24.7 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 19

కేరళలో ఇదే ఫస్ట్ బీవైడీ సీల్.. కొన్నది 21 ఏళ్ల చిన్నది: ధర తెలిస్తే అవాక్కవుతారు!

0

21 Years Kerala Woman To Own BYD Seal EV: మన దేశంలో బీవైడీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఆట్టో3, సీల్ మరియు ఈమ్యాక్స్ అనే మూడు కార్లను లాంచ్ చేసింది. ఇటీవల ‘బీవైడీ సీల్’ (BYD Seal) కారును కేరళకు చెందిన వ్యాపారవేత్త ‘లక్ష్మీ కమల్’ (Lakshmi Kamal) కొనుగోలు చేశారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.51 లక్షలు (ఆన్ రోడ్, కేరళ – కొచ్చి). కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ కారును ఎవరూ కొనుగోలు చేయలేదు, కాబట్టి బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన మొదటి వ్యక్తిగా & మొదటి మహిళగా లక్ష్మీ కమల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

కేవలం 21ఏళ్ల వయసులోనే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన అతి తక్కువ మందిలో లక్ష్మీ కమల్ కూడా ఒకరుగా నిలిచారు. ఈమె బ్లాక్ కలర్ ప్రీమియం బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. నిజానికి ఇది డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. బీవైడీ సీల్ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్ అందిస్తుంది.

చిన్న వయసులోనే ఖరీదైన కారును కొనుగోలు చేసిన లక్ష్మీని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ కారు 312 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే మోటారును పొందుతుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బ్యాటరీ & రేంజ్

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు.. 2024 మార్చిలో ప్రారంభమైంది. కంపెనీ ఈ కారును ప్రారంభించిన తరువాత మొదటి 15 రోజుల్లో 500 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఎలక్ట్రిక్ కారు ధర ఎక్కువైనా.. డిమాండ్ కూడా అదే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీవైడీ సీల్ డైనమిక్ వేరియంట్ 61.44 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. మిగిలిన రెండు వేరియంట్లు 82.56 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి.

సీల్ ఎలక్ట్రిక్ కారు పరిమాణంలో కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4800 మిమీ, వెడల్పు 1875 మిమీ మరియు ఎత్తు 1460 మిమీ వరకు ఉన్నాయి. ఇది చూడటానికి కూపే స్టైల్ డిజైన్ పొందుతుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ లైట్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన బీవైడీ సీల్ ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే మరియు కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.

ఫీచర్స్

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ప్రీమియం క్యాబిన్ అనుభూతిని అందిస్తుంది. 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ కోసం హెడ్స్ అప్ డిస్‌ప్లే, క్రిస్టల్ టోగుల్ డ్రైవ్ సెలెక్టర్, 8 వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, మెమొరీ ఫంక్షన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ సీల్ కారులో ఉన్నాయి.

Don’t Miss: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ప్రజలకోసం ఓ అడుగు ముందుకేసి: ఇది కదా ‘రతన్ టాటా’

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా బీవైడీ సీల్.. ప్రయాణికులకు భద్రత కల్పించడానికి 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమాటిక్ వైపర్స్, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ టెక్నాలజీ వంటి మరెన్నో ఉన్నాయి. ఇది యూరో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే.. ఎంతోమంది సెలబ్రిటీలను ఆకర్షిస్తోంది. మొత్తం మీద అతి తక్కువ కాలంలోనే చాలామంది వాహన ప్రియులను ఆకర్షిస్తోంది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ప్రజలకోసం ఓ అడుగు ముందుకేసి: ఇది కదా ‘రతన్ టాటా’

0

Ratan Tata Dream Car Nano For Indians: అది శీతాకాలం.. 2008 జనవరి 10వ తేదీ ఆటో ఎక్స్‌పోలో వందలాది కంపెనీలు, వేలాది జర్నలిస్టులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, మంత్రులు ఇలా ఎంతోమంది నిండి ఉన్న వాతావరణం. అయితే ఏ హాల్ వద్ద లేనంతమంది జనం నెంబర్ 11 హాల్ దగ్గర కిక్కిరిసి ఉన్నారు. నిలబడటానికి స్థలం కూడా లేదు. వీరందరూ నిలబడి ఉన్నది.. ఏ పెద్ద లగ్జరీ కారు కోసమో కాదు. కేవలం ఓ చిన్న కారు కోసం. దాని ధర కేవలం రూ. లక్ష రూపాయలు మాత్రమే.

లక్ష రూపాయలకు కారు సాధ్యమేనా అని ఎంతోమంది కుతూహలంతో వేచి చూస్తున్నారు. హాల్ నెంబర్ 11 వద్ద కోలాహలం రెట్టింపు అయింది. లక్ష రూపాయల కారును చూపించడానికి అందరూ వచ్చేసారు. అదే సమయంలో రతన్ టాటా (Ratan Tata) చిన్న తెల్లటి కారును వేదికమీదకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసారు. కారును చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటికే లక్ష రూపాయలకు కారును తయారు చేయడం అసాధ్యం అనుకున్నవారు సైతం నోటికి తాళం వేసుకున్నారు.

కారు చూడటానికి చిన్నాదిగా ఉన్నప్పటికీ.. ప్రయాణికులకు కావాల్సిన సకల సౌకర్యాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. లోపల క్యాబిన్ చాలా విశాలంగా ఉంది. నాలుగు చక్రాలు, స్టీరింగ్ వీల్, నలుగురు వ్యక్తులకు లేదా చిన్న కుటుంబానికి సరిపోయే విశాలమైన క్యాబిన్ ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చిన్న కారుకు నాలుగు డోర్స్ ఉండటం ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. 22 కిమీ నుంచి 24 కిమీ మైలేజ్ ఇచ్చే ఈ కారు ఎంతోమందిని ఒక్క చూపుతోనే ఆకర్శించింది.

కారును పరిచయం చేసిన కార్యక్రమం పూర్తయింది. విలేఖరుల సమావేశం ప్రారంభమైంది కొందరు ఆ చిన్న కారును ‘బుద్దు కార్’ అని పిలిచారు. కానీ టాటా మోటార్స్ కారును ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కారణంగా దాన్ని.. నానో కారుగా అభివర్ణించింది. ఇలా టాటా నానో కారు భారతదేశంలో అడుగుపెట్టింది.

నానో కారు ఎందుకు లాంచ్ చేశారు?

ప్రతి ఒక్కరికి సొంత కారు ఉండాలనేది ఒక కల. ఆ నిల నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడతారు. అయితే రోజు రోజుకి ధరలు భారీగా పెరుగుతుండటంతో.. కొందరికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయితే అలాంటి కలను నిజం చేయడానికి రతన్ టాటా ఓ అడుగు ముందుకు వేశారు.

ఒక కారు కొనాలంటే కనీసం రూ.10 లక్షలు ఉండాల్సిందే.. కానీ రతన్ టాటా ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో ఒక కారును సృష్టించాలని కలలు కన్నారు. అనుకున్న విధంగానే కేవలం రూ.1 లక్షకే కారును అందించాలనే ఉద్దేశ్యంతో ‘నానో’ కారుకు శ్రీకారం చుట్టారు. టాటా నానో దేశీయ విఫణిలో లాంచ్ చేశారు. ఈ కారు ఒకప్పుడు మార్కెట్లో గొప్ప సంచలనం సృష్టించింది. కేవలం లక్ష రూపాయలకే కారు అనేది అసాధ్యమైన పని. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత తక్కువ ధరకు కారును అందించలేదు.

రతన్ టాటా ఏం చెప్పారంటే?

భారతదేశంలో చాలా కుటుంబాలు స్కూటర్ మీద వెళ్లడం నేను చూసాను. తల్లి, తండ్రి మధ్యలో ఒక పిల్లవాడు. ఇలాంటి సన్నివేశాలను నేను చాలా సందర్భాల్లో చూసాను. వారికి రక్షణ కాల్పించాలనే ఉద్దేశ్యంతో.. నానో కారును రూపొందించడం జరిగిందని రతన్ టాటా వెల్లడించారు. మనదేశంలో మారుతి ఆల్టో 800 కారును కొనుగోలు చేయలేనివారు కూడా టాటా నానో కారును కొనుగోలు చేయగలిగారు.

ప్రారంభంలో విపరీతమైన అమ్మకాలు పొందిన టాటా నానో (Tata Nano) కారు 2018 వరకు కూడా మంచి అమ్మకాలను పొందుతూ.. ముందుకు సాగింది. అయితే అమ్మకాలు మందగించడం వల్ల 2018లో కంపెనీ ఈ కారు యొక్క ఉత్పత్తిని నిలిపివేసింది. టాటా నానో కారు ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా లేకపోవడం కూడా దీని ఉత్పత్తి నిలిచిపోవడానికి ప్రధాన కారణం కావడం గమనార్హం.

Don’t Miss: రతన్ టాటా మీద చెయ్యేసి మాట్లాడేంత చనువుందా! ఎవరితడు?

టాటా నానో ఎలక్ట్రిక్ (Tata Nano Electric)

నానో కారు ఉత్పత్తి నిలిచిపోయిన తరువాత రతన్ టాటా దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సంకల్పించారు. ఇప్పటికే రతన్ టాటా ఎలక్ట్రిక్ నానో కారును ఉపయోగిస్తున్నారు. అయితే ఈ కారును సాధారణ ప్రజల కోసం లాంచ్ చేయాల్సి ఉంది. కానీ అంతలోనే భరతమాత ముద్దుబిడ్డ రతన్ టాటా కన్ను మూసారు. దీంతో దేశం ఒక్కసారిగా మూగబోయింది.

భారీ తగ్గింపు.. టాటా కార్లపైన గొప్ప డిస్కౌంట్స్ – వివరాలు

0

Discounts on Tata Cars in Festive Season 2024: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors).. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ కొన్ని రోజులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఏ కారుపైన ఎంత డిస్కౌంట్స్ లభిస్తుందనే విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

టాటా హారియర్ (Tata Harrier)

హారియర్ కొనుగోలుపైన కంపెనీ ఏకంగా రూ. 1.33 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 2023 హారియర్ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్స్ మీద రూ. 50000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. కాగా 2024 మోడల్ మీద ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ కింద రూ. 25000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 170 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఎంజీ హెక్టర్ యొక్క ప్రత్యర్థిగా ఉన్న హారియర్ ధర రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ఉంది.

టాటా సఫారీ (Tata Safari)

ఈ నెలలో టాటా సఫారీ కొనుగోలుపైన కూడా రూ. 1.33 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 2023 మోడల్ మీద రూ. 50,000 తగ్గింపు, 2024 మోడల్ మీద రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా XUV700 మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.79 లక్షల మధ్య ఉంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)

మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న టాటా నెక్సాన్ మీద కూడా ఈ నెలలో గరిష్టంగా రూ. 95000 తగ్గింపు పొందవచ్చు. డీజిల్ వెర్షన్ మీద రూ. 80,000 తగ్గింపు లభిస్తుంది. నెక్సాన్ యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్ గత సెప్టెంబర్‌లో పరిచయం చేయడం జరిగింది. అయితే 2023 నెక్సాన్ మీద రూ. 40000 మరియు 2024 మోడల్ మీద రూ. 10000 నుంచి రూ. 25000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఇది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.

