37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 11

ఒక్కొక్కటి కాదు.. ఒక్కొక్కరికి రెండు: సెలబ్రిటీలంటే అట్లుంటది

0

Celebrities Who Own Two Mercedes Benz Maybach Cars: సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారని అందరికీ తెలుసు. ఇష్టపడితే ఒక బ్రాండుకు సంబంధించిన కారును ఒకటి కొనుగోలు చేస్తారు. మరీ మక్కువ పడుతున్నారంటే.. అదే బ్రాండుకు చెందిన రెండు కార్లను కొనుగోలు చేస్తారు. కానీ ఒకే మోడల్ కారును.. ఎవరైనా రెండు కొనుగోలు చేస్తారా?.. ఈ కథనంలో ఒకే మోడల్ కార్లను రెండు కలిగిన సెలబ్రెటీలు (సినీతారలు) ఎవరు? వారు కొనుగోలు చేసిన కార్లు ఏవి? వాటి వివరాలు ఏమిటనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం.

ఒక బ్రాండుకు చెందిన.. ఒకే మోడల్ కార్లను రెండు కొనుగోలు చేసిన సినీతారల జాబితాలో విద్యా బాలన్, దీపికా పదుకొనే మరియు కంగనా రనౌత్ ఉన్నారు.

విద్యా బాలన్ (Vidya Balan)

ప్రముఖ నటి విద్యా బాలన్ ఇష్టపడి కొనుగోలు చేసిన కార్లలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన మేబ్యాచ్ ఎస్580 మరియు జీఎల్ఎస్600 చెప్పుకోదగ్గవి. ఇవి రెండూ కూడా ఒకే మోడల్ అయినప్పటికీ.. వేరు వేరు వేరియంట్స్ అన్నమాట.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600 కారు ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 4.0 లీటర్ వీ8 ఇంజిన్.. 557 పీఎస్ పవర్, 730 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హైబ్రిడ్ సిస్టం కలిగి ఉండటం వల్ల పవర్ మరియు టార్క్ అనేది కొంత పెరుగుతుంది. తద్వారా పర్ఫామెన్స్ ఉత్తమంగా ఉంటుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.

ఇక మేబ్యాచ్ ఎస్580 విషయానికి వస్తే.. దీని ధర రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారులోని 4.0 లీటర్ ఇంజిన్ 496 బీహెచ్‌పీ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. పవర్ అనేది నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.

దీపికా పదుకొనే (Deepika Padukone)

నటి దీపికా పదుకొనె ఉపయోగించే కార్లలో కూడా రెండు మేబ్యాచ్ కార్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ‘ఎస్500’. ఇది పాతతరం మోడల్. ఈ కారులో 4.7 లీటర్ వీ8 బై-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 455 బీహెచ్‌పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ కారు మోడల్స్ విక్రయానికి లేదు. కానీ ఇది అమ్మకానికి ఉన్న సమయంలో దీని ధర రూ. 1.85 కోట్లు.

దీపికా పదుకొనె గ్యారేజిలోని మరో కారు జీఎస్ఎస్600. నిజానికి ఈ కారును ఈమె భర్త రణబీర్ సింగ్ గిఫ్ట్ అని సమాచారం. బాలీవుడ్‌లో మొట్ట మొదటి జీఎల్ఎస్ కొనుగోలు చేసిన వ్యక్తులలో వీరు ఒకరు. చూడచక్కని డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). మేబ్యాచ్ కార్లు మాత్రమే కాకుండా.. వీరి గ్యారేజిలో ఆడి క్యూ7, ఆడి ఏ8ఎల్, మినీ కూపర్ కన్వర్టిబుల్, ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ఎస్, లంబోర్ఘిని మరియు రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం.

కంగనా రనౌత్ (Kangana Ranaut)

ప్రముఖ నటి, రాజకీయం నాయకురాలు కంగనా రనౌత్ విషయానికి వస్తే.. ఈమె కూడా రెండు మేబ్యాచ్ కార్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి ఎస్680. ఇది ఎస్580 మోడల్ కంటే కూడా పెద్దది. ఈ కారులో 6.0 లీటర్ వీ12 ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 604 Bhp పవర్ మరియు 900 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది.

Also Read: మీకు తెలుసా?.. ఈ ఏడాది (2024) కనుమరుగైన కార్లు ఇవే!

కంగనా గ్యారేజిలోని మరో మెర్సిడెస్ మేబ్యాచ్ జారు జీఎల్ఎస్600. ఎక్కువ సార్లు కంగనా ఈ కారులో కనిపించింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఈ బెంజ్ మేబ్యాచ్ కార్లు కాకుండా.. నటి గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ మరియు ఆడి క్యూ3 వంటి కార్లు ఉన్నాయి.

మీకు తెలుసా?.. ఈ ఏడాది (2024) కనుమరుగైన కార్లు ఇవే!

0

Discontinued Cars in India 2024: 2024 ముగియడానికి.. 2025 మొదలవ్వడానికి ఇంకెన్నో రోజులు లేదు. ఈ ఏడాది మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు (పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ) లాంచ్ అయ్యాయి. కాగా.. ఈ ఏడాది కనుమరుగైన కార్లు కూడా చాలానే ఉన్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా మహీంద్రా మరాజో, మినీ కూపర్ ఎస్ఈ & కంట్రీమ్యాన్, జాగ్వార్ ఐ-పేస్ మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఉన్నాయి.

మహీంద్రా మరాజో (Mahindra Marazzo)

2018లో ప్రారంభమైన మహీంద్రా మరాజో 2024లో అధికారిక వెబ్‌సైట్ నుంచే కనుమరుగైంది. ఈ కారుకు మార్కెట్లో ప్రజాదరణ లేకపోవడంతో.. నవంబర్ నెలలో కేవలం తొమ్మిది యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మల్టిపుల్ వేరియంట్లలో అమ్ముడైన ఈ కారు 7 సీటర్ విభాగంలో ఒకప్పుడు.. ఓ మెరుపు మెరిసింది. దీని ప్రారంభ ధర రూ. 14.83 లక్షలు (ఎక్స్ షోరూమ్).

విశాలమైన డిజైన్ కలిగిన మహీంద్రా మరాజో.. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 3500 rpm వద్ద 121 Bhp పవర్, 1750 – 2500 rpm వద్ద 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ (Hyindai Kona Electric)

ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలు పొందిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్.. 2019లో మార్కెట్లో అడుగుపెట్టింది. అప్పట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ కారు అమ్మకానికి అందుబాటులో లేదు.

ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ కోనా ప్రారంభ ధర మార్కెట్లో రూ. 23.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 39.2 కిలోవా బ్యాటరీ ద్వారా 452 కిమీ రేంజ్ అందించేది. ఇందులోని మోటార్ 134 Bhp, 395 Nm టార్క్ అందింస్తుంది. ప్రస్తుతం ఈ కారు భారతీయ మార్కెట్లో అమ్మకానికి లేకపోయినప్పటికీ.. ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి ఉంది. కాగా కంపెనీ జనవరి 2025లో తన క్రెటా కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

జాగ్వార్ ఐ-ఫేస్ (Jaguar i-Pace)

ఈ ఏడాది మార్కెట్లో నిలిచిపోయిన కార్లలో జాగ్వార్ కంపెనీకి చెందిన ఐ-ఫేస్ కూడా ఒకటి. దీని ధర రూ. 1.06 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు 90 కిలోవాట్ బ్యాటరీ మరియు ట్విన్ ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. ఇది 394 Bhp పవర్ మరియు 695 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జాగ్వార్ ఐ-ఫేస్ ఈవీ కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 200 కిమీ/గం కావడం గమనార్హం. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. అయినప్పటికీ మార్కెట్లో ఈ కారు గొప్ప అమ్మకాలను పొందలేకపోయింది. ఈ కారణంగానే.. ఈ కారు అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి.

Also Read: కొత్త ఏడాది.. సరికొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఇది చూడండి

మినీ కూపర్ ఎస్ఈ మరియు కంట్రీమ్యాన్ (Mini Cooper SE and Countryman)

2024లో నిలిచిపోయిన కార్ల జాబితాలో మినీ కూపర్ ఎస్ఈ మరియు కంట్రీమ్యాన్ రెండూ ఉన్నాయి. ఎస్ఈ ఎలక్ట్రిక్ కారు 32.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని మోటారు 181 బీహెచ్‌పీ మరియు 270 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.

ఇక మినీ కంట్రీమ్యాన్ విషయానికి వస్తే.. 175 బీహెచ్‌పీ, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అయితే వచ్చే ఏడాది (2025)లో భారతీయ మార్కెట్లో లాంచ్ కావడానికి లెక్కకు మించిన కార్లు సిద్ధమవుతున్నాయి.

కొత్త ఏడాది.. సరికొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఇది చూడండి

0

2025 Honda SP 125 Launched in India: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన యాక్టివా 125 స్కూటర్ యొక్క అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసిన తరువాత.. ‘2025 హోండా ఎస్పీ 125’ (2025 Honda SP 125) యొక్క అప్డేటెడ్ మోడల్ కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త 2025 మోడల్ గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధరలు

2025 హోండా ఎస్పీ 125 మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 91,771 మరియు రూ. 1,00,284 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అప్డేట్ మోడల్ ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ మోడల్స్ కంటే రూ. 4,000 మరియు రూ. 8,816 ఎక్కువని స్పష్టమవుతోంది.

కలర్ ఆప్షన్స్

2025 హోండా ఎస్పీ 125 బైక్ మొత్తం ఐదు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ, ఇంపీరియర్ రెడ్ మెటాలిక్ మరియు మ్యాట్ మర్వెల్ బ్లూ మెటాలిక్. అప్డేటెడ్ హోండా ఎస్పీ125 ఇన్ని రంగులలో లభిస్తుంది, కాబట్టి కొనుగోలుదారుడు తనకు నచ్చిన కలర్ ఎందుకోవచ్చు.

ఇంజిన్ డీటైల్స్

అప్డేటెడ్ హోండా ఎస్పీ 125 బైక్ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలమైన అప్డేట్స్ పొందింది. కాబట్టి ఇందులోని 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 11 హార్స్ పవర్ మరియు 11 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది కఠినమైన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ అయినప్పటికీ.. పనితీరు లేదా పర్ఫామెన్స్ పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

డిజైన్ మరియు ఫీచర్స్

చూడటానికి సాధారణ హోండా ఎస్పీ 125 మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. 2025 మోడల్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ పొందుతుంది. ఫ్రంట్ ఎండ్ మరియు టెయిల్ సెక్షన్ రెండూ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. మిగిలిన డిజైన్ మొత్తం మునుపటి మోడల్ బైకును గుర్తుకు తెస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. స్టాండర్డ్ మోడల్ బైకులో ఉన్న అన్ని ఫీచర్స్ ఈ 2025 ఎస్పీ 125 బైకులో ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు 4.2 ఇంచెస్ TFT స్క్రీన్ కూడా ఈ బైకులో ఉంటుంది. కాబట్టి రైడర్ ఈ స్క్రీన్ మీద టర్న్ బై టర్న్ న్యావిగేషన్యాక్సెస్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ బైకులో USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. రైడింగ్ చేస్తున్న సమయంలో కూడా మొబైల్ వంటి వాటిని ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

మెకానికల్స్

డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్స్ పొందినప్పటికీ.. మెకానికల్స్ లేదా హార్డ్‌వేర్ ప్యాకేజీలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి 2025 హోండా ఎస్పీ 125 బైక్ అదే టెలిస్కోపిక్ పోర్క్, డ్యూయెల్ స్ప్రింగ్, 17 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 116 కేజీలు కాగా ఫ్యూయెల్ ట్యాంక్ 11.2 లీటర్లు. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Also Read: 2025 Honda Activa 125: వచ్చేసింది సరికొత్త యాక్టివా.. ధర కూడా తక్కువే!

నిజానికి హోండా ఎస్పీ 125 బైక్ కొంత తక్కువ ధరకు లభించడమే కాకుండా.. అత్యుత్తమ మైలేజ్ కూడా అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన 2025 మోడల్.. దాని మునుపటి మోడల్ కంటే కొంత అప్డేటెడ్ డిజైన్ పొందటమే కాకుండా, TFT స్క్రీన్ కూడా పొందింది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మకాలు కూడా ఉత్తమాంగానే ఉంటాయని భావిస్తున్నాము.

కొత్త హోండా ఎస్పీ 125 బైక్ గురించి మా అభిప్రాయం

2025 సంవత్సరం త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తరువాత సంక్రాతి, ఉగాది వరుసగా రానున్నాయి. అలాంటి పండుగల సందర్భంలో కొంత తక్కువ ధరకు లభించే బైక్ కొనాలని వేచి చూసేవారికి ‘హోండా ఎస్పీ 125’ ఓ మంచి ఆప్షన్ అవుతుందని తెలుస్తోంది. ఈ బైక్ 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.

వచ్చేసింది సరికొత్త యాక్టివా.. ధర కూడా తక్కువే!

0

2025 Honda Activa 125 Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఎట్టకేలకు ‘2025 యాక్టివా 125’ (2025 Activa 125)ను లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేట్స్ పొందింది. దీని గురించి పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర మరియు వేరియంట్స్

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ లాంచ్ చేసిన అప్డేటెడ్ యాక్టివా స్కూటర్ 125 ప్రారంభ ధర రూ. 94,422. ఇది చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ గమనించవచ్చు. ఈ స్కూటర్ ఆధునిక ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందింది. అప్డేటెడ్ యాక్టివా 125 డీఎల్ఎక్స్ మరియు హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 94,442 మరియు రూ. 97,146 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).

ఇంజిన్

2025 హోండా యాక్టివా 125 స్కూటర్ 123.92 సీసీ సింగిల్ సిలిండర్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.40 పీఎస్ పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ ఐడెల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం కలిగి ఉండటం వల్ల మైలేజ్ కూడా కొంత పెరుగుతుంది. కాబట్టి రైడర్లు ఉత్తమ పనితీరును పొందవచ్చని తెలుస్తోంది.

అప్డేటెడ్ హోండా యాక్టివా 125 స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, సింగిల్ సైడ్ షాక్ అబ్జార్బర్ పొందుతుంది. బ్రేకింగ్స్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

డిజైన్ మరియు ఫీచర్స్

2025 హోండా యాక్టివా 125 స్కూటర్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే 4.2 ఇంచెస్ TFT డిస్‌ప్లే వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఉండటం చూడవచ్చు. ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైడర్ న్యావిగేట్, కాల్ / మెసేజ్ అలర్ట్స్ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు.

అంతే కాకుండా కనెక్టెడ్ ఫంక్షన్‌లకు అనుమతిస్తుంది. USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ ఇందులో ఉండటం వల్ల ప్రయాణించే సమయంలో రైడర్ మొబైల్ వంటి వాటికి ఛార్జ్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ యాక్టివా 125 బ్రాండ్ యొక్క సిగ్నేచర్ సిల్హౌట్ పొందుతుంది. అయితే కొత్తగా కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, ప్యానల్స్ వంటివి లభిస్తాయి.

కలర్ ఆప్షన్స్

2025 హోండా యాక్టివా 125 స్కూటర్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ సైరన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ ప్రేషియస్ వైట్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. యాక్టివా 125 మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించడం వల్ల కస్టమర్లు కూడా తమకు నచ్చిన కలర్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు.

ప్రత్యర్థులు

భారతీయ విఫణిలో అడుగు పెట్టిన సరికొత్త యాక్టివా 125 స్కూటర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టీవీఎస్ జుపీటర్ 125 మరియు సుజుకి యాక్సిస్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా బహుశా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

ప్రస్తుతం మార్కెట్లోని హోండా స్కూటర్లు

భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే స్కూటర్లలో హోండా స్కూటర్స్ చెప్పుకోదగ్గవి. కంపెనీ ప్రస్తుతం డియో, యాక్టివా మరియు గ్రాజియా స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ మూడూ కూడా మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందాయి. హోండా యాక్టివాను ఏకంగా 3 కోట్ల మంది కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే యాక్టివాకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: బజాజ్ చేతక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ధర తెలిస్తే ఇప్పుడో కొనేస్తారు!

ఇక హోండా డియో (Honda Dio) విషయానికి వస్తే.. ఈ స్కూటర్ 30 లక్షల సేల్స్ సాధించింది. కాగా గ్రాజియా (Honda Grazia) స్కూటర్ సేల్స్ 2 లక్షలు మాత్రమే. మొత్తం మీద మార్కెట్లో హోండా స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది అని చెప్పడానికి వీటి అమ్మకాలే నిదర్శనం అని స్పష్టంగా తెలుస్తోంది.

2025 Auto Expo: డేట్స్, బ్రాండ్స్ & పూర్తి వివరాలు ఇవే

1

Full Details of 2025 Auto Expo in Delhi: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆటో ఎక్స్‌పో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డేట్స్, హాజరయ్యే బ్రాండ్స్, వెన్యూ (ప్రదేశం) వంటి వివరాలన్నీ అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా ఇక్కడా తెలుసుకుందాం.

గ్లోబల్ ఆటో ఎక్స్‌పో డేట్స్

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్స్ (SIAM) నిర్వహించనున్న ‘2025 భారత్ ఆటొమొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’ (2025 Bharat Mobility Global Expo) 2025 జనవరి 17 నుంచి 22 వరకు అంటే మొత్తం ఆరు రోజులు జరగనుంది. ఇది న్యూ ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమాన్ని దేశ ప్రధాని ‘నరేంద్ర మోదీ’ (Narendra Modi) ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రావాల్సి ఉంది.

కనిపించనున్న వెహికల్స్ బ్రాండ్స్

2025 ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్న బ్రాండ్లలో దేశీయ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలతో పాటు.. టయోటా, మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, బీఎండబ్ల్యూ, స్కోడా, మెర్సిడెస్ బెంజ్, పోర్స్చే, ఇసుజు మోటార్స్ మొదలైనవి ఉండనున్నాయి.

ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయానికి వస్తే.. వియత్నామీస్ ఈవీ బ్రాండ్ విన్‌ఫాస్ట్ కనిపించనుంది. ఇది కాకుండా చైనా బ్రాండ్ బీవైడీ.. ఇండియన్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్, బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఉండనున్నాయి. సుజుకి మోటార్‌సైకిల్, టీవీఎస్, బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్, హీరో మోటోకార్ప్ వంటివి కూడా ఇక్కడ దర్శనమివ్వనున్నాయి.

కనిపించని బ్రాండ్స్

జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో హోండా, ఆడి, ఫోక్స్‌వ్యాగన్, సిట్రోయెన్, జీప్ మరియు నిస్సాన్ వంటి బ్రాండ్స్ కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే.. మొత్తం మీద ఎన్ని మోడల్స్ ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్నాయనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. గతంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కనిపించిన బ్రాండ్స్ కంటే ఎక్కువే ఉండనున్నట్లు సమాచారం.

లొకేషన్ వివరాలు

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో మూడు ప్రదేశాల్లో జరగనుంది. కాబట్టి ప్రారంభ, ముగింపు తేదీలు భిన్నంగా ఉంటాయి.

➤ఆటో ఎక్స్‌పో మోటార్ షో, ఇంటర్నేషనల్ టైర్ షో, ఇండియా సైకిల్ షో, స్టీల్ పెవిలియన్ మరియు మొబిలిటీ టెక్ పెవిలియన్‌లు జనవరి 17న ప్రారంభమై 22న ముగుస్తాయి. ఇది భారత్ మండపం (ప్రగతి మైదాన్)లో జరుగుతుంది. జనవరి 17 మరియు 18వ తేదీల్లో మీడియా మరియు డీలర్‌ల కోసం.. జనవరి 19 నుంచి 22 వరకు సాధారణ ప్రజల సందర్శనార్థం అనుమతి ఉంటుంది.

➤2025 ఆటో ఎక్స్‌పో కాంపోనెంట్స్ షో జనవరి 18 నుంచి 21 వరకు ఢిల్లీలోని ద్వారక వద్ద ఉన్న యశోభూమి సెంటర్‌లో జరుగుతుంది.

➤జనవరి 19 నుంచి 22 వరకు గ్రేటర్ నోయిడాలో.. భారత్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ షో మరియు అర్బన్ మొబిలిటీ షో జరుగుతుంది. ఈ మూడు షోలకు వేలాదిమంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

Also Read: 2024లోనే కారును ఎందుకు కొనాలి.. 2025లో కొంటే వచ్చే నష్టాలు తెలుసా?

రెండేళ్లకు ఒకసారి

భారతదేశంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గ్లోబల్ ఆటో ఎక్స్‌పో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు, పారిశ్రామికవేత్తలు మరియు ఇతర ప్రముఖులు వేచి చూస్తుంటారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను లేదా రాబోయే ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. అయితే కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే ఈ ఎక్స్‌పో వాయిదా పడింది. ఆ తరువాత యధావిధిగా కార్యక్రమం జరుగుతోంది.

ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా భారత్

భారతదేశంలో రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలువనుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అమెరికా, చైనా వంటి దేశాలను ఇండియా అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఈ రంగంలో మన దేశం తప్పకుండా అగ్రస్థానానికి చేరుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పలు రంగాల్లో ఇండియా వేగంగా దూసుకెళ్తోంది. దీంతో చాలా దేశాల చూపు మనదేశం మీద పడింది. కాబట్టి చాలామంది పారిశ్రామిక వేత్తలు సైతం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు. మొత్తానికి భారత్.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులను బట్టే అర్థం చేసుకోవచ్చు.

బజాజ్ చేతక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

0

New Bajaj Chetak Launched in India: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) ఎట్టేకలకు దేశీయ మార్కెట్లో కొత్త తరం ‘చేతక్’ (Chetak) లేదా ‘చేతక్ 35 సిరీస్’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్కూటర్ కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ లేదా స్టాండర్డ్ మోడల్ కంటే కూడా హుందాగా ఉంటుంది.

వేరియంట్స్ & ధరలు (Variants & Price)

కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 3501, 3502 మరియు 3503 వేరియంట్లు. ప్రస్తుతం బేస్ వేరియంట్ మరియు మిడ్ స్పెక్ వేరియంట్ల ధరలు మాత్రమే వెల్లడయ్యాయి. టాప్ వేరియంట్ ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

➤బజాజ్ చేతక్ 3501: రూ. 1.27 లక్షలు
➤బజాజ్ చేతక్ 3502: రూ. 1.20 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, బెంగళూరు).

డిజైన్ (Design)

కొత్త ‘బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్’ (Bajaj Chetak Electric Scooter) కొత్త ఫ్రేమ్, బ్యాటరీ మరియు మోటార్ వంటి వాటిని పొందుతుంది. అయితే చూడటానికి పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇందులో స్లీకర్ టర్న్ ఇండికేటర్స్, బ్లాక్ అవుట్ హెడ్‌లైట్ సరౌండ్, స్లిమ్మర్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటివి కూడా ఉన్నాయి.

ఫీచర్స్ (Features)

కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యాప్‌లతో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, స్క్రీన్ మిర్రరింగ్ వంటివన్నీ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు డాక్యుమెంట్ స్టోరేజ్, జియో ఫెన్సింగ్, తెఫ్ట్ వార్ణింగ్, ఓవర్ స్పీడ్ కోసం కావాల్సిన అలర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి.

బ్యాటరీ & రేంజ్ (Battery & Range)

బజాజ్ చేతక్ 3.5 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఈ బ్యాటరీ ఇప్పుడు ఫ్లోర్‌బోర్డ్ కింద ఉంది. అయితే ఈ బ్యాటరీ.. మునుపటి మోడల్లోని బ్యాటరీ కంటే కూడా 3 కేజీలు తక్కువ బరువు ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 153 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 950 వాట్ ఛార్జర్ పొందుతుంది. దీని ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి పట్టే సమయం మూడు గంటలు మాత్రమే.

కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కేడబ్ల్యు మోటారును పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 73 కిమీ. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫ్లోర్ మౌంటెడ్ బ్యాటరీ (Floor Mounted Battery)

బజాజ్ కొత్త తరం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో ఫ్లోర్ మౌంటెడ్ బ్యాటరీ ఉంది. ఈ కారణంగా ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు బూట్ స్పేస్ 35 లీటర్ల వరకు ఉంటుంది. వీల్‌బేస్ కూడా పెరిగింది. సీటు 80 మిమీ పొడవు ఉంటుంది. కాబట్టి ఇది రైడర్ మరియు పిలియన్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Also Read: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న కియా కొత్త కారు: మార్కెట్లో మోత మోగిస్తున్న సిరోస్

కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50000 కిమీ వారంటీ అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీ రెండు వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. త్వరలో 3503 వేరియంట్ ధరను వెల్లడించనుంది. ఇది మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్ట, యంపియర్ నెక్సస్ మరియు ఓలా ఎస్1 రేంజ్ స్కూటర్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చేతక్ స్కూటర్‌పై మా అభిప్రాయం

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు లాంచ్ చేసిన చేతక్ ఏలక్ట్రిక్ స్కూటర్.. దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత అప్డేట్ అయింది. కాబట్టి ఇది తప్పకుండా చేతక్ ప్రియులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న కియా కొత్త కారు: మార్కెట్లో మోత మోగిస్తున్న సిరోస్

0

2025 Kia Syros SUV Revealed: అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) ఎట్టకేలకు ‘సిరోస్’ (Syros) ఎస్‌యూవీ ఆవిష్కరించింది. సిరోస్ అనేది భారతీయ కంపెనీ యొక్క రెండవ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ సరికొత్త కియా కారు డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ మరియు ధరల వంటి వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

బుకింగ్స్ & వేరియంట్స్

దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త కియా సిరోస్ ఎస్‌యూవీ కోసం కంపెనీ 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. కాగా డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. ఆ సమయంలో కంపెనీ కియా సిరోస్ ధరలను అధికారికంగా వెల్లడించనుంది. ఈ కారు HTK, HTK (O), HTK+, HTX, HTX+ మరియు HTX+(O) అనే వేరియంట్లలో లభిస్తుంది.

ఎక్స్‌టీరియర్ డిజైన్

కియా సిరోస్ కారు చూడటానికి చాలా కొత్త డిజైన్ పొందుతుంది. చూడగానే ఆకర్శించబడే ఫ్రంట్ డిజైన్, బంపర్ అంచుల వద్ద నిలువుగా పేర్చబడిన హెడ్‌ల్యాంప్‌లు, ఎయిర్ ఇన్‌టేక్ దిగువ బ్లాక్ అవుట్ చూడవచ్చు. ముందు భాగం చూడగానే ఇది ఎలక్ట్రిక్ కారేమో అనే భ్రమ కలుగుతుంది.

ఈ కొత్త కియా కారు యొక్క వీల్ ఆర్చ్‌లపైన చంకీ ప్లాస్టిక్ క్లాడింగ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, వెనుక భాగంలో ఎల్ షేప్ టెయిల్ లైట్ ఉంటుంది. వెనుక బంపర్ డ్యూయెల్ టోన్ పొందుతుంది. షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద ఇది ఓ కొత్త డిజైన్ పొందినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇంటీరియర్ ఫీచర్స్

కొత్త కియా సిరోస్ కారులో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయెల్ 12.3 ఇంచెస్ డిస్‌ప్లేలు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ కోసం 5 ఇంచెస్ స్క్రీన్ ఉంది. టూ స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, HVAC కంట్రోల్ కోసం ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్, యాంబియంట్ లైటింగ్ వంటివన్నీ కూడా ఈ కారులో ఉన్నాయి.

పైన చెప్పుకున్న ఫీచర్స్ కాకుండా సిరోస్ కారులో.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కోసం ఓటీఏ అప్‌డేట్‌లు, నాలుగు వెంటిలేటెడ్ సీట్లు, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన రిక్లైనింగ్ మరియు స్లైడింగ్ సెకండ్ రో సీట్లు, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ ఫంక్షన్, పవర్డ్ డ్రైవర్ సీటు, 8 స్పీకర్ హార్మాన్ కార్డాక్ సౌండ్ సిస్టం, డ్యూయెల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్ డీటైల్స్

కియా సిరోస్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.0 లీటర్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ సీఆర్డీఐ టర్బో డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీ ద్వారా 120 హార్స్ పవర్ 172 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 116 హార్స్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది.

Also Read: 25 సంవత్సరాలుగా తిరుగులేని మోడల్: 32 లక్షల మంది కొన్న ఏకైక కారు ఇదే

అంచనా ధర మరియు ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా సిరోస్ (Kia Syros).. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3ఎక్స్ఓ, మారుతి బ్రెజ్జా, స్కోడా కైలాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన తరువాత మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రభావం బహుశా అమ్మకాల మీద పడే అవకాశం ఉంది.

25 సంవత్సరాలుగా తిరుగులేని మోడల్: 32 లక్షల మంది కొన్న ఏకైక కారు ఇదే

0

Maruti Wagon R 25 Years Completed in India: ఎక్కువమందికి సుపరిచయమైన వెహికల్ బ్రాండ్ మారుతి సుజుకి (Maruti Suzuki). ఈ కంపెనీ ఇప్పటికే లెక్కకు మించిన మోడల్స్ మార్కెట్లో లాంచ్ చేసి, అధిక ప్రజాదరణ పొందుతోంది. ఇందులో ఒకటి ‘మారుతి వ్యాగన్ ఆర్’ (Maruti Wagon R). ఈ కారు భారతదేశంలో ఏకంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, హోండా సిటీ వంటి వాటితో పాటు మార్కెట్లో ఎక్కువ సంవత్సరాలుగా అమ్ముడవుతున్న కారుగా వ్యాగన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

1999లో తొలిసారి

డిసెంబర్ 18, 1999లో మొదటిసారి ‘వ్యాగన్ ఆర్’ భారతీయ విపణిలో అరంగేట్రం చేసింది. కాగా అప్పటి నుంచి, ఇప్పటి వరకు ఎంతోమందిని ఆకర్షిస్తూ.. మంచి అమ్మకాలను పొందుతూ పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. 2022, 2023 మరియు 2024 ఆర్ధిక సంవత్సరాల్లో కూడా ఈ కారు అధిక అమ్మకాలను పొందగలిగింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాగన్ ఆర్.. మూడవ తరం మోడల్. ఇప్పటి వరకు (25 సంవత్సరాల్లో) 32 లక్షల మంది ఈ వ్యాగన్ ఆర్ కార్లను కొనుగోలు చేశారు.

మొత్తం 25 సంవత్సరాల్లో మారుతి వ్యాగన్ ఆర్ రెండు సార్లు అప్డేట్స్ పొందింది. ఈ కారణంగానే ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న కారు 1.0 లీటర్ మరియు 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్స్ కలిగి ఉంది. మారుతి వ్యాగన్ ఆర్ టాల్‌బాయ్ డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్ కలిగి ఉంది.

వ్యాగన్ ఆర్ మొదటి తరం

మారుతి సుజుకి వ్యాగన్ 1999లో లాంచ్ అయినప్పుడు.. హ్యుందాయ్ కంపెనీ యొక్క శాంత్రోకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది. పొడుగ్గా ఉండే ప్రజలు ప్రయాణించడానికి వ్యాగన్ ఆర్ అనుకూలంగా ఉండటం చేత.. ఇది అప్పట్లోనే గణనీయమైన అమ్మకాలను పొందగలిగింది. మొదటితరం వ్యాగన్ ఆర్ 2003లోనే చిన్న కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. ఆ తరువాత 2006లో మరోసారి మరింత ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఆ సమయంలో LPG వేరియంట్ పరిచయమైంది.

వ్యాగన్ ఆర్ గొప్ప పర్ఫామెన్స్ అందించడం వల్ల.. ఇది గణనీయమైన అమ్మకాలను పొందగలిగింది. ఈ కారులో 50:50 స్ప్లిట్ రియర్ సీటు కూడా ఉంది. మొదటితరం మోడల్ 4 సీటర్ కారుగా మాత్రమే పరిచయమైంది. ఆ తరువాత కాలంలో ఇది అప్డేట్ పొందింది.

రెండో తరం మారుతి వ్యాగన్ ఆర్

మారుతి వ్యాగన్ ఆర్ రెండో తరం మోడల్ 2010 నుంచి 2018 మధ్యలో అందుబాటులో ఉండేది. ఇది జపాన్‌లోని నాలువగా తరం వ్యాగన్ ఆర్ ఆధారంగా నిర్మితమైంది. ఇది దాని మునుపటి తరం కరుకంటే కూడా కొంత పెద్దదిగా ఉండేది. ఇది ఏబీఎస్ మరియు ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. ఈ కారు 1.0 లీటర్ త్రి సిలిండర్ కే10బీ ఇంజిన్ పొందింది. ఇది 68 హార్స్ పవర్ అందించింది. ఇందులో CNG మోడల్ కూడా ఈ రెండోతరంలోనే పరిచయమైంది.

2013లో వ్యాగన్ ఆర్ మరింత ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందటం మాత్రమే కాకుండా.. ఇంటీరియర్‌లో కూడా ఎక్కువ అప్డేట్స్ పొందింది. 2014లో మారుతి సుజుకి ఒక కొత్త వేరియంట్ పరిచయం చేసింది. ఇది దాని సాధారణ మోడల్ కంటే కూడా ప్రీమియంగా ఉండేది. ఈ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఇదే వ్యాగన్ ఆర్ టాప్ వేరియంట్‌గా మార్కెట్లో విక్రయించబడింది.

Also Read: 2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే!

మూడోతరం వ్యాగన్ ఆర్

వ్యాగన్ ఆర్ మూడవ తరం కారు 2019లో ప్రారంభమైంది. అదే ఇప్పటికి కూడా అమ్మకానికి ఉంది. మూడోతరం వ్యాగన్ ఆర్ కారు హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కారుకు జపాన్‌లో అమ్ముడవుతున్న కారుకు పెద్దగా సంబంధమే లేదు. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందింది. కాగా CNG ఇంజిన్ 1.0 లీటర్ ఇంజన్‌తో మాత్రమే అమ్మకానికి ఉంది.

ఇకపోతే 2022లో కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఒకసారి అప్డేట్స్ పొందింది. ఆ సమయంలోనే రెండు ఇంజన్‌లు డ్యూయెల్ జెట్ టెక్నాలజీ మరియు ఐడెల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం వంటి వాటితోపాటు కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. కాగా ఈ ఏడాది జూన్ నెలలోనే కంపెనీ తన మూడోతరం వ్యాగన్ ఆర్‌తో 10 లక్షల అమ్మకాలను పొందగలిగింది. అంతే కాకుండా భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన CNG మోడల్ కూడా వ్యాగన్ ఆర్ కావడం గమనార్హం. ఇప్పటికి మార్కెట్లో 6.6 లక్షల CNG కార్లు అమ్ముడైనట్లు సమాచారం.

2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే!

0

Upcoming Electric Cars in India 2025: 2024లో చాలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. ఇక ఈ ఏడాది ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఎదురు చూసేవారు.. మరికొన్ని రోజులు ఎదురుచూస్తే.. 2025లో ఏకంగా 15 ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అవుతున్నాయి. వాటిలో మీకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఏడాది (2025) మార్కెట్లో లాంచ్ అయ్యే సరికొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వచ్చేయండి.

హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)

వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ కానున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ఈవీ. ఈ కారు 2025లో జరగనున్న భారత్ ఆటొమొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో కనిపించనుంది. ఫ్యూయెల్ కారుగా దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన ఈ కారు త్వరలోనే ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందనున్నట్లు సమాచారం. కాబట్టి క్రెటా ఈవీ ఒక సింగిల్ ఛార్జితో 450 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 138 బీహెచ్‌పీ పవర్, 255 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 22 లక్షలు ఉంటుందని సమాచారం.

మారుతి సుజుకి ఈ విటారా (Maruti Suzuki E Vitara)

2025లో మారుతి సుజుకి కూడా తన గ్రాండ్ విటారా కారును ఎలక్ట్రిక్ రూపంలో ‘ఈ విటారా’ పేరుతో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా 2025 భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ కారు ఇటలీలోని మిలాన్‌లో కనిపించింది. కాబట్టి ఈ గ్రాండ్ విటారా 49 కిలోవాట్ మరియు 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందనున్నట్లు సమాచారం. ఇది ఒక ఫుల్ ఛార్జితో 450 నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.

టయోటా అర్బన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Toyota Urban Electric SUV)

వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ కానున్న మరో ఎలక్ట్రిక్ కారు.. టయోటా కంపెనీకి చెందిన అర్బన్ ఎలక్ట్రిక్ అని తెలుస్తోంది. ఇది ఈ విటారా కంటే కొంత భిన్నంగా ఉంటుంది. అయితే ఇంటీరియర్ ఈ విటారా మాదిరిగానే ఉంటుంది. యాంత్రికంగా కూడా అర్బన్ ఎలక్ట్రిక్.. మారుతి ఈ గ్రాండ్ విటారాకు సమానంగా ఉంటుంది.

మహీంద్రా బీఈ 6 & ఎక్స్ఈవీ 9ఈ (Mahindra BE 6 & XEV 9E)

2025లో మహీంద్రా కంపెనీ కూడా బీఈ 6 మరియు ఎక్స్ఈవీ 9ఈ పేరుతో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే సంస్థ ఈ కార్లను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు 59 కిలోవాట్ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. కాబట్టి వీటి రేంజ్ అనేది 500 కిమీ నుంచి 650 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరలు రూ. 20 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా ఎస్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ (Mahindra SUV 3XO EV)

ఇప్పటికే ఫ్యూయెల్ కారుగా మార్కెట్లో అమ్ముడవుతున్న మహీంద్రా ఎస్‌యూవీ 3ఎక్స్ఓ.. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది మార్కెట్లో లాంచ్ కానున్న ఎస్‌యూవీ 400 ఈవీ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. ఎస్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారు 34.5 కిలోవాట్ మరియు 39.5 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఈ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే అక్కడక్కగా కొన్ని మార్పులు లేదా చేంజెస్ స్పష్టంగా కనిపిస్తాయి.

టాటా ఎలక్ట్రిక్ కార్లు (Tata Electric Cars)

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2025లో లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లలో హారియార్ ఈవీ (Haarier EV), సఫారీ ఈవీ (Safari EV) మరియు సియెర్రా ఈవీ (Sierra EV) వంటివి ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి కొంతవరకు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఎలక్ట్రిక్ కార్లు కాబట్టి కొన్ని ఆధునిక మార్పులను గమనించవచ్చు. కంపెనీ ఈ కార్ల ధరలు మరియు రేంజ్ వంటయి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఎంజీ విండ్సర్ ఈవీ 50 కిలోవాట్ (MG Windsor EV 50 kWh)

ఇటీవలే భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. వచ్చే ఏడాది 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కలిగిన కారుగా దేశీయ విఫణిలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 331 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ కానున్న 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కారు 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster)

2025 జనవరిలో ఎంజీ మోటార్ కంపెనీ మార్కెట్లో మొదటిసారి తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్‌స్టర్‌ను ఆవిషకరించనుంది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ కారు కూపే మాదిరిగా ఉంటుంది. దీని ధర రూ. 80 లక్షల నుంచి రూ. 85 లక్షల మధ్య ఉంది. ఈ కారు ఒక సింగిల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Also Read: కొత్త పెళ్లి కూతురు ‘కీర్తి సురేష్’ ఇష్టపడి కొన్న కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

కియా సైరస్ ఈవీ (Kia Syros EV)

ఇప్పటికే ఉత్తమ కార్లను మార్కెట్లో లాంచ్ చేసి గొప్ప అమ్మకాలు పొందుతున్న కియా మోటార్స్ త్వరలోనే ‘సైరస్ ఈవీ’ పేరుతో మరో కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే దీనిని కంపెనీ ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని.. స్పష్టంగా వెల్లడించలేదు. అయితే 2025 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది 35 కిలోవాట్ లేదా 40 కిలోవాట్ బ్యాటరీని పొందుతుందని, ఇది 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం.

స్కోడా ఎన్యాక్ IV (Skoda Enyaq IV)

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా కూడా వచ్చే ఏడాది భారతీయ మార్కెట్లో ఎన్యాక్ IV ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 50 లక్షల నుంచి రూ. 55 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారులో 77 కిలోవాట్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 513 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ కారు డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుందని సమాచారం.

Also Read: లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్‌ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!

స్కోడా ఎల్రోక్ (Skoda Elroq)

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా లాంచ్ చేయనున్న మరో ఎలక్ట్రిక్ కారు ఎల్రోక్. ఇది 50, 60, 85 మరియు 85ఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుందని సమాచారం. ఇది 55 కిలోవాట్, 63 కిలోవాట్, 82 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు గరిష్టంగా 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారుకు సంబంధించిన ధరలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4 (Volkswagen ID.4)

కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ కూడా ఉంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు పేరు ఐడీ.4. ఈ కారు ధర రూ. 65 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది 55 కిలోవాట్ మరియు 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు గరిష్టంగా 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు కూడా 2025లోనే లాంచ్ అవుతుందని సమాచారం.

ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ కానున్న ‘హ్యుందాయ్ క్రెటా’: ధర ఎంతంటే?

0

Hyundai Creta EV Launch on 2025 January 17: హ్యుందాయ్ అంటే మొదట గుర్తొచ్చేది ‘క్రెటా’. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ కారును 10 లక్షల కంటే ఎక్కువమంది కొనుగోలు చేశారు. అయితే కంపెనీ ఈ కారును త్వరలోనే ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ లాంచ్ చేయనున్న కొత్త ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ లేదా ఆదరణను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ తన పాపులర్ క్రెటా కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ ఈ కారును 2025 జనవరి 17 మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశంఉంది. మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఈ కారు మహీంద్రా లాంచ్ చేయనున్న బీఈ 6 మరియు టాటా కర్వ్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)

చూడటానికి హ్యుందాయ్ క్రెటా స్టాండర్డ్ మోడల్ కంటే కూడా క్రెటా ఈవీ కొంత భిన్నంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానున్న క్రెటా ఇప్పుడు క్లోజ్డ్ గ్రిల్ పొందనుంది. బంపర్ కూడా కొత్త డిజైన్ పొందుతుంది. కొంత భిన్నంగా కనిపించే అల్లాయ్ వీల్స్ మరియు ఈవీ బ్యాడ్జ్ వంటివన్నీ ఈ కారులో చూడవచ్చు. మొత్తం మీద ఈ హ్యుందాయ్ క్రెటా.. ఫ్యూయెల్ కారు కంటే కూడా భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, డ్రైవ్ సెలెక్టర్ కంట్రోలర్, రెండు కప్ హోల్డర్లతో రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కోసం ప్రత్యేకంగా బటన్స్, 360 డిగ్రీ కెమెరా, సెంటర్ ప్యానెల్‌లో HVAC కంట్రోల్స్ వంటివన్నీ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. కాబట్టి దీనిని సులభంగా యాక్సిస్ చేయవచ్చు. కొన్ని ఫిజికల్ కంట్రోల్స్ కూడా ఈ కారులో గమనించవచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఈవీ బ్యాటరీ & రేంజ్

వచ్చే నెలలో మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టనున్న క్రెటా ఈవీ 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందనున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ ఎంజీ జెడ్ఎస్ ఈవీ (50.3 కిలోవాట్), మారుతి ఈవీఎక్స్ (49.6 కిలోవాట్) కంటే తక్కువని తెలుస్తోంది. అయితే క్రెటా ఈవీ సింగిల్ ఛార్జితో 400 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

Also Read: లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్‌ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!

హ్యుందాయ్ క్రెటా ఈవీలో సింగిల్ ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది. ఇది 138 హార్స్ పవర్ మరియు 255 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి ఇది ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని సమాచారం. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత ప్రతి ఏటా 24000 కంటే ఎక్కువ కార్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.

క్రెటా ఈవీ అంచనా ధర

కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త హ్యుందాయ్ క్రెటా ఈవీ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. అంతే కాకూండా ఈ కారు రేంజ్ కూడా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈ వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడవుతాయని భావిస్తున్నాము.

క్రెటా ఈవీ లాంచ్ ఎప్పుడంటే..

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా కూడా ఒకటి. ఈ కారు రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఇది గొప్ప అమ్మకాలను పొందగలిగింది. కాబట్టి మార్కెట్లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ కూడా మంచి అమ్మకాలు పొందుతుందని, దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము. అయితే ఈ కారును హ్యుందాయ్ కంపెనీ ఎప్పుడు లాంచ్ చేస్తుందనే వివరాలు వెల్లడించాల్సి ఉంది.