24.7 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 29

దేవర భామ ‘జాన్వీ కపూర్’ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు

0

Janhvi Kapoor Buys New Lexus Car: ప్రముఖ నటి ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ నటించకపోయినా.. ఒక సెలబ్రిటీగా మాత్రమే కాకుండా.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ఈమె (జాన్వీ) దేవర (Devara) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న తెరమీదకు రానున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఖరీదైన కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల తాజాగా జపాన్ బ్రాండ్ అయిన ‘లెక్సస్’ (Lexus) కంపెనీకి చెందిన ‘ఎల్ఎమ్ 350హెచ్’ (LM 350h) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. సోనిక్ అగేట్ షేడ్‌లో మెరిసిపోతున్న ఓ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు కనిపిస్తుంది. ఇది నటి జాన్వీ కపూర్‌కు చెందినదని తెలుస్తోంది. వీడియోలో కారు వెళ్లడం మాత్రమే కనిపిస్తుంది. కానీ కారులో నుంచి జాన్వీ కపూర్ కిందికి దిగటం లేదా కారులోకి ఎక్కడం వంటి సన్నివేశాలు కనించలేదు.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ (Lexus LM 350h)

చాలామంది సెలబ్రిటీలకు (బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మొదలైన) నచ్చిన కార్ల జాబితాలో ఈ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కూడా ఒకటి. ఇప్పటికే రణబీర్ కపూర్, అలియా భట్ ఈ కారును కొనుగోలు చేశారు. కాగా ఇప్పుడు శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కూడా ఈ కారుకు ఓనర్ అయిపోయింది.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ అనేది నిజానికి భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టయోటా వెల్‌ఫైర్ యొక్క లగ్జరీ వెర్షన్. దేశీయ విఫణిలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనించదగ్గ విషయం. దీని ధర రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.

డిజైన్ & ఫీచర్స్

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ యొక్క డిజైన్ చాలా హుందాగా ఉంటుంది. ఈ కారు హెక్సాగోనల్ నమూనాతో పెద్ద ఫ్రంట్ గ్రిల్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బంపర్ మీద నిలువుగా కనిపించే ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటి వాటితో పాటు.. వెనుక వైపు బ్రాండ్ లోగో మరియు టెయిల్ గేట్ దిగువన ఎల్ఎమ్ 350హెచ్ బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ మొత్తం వెడల్పు అంతటా టెయిల్ లాంప్ ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ధరకు తగిన విధంగానే ఈ కారు లగ్జరీ ఫీచర్స్ పొందుతుంది. ఇది 4 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. అయితే జాన్వీ 4 సీటర్ మోడల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 7 సీటర్ కంటే కూడా 4 సీటర్ లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ చాలా విలాసవంతంగా ఉంటుంది. ముందు మరియు వెనుక సీట్ల మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు 48 ఇంచెస్ టీవీ, ఎయిర్‌లైనన్ స్టైల్ రిక్లైనింగ్ సీట్లు, ప్రీమియం సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 23 స్పీకర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, ఒట్టోమన్‌లు, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఫ్రిజ్, రియర్ గ్లోవ్ బాక్సులు, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికులకు అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

Don’t Miss: సమంత ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?.. ఒక్కక్కటి ఇంత రేటా..

ఇంజిన్

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్ కారు 2.5 లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 పీఎస్ పవర్ మరియు 239 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం’ (ADAS) టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇది ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది.

తోబుట్టుల మనసు దోచే ‘రక్షాబంధన్’ గిఫ్ట్? ఇది చూడండి

0

Electric Scooters to Gift Your Sisters This Raksha Bandhan: తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక అయిన ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) త్వరలో (ఆగష్టు 19) వచ్చేస్తోంది. ఈ సమయంలో అన్నలు.. తమ అక్కలకు లేదా చెల్లెళ్లకు అద్భుతమైన టూ వీలర్, కొంత తక్కువ ధరలోనే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఐదు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. మరిన్ని వివరాలు చూసేద్దామా..

కైనెటిక్ గ్రీన్ జూమ్ (Kinetic Green Zoom)

రోజువారీ వినియోగానికి తక్కువ ధరలో ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వాలనుకుంటే.. కైనెటిక్ గ్రీన్ జూమ్ ఓ ఉత్తమ ఆప్షన్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 71531 (ఎక్స్ షోరూమ్). ఇది రోజువారీ వినియోగానికి, సిటీ ప్రయాణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 250 వాట్స్ బీఎల్డీసీ మోటార్ ద్వారా శక్తిని పొందే ఈ స్కూటర్ 48 వోల్ట్ / 24 యాంపియర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 70 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 25 కిమీ/గం.

కైనెటిక్ గ్రీన్ జూమ్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు మాత్రమే. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇది మంచి దృశ్యమానతను అందిస్తుంది. డ్రమ్ బ్రేక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు డ్యూయెల్ స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్ వంటివి ఇందులో ఉంటాయి. ఇందులోని బ్యాటరీ రిమూవబుల్.. కాబట్టి ఛార్జింగ్ అయిపోయిన తరువాత స్వపబుల్ సెంటర్లో కూడా మార్చుకోవచ్చు.

ఒడిస్సే స్నాప్ (Odysse Snap)

రూ. 79999 వద్ద లభించే ఒడిస్సే స్నాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మన జాబితాలో చెప్పుకోదగ్గ ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ స్కూటర్. గంటకు 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ 105 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ అజూర్ బ్లూ, మ్యాట్ బ్లాక్, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభిస్తుంది. ఇందులో బుక్ చేసుకుంటే రూ. 10000 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ఎక్స్ (Hero Electric Atria LX)

రూ. 77690 ధర వద్ద లభించే హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ఎక్స్ స్కూటర్ నగర ప్రయాణం కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన వెహికల్. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్. ఇందులో 250 వాట్స్ బీఎల్డీసీ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ 51.2 వోల్ట్స్ / 30 యాంపియర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. అట్రియా ఎల్ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో 85 కిమీ రేంజ్ అందిస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ఎక్స్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు మాత్రమే. ఇందులో మెరుగైన దృశ్యమానత కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. అంతే కాకుండా వెహికల్ గురించి చాలా సమాచారాన్ని అందించడానికి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఇది బ్యాటరీ స్టేటస్, టైమ్ మరియు స్పీడ్ వంటి చాలా విషయాలను రైడర్లకు తెలియజేస్తుంది.

ఒడిస్సే ఈ2గో లైట్ (Odysse E2go Lite)

మన జాబితాలో తక్కువ ధర వద్ద లభించే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒడిస్సే ఈ2గో లైట్. దీని ధర రూ. 71000. నగర ప్రయాణానికి చాలా అద్భుతంగా ఉండే ఈ స్కూటర్ 250 వాట్స్ బీఎల్డీసీ మోటార్ పొందుతుంది. ఇందులోని 1.42 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ గరిష్టంగా 70 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ మాత్రమే.

ఈ ఒడిస్సే ఈ2గో లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ కీలెస్ ఎంట్రీ, యాంటీ తెఫ్ట్ అలారం మరియు ముందు భాగంలో డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఈ స్కూటర్ కంబాట్ రెడ్, అజూర్ బ్లూ, మ్యాట్ బ్లాక్, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకుంటే ఏకంగా రూ.10 వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X)

భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్. ఈ కంపెనీ యొక్క ఎస్1 ఎక్స్ తక్కువ ధర వద్ద లభించే మరియు రోజువారీ వినియోగానికి అత్యద్భుతమైన స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84999. ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉత్తమమైన స్కూటర్.

Don’t Miss: ప్రపంచ కుబేరులు.. వేలకోట్ల సంపద: వీళ్ళు వాడే కార్లు మాత్రం ఇవే

ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్ బ్యాటరీ గంటకు 85 కిమీ వేగంతో 121 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో 3 కిలోవాట్ బ్యాటరీ మోడల్ (రూ. 90019) గంటకు 90 కిమీ వేగంతో 151 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 7.4 గంటల సమయం పడుతుంది. ఇది 7 విభిన్న రంగులలో లభిస్తుంది. కాబట్టి ఈ స్కూటర్ అన్ని విధాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సమంత ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?.. ఒక్కక్కటి ఇంత రేటా..

0

Samantha Ruth Prabhu Expensive Car Collection: సమంత (Samantha).. ఈ పేరుకు చిత్ర సీమలో ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఏమాయ చేసావే సినిమాతో అభిమానుల మనసుదోచిన ఈ అమ్మడు.. బృందావనం, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది వంటి అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్యతో పెళ్లి.. విడాకులు ఇవన్నీ దాదాపు అందరికి తెలుసు. సినిమా రంగంలో దూసుకెళ్తున్న సమంత ఖరీదైన కార్లను కూడా ఉపయోగిస్తుంది. బహుశా ఇది చాలా కొంతమందికి మాత్రమే తెలిసిఉంటుంది. ఈ కథనంలో సమంత ఉపయోగించే కార్లు ఏవి? వాటి ధర ఎంత ఉంటుందనే మరిన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.. ఇక ఆలస్యమెందుకు స్టోరీలోకి వెళ్ళిపోదాం.

నటి సమంత ఉపయోగించే కార్లు

బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series)

ఇతర సెలబ్రిటీల మాదిరిగానే సమంత జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ కారును కలిగి ఉంది. దీని ధర రూ. 1.42 కోట్లు. సమంత తరచుగా ఈ కారునే ఉపయోగిస్తుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే కాకుండా డీజిల్ మరియు హైబ్రిడ్ వంటి వెర్షన్లలో కూడా లభిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 335 హార్స్ పవర్, 450 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 5.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF)

రూ. 70 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన జాగ్వార్ కంపెనీకి చెందిన ఎక్స్ఎఫ్ కూడా సమంత గ్యారేజిలో ఉందని సమాచారం. ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 197 బీహెచ్‌పీ పవర్.. 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 10 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ కారు గరిష్ట వేగం గంటకు 234 కిమీ. ఈ సెడాన్ 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 6.4 సెకన్లు మాత్రమే. మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఆడి క్యూ7 (Audi Q7)

జాన్ అబ్రహం, బిపాసా బసు, దీపికా పదుకొనె వంటి ప్రముఖ సెలబ్రిటీల గ్యారేజిలో కనిపించే ఆడి క్యూ7 కారు.. సమంత గ్యారేజీలోనూ ఉంది. దీన్ని బట్టి చూస్తేనే.. ఈ కారు సెలబ్రిటీల మనసును ఎంతగా దోచేస్తోందో స్పష్టంగా అర్థమవుతోంది. రూ. 80 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు 3.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 241.4 Bhp పవర్ మరియు 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 12 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ కారు గరిష్ట వేగం గంటకు 215 కిమీ. యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్స్ క్యూ7 కారులో ఉన్నాయి.

Don’t Miss: రూ.3.5 కోట్ల కారు కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!

మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG)

జర్మన్ బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క జీ63 ఏఎంజీ కూడా సమంత గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం. ఈ కారు పవన్ కళ్యాణ్, అంబానీ ఫ్యామిలీలో కూడా ఉంది. సుమారు రూ.2.3 కోట్ల ఖరీదైన ఈ కారు 5.5 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 572 బీహెచ్‌పీ పవర్ & 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ కారు టాప్ స్పీడ్ 210 కిమీ/గం.. కాగా ఇది 5.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతం అవుతుంది.

పోర్స్చే కేమాన్ జీటీఎస్ (Porsche Cayman GTS)

లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. సమంత గ్యారేజిలో పోర్స్చే స్పోర్ట్స్ కారు కూడా ఉంది. బహుశా ఇదే సమంత వద్ద ఉన్న ఏకక స్పోర్ట్స్ కారు అని తెలుస్తోంది. దీని ధర రూ. 1.19 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో 3.5 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 330 Bhp పవర్ & 370 Nm టార్క్ అందిస్తుంది. 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 283 కిమీ/గం. ఈ స్పోర్ట్స్ కారు మైలేజ్ 9 నుంచి 16 కిమీ/లీ అని తెలుస్తోంది.

రూ.3 లక్షల వద్ద లాంచ్ అయిన BSA Gold Star 650 బైక్ – ఎక్కడ బుక్ చేసుకోవాలో తెలుసా?

0

BSA Gold Star 650 Launched in India: ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏ (BSA) దేశీయ మార్కెట్లో ‘గోల్డ్ స్టార్ 650’ (Gold Star 650) లాంచ్ చేసింది. ఒక్కప్పుడు టూ వీలర్ అమ్మకాల్లో ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించిన ఈ బైక్ మళ్ళీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్ & ధర వంటి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ధర & బుకింగ్స్

దేశీయ మార్కెట్లో అధికారంగా లాంచ్ అయిన కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ధర రూ. 3 లక్షల నుంచి రూ. 3.35 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న జావా / యెజ్డీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. బీఎస్ఏ క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం.. గోల్డ్ స్టార్ 650 బుకింగ్స్ భారతదేశంలోని 52 అవుట్‌లెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా కంపెనీ తన పరిధిని మరింత విస్తరించే యోచనలో ఉంది. అయితే డెలివరీలు మరో 10 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

డిజైన్ & ఫీచర్స్

చూడటానికి ఆకర్షణీయంగా ఉండే కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ క్లాసిక్ రోడ్‌స్టర్ మాదిరిగా ఉంటుంది. ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ వంటివి చూపించడానికి డిజిటల్ గేజ్ మరియు రెట్లో డిజైన్ వంటివి చూడవచ్చు. వార్ణింగ్ లైట్స్, స్పీడో మీటర్, టాకొమీటర్ ఉండే రెండు అనలాగ్ క్లాక్స్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. ఫ్యూయెల్ ట్యాంక్ మీద బ్రాండ్ గుర్తులు కూడా చూడవచ్చు. మొత్తం మీద ఈ బైక్ ఆధునిక కాలంలో రైడర్లను ఆకర్శించే విధంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో అనలాగ్ డయల్స్, బీఎస్ఏ లోగోలు, లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ ఎగ్జాస్ట్ మరియు టియర్ డ్రాప్ ఫ్యూయెల్ ట్యాంక్, స్పోక్ వీల్స్, రౌండ్ హెడ్‌లైట్, డే టైమ్ రన్నింగ్ లాంప్ (డీఆర్ఎల్) వంటివి ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

కలర్ ఆప్షన్స్

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ మొత్తం ఆరు రంగులలో లభిస్తుంది. అవి హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, డాన్ సిల్వర్, షాడో బ్లాక్ మరియు లెగసీ ఎడిషన్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కాబట్టి వాహన ప్రియులు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు. బైకులో అక్కడక్కడా క్రోమ్ బిట్స్ ఉన్నాయి.

ఇంజిన్

ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవలసిన అంశం ఇంజిన్.. ఇందులో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 45 Bhp పవర్ మరియు 55 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. కాబట్టి ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే పవర్ మరియు టార్క్ అన్నీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ బైకుల కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది.

డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలు పక్కన పెడితే.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ బ్రెంబో కాలిపర్‌లతో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ (320 మిమీ ఫ్రంట్ మరియు 255 మిమీ రియర్ బ్రేక్స్), అల్యూమినియం స్పోక్ వీల్స్ మరియు పిరెల్లి టైర్లు ఉన్నాయి. ఈ బైక్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. అంతే కాకుండా.. ఈ బైక్ 41 మిమీ టెలిస్కోపిక్ పోర్క్ మరియు రియర్ ట్విన్ షాక్స్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

Don’t Miss: ప్రపంచ కుబేరులు.. వేలకోట్ల సంపద: వీళ్ళు వాడే కార్లు మాత్రం ఇవే

భారతీయ మార్కెట్లో ఇప్పటికే 650 సీసీ బైకులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఎస్ఏ 650 గోల్డ్ స్టార్ లాంచ్ చేసింది. ఒకప్పుడు గణనీయమైన అమ్మకాలను పొందిన బీఎస్ఏ బైక్.. మళ్ళీ దేశీయ విఫణిలో పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుందని త్వరలోనే తెలుస్తుంది.

కేవలం 1000 మందికే ఈ స్కూటర్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

0

TVS iQube Celebration Edition Launched in India: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) ఇప్పటికే లెక్కకు మించిన వాహనాలను భారతీయ విఫణిలో లాంచ్ చేసి విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ విభాగంలో మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న ‘టీవీఎస్ ఐక్యూబ్’ (TVS iQube) ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది.

టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్స్

టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ యొక్క ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ సెలబ్రేషన్ ఎడిషన్‌లుగా లాంచ్ అయ్యాయి. వీటి ధరలు వరుసగా రూ. 1.20 లక్షలు మరియు రూ. 1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషన్ ఎడిషన్ స్కూటర్లు పరిమిత సంఖ్యలో (కేవలం 1000 యూనిట్లు) మాత్రమే విక్రయించనున్నారు.

బుకింగ్స్ & డెలివరీలు (Bookings & Delivery)

భారతీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్స్ అనేవి కేవలం 1000 మంది కస్టమర్లకు మాత్రమే అందించనున్నారు. అంటే ముందుగా బుక్ చేసుకున్న 1000 మందికి వారికి మాత్రమే కంపెనీ వీటిని డెలివరీ చేస్తుంది. కాబట్టి ఈ స్కూటర్ కావాలనుకునే వారు ఈ రోజు (ఆగష్టు 15) బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీలు ఆగష్టు 26 నుంచి ప్రారంభమవుతాయి.

డిజైన్ మరియు ఫీచర్స్ (Design and Features)

78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఈ లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది డ్యూయెల్ టోన్ కలర్ పొందుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ ఎండ్ నారింజ రంగులో ఉంటుంది. సైడ్ ప్యానెల్ మరియు వెనుక భాగం బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇది దాని మునుపటి వేరియంట్ల కంటే భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ యొక్క ఎల్ఈడీ డీఆర్ఎల్ మీద చిన్న జాతీయ జెండా ఉంటుంది. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పకనే చెబుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్, ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఐక్యూబ్ యొక్క అదే ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇందులో కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర అన్ని ఫీచర్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే.. రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

బ్యాటరీ & రేంజ్ (Battery & Range)

కొత్త టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్.. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. స్టాండర్డ్ ఐక్యూబ్ మోడల్‌లోని అదే బ్యాటరీ ఇందులో ఉంటుంది. కాబట్టి రేంజ్ మరియు మోటార్ కెపాసిటీ, చాసిస్, సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ అన్నీ కూడా సాధారణ ఐక్యూబ్ మోడల్‌ మాదిరిగానే ఉంటాయి.

టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్ 4.4 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ 4.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ టాప్ 78 కిమీ/గం. ఈ స్కూటర్‌లో రివర్స్ మోడ్ మరియు ఎకానమీ, పవర్ అనే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ యొక్క 3.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ చార్జితో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. స్టాండర్డ్ స్కూటర్ మాదిరిగానే అదే పర్ఫామెన్స్ అందిస్తుందని స్పష్టమవుతోంది.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో ‘మహీంద్రా థార్ రోక్స్’ లాంచ్: ధర రూ.12.99 లక్షలే!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త లేదా అప్డేటెడ్ వాహనాలను లాంచ్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము. కాగా కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దేశీయ మార్కెట్లోని టూ వీలర్ విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.

ఎట్టకేలకు భారత్‌లో ‘మహీంద్రా థార్ రోక్స్’ లాంచ్: ధర రూ.12.99 లక్షలే!

0

Mahindra Thar Roxx Launched in India At Rs.12.99 Lakh: ముందుగా మార్థా తెలుగు (Martha Telugu) పాఠకులకు భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) భారతీయ మార్కెట్లో తన 5 డోర్ వెర్షన్ థార్ (Thar) లాంఛ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు అత్యద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉంది. ఈ కొత్త కారు యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ధరల వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం..

ధరలు & వేరియంట్స్

ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx) పేరుతో లాంచ్ అయిన ఈ కొత్త కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎమ్ఎక్స్1 పెట్రోల్ మాన్యువల్ (MX1 Petrol MT) మరియు ఎమ్ఎక్స్1 డీజిల్ మాన్యువల్ (MX1 Diesel MT). వీటి ధరలు వరుసగా రూ. 12.99 లక్షలు మరియు రూ. 13.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). డీజిల్ వేరియంట్ ధర పెట్రోల్ వేరియంట్ ధరల కంటే ఎక్కువని తెలుస్తోంది. అంతే కాకుండా థార్ రోక్స్ అనేది సాధారణ 3 డోర్ థార్ ప్రారంభ ధర కంటే కూడా రూ. 1.64 లక్షలు ఎక్కువని స్పష్టమవుతోంది.

డిజైన్

మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన కొత్త థార్ రోక్స్ పరిమాణంలో దాని 3 డోర్ వెర్షన్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇది కొత్త గ్రిల్, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సీ ఆకారంలో ఉండే డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్ (టాప్ వేరియంట్) డ్యూయెల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ (మిడ్ వేరియంట్) వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది ఇంటిగ్రేటెడ్ ఫాగ్ లాంప్ హోసింగ్.. మధ్యలో ఫాక్స్ బ్రస్డ్ అల్యూమినియం బిట్స్, ఛంకీ వీల్ ఆర్చెస్.. స్టైలిష్ 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ (హై వేరియంట్) పొందుతుంది.

థార్ రోక్స్ యొక్క ముందు డోర్ దాదాపు దాని స్టాండర్డ్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. వెనుక డోర్ మాత్రం కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లాంప్, రియర్ వైపర్ అన్నీ కూడా కారును మరింత ఆకర్షణీయంగా చేయడంలో ఉపయోగపడతాయి.

ఫీచర్స్

మహీంద్రా థార్ రోక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా 3 డోర్ మోడల్ యొక్క అదే డ్యాష్‌బోర్డ్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యాడ్ మీద సాఫ్ట్ టచ్ మెటీరియట్ వంటి కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లో లేత గోధుమ రంగు లెథెరెట్ సీట్లు చూడవచ్చు.

డ్యాష్‌బోర్డ్ డ్యూయెల్ టోన్ థీమ్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. టాప్ వేరియంట్ రోక్స్ మోడల్ యొక్క ముందు వరుసలో కూల్డ్ సీట్లు, యంబియాంట్ లైటింగ్, యాంబియంట్ లైటింగ్ మరియు ఫుట్‌వెల్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్క్, నాలుగు పవర్ విండోస్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రిమోట్ ఫ్యూయెల్ ఓపెనింగ్ సెటప్ (ఈ ఫీచర్ 3 డోర్ థార్ మోడల్ కారులో లేదు) అన్నీ కూడా ఉన్నాయి.

ఇంజిన్

కొత్త మహీంద్రా థార్ రోక్స్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 162 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 152 హార్స్ పవర్ & 330 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు వేరియంట్లు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయని తెలుస్తోంది. బహుశా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండొచ్చని భావిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సేఫ్టీ ఫీచర్స్

మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ మాదిరిగిగా 5 డోర్ మోడల్ కూడా అన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని భావిస్తున్నాము. కాబట్టి ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉండనున్నాయి. థార్ రోక్స్ టాప్ ఎండ్ మోడల్ ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందవచ్చని సమాచారం.

Don’t Miss: మహ్మద్ సిరాజ్ రూ.3 కోట్ల కారు ఇదే.. ఫోటోలు చూశారా?

ప్రత్యర్థులు

మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ లేదా థార్ రోక్స్ కారుకు దేశీయ మార్కెట్లో ఫోర్స్ గూర్ఖా 5 డోర్ మోడల్ ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కానీ అమ్మకాలు పరంగా ఇది తప్పