర్క్, వెనుక 250 మిమీ ట్రావెల్‌తో మోనోషాక్ సెటప్ ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ.. కవాసకి కొత్త బైక్ 880 మిమీ పొడవైన సీటును పొందుతుంది. దీని బరువు కేవలం 139 కేజీలు మాత్రమే. ఇది పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సింపుల్ డిజైన్ కలిగిన ఈ కవాసకి బైకులో ఫీచర్స్ కూడా చాలా పరిమితంగానే ఉంటాయి. ఇది బ్లూటూత్ కనెక్టివిటీని అనుమతించే LCD యూనిట్ పొందుతుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఇసుకలో లేదా గడ్డి ప్రాంతాల్లో కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది.

కవాసకి లాంచ్ చేసిన కేఎల్ఎక్స్230 బైక్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయానికి ఉన్న.. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ (రూ. 1.51 లక్షలు) మరియు ఎక్స్‌పల్స్ 200 4వీ ప్రో (రూ. 1.64 లక్షలు) వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా. ధరల పరంగా చూస్తే కేఎల్ఎక్స్320.. దాని ప్రత్యర్థుల కంటే రెండు రెట్లు ఎక్కువని స్పష్టమవుతోంది.

మార్కెట్లో ఇలాంటి బైకులకున్న డిమాండ్?

ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి బైకులకు పెద్దగా డిమాండ్ లేదనే తెలుస్తోంది. బహుశా ఆటోమొబైల్ ఔత్సాహికులు, రైడింగ్ పట్ల ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఈ తరహా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. సాధారణ ప్రజలు లేదా రోజువారీ వినియోగం కోసం కావాలనుకునే వారు ఇలాంటి బైకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే ధర ఎక్కువనే కాదు.. ఫీచర్స్ కూడా రైడర్లకు కావలసినన్ని ఇందులో లేకపోవడమే. ఇవి కాకుండా ఈ బైక్ ఇచ్చే మైలేజ్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉండదు.

Also Read: మీకు తెలుసా?.. ఈ ఏడాది (2024) కనుమరుగైన కార్లు ఇవే!

కంపెనీ మార్కెట్లో ఇలాంటి బైకులను లాంచ్ చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి బైకులను విరివిగా మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఎప్పుడు ఇలాంటి బైకులను లాంచ్ చేసినా.. దీనికి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ మాత్రం వెల్లడించలేదు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లు ఈ బైకును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ముందుకు రారు.

కవాసకి బైకులు

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైకులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ‘నింజా హెచ్2’ (Ninja H2) అనేది.. కవాసకి బ్రాండ్. దీని ధర రూ. 79 లక్షల కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశీయ విఫణిలో జెడ్900, నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా 300, డబ్ల్యు 175, నింజా 1100ఎస్ఎక్స్, నింజా 500, నింజా జెడ్ఎక్స్ 6ఆర్, జెడ్650, నింజా 650, నింజా జెడ్ఎక్స్-4ఆర్, ఎలిమినేటర్, నింజా హెచ్2 హెచ్ఎక్స్, నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్, వెర్సిస్ 650, జెడ్900ఆర్ఎస్, జెడ్650ఆర్ఎస్ మరియు నింజా హెచ్2 ఎస్ఎక్స్ ఎస్ఈ మొదలైన బైకులను విక్రయిస్తోంది.

చిన్నప్పుడే తల్లి మరణం.. యూనివర్సిటీలో ప్రొఫెసర్: మన్మోహన్ సింగ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

0

Interesting Facts About Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురువృద్ధుడు ‘మన్మోహన్ సింగ్’ (Manmohan Singh) నేడు (డిసెంబర్ 26) 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగానే కన్ను మూసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. దేశ ప్రధానమంత్రిగా దశాబ్దం పాటు కొనసాగిన ఈయన అనేక సంస్కరణలు చేశారు. భారతదేశాన్ని ఓ కొత్త శకం వైపు నడిపిన ఘనత మన్మోహన్ సింగ్ సొంతమే అనటంలో ఎలాంటి సందేహం లేదు.

భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఖ్యాతిగడించారు.2004 మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఈయన 2014 మే 26వరకు రెండుసార్లు.. పదేళ్ళపాటు ప్రధాని పీఠాన్ని అలంకరించారు.

చిన్నప్పుడే తల్లి మరణం

గురుముఖ్ సింగ్ మరియు అమృత్ కౌర్ దంపతులకు 1932 సెప్టెంబర్ 26న బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్‌లోని గాహ్ (పాకిస్తాన్‌లో ఉంది)లో జన్మించిన మన్మోహన్ సింగ్.. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయారు (తల్లి మరణించింది). ఆ తరువాత నానమ్మ సంరక్షణలోనే పెరిగిన ఈయన.. మొదట ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.

భారతదేశ విభజన తరువాత.. మన్మోహన్ సింగ్ కుటుంబం దేశంలోని హల్ద్వానీకి వలస వచ్చింది. ఆ తరువాత 1948లో అమృత్‌సర్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న హిందూ కళాశాలలో చదువుకున్నారు. పంజాబ్ యూనివర్సిటిలో బీఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అప్పట్లోనే ఆర్థిక శాస్త్రంపై మంచి పట్టును సాధించారు. సింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటిలో చదువు పూర్తి చేసిన తరువాత.. మనదేశానికి వచ్చి.. పంజాబ్ యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తరువాత మళ్ళీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటిలో కూడా చదువుకున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ (RBI Governor)

పంజాబ్ యూనివర్సిటిలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసిన మన్మోహన్ సింగ్.. లలిత్ నారాయణ్ మిశ్రా చేత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుడిగా నియమించబడ్డారు. ఆ తరువాత 1982లో అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

1982 నుంచి 1985 వరకు RBI గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్.. 1985 నుంచి 1987 వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంత కాలం ఆర్ధిక వ్యవహారాలపై భారత ప్రధానమంత్రికి సలహాదారుగా కూడా పనిచేశారు.

రాజకీయ రంగప్రవేశం & ఆర్ధిక మంత్రి

మన్మోహన్ సింగ్ 1991లో మొదటిసారి అస్సాం రాష్ట్ర శాసనసభ ద్వారా పార్లమెంట్ ఎగువ సభ, రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1995, 2001, 2007 మరియు 2013లో కూడా పలుమార్లు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 వరకు భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలో ఉన్నప్పుడు.. మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. నిజానికి జూన్ 1991లో అప్పటి భారత ప్రధాని ‘పీవీ నరసింహా రావు’ (PV Narasimha Rao).. మన్మోహన్ సింగ్‌ను తన ఆర్ధిక మంత్రిగా ఎన్నుకున్నారు.

ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ (PM Manmohan Singh)

2004 సార్వత్రిక ఎన్నికల తరువాత లోక్‌సభలో అధిక స్తనాలు పొందిన పార్టీగా అవతరించిన భారత జాతీయ కాంగ్రెస్ (ప్రస్తుత ఇండియా కూటమి) ఛైర్‌పర్సన్ ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi) మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రి పదవికి యూపీఏ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఈయన 2004 మే 22న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని మన్మోహన్ సింగ్ అధిక ప్రజాదరణ పొందారు. దీనికి ప్రధాన కారణం సింగ్ ఒక స్వచ్ఛమైన రాజకీయ వేత్త కావడమే.

Also Read: రతన్ టాటా అరుదైన వీడియో: ఫిదా అయిపోతున్న జనం

కుటుంబం (Manmohan Singh Family)

స్వచ్ఛమైన రాజకీయ వేత్తగా.. మచ్చలేని మనిషిగా ఎదిగిన మన్మోహన్ సింగ్ 1958లో గురుశరన్ కౌర్ (Gursharn Kaur)ను వివాహం చేసుకున్నారు. వీరికి ఊపిందర్ సింగ్, దమన్ సింగ్ఎం అమృత్ సింగ్ అనే ముగ్గురు కుమారైలు ఉన్నారు. వీరందరూ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు.