31.2 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 20

టాటా పంచ్ క్యామో ఎడిషన్: ఫిదా చేస్తున్న కలర్.. ధర ఎంతో తెలుసా?

0

Tata Punch Camo Edition Launched In India: భారతదేశంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటైన టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్.. ఎట్టకేలకు ‘క్యామో ఎడిషన్’ పేరుతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర పంచ్ కార్ల కంటే కూడా ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయండి.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్ ప్రారంభ ధర రూ. 8.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇంటీరియర్ కలర్ పూర్తిగా నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.

వేరియంట్స్ వారీగా ధరలు

➢అకాంప్లిస్డ్ ప్లస్: రూ. 8.45 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఏఏంటీ: రూ. 9.05 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్: రూ. 8.95 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్ ఏఎంటీ: రూ. 9.55 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ సీఎన్‌జీ: రూ. 9.55 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్ సీఎన్‌జీ: రూ. 10.05 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్: రూ. 9.15 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఏఎంటీ: రూ. 9.75 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఎస్: రూ. 9.60 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఎస్ ఏఎంటీ: రూ. 10.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

టాటా పంచ్ క్యామో ఎడిషన్ 2022లో మొదటిసారి లాంచ్ అయింది. ఇది 2023లో నిలిపివేయబడింది. కాగా ఇప్పుడు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఎన్ని యూనిట్లు అందుబాటులో ఉంటాయనేది తెలియాల్సి ఉంది. అయితే దీని ధర దాని ఇతర మోడల్స్ కంటే కూడా రూ. 15,000 ఎక్కువ.

కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్‌లో గమనించదగ్గ ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే.. ఇది కొత్త సివీడ్ గ్రీన్ కలర్ పొందుతుంది. అయితే ఇది డ్యూయెల్ టోన్ షేడ్‌లో ఉంటుంది. అంటే కారు మొత్తం ఒక రంగులో ఉంటే.. రూఫ్ మాత్రం మరో రంగులో ఉంటుంది. అల్లాయ్ వీల్స్ ముదురు రంగులో 16 ఇంచెస్ వరకు ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్ మీద ‘క్యామో’ బ్యాడ్జింగ్ చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ మొత్తం నలుపు రంగులో ఉంటుంది. సీట్ అపోల్స్ట్రే మరియు డోర్ ప్యాడ్ మీద క్యామో గ్రాఫిక్స్ ఉండటం చూడవచ్చు. డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్ పొందుతాయి. కాబట్టి ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ మొత్తం చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటివన్నీ ఉన్నాయి.

టాటా పంచ్ అంటేనే డిజైన్, ఫీచర్స్ కంటే కూడా సేఫ్టీ గుర్తొస్తుంది. కాబట్టి ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. ఇది కూడా స్టాండర్డ్ పంచ్ కారు మాదిరిగానే మంచి సేఫ్టీ అందిస్తుందని భావిస్తున్నాము.

ఇంజిన్ వివరాలు

టాటా పంచ్ క్యామో ఎడిషన్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇందులోని 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 88 హార్స్ పవర్ అందిస్తుంది. సీఎన్‌జీ ఇంజిన్ 74 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. సీఎన్‌జీ మోడల్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

Don’t Miss: పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్.. హ్యుందాయ్ ఎక్స్‌టర్, సిట్రోయెన్ సీ3, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే పంచ్ గొప్ప సేఫ్టీ ఫీచర్స్ కలిగి.. ఇప్పుడు కొత్త రంగులో అందుబాటులో ఉంది కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

రూ.9.25 లక్షల సుజుకి కొత్త బైక్ ఇదే.. దీని గురించి తెలుసా?

0

Suzuki GSX-8R Launched In India: ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్’ (Suzuki GSX-8R) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన కొత్త జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ ధర రూ. 9.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ సిల్వర్, మెటాలిక్ ట్రిటాన్ బ్లూ మరియు మెటాలిక్ మ్యాట్ నెంబర్ 2. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ బైక్.. మొత్తానికి భారతీయ గడ్డపై కూడా అడుగుపెట్టింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ బైక్ లాంచ్ చేయడం జరిగింది.

డిజైన్ మరియు ఫీచర్స్

సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ షార్ప్ డిజైన్ పొందుతుంది. ఇందులో నిలువుగా పేర్చబడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉంటాయి. ఇంజిన్ మొత్తం బహిర్గతంగా ఉంటుంది. బైక్ వెనుక భాగం పైకి లేచి ఉంటుంది. సీటింగ్ పొజిషన్ కూడా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. రియర్‌వ్యూ మిర్రర్స్ ఫెయిరింగ్ మీద ఉండటం చూడవచ్చు. మొత్తం మీద డిజైన్ చూపరులను ఆకట్టుకునే విధంగానే ఉంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ దాని మునుపటి బైక్ యొక్క దదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రైడ్ బై వైర్, లో ఆర్పీఎం అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ మరియు ఈజీ స్టార్ట్ వంటివన్నీ ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు

కొత్త సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ 776 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 81 హార్స్ పవర్ మరియు 6800 rpm వద్ద 78 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో బై-డైరెక్షన్ క్విక్ షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 14 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ బరువు 205 కేజీలు వరకు ఉంటుంది. కాబట్టి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.

జీఎస్ఎక్స్-8ఆర్ బైకులో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, సులభంగా ఉండే స్టార్ట్ సిస్టం, ఎస్ఎఫ్ఎఫ్ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, మోనోషాక్ సెటప్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ ముందు భాగంలో ట్విన్ 310 మిమీ డిస్క్ మరియు ఫోర్ ఫిస్టన్ కాలిపర్స్, వెనుక భాగంలో సింగిల్ ఫిస్టన్ కాలిపర్‌తో 240 మిమీ డిస్క్ వంటివి ఉన్నాయి. 17 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ బైక్ 120/70 సెక్షన్ ఫ్రంట్ టైర్ మరియు 180/55 సెక్షన్ రియర్ టైర్ వంటివి ఉన్నాయి.

ప్రత్యర్థులు

సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ డేటోనా 660, కవాసకి నింజా 650 మరియు ఏప్రిలియా ఆర్ఎస్660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది. దీని ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Don’t Miss: పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మాత్రమే కాకుండా.. ఖరీదైన బైకులకు కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ మంచి అమ్మకాలు పొందుతుందని తెలుస్తుంది. అందులోనూ ఇది పండుగ సీజన్ కాబట్టి ఈ బైక్ మంచి అమ్మకాలను పొందుతుందనే భావిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ హయాబుసా వంటి ఖరీదైన బైకులను కూడా మార్కెట్లో విజయవంతంగా విక్రయిస్తోంది. అంతే కాకుండా కంపెనీ జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ 250 వంటి బైకులను.. సుజుకి అవెనిస్, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, సుజుకి యాక్సెస్ 125 వంటి స్కూటర్లు మార్కెట్లో విక్రయిస్తోంది.

పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

0

2024 Nissan Magnite Facelift Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్’ (Nissa Magnite Facelift) దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దసరా, దీపావళి సందర్భంగా తక్కువ ధరలో కొత్త కారు కొనుగోలు చేయాలని ఎదురు చూసేవారికి ఇది అత్యుత్తమ ఆప్షన్ అని తెలుస్తోంది. నాలు సంవత్సరాల తరువాత భారతదేశంలో అడుగుపెట్టిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో.. మీ కోసం.

మొదటి 10వేల మందికే ఎక్స్ షోరూమ్ ధరలు

నిస్సాన్ ఇండియా లాంచ్ చేసిన కొత్త ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ ధరలు మొదట బుక్ చేసుకున్న 10000 మందికి మాత్రమే వర్తిస్తాయి. అంటే ముందుగా బుక్ చేసుకున్న 10000 మంది కస్టమర్లకు రూ. 5.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలే వర్తిస్తాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎంత పెరుగుతాయనే వివరాలు ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడికాలేదు.

వేరియంట్స్ వారీగా ధరలు

▸విసియా: రూ. 5.99 లక్షలు
▸విసియా ఏఎంటీ: రూ. 6.60 లక్షలు
▸విసియా ప్లస్: రూ. 6.49 లక్షలు
▸ఎసెంటా: రూ. 7.14 లక్షలు
▸ఎసెంటా ఏఎంటీ: రూ. 7.64 లక్షలు
▸ఎన్-కనెక్టా: రూ. 7.86 లక్షలు
▸ఎన్-కనెక్టా ఏఎంటీ: రూ. 8.36 లక్షలు
▸టెక్నా: రూ. 8.75 లక్షలు
▸టెక్నా ఏఎంటీ: రూ. 9.25 లక్షలు
▸టెక్నా ప్లస్: రూ. 9.10 లక్షలు
▸టెక్నా ప్లస్ ఏఎంటీ: రూ. 9.60 లక్షలు
▸ఎసెంట్ టర్బో సీవీటీ: రూ. రూ. 9.79 లక్షలు
▸ఎన్-కనెక్టా టర్బో: రూ. 9.19 లక్షలు
▸ఎన్-కనెక్టా టర్బో సీవీటీ: రూ. 10.34 లక్షలు
▸టెక్నా టర్బో: రూ. 9.99 లక్షలు
▸టెక్నా టర్బో సీవీటీ: రూ. 11.14 లక్షలు
▸టెక్నా ప్లస్ టర్బో: రూ. 10.35 లక్షలు
▸టెక్నా ప్లస్ టర్బో సీవీటీ: రూ. 11.50 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా)

డిజైన్

కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్డ్ ఇప్పుడు కొత్త గ్రిల్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డీఆర్ఎల్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, రీస్టైల్ ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. రియర్ ప్రొఫైల్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఇక్కడ ఎటువంటి అప్డేట్ కనిపించదు.

ఇంటీరియర్ ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్

2024 నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ సన్‌రైజ్ ఆరెంజ్ కాపర్ అనే కొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ కలర్ స్కీమ్ పొందుతుంది. కొత్త ఫీచర్లలో ఫ్రేమ్‌లెస్ ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఫోర్ కలర్ యాంబియంట్ లైటింగ్, వెనుకవైపు టైప్-సీ యాఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ వెంట్స్ వంటివన్నీ ఇందులో ఉన్నాయి.

8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, రియర్ ఏసీ వెంట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రిమోట్ స్టార్ట్‌తో కీ, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్ వంటి వాటితో పాటు.. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ మరియు అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటివన్నీ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్

2024 నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 71 Bhp పవర్ మరియు 96 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. అయితే టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 99 Bhp మరియు 160 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. అయితే రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతాయి.

Don’t Miss: Kia EV9 ఎలక్ట్రిక్ కారు: సరికొత్త డిజైన్.. ఫిదా చేసే ఫీచర్స్ – రేంజ్ ఎంతో తెలుసా?

ప్రత్యర్థులు

నిస్సాన్ లాంచ్ చేసిన కొత్త మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే నిస్సాన్ తన మాగ్నైట్ కారును భారతదేశంలో లాంచ్ చేసినప్పటి నుంచి సుమారు 1.5 లక్షల సేల్స్ సాధించింది. కాబట్టి ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ కావడంతో ఈ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Kia EV9 ఎలక్ట్రిక్ కారు: సరికొత్త డిజైన్.. ఫిదా చేసే ఫీచర్స్ – రేంజ్ ఎంతో తెలుసా?

0

Kia EV9 Launched in India: సౌత్ కొరియా కార్ మేకర్ కియా మోటార్స్ (Kia Motors) ఎట్టకేలకు తన ఈవీ9 (EV9) ఎలక్ట్రిక్ కారును భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 561 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది.

వేరియంట్స్ మరియు ధరలు

కొత్త ప్రీమియం కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు జీటీ-లైన్ ఏడబ్ల్యుడీ 6 సీటర్ అనే ఓకే వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ధర 1.30 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

కలర్ ఆప్షన్స్ మరియు డిజైన్

కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP) ఆధారంగా రూపొందించబడింది. ఇది స్నో వైట్ పెర్ల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే, పాన్తేరా మెటల్ మరియు అరోరా బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది.

ఈవీ9 పొడవు 5015 మిమీ, వెడల్పు 1980 మిమీ, వీల్‌బేస్ 3100 మిమీ, ఎత్తు 1780 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారులోని 20 ఇంచెస్ స్పోర్టీ మ్యాప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్, గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్, రియర్ వైపర్, రూప్ మౌంటెడ్ రియర్ స్పాయిలర్ మొదలైనవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి.

ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్

కియా ఈవీ9 సిక్స్ సీటర్ లేఅవుట్‌తో మాత్రమే లభిస్తుంది. క్యాబిన్ వైట్/బ్లాక్ లేదా బేజ్/బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లెథెరెట్ అపోల్స్ట్రే, స్వెడ్ హెడ్‌లైనర్, ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయెల్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ కోసం మెమొరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, అల్యూమినియం పెడల్స్ మొదలైనవి పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కియా ఈవీ9 కారులో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఇన్‌బిల్ట్ న్యావిగేషన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్ప్లే, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ ఆప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ కీ, 14 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టం, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్, 360 డిగ్రీ కెమెరా మరియు 50:50 స్ప్లిట్ ఫోల్డ్ మరియు రిక్లైన్ ఫంక్షన్ వంటివి ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

అత్యధిక రేంజ్, కొత్త డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ ఎంత ముఖ్యమో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా కారులో అంతే ముఖ్యం. కాబట్టి కియా ఈవీ9 కారులో కంపెనీ 10 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్, సైడ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు డిస్క్ బ్రేక్స్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.

బ్యాటరీ మరియు రేంజ్

ఈవీ9 కారులో కంపెనీ 99.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కూడా 383 Bhp పవర్ మరియు 700 Nm టార్క్ అందిస్తాయి. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 561 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 350కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 24 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

Don’t Miss: లాంచ్‌కు ముందే దుమ్ములేపిన బుకింగ్స్!.. కియా కార్నివాల్‌పై పెరుగుతున్న మోజు

భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే అమ్మకాల పరంగా దేశంలో ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ ఈక్యూఎస్, ఈక్యూఈ, బీఎండబ్ల్యూ ఐఎక్స్ మరియు ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీ ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము.

లాంచ్‌కు ముందే దుమ్ములేపిన బుకింగ్స్!.. కియా కార్నివాల్‌పై పెరుగుతున్న మోజు

0

New Kia Carnival Launched In India: ఒకప్పుడు అద్భుతమైన అమ్మకాలు పొంది 2023లో నిలిచిపోయిన కియా కార్నివాల్ ఆధునిక హంగులతో దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అయింది. ఎంతగానో ఎదురు చూస్తున్న 2024 కియా కార్నివాల్ ఇప్పుడు దాని ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చేలా తయారై భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. ఈ కారు ధర ఎంత? ఇప్పటికి ఎన్ని బుకింగ్స్ వచ్చాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..

2024 కియా కారెన్స్ ధర

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినా 2024 కియా కార్నివాల్ (2024 Kia Carnival) ధర రూ. 63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ దీనిని రెండు వేరియంట్లలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం లిమోసిన్ ప్లస్ అనే ఒకే ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరో ట్రిమ్ లాంచ్ చేయనుంది.

బుకింగ్స్

కియా మోటార్స్ తన కార్నివాల్ కారును లాంచ్ చేయానికి ముందే సెప్టెంబర్ 16న బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటలోపే 1800 మంది ఈ కారును బుక్ చేసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ కారు కోసం 2796 బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం.

2024 కియా కార్నివాల్ ప్రస్తుతం రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అవి ఫ్యూజన్ బ్లాక్, గ్లేసియర్ వైట్ పెర్ల్ కలర్స్. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, 18 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ కారు 2+2+3 సీటింగ్ లేఅవుట్ పొందుతుంది. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇక్కడే వెంటిలేషన్‌తో పాటు అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, డ్యూయెల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 11 ఇంచెస్ హెడ్ ఆప్ డిస్‌ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, హీటింగ్ అండ్ వెంటిలేషన్ లెగ్ సపోర్ట్‌తో రెండవ వరుసలో కెప్టెన్ సీట్స్ పొందుతుంది. పవర్డ్ టెయిల్‌గేట్ మరియు స్లైడింగ్ రియర్ డోర్ వంటివి ఇందులో లభిస్తాయి.

కొత్త డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇది ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఫ్రంట్ అండ్ సైడ్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ ఫీచర్స్ (లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపాశ్చర్ వార్ణింగ్, ఫ్రంట్ కొలిషన్ వార్ణింగ్, హై భీమ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్) వంటివన్నీ పొందుతుంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 బ్రేక్ హార్స్ పవర్ మరియు 441 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. అయితే ఇది ఎలాంటి పనితీరును అందిస్తుందని విషయం త్వరలోనే తెలుస్తోంది.

కియా మోటార్స్ ఇప్పుడు తన కియా కార్నివాల్ కారు మీద మూడు సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్, వారంటీ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివన్నీ అందిస్తుంది. కాబట్టి కొనుగోలుదారులు ఈ కారును కొనుగోలు చేస్తే.. ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

Don’t Miss: అర్థంకాని మేధావి RGV.. ఎలాంటి కార్లు ఉపయోగించారో తెలుసా..

సేల్స్ ఎలా ఉండబోతున్నాయి

కియా కార్నివాల్ భారతీయ మార్కెట్లో సెవెన్ సీటర్ విభాగంలో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాయి. ఇప్పటికే దేశీయ విఫణిలో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కియా కార్నివాల్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికే రెండు వేలు కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన ఈ కారు ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం తెలియాల్సి ఉంటుంది.

60 నిమిషాల్లో 1.76 లక్షల బుకింగ్స్: భారీగా ఎగబడుతున్న జనం..

0

Mahindra Thar Roxx 1.76 Lakh Bookings First One Hour: గత ఆగష్టు 15న దేశీయ మార్కెట్లో అధికారికంగా డుగుపెట్టిన మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx) బుకింగ్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కంపెనీ బుకింగ్స్ ప్రారభవించిన కేవలం 60 నిమిషాల్లో ఏకంగా 1,76,218 మంది బుక్ చేసుకున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

60 నిమిషాల్లో 1.76 బుకింగ్స్

భారతదేశంలో మహీంద్రా థార్ యొక్క 3 డోర్ కారుకు కూడా ఇప్పటికీ బుకింగ్స్ తగ్గడం లేదు. కంపెనీ ఇంకా 3 డోర్ మోడల్ డెలివరీ చేయాల్సిన కార్లు ఇంకా ఉన్నాయి. ఈ తరుణంలో థార్ యొక్క 5 డోర్ వెర్షన్ యొక్క బుకింగ్స్ మరింత ఎక్కువగా ఉన్నాయి. అయితే థార్ రోక్స్ బుకింగ్స్ విపరీతంగా పెరగడంతో డెలివరీ వెయిటింగ్ పీరియడ్ కొంత ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నాము. అయితే ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు దసరా రోజును ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కేవలం ఒక గంటలోనే 1.76 లక్షలమంది ఈ కారును బుక్ చేసుకోవడంతో.. బ్రాండ్ వాహనాల మీద ప్రజలకున్న నమ్మకానికి ధన్యవాదాలు అని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా డెలివరీలను కూడా వీలైనంత వేగంగా చేస్తామని వెల్లడించింది. అయితే డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

కొత్త మహీంద్రా థార్ చూడగానే సాధారణ 3 డోర్ మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే.. ఇది 5 డోర్ మోడల్ అని తెలిసిపోతుంది. పరిమాణంలో ప్రధానంగా మార్పును గమనించవచ్చు. 3 డోర్ వెర్షన్ కంటే కూడా 5 డోర్ పరిమాణం కొంత పెద్దదిగా ఉంటుంది.

మహీంద్రా థార్ రోక్స్ 19 ఇంచెస్ అల్లీ వీల్స్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్ వంటి వాటిని ఇందులో చూడవచ్చు. ఈ 5 సీటర్ మోడల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు, హర్మాన్ కార్టాన్ సౌండ్ సిస్టం వంటి ఆధునిక ఫీచర్స్ థార్ రోక్స్ కారులో ఉన్నాయి.

మహీంద్రా థార్ రోక్స్ ఇప్పుడు ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారులను ప్రమాదం సమయంలో కాపాడటానికి ఉపయోగపడతాయి.

పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్

2024 మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో 162 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆటోమాటిక్ వెర్షన్ 177 హార్స్ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ 4×2 వేరియంట్స్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఎంపికలో 152 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ టార్క్ విడుదల చేస్తాయి.

రోక్స్ 4×4 వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో 152 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో 175 హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ రిలీజ్ చేసేది. కాబట్టి రెండు ఇంజిన్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయని తెలుస్తోంది. కాబట్టి కొనుగోలుదారులు పనితీరు గురించి సందేహించాల్సిన అవసరం లేదు.