నెక్సాన్ ప్రస్తుతం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120 హార్స్ పవర్) లేదా 1.5 లీటర్ డీజిల్ (115 హార్స్ పవర్) ఇంజిన్స్ పొందుతుంది. ఈ రెండూ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. నెక్సాన్ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.50 లక్షల మధ్య ఉన్నాయి. కాగా నెక్సాన్ ఐసీఎన్‌జీ ధరలు రూ. 8.99 లక్షల నుంచి రూ. 14.59 లక్షల ( అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంది.

టాటా టియాగో (Tata Tiago)

టియాగో కొనుగోలుపైన రూ. 90వేలు వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.75 లక్షల మధ్య ధర వద్ద లభించే ఈ కారు యొక్క 2023 మోడల్ మీద గరిష్టంగా రూ. 90000 వరకు తగ్గింపు పొందవచ్చు. సీఎన్‌జీ వేరియంట్ మీద రూ. 85000 వరకు తగ్గింపు లభిస్తుంది. 2024 టియాగో టాప్ వేరియంట్ కొనుగోలు మీద రూ. 30000 వరకు తగ్గింపు లభిస్తుంది. లో ట్రిమ్ వేరియంట్ మీద రూ. 20000 డిస్కౌంట్ లభిస్తుంది.

1.2 లీటర్ ఇంజిన్ అనేది టాటా టియాగో కారులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 86 హార్స్ పవర్ అందిస్తుంది. సిఎన్‌జీ వేరియంట్ మీద 73.4 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందిస్తుంది. ఇది హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి స్విఫ్ట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టిగోర్ (Tata Tigor)

టిగోర్ కొనుగోలుపైన కంపెనీ రూ. 85000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఈ డిస్కౌంట్ 2023 కారు కొనుగోలుపైన మాత్రమే లభిస్తుంది. 2024 యొక్క అన్ని వేరియంట్స్ మీద రూ. 30000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఆరా, మారుతి డిజైర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టిగోర్ 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.4 లక్షల మధ్య ఉంది.

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)

ఆల్ట్రోజ్ కొనుగోలుపైన కంపెనీ రూ. 70000 వరకు తగ్గింపు లభిస్తుంది. 2023 పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్స్ మీద ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే గత ఏడాది మార్కెట్లో అడుగుపెట్టిన ఆల్ట్రోజ్ సిఎన్‌జీ వేరియంట్ మీద రూ. 55000 తగ్గింపు లభిస్తుంది. 2024 మిడ్ స్పెక్ మరియు హై-స్పెక్ కొనుగోలుపైన వరుసగా రూ. 25000 మరియు రూ. 35000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ. 9.49 లక్షల నుంచి రూ. 10.99 లక్షల మధ్య ఉంది.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన BYD eMax 7: ధర ఎంతో తెలుసా?

టాటా పంచ్ (Tata Punch)

ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న టాటా పంచ్ కొనుగోలుపైన గరిష్టంగా రూ. 18000 తగ్గింపు పొందవచ్చు. అయితే సిఎన్‌జీ వేరియంట్ మీద రూ. 15000 తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రత్యర్థిగా ఉన్న టాటా పంచ్ 1.2 లీటర్ ఇంజిన్ 88 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ధరలు మార్కెట్లో రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.12 లక్షల (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్-ఇండియా) మధ్య ఉంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన BYD eMax 7: ధర ఎంతో తెలుసా?

0

BYD eMax 7 Electric Car Launched in India: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనీస్ వాహన తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఎట్టకేలకు దేశీయ విఫణిలో తన ఈమ్యాక్స్ 7 (eMax 7) ఎంపీవీ లాంచ్ చేసింది. ఇప్పటికే బీవైడీ కంపెనీ ఆట్టో 3, సీల్ వంటి కార్లను విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు ఈ మ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా హుందాగా ఉంది.

ధర

మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బీవైడీ ఈమ్యాక్స్ 7 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ప్రీమియం, సుపీరియర్. వీటిని ధరలు వరుసగా రూ. 26.9 లక్షలు, రూ. 29.9 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). సెప్టెంబర్ 20 నుంచి కంపెనీ ఈ కారు కోసం రూ. 51000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

కలర్ ఆప్షన్స్ & డిజైన్

కొత్త బీవైడీ ఈమ్యాక్స్ 7 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్ మరియు కాస్మోస్ బ్లాక్ కలర్స్.

మూడు వరుసల సీటింగ్ పొజిషన్ కలిగిన ఈ కారు.. ఇండియన్ మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు 6 సీటర్ మరియు 7 సీటర్ రూపంలో అందుబాటులో ఉంది. అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్, కొత్త బంపర్, రెండు చివర్లలో క్రోమ్ ఎలిమెంట్స్ వంటివి ఈ కారులో ఉన్నాయి. 225/55 ఆర్17 టైర్లతో కొత్త డిజైన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

ఎక్స్టీరియర్ డిజైన్ మాదిరిగానే.. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 12.8 ఇంచెస్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీని చుట్టూ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉండటం చూడవచ్చు. అయితే సెంటర్ కన్సోల్ కొంత సవరించబడి ఉండటం చూడవచ్చు. ఈ కారులో రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, కొత్త స్విచ్‌గేర్, డ్రైవ్ సెలెక్టర్ లివర్ వంటివి ఉన్నాయి. స్టీరింగ్ వీల్ కూడా కొత్తది కావడం గమనార్హం.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచెస్ ఎల్‌సీడీ ఎమ్ఐడీతో అనలాగ్ డయల్స్ ఉన్నాయి. ఈమ్యాక్స్ 7 యొక్క రెండు వేరియంట్లలోనూ.. లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్ ఉంటుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్, పవర్ అండ్ వెంటలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఫ్రేమ్‌లెస్ ఫ్రంట్ వైపర్స్, రూఫ్ రెయిల్స్ కూడా ఈ కారులో ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఇందులో ఉన్నట్లు సమాచారం.

బ్యాటరీ మరియు రేంజ్

బీవైడీ ఈమ్యాక్స్ 7 యొక్క ప్రీమియం వేరియంట్ 55.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 420 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే సుపీరియర్ వేరియంట్ 71.8 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఈమ్యాక్స్ 7 ప్రీమియం ట్రిమ్ 163 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 10.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. సుపీరియర్ ట్రిమ్ 204 హార్స్ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Don’t Miss: మహీంద్రా థార్ కొనుగోలుపై రూ.1.60 లక్షల డిస్కౌంట్స్: మళ్ళీ రాదు ఈ ఆఫర్

ఈ రెండు వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ కావడం గమనార్హం. ఈ రెండు ట్రిమ్స్ 7కేడబ్ల్యు ఛార్జర్ పొందుతాయి. ప్రీమియం వేరియంట్ 89కేడబ్ల్యు డీసీ ఛార్జర్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోగలదు. సుపీరియర్ వేరియంట్ 115కేడబ్ల్యు ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. బీవైడీ కంపెనీ బ్యాట్రీపైన 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీ వారంటీ అందిస్తుంది. మోటార్ మీద 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిమీ వారంటీ అందిస్తుంది.

భార్య కోసం స్పెషల్ మినీ వ్యాన్ రెడీ చేయించిన కుబేరుడు

0

Mark Zuckerberg Porsche Mini Van For His Wife Priscilla Chan: ఇప్పటివరకు మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు కూడా వీ-క్లాస్ వంటి మినీ వ్యాన్స్ వంటివి విక్రయిస్తోంది. అయితే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్స్చే మాత్రం ఎప్పుడూ మినీ వ్యాన్ తయారు చేయలేదు. అయితే ఫేస్‌బుక్ సీఈఓ ‘మార్క్ జుకర్‌బర్గ్’ (Mark Zuckerberg) కోసం ఓ మినీ వ్యాన్ రూపొందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

బిలియనీర్ అనుకోవాలేగానీ ఏదైనా చేసేస్తారు.. అని నిరూపించారు మార్క్ జుకర్‌బర్గ్. ఇప్పటివరకు కార్లను మాత్రమే తయారుచేసే పోర్స్చే కంపెనీ మినీ వ్యాన్ రూపొందించింది. ఇది కేవలం జుకర్‌బర్గ్ కోసం మాత్రమే. ఇది కూడా తన భార్య కోసం ప్రత్యేకంగా తయారు చేయించి గిఫ్ట్ ఇచ్చారు.

జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి ఫోర్స్చే కయెన్ మరియు 911 జీటీ3 ముందు నిలబడి ఉన్నారు. పోర్స్చే మినీ వ్యాన్ యొక్క ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది స్లైడింగ్ డోర్ కలిగి ఉండటం చూడవచ్చు. ఫోటోలను షేర్ చేస్తూ.. కొత్త వైపు అన్వేషణ, ప్రిసిల్లాకు ఒక మినీ వ్యాన్ కావాలి. కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి డిజైన్ చేయాలని పోర్స్చే కయెన్ జీటీ మినీ వ్యాన్ ఇవ్వాలనుకున్నాను. నేను అనుకున్న విధంగా పోర్స్చే మినీ వ్యాన్ రూపొందించి ఇవ్వడానికి సహాయపడటానికి పోర్స్చే మరియు వెస్ట్‌కోస్ట్‌కస్టమ్స్‌కి థాంక్స్ అని ఫోటోలను షేర్ చేస్తూ పేర్కొన్నారు.

నిజానికి పోర్స్చే కంపెనీ ఎప్పుడూ మినీ వ్యాన్ తయారు చేయలేదు, తయారుచేయాల్సిన అవసరం రాలేదు. మొదటిసారి కంపెనీ మినీవ్యాన్ జుకర్‌బర్గ్ కోసం డిజైన్ చేసింది. దీనిని వెస్ట్ కోస్ట్ కస్టమ్స్ సహకారంతో రూపొందించడం జరిగింది. ఈ స్పెషల్ మినీ వ్యాన్ క్లాసీ షేడ్‌లో పూర్తిచేయబడి ఉంది. సాధారణగా డోర్స్ స్థానంలో కంపెనీ కస్టమ్ ఎలక్ట్రిక్ డోర్స్ అమర్చింది. ఇది స్టాండర్డ్ కయెన్ కారు కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే దీని వీల్‌బేస్ పొడిగించబడి ఉంది.

పోర్స్చే మినీ వ్యాన్ యొక్క మధ్యలోని సీట్లను కెప్టెన్ చైర్స్ మాదిరిగా డిజైన్ చేశారు. కాబట్టి ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మినీ వ్యానుకు సంబంధించి పవర్‌ట్రెయిన్ గణాంకాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజిన్ ద్వారా 659 బీహెచ్‌పీ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మార్క్ జుకర్‌బర్గ్ కార్ కలెక్షన్

బిలియనీర్ మార్క్ జుకర్‌బర్గ్ సాధాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో కేవలం ఒకే సూపర్ కారు ఉన్నట్లు తెలుస్తోంది. హోండా ఫిట్, అకురా టీఎస్ఎక్స్, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ఎంకే6 జీటీఐ, ఇన్ఫినిటీ జీ సెడాన్ మరియు పగానీ హుయ్రా మొదలైనవి ఈయన గ్యారేజిలో ఉన్నాయి.

ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న జుకర్‌బర్గ్ నికర విలువ 207 బిలియన్ డాలర్లు. గతంలో ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఈయన.. ఇటీవలే రెండో స్థానానికి వచ్చారు. ప్రస్తుతం ఎలోన్ మస్క్ తరువాత స్థానంలో నిలిచారు. కాగా ఇప్పుడు పోర్స్చే మినీ వ్యాన్ కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి మినీ వ్యాన్ మరొక్కటి లేదనే తెలుస్తుంది.

పోర్స్చే కార్లకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలామంది బిలియనీర్లు, సెలబ్రిటీలు కూడా ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేశారు. హృతిక్ రోషన్, సోనూసూద్, ఫరూక్ అక్తర్, సచిన్ టెండూల్కర్, యుజ్వేంద్ర చాహల్ మరియు సురేష్ రైనా, కపిల్ దేవ్, అక్షయ్ కుమార్, బాబీ డియోల్, ఇమ్రాన్ ఖాన్, రామ్ కపూర్, నరైన్ కార్తికేయన్ మొదలైనవారు ఈ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే పోర్స్చే కార్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది.

Don’t Miss: మహీంద్రా థార్ కొనుగోలుపై రూ.1.60 లక్షల డిస్కౌంట్స్: మళ్ళీ రాదు ఈ ఆఫర్

నిజానికి పోర్స్చే కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ ప్రజలు వీటిని కొనుగోలు చేయలేరు. కాబట్టి చాలా తక్కువమంది మాత్రమే ఈ కార్లను కలిగి ఉన్నారు. పోర్స్చే బ్రాండ్ కార్ల ధర రూ. 1 కోటి నుంచి రూ. 3.51 కోట్ల కంటే ఎక్కువ వరకు ఉన్నాయి. ధరలు కొనుగోలు చేసే నగరాన్ని బట్టి.. ఎంచుకునే కారును బట్టి ఉంటాయి.

మహీంద్రా థార్ కొనుగోలుపై రూ.1.60 లక్షల డిస్కౌంట్స్: మళ్ళీ రాదు ఈ ఆఫర్

0

Rs.1.6 Lakh Discount On Mahindra Thar This Festive Season: భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రేమికులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో చెప్పుకోదగ్గది మహీంద్రా కంపెనీ యొక్క థార్. ఇప్పటికే 1.86 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. అయితే ఈ కారుపైన కంపెనీ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా థార్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గొప్ప అవకాశం.

మహీంద్రా థార్ కొనుగోలుపై డిస్కౌంట్స్

థార్ కొనుగోలుపైన గరిష్టంగా రూ. 1.60 లక్షల డిస్కౌంట్ పొందవచ్చు. థార్ 3 డోర్ వెర్షన్ (లోయర్ వేరియంట్) మీద రూ. 1.25 లక్షలు, థార్ ఎర్త్ ఎడిషన్ మీద రూ. 1.60 లక్షలు, ఇతర వేరియంట్ల మీద రూ. 1.30 లక్షల తగ్గింపు లభిస్తుంది.

మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ విఫణిలో థార్ రోక్స్ లాంచ్ చేసిన తరువాత చాలామంది ఈ కారునే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో 3 డోర్ మోడల్ అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కాబట్టి సంస్థ ఈ పండుగ సీజన్‌లో తన అమ్మకాలను పెంపొందించుకోవడానికి ఈ అద్భుతమైన తగ్గింపులు ప్రకటించడం జరిగింది. కాగా కంపెనీ అన్ని వేరియంట్‌ల మీద 25000 రూపాయల విలువైన మహీంద్రా యాక్ససరీస్ కిట్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది.

థార్ కొనుగోలుపైన డిస్కౌంట్ అనేది మీరు ఎంచుకునే వేరియంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే థార్ ఎర్త్ ఎడిషన్ మీద ఎక్కువ డిస్కౌంట్ (రూ. 1.60 లక్షలు) డిస్కౌంట్ లభిస్తుంది.

మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్

థార్ ఎర్త్ ఎడిషన్ 4డబ్ల్యుడీ స్టాండర్డ్‌తో వస్తుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ ఎర్త్ ఎడిషన్ ఒక ప్రత్యేకమైన మాట్టే షేడ్‌లో లభిస్తుంది. దీనిని కంపెనీ డెసర్ట్ ప్యూరీ అని పిలుస్తుంది. ఈ కారు యొక్క బీ-పిల్లర్స్ మరియు వెనుక పెండర్ల మీద స్పెషల్ ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జ్ పొందుతుంది.

చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా కనిపించే థార్ ఎర్త్ ఎడిషన్ లేత గోధుమఱంగు మరియు నలుపు రంగు ఇంటీరియర్ లెథెరెట్ అపోల్స్ట్రే పొందుతుంది. స్టీరింగ్ వీల్ మీద బ్రాండ్ లోగో, కప్ హోల్డర్స్, గేర్ నాబ్, గేర్ కన్సోల్ వంటి ఎలిమెంట్స్ మీద క్రోమ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు. ఇది కూడా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

థార్ వెయిటింగ్ పీరియడ్

నివేదికల ప్రకారం.. మహీంద్రా థార్ 3 డోర్ చాలా అవుట్‌లెట్‌లలో దాదాపు వెయిటింగ్ పీరియడ్ లేకుండానే అందుబాటులో ఉంది. అయితే 2డబ్ల్యుడీ పెట్రోల్ మరియు ఎంట్రీ లెవెల్ 2డబ్ల్యుడీ ఎల్ఎక్స్ డీజిల్ వంటి వాటికి మాత్రం డిమాండ్ కొంత అధికంగానే ఉంది. ఈ డిమాండ్ కూడా కొన్ని ప్రదేశాల్లో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ కారును బుక్ చేసుకుంటే త్వరగానే డెలివరీలు పొందువచ్చు.

మహీంద్రా థార్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గొప్ప అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. ప్రారంభంలో ఈ కారు డెలివరీలు కొంత ఆలస్యంగా జరిగినా.. ప్రస్తుతం మాత్రం డెలివరీలో ఆలస్యం లేదనే తెలుస్తోంది. కాబట్టి థార్ బుక్ చేసుకుంటే త్వరగానే డెలివరీలు పొందవచ్చు.

Don’t Miss: మారుతి కార్లపై గొప్ప డిస్కౌంట్స్: పండుగ సీజన్‌లో ఇదే సువర్ణావకాశం!

మొదలైన థార్ రోక్స్ బుకింగ్స్

మహీంద్రా లాంచ్ చేసిన థార్ రోక్స్.. కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక గంటలోనే లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే థార్ రోక్స్ మోడల్ కోసం కస్టమర్లు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. థార్ రోస్ డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. థార్ రోక్స్ టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు పరిమాణం పరంగా 3 డోర్ మోడల్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి కార్లపై గొప్ప డిస్కౌంట్స్: పండుగ సీజన్‌లో ఇదే సువర్ణావకాశం!

0

Maruti Suzuki Festive Discounts: పండుగ సీజన్ మొదలైపోయింది. దసరా, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అలంటి వారికి మారుతి సుజుకి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ అందిస్తుందని వెల్లడించింది. ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్ మొదలైన కార్లు ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

మారుతి బ్రెజ్జా (Maruti Brezza)

బ్రెజ్జా కొనుగోలుపైనా ఈ నెలలో గరిష్టంగా రూ.25 వేలు వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 8.34 లక్షల నుంచి రూ. 14.14 లక్షల మధ్య ఉంది. ఇది భారతీయ విఫణిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనేట్, టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది ఉత్తమంగా ఉండటమే కాకుండా ఉత్తమ పనితీరును కూడా అందిస్తుంది.

మారుతి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R)

వ్యాగన్ ఆర్ కొనుగోలుపై కంపెనీ రూ. 35000 నుంచి రూ. 45000 తగ్గింపు అందిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క సీఎన్‌జీ కారు కొనుగోలుపైన కస్టమర్లు ఎక్కువ తగ్గింపును పొందవచ్చు. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ మరియు రూ. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది. అయితే సీఎన్‌జీ కారు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

మారుతి స్విఫ్ట్ (Maruti Swift)

స్విఫ్ట్ కారు కొనుగోలుపైన రూ. 35000 వరకు తగ్గింపులు పొందవచ్చు. స్విఫ్ట్ సీఎన్‌జీ కారు కొనుగోలుపైన 15000 రూపాయల తగ్గింపు పొందవచ్చు. కాగా మునుపటి స్విఫ్ట్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 30000 తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొందుతున్న ఈ కారుపైన కంపెనీ ఇప్పుడు మంచి తగ్గింపులు ప్రకటించింది. కాబట్టి ఈ నెలలో స్విఫ్ట్ మంచి సంఖ్యలో అమ్ముడవుతుందని భావిస్తున్నాము.

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)

డిజైర్ కొనుగోలుపైన కస్టమర్ గరిష్టంగా రూ. 40 వేలు తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది కేవలం ఆటోమాటిక్ వేరియంట్స్ కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది. మాన్యువల్ వేరియంట్స్ కొనుగోలుపైన కంపెనీ రూ. 25000 తగ్గింపు అందిస్తుంది. కాగా సీఎన్‌జీ వేరియంట్ కొనుగోలుపైన ఎటువంటి తగ్గింపు లభించదు. అయితే కంపెనీ డిజైర్ కారును 2024 మోడల్ రూపంలో లాంహెచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలోనే మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)

భారతదేశంలో ఒకప్పటి నుంచి అధిక ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి యొక్క ఆల్టో కే10 కొనుగోలుపైనా కంపెనీ రూ. 35000 నుంచి రూ. 50000 వరకు తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన వేరియంట్స్ మీద అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారులోని 1.0 లీటర్ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ కూడా వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)

ఎస్-ప్రెస్సో కొనుగోలుపైన కస్టమర్లు గరిష్టంగా రూ. 55000 తగ్గింపు అందిస్తాయి. అయితే ఎక్కువగా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ మోడల్స్ కొనుగోలుపై లభిస్తాయి. పెట్రోల్ మరియు CNG కార్ల కొనుగోలుపైనా కొంత తక్కువ డిస్కౌంట్స్ లభిస్తాయి. ఎస్-ప్రెస్సో కార్లు మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలను పొందుతూ ముందుకు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పుడు అధిక తగ్గింపులను అందిస్తుండటంతో మరింతమంది కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)

మన జాబితాలో మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ సెలెరియో కొనుగోలుపై కూడా పొందవచ్చు. టాటా టియాగో కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సెలెరియో 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. సెలెరియో కొనుగోలుపైనా కస్టమర్లు రూ. 55000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సెలెరియో యొక్క టాప్ స్పెక్ వేరియంట్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్, లో స్పెక్ వేరియంట్స్ మీద కొంత కొంత తక్కువ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

Don’t Miss: వీడియోలు చేస్తూ.. రూ.18 లక్షల బైక్ కొనేసిన యువతి

గమనిక: మారుతి సుజుకి అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయు. అంతే కాకుండా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ కారు కొనుగోలుపైన ఎంత డిస్కౌంట్ లభిస్తుంది అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

వీడియోలు చేస్తూ.. రూ.18 లక్షల బైక్ కొనేసిన యువతి

0

Social Media Influencer Buys Suzuki Hayabusa Superbike: ఖరీదైన బైకులు, కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఇష్టమే. అయితే వీటిని అందరూ కొనుగోలు చేస్తారా? అంటే.. అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ ఖరీదైన బైకును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కమనిస్తే.. ఒక యువతి బైక్ చుట్టూ ఉన్న మెటల్ గార్డ్ తొలగిస్తుంది. ఆ తరువాత దానిని కప్పివున్న ఒక తెల్లటి షీట్ కూడా తొలగిస్తుంది. ఈమెతో పాటు మరో ఇద్దరు కూడా ఈ బైకును డెలివరీ తీసుకునే దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. యువతి కొనుగోలు చేసిన బైక్ మెటాలిక్ థండర్ గ్రే కలర్ పొంది ఉండటం చూడవచ్చు.

నిజానికి సుజుకి హయబుసా అనేది కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన బైక్. దీనిని జపాన్‌లోని టోక్యోలో తయారు చేస్తారు. అయితే ఈ బైకుని కంప్లీట్ నాక్డ్ డౌన్ (CKD) మార్గం ద్వారా మనదేశానికి దిగుమతి చేసుకుంటారు. దిగుమతి చేసుకోవడం వల్ల దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ బైకు ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువమంది మాత్రమే దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కొనుగోలు చేసిన బైక్ మెటాలిక్ థండర్ గ్రే కలర్‌లో అద్భుతంగా ఉండటమే కాకుండా అక్కడక్కడా రెడ్ కలర్ డెకాల్స్ పొందింది. ఇవి దీనిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఈ బైక్ ఎవ్వరినైనా ఒక్క చూపుతోనే ఫిదా చేసే డిజైన్ కలిగి ఉంది. అందుకే దీనిని చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

సుజుకి హయబుసా (Suzuki Hayabusa)

ప్రస్తుతం మార్కెట్లో సుజుకి హయబుసా రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్ మరియు 25వ యానివెర్సరీ ఎడిషన్. స్టాండర్డ్ హయబుసా మోడల్ ధర రూ. 16.91 లక్షలు. 25వ యానివెర్సరీ ఎడిషన్ ధర రూ. 17.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కొనుగోలు చేసిన బైక్ స్టాండర్డ్ మోడల్ అని తెలుస్తోంది.

సుజుకి హయబుసా యొక్క రెండు వేరియంట్లు 1340 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp పవర్ మరియు 142 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్‌పై నిర్మించబడి ఉంటుంది. హయబుసా మొత్తం బరువు 264 కేజీలు మాత్రమే. ఇది బ్రెంబో స్టైల్మా బ్రేక్ కాలిపర్‌లతో వస్తుంది. అంతే కాకుండా హయబుసా బైక్ సిక్స్ యాక్సిస్ ఐఎంయూ, 10 లెవెల్స్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు 10 లెవెల్స్ యాంటీ విలీ కంట్రోల్‌తో వస్తుంది.

హయబుసా బైక్ త్రీ లెవెల్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ మరియు మూడు పవర్ మోడ్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కర్నారింగ్ ఏబీఎస్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి కూడా ఉంటాయి. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో కొత్త తరం హయబుసా టీఎఫ్‌టీ డిజిటల్ డిస్‌ప్లే మరియు ఎల్ఈడీ లైట్స్ పొందుతుంది.

Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రేసింగ్ టీమ్.. అంతర్జాతీయ పోటీలకు సిద్ధం! – ఫోటోలు చూడండి

జాన్ అబ్రహం సుజుకి హయబుసా

ప్రముఖ నటుడు జాన్ అబ్రహం గ్యారేజిలో హయబుసా బైక్ ఉంది. దీనిని షారుక్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చినట్లు.. వేద ప్రమోషన్ ఇంటర్వ్యూలో జాన్ స్వయంగా వెల్లడించారు. జవాన్ సినిమా విజయం సాధించిన తరువాత ఈ బైకును గిఫ్ట్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఈయన గ్యారేజిలో ఖరీదైన హయబుసా మాత్రమే కాకుండా.. అత్యంత విలాసవంతమైన కార్లు, బైకులు కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహం కాకుండా ఇతర ఏ సెలబ్రిటీ గ్యారేజీలోనూ హయబుసా లేదనే తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. హయబుసా వినియోగించే సెలబ్రిటీల సంఖ్య కూడా చాలా తక్కువనే తెలుస్తోంది.

టాటా పంచ్ క్యామో ఎడిషన్: ఫిదా చేస్తున్న కలర్.. ధర ఎంతో తెలుసా?

0

Tata Punch Camo Edition Launched In India: భారతదేశంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటైన టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్.. ఎట్టకేలకు ‘క్యామో ఎడిషన్’ పేరుతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర పంచ్ కార్ల కంటే కూడా ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయండి.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్ ప్రారంభ ధర రూ. 8.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇంటీరియర్ కలర్ పూర్తిగా నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.

వేరియంట్స్ వారీగా ధరలు

➢అకాంప్లిస్డ్ ప్లస్: రూ. 8.45 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఏఏంటీ: రూ. 9.05 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్: రూ. 8.95 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్ ఏఎంటీ: రూ. 9.55 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ సీఎన్‌జీ: రూ. 9.55 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్ సీఎన్‌జీ: రూ. 10.05 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్: రూ. 9.15 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఏఎంటీ: రూ. 9.75 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఎస్: రూ. 9.60 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఎస్ ఏఎంటీ: రూ. 10.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

టాటా పంచ్ క్యామో ఎడిషన్ 2022లో మొదటిసారి లాంచ్ అయింది. ఇది 2023లో నిలిపివేయబడింది. కాగా ఇప్పుడు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఎన్ని యూనిట్లు అందుబాటులో ఉంటాయనేది తెలియాల్సి ఉంది. అయితే దీని ధర దాని ఇతర మోడల్స్ కంటే కూడా రూ. 15,000 ఎక్కువ.

కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్‌లో గమనించదగ్గ ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే.. ఇది కొత్త సివీడ్ గ్రీన్ కలర్ పొందుతుంది. అయితే ఇది డ్యూయెల్ టోన్ షేడ్‌లో ఉంటుంది. అంటే కారు మొత్తం ఒక రంగులో ఉంటే.. రూఫ్ మాత్రం మరో రంగులో ఉంటుంది. అల్లాయ్ వీల్స్ ముదురు రంగులో 16 ఇంచెస్ వరకు ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్ మీద ‘క్యామో’ బ్యాడ్జింగ్ చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ మొత్తం నలుపు రంగులో ఉంటుంది. సీట్ అపోల్స్ట్రే మరియు డోర్ ప్యాడ్ మీద క్యామో గ్రాఫిక్స్ ఉండటం చూడవచ్చు. డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్ పొందుతాయి. కాబట్టి ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ మొత్తం చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటివన్నీ ఉన్నాయి.

టాటా పంచ్ అంటేనే డిజైన్, ఫీచర్స్ కంటే కూడా సేఫ్టీ గుర్తొస్తుంది. కాబట్టి ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. ఇది కూడా స్టాండర్డ్ పంచ్ కారు మాదిరిగానే మంచి సేఫ్టీ అందిస్తుందని భావిస్తున్నాము.

ఇంజిన్ వివరాలు

టాటా పంచ్ క్యామో ఎడిషన్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇందులోని 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 88 హార్స్ పవర్ అందిస్తుంది. సీఎన్‌జీ ఇంజిన్ 74 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. సీఎన్‌జీ మోడల్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

Don’t Miss: పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్.. హ్యుందాయ్ ఎక్స్‌టర్, సిట్రోయెన్ సీ3, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే పంచ్ గొప్ప సేఫ్టీ ఫీచర్స్ కలిగి.. ఇప్పుడు కొత్త రంగులో అందుబాటులో ఉంది కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

రూ.9.25 లక్షల సుజుకి కొత్త బైక్ ఇదే.. దీని గురించి తెలుసా?

0

Suzuki GSX-8R Launched In India: ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్’ (Suzuki GSX-8R) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన కొత్త జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ ధర రూ. 9.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ సిల్వర్, మెటాలిక్ ట్రిటాన్ బ్లూ మరియు మెటాలిక్ మ్యాట్ నెంబర్ 2. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ బైక్.. మొత్తానికి భారతీయ గడ్డపై కూడా అడుగుపెట్టింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ బైక్ లాంచ్ చేయడం జరిగింది.

డిజైన్ మరియు ఫీచర్స్

సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ షార్ప్ డిజైన్ పొందుతుంది. ఇందులో నిలువుగా పేర్చబడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉంటాయి. ఇంజిన్ మొత్తం బహిర్గతంగా ఉంటుంది. బైక్ వెనుక భాగం పైకి లేచి ఉంటుంది. సీటింగ్ పొజిషన్ కూడా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. రియర్‌వ్యూ మిర్రర్స్ ఫెయిరింగ్ మీద ఉండటం చూడవచ్చు. మొత్తం మీద డిజైన్ చూపరులను ఆకట్టుకునే విధంగానే ఉంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ దాని మునుపటి బైక్ యొక్క దదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రైడ్ బై వైర్, లో ఆర్పీఎం అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ మరియు ఈజీ స్టార్ట్ వంటివన్నీ ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

కొత్త సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ 776 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 81 హార్స్ పవర్ మరియు 6800 rpm వద్ద 78 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో బై-డైరెక్షన్ క్విక్ షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 14 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ బరువు 205 కేజీలు వరకు ఉంటుంది. కాబట్టి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.

జీఎస్ఎక్స్-8ఆర్ బైకులో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, సులభంగా ఉండే స్టార్ట్ సిస్టం, ఎస్ఎఫ్ఎఫ్ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, మోనోషాక్ సెటప్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ ముందు భాగంలో ట్విన్ 310 మిమీ డిస్క్ మరియు ఫోర్ ఫిస్టన్ కాలిపర్స్, వెనుక భాగంలో సింగిల్ ఫిస్టన్ కాలిపర్‌తో 240 మిమీ డిస్క్ వంటివి ఉన్నాయి. 17 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ బైక్ 120/70 సెక్షన్ ఫ్రంట్ టైర్ మరియు 180/55 సెక్షన్ రియర్ టైర్ వంటివి ఉన్నాయి.

ప్రత్యర్థులు

సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ డేటోనా 660, కవాసకి నింజా 650 మరియు ఏప్రిలియా ఆర్ఎస్660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది. దీని ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Don’t Miss: పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మాత్రమే కాకుండా.. ఖరీదైన బైకులకు కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తుంది. అందులోనూ ఇది పండుగ సీజన్ కాబట్టి ఈ బైక్ మంచి అమ్మకాలను పొందుతుందనే భావిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ హయాబుసా వంటి ఖరీదైన బైకులను కూడా మార్కెట్లో విజయవంతంగా విక్రయిస్తోంది. అంతే కాకుండా కంపెనీ జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ 250 వంటి బైకులను.. సుజుకి అవెనిస్, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, సుజుకి యాక్సెస్ 125 వంటి స్కూటర్లు మార్కెట్లో విక్రయిస్తోంది.