Don’t Miss: మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు ఇవే.. వీటిని ఒక్కసారైనా చూశారా?

థార్ రోక్స్ బుకింగ్స్ పెరగటానికి కారణం

మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ పెరగటానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రజలకు ఆఫ్ రోడింగ్ కార్ల మీద ఉన్న అమితమైన ఆసక్తి. థార్ కార్లు కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా కఠినమైన భూభాగాల్లో కూడా సజావుగా ముందుకు సాగుతుంది. పనితీరు విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేసేలా చేస్తోంది.

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు ఇవే.. వీటిని ఒక్కసారైనా చూశారా?

0

These Are the Cars Used by Mahatma Gandhi Have You Ever Seen: మారణాయుధాలు ముట్టరాదని, రక్తపు బిందువు చిందరాదని చెప్పిన మహోన్నత వ్యక్తి మన గాంధీజీ. అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని తలచి, తాను అనుకున్న సిద్ధాంతాలను మాత్రమే అనుసరించి భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన బాపూజీ.. ఒక్కడిగా ప్రారంభమై దేశంలోనే ఎంతమంది ప్రజలను ఒకేతాటిపై నడిపించి దేశం యొక్క దాస్య శృంఖలాలను తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ గురించి చాలా విషయాలనే తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు గాంధీ కాలంలో ఎలాంటి వాహనాలను ఉపయోగించారు. ప్రస్తుతం అలాంటి కార్లు ఎందుకు అందుబాటులో లేదు అనే చాలా విషయాలను వివరంగా పరిశీలిద్దాం.

గాంధీ కాలంలో అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు.. ప్రజలను ఉత్తేజ పరచడానికి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గాంధీ వెల్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో కాలినడకనే ప్రయాణించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో కార్లలో కూడా ప్రయాణించేవారు. గాంధీజీ ప్రయాణించిన కార్లలో ఫోర్డ్ మోటార్స్ యొక్క ‘మోడల్ టీ’ ఒకటి.

ఫోర్డ్ మోడల్ టీ (Ford Model T)

ప్రస్తుతం అమెరికాలో అగ్రగామి వాహన తయారీ సంస్థగా నిలిచిన ఫోర్డ్ మోటార్స్.. స్వాతంత్య్రం రాకముందే మార్కెట్లో కార్లను విక్రయించింది. అంతే ఫోర్డ్ కంపెనీకి కూడా దశాబ్దాల చరిత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఫోర్స్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తుల్లో ఒకటైన మోడల్ టీ కారులో మహాత్మా గాంధీ అనేక సార్లు ప్రయాణించారు. 1927లో బరేలీ సెంట్రల్ జైలు నుంచి గాంధీ విడుదలైన తరువాత ఉత్తరప్రదేశ్ ర్యాలీలో ఈ కారును ఉపయోగించారు.

ఫోర్డ్ మోడల్ టీ కారు 2.9 లీటర్ సైడ్ వాల్వ్ రివర్స్ ప్లో సిలిండర్ హెడ్ ఇన్‌లైన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందింది. ఇది 20 హార్స్ పవర్ శక్తిని విడుదల చేసేది. ఈ రోజుల్లో ఈ కారు పెద్దగా చెప్పుకోదగ్గ మోడల్ కానప్పటికీ.. అప్పట్లో ఇదే పాపులర్ మోడల్. సంపన్నులు చాలామంది ఇలాంటి కార్లనే ఉపయోగించేవారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 72 కిమీ మాత్రమే.

ప్యాకర్డ్ 120 (Packard One Twenty)

గాంధీ ప్రయాణించిన కార్ల జాబితాలో మరోకారు ప్యాకర్డ్ 120. 1940లలో గాంధీ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ కారులో ప్రయాణించినట్లు సమాచారం. ఫోర్డ్ కార్ల మాదిరిగానే ప్యాకర్డ్ 120 కూడా కొంత పొడవైన బోనెట్ కలిగి, పెద్ద ఇంజిన్ కలిగి ఉండేది. ఇది 110 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇన్‌లైన్ ఎయిట్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉండేది. ఇంజిన్ వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

నిజానికి మహాత్మ గాంధీకి సొంతంగా కారు లేదు. గాంధీ ప్రయాణించిన కార్లన్నీ కూడా ఆయన మద్దతుదారులు లేదా ఆయనకు అనుచరులలోని సంపన్నులకు చెందినవి మాత్రమే. అప్పట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా మరియు ఢిల్లీ క్లాత్ అండ్ జనరల్ మిల్స్ ఫౌండర్ లాలా శ్రీరామ్ మొదలైన వారు ఉండేవారు. వీరికి చెందిన కార్లలో గాంధీ తన ప్రయాణాలను కొనసాగించారు.

స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ (Studebaker President)

గాంధీ ప్రయాణించడానికి ఉపయోగించిన మరో కారు స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ 8 సెలూన్. గాంధీ మైసూర్ పర్యటన సందర్భంగా ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు కూడా అమెరికాలో తయారైనట్లు సమాచారం. అప్పట్లోనే అత్యంత విలాసవంతమైన కారుగా ప్రజాదరణ పొందిన ఈ కారు 5.5 లీటర్ ఇన్‌లైన్ ఎయిట్ సిలిండర్ ఇంజిన్ పొందింది. ఇది 100 పీఎస్ పవర్ మరియు 353 న్యూటన్ మీటర్ టార్క్ అందించేది. ఇంజిన్ 3 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండేది.

స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ కారు 1926 నుంచి 1942 మధ్య అందుబాటులో ఉండేదని సమాచారం. గాంధీ ఉపయోగించిన ఈ స్టూడ్‌బేకర్ ప్రెసిడెంట్ కారు ఎవరిదనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ఇది ప్రస్తుతం మైసూర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేలోని పయన కార్ మ్యూజియంలో ప్రదర్శనాకు ఉన్నట్లు సమాచారం.

గాంధీ ఉపయోగించిన స్టూడ్‌బేకర్ కారు కాకుండా.. ఫోర్డ్ మోడల్ టీ మరియు ప్యాకర్డ్ 120 కార్లు ప్రస్తుతం ఎక్కడున్నాయో స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే అప్పట్లో ఇండియన్ రోడ్ల మీద అమెరికన్ బ్రాండ్ కార్లు ఎక్కువగా తిరగడానికి ప్రధాన కారణం.. మనదేశంలో సొంత కార్ల తయారీ సంస్థ లేకపోవడమే తెలుస్తోంది. కాబట్టి సంపన్నులు లేదా పారిశ్రామిక వేత్తలు వారి సొంత అవసరాల కోసం విదేశాల నుంచి తిగుమతి చేసుకునేవారు.

Don’t Miss: స్కూటర్ చిన్నదే.. ధర మాత్రం లక్షల్లోనే! బీఎండబ్ల్యూ సీఈ 02 ఇదే

పాత కార్లు అంతరించిపోవడానికి కారణం ఇదే..

భారతదేశంలో హిందూస్తాన్ మోటార్స్ వంటి సంస్థలు.. కార్లను తయారు చేయడం ప్రారంభించిన తరువాత అమెరికన్ కార్ల వాడకం అప్పట్లో చాలా తగ్గిపోయింది. 1942లో హిందూస్తాన్ మోటార్స్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తరువాత అంబాసిడర్ కార్ల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత విదేశీ కార్ల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఆ తరువాత కాలంలో పుట్టుకొచ్చిన కొత్త కంపెనీల కార్ల కారణంగా.. పాత కార్ల వినియోగం బాగా తగ్గింది. దీంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.

గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు కేవలం అవగాహన కోసం (సూచన ప్రాయం) మాత్రమే. గాంధీ ఈ బ్రాండ్ కార్లను ఉపయీగించారు అని చెప్పడానికి మాత్రమే. పాఠకులు గమనించగలరు.

స్కూటర్ చిన్నదే.. ధర మాత్రం లక్షల్లోనే! బీఎండబ్ల్యూ సీఈ 02 ఇదే

0

BMW CE 02 Electric Two Wheeler Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) మార్కెట్లో తన సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది కంపెనీ యొక్క సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ.. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఖరీదైన టూ వీలర్ల జాబితాలో ఒకటిగా ఉంది.

బీఎండబ్ల్యూ సీఈ 02 (BMW CE 02)

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ డిజైన్ పొందుతుంది. ఈ స్కూటర్ ధర రూ. 4.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) కావడం గమనార్హం. ధరను బట్టి చూస్తే.. మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటిగా ఉంది.

బీఎండబ్ల్యూ సీఈ 02 అనేది బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటికే మార్కెట్లో రూ. 14.90 లక్షల ఖరీదైన సీఈ 04 లాంచ్ అయింది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం. కాగా ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త సీఈ 02 స్కూటర్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. అయితే సీఈ 02 తమిళనాడు హోసూర్‌లోని టీవీఎస్ ఫెసిలిటీలో తయారవుతుంది.

భారతదేశంలో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవాలంటే కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కొత్త బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ బైక్ చిన్నదిగా ఉన్నప్పటికీ.. బేర్‌బోన్స్ డిజైన్ పొందుతుంది. ఇతర బైకులతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైక్ రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారంగా ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఇందులో చూడవచ్చు. ఇన్‌స్ట్రుమెట్ కన్సోల్, రివర్స్ గేర్, కీలెస్ ఆపరేషన్, 3.5 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్ వంటివి కూడా ఇందులో కనిపిస్తాయి.

బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్ సెటప్, అడ్జస్టబుల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే 239 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ రియర్ డిస్క్ ఉంటాయి. ఇందులో ఏబీఎస్ కూడా ఉంటుంది. ఇది 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ముందు భాగంలో 120/80 సెక్షన్ టైర్, వెనుకవైపు 150/70 సెక్షన్ టైర్స్ ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 11 కిలోవారు ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది 15 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక చార్జితో గరిష్టంగా 90 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిమీ కావడం గమనార్హం.

ఖరీదైన స్కూటర్లకు డిమాండ్ ఉందా?

నిజానికి భారతదేశంలో ఖరీదైన స్కూటర్లకు డిమాండ్ పెద్దగా లేదు. ఎందుకంటే సామాన్య ప్రజలు రోజువారీ వినియోగానికి ఎక్కువ మైలేజ్ లేదా రేంజ్ ఇచ్చే స్కూటర్లను కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన సీఈ 04, సీఈ 02 రెండూ కూడా అధిక ధర కలిగి ఉన్నాయి. కాబట్టి ఇండియన్ మాకెట్లో ఇలాంటి వాటిని సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. కాబట్టి సెలబ్రిటీలు లేదా వాహనాలపై మక్కువ ఎక్కువ ఉన్నవారు మాత్రమే వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

Don’t Miss: కొత్త రంగులో టీవీఎస్ రేడియన్: రూ.59,880 మాత్రమే

బీఎండబ్ల్యూ కంపెనీ తన సీఈ 02 కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది. ఎలా అమ్ముడవుతుందనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ధర కొంత ఎక్కువే అయినప్పటికీ ఈ స్కూటర్ ధరకు తగిన ఫీచర్స్ కలిగి ఉంది. పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల నగరంలో, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా దీనిని సులభంగా రైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు.

కొత్త రంగులో టీవీఎస్ రేడియన్: రూ.59,880 మాత్రమే

0

TVS Radeon Base Edition All Black Colour Option Launched: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన ‘రేడియన్’ కమ్యూటర్ బైక్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను సరికొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు మొత్తం ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ బైక్ డిజైన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇంజిన్ వివరాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

టీవీఎస్ రేడియన్ ఇప్పుడు మొత్తం నలుపు రంగులో అందుబాటులో ఉంది. ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న రేడియన్ రంగుల కంటే కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. ఈ బైక్ ధర రూ. 59880 (ఎక్స్ షోరూమ్) కావడం గమనార్హం.

ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి బేస్ వేరియంట్ (రూ. 59880), డిజి డిస్క్ (రూ. 81394) మరియు డిజి డ్రమ్ (రూ. 84869). బైక్ మొత్తం నలుపు రంగులో ఉన్నప్పటికీ.. బ్యాడ్జింగ్ తెలుపు రంగులో ఉంది. ఇంజిన్ కేసింగ్ బ్రాంజ్ కలర్‌లో ఉండటం చూడవచ్చు.

డిజైన్ మరియు ఫీచర్స్

బ్లాక్ కలర్ టీవీఎస్ రేడియన్ బైక్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది పొడవైన సింగిల్ పీస్ సీటు, క్రోమ్ బెజెల్ హెడ్‌ల్యాంప్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, రివర్స్ ఎల్‌సీడీ క్లస్టర్, సెల్ఫ్ స్టార్ట్, పిలియన్ గ్రాబ్ రైల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి పొందుతుంది.

పరిమాణం పరంగా ఈ బైకులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ బైక్ ఎత్తు 1080 మిమీ, వీల్‌బేస్ 1265 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంది. అయితే రేడియన్ బ్లాక్ కలర్ డ్రమ్ వేరియంట్ బరువు 113 కేజీలు, డిస్క్ వేరియంట్ బరువు 115 కేజీల వరకు ఉంటుంది.

ఇంజిన్ వివరాలు

టీవీఎస్ రేడియన్ కొత్త రంగులో అందుబాటులో ఉన్నప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7350 rpm వద్ద 8.08 Bhp పవర్ మరియు 4500 rpm వద్ద 8.7 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. 10 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ ఒక లీటరుకు 69.3 కిమీ మైలేజ్ అందిస్తుంది.

సింగిల్ క్రెడిల్ ట్యూబులర్ ఫ్రేమ్ కలిగిన టీవీఎస్ రేడియం టెలిస్కోపిక్ పోర్క్, ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. రేడియన్ బేస్ ఎడిషన్ మరియు డిజి డ్రమ్ వేరియంట్ 130 మిమీ డ్రమ్ బ్రేక్ (ముందు భాగంలో), వెనుకవైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అయితే టాప్ ఎండ్ మోడల్ డిజి డిస్క్ వెర్షన్ యొక్క ముందువైపు 240 మిమీ డిస్క్, వెనుకవైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇవి సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ పొందుతాయి. ఈ బైక్ 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి. కాబట్టి మొత్తం మీద ఇది ఉత్తమ పనితీరును అందిస్తాయని తెలుస్తోంది.

Don’t Miss: హీరో ‘అజిత్ కుమార్’ రేసింగ్ టీమ్.. అంతర్జాతీయ పోటీలకు సిద్ధం! – ఫోటోలు చూడండి

రేడియన్ కొత్త కలర్ ఆప్షన్ పొందటానికి కారణం

టీవీఎస్ మోటార్ తన రేడియన్ బైకును కొత్త రంగులో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం వాహన ప్రేమికులను ఆకర్శించడం కోసమే. నిజానికి చాలామంది వాహన ప్రియులు కొత్త బైకులను కొనాలనుకుంటారు లేదా అప్డేటెడ్ బైకులను కొనాలనుకుంటారు. కొత్త రంగులో లభించే బైకులను కొనుగోలు చేయడానికి కూడా పలువురు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ కంపెనీ తన రేడియన్ బైకును కొత్త రంగులో ప్రవేశపెట్టింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ బైక్ దేశీయ మార్కెట్లో దాని విభాగంలో అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉండనుంది.

హీరో ‘అజిత్ కుమార్’ రేసింగ్ టీమ్.. అంతర్జాతీయ పోటీలకు సిద్ధం! – ఫోటోలు చూడండి

0

Ajith Kumar Racing Team India Hero Announces Own Racing Team: ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి తెలిసిన చాలామందికి.. ఈయనకు బైకుల మీద ఉన్న ఆసక్తి గురించి కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఈయన చాలా సందర్భాల్లో తన ఖరీదైన బైకులో ప్రయాణం చేస్తూ కనిపించారు. అంతే కాకుండా గతంలో కొన్ని రేసింగ్ ఈవెంట్లలో కూడా స్వయంగా పాల్గొన్న చరిత్ర కూడా ఈయనకు ఉంది. కాగా ఇప్పుడు సొంతంగా ఒక రేసింగ్ టీమ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు హీరో అజిత్.

రేసింగ్ పట్ల అమితాసక్తి ఉన్న హీరో అజిత్ ఒక ప్రొఫెషనల్ రేసర్. ఇప్పుడు ఈయన సొంతంగా ‘అజిత్ కుమార్ రేసింగ్ టీమ్’ (Ajith Kumar Racing Team) పేరుతో రేసింగ్ టీమ్​ను ప్రకటించారు. ఈ టీమ్ త్వరలో జరగనున్న రేసింగులో పాల్గొంటుంది. అంతకంటే ముందు అజిత్ దుబాయ్ ఆటోడ్రోమ్‌లో ఫెరారీ 488 ఈవోను టెస్ట్ చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలను అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఫెరారీ రేసింగ్ కారును చూడవచ్చు.

ఫోటోలను షేర్ చేస్తూ.. హీరో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్. కొత్త ఉత్తేజకరమైన సాహసానికి నాంది పలికిందుకు చాలా సంతోషిస్తున్నాము. అజిత్ కేవలం జట్టు యజమానిగా మాత్రమే కాకుండా.. రేసింగులో కూడా స్వయంగా పాల్గొనబోతున్నారు. అంతర్జాతీయ మైదానములో రేసింగ్ చేయనున్న అతి కొద్దిమంది భారితీయ ఛాంపియన్‌షిప్‌లలో అజిత్ ఒకరుగా చరిత్ర సృష్టించనున్నారు. ప్రతిభ కలిగిన యువ రైడర్లకు మద్దతు ప్రకటించడమే మా ప్రధాన ఉద్దేశ్యం అంటూ సురేష్ చంద్ర పేర్కొన్నారు.

నిజానికి హీరో అజిత్ కుమార్ 2004లో ఫార్ములా ఆసియా బీఎండబ్ల్యూ ఎఫ్3 ఛాంపియన్‌షిప్‌లో మరియు 2010 ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నారు. కాగా ఇక త్వరలో జరగబోయే మరో రేసింగులో కూడా ఈయన తన ప్రతిభ చూపనున్నారు. మొత్తం మీద నటుడు ఇప్పుడు రేసర్ అవతారం ఎత్తనున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు రేసింగ్ పట్ల ఎంత అభిరుచి ఉందో తెలుసుకోవచ్చు.

ఇటీవల అజిత్ కొన్న ఖరీదైన కారు

నటుడు అజిత్ ఇటీవల రూ. 3.5 కోట్ల ఖరీదైన పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ కారును కొనుగోలు చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని రోజులకు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఇలాంటి మోడల్ కారును అక్కినేని నాగ చైతన్య కూడా కొనుగోలు చేశారు.

నటుడు అజిత్ కొనుగోలు చేసిన పోర్స్చే కారు.. భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగి, గొప్ప పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ కారులోని 3996 సీసీ ఇంజిన్ 468 న్యూటన్ మీటర్ టార్క్, 518 బ్రేక్ హార్స్ పవర్ (Bhp) ప్రొడ్యూస్ చేస్తుంది. 296 కిమీ/గం వేగంతో ప్రయాణించే ఈ కారు 0 నుంచి 100 కిమీ వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 3.2 సెకన్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఇది ఎంత వేగవంతమైన కారో అర్థం చేసుకోవచ్చు.

అజిత్ గ్యారేజిలోని కార్లు & బైకులు

హీరో అజిత్ కుమార్ గ్యారేజిలో కార్ల కంటే.. ఖరీదైన బైకులే ఎక్కువ ఉన్నాయి. అవి బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ (రూ. 22.4 లక్షలు), బీఎండబ్ల్యూ కే 1300 ఎస్ (రూ. 23.95 లక్షలు), ఏప్రిలియా కపనోర్డ్ 200 (రూ. 18.05 లక్షలు) మరియు కవాసకి నింజా జెడ్ఎక్స్ 145 (రూ. 19.70 లక్షలు). కారల్ జాబితాలో ఫెరారీ 458 ఇటాలియా (రూ. 3.87 కోట్లు), బీఎమ్1 740 ఎల్ఐ (రూ. 1.42 కోట్లు) మరియు హోండా అకార్డ్ వీ6 (రూ. 27.75 లక్షలు). ఈ కార్ల జాబితాలోకి ఇటీవలే రూ. 3.5 కోట్ల పోర్స్చే కారు కూడా చేరింది.

Don’t Miss: 10 కోట్లకు చేరిన ఉత్పత్తి: కంపెనీ చరిత్రలోనే అరుదైన ఘట్టం

సినిమా రంగంలో చాలామంది లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రమే స్పోర్ట్స్ బైకులు, స్పోర్ట్స్ కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కోవకు చెందిన వారిలో అజిత్ కుమార్ ఒకరు. ఈయన సమయం దొరికినప్పుడల్లా.. తన బైకులో లాంగ్ రైడ్ కూడా చేస్తుంటారు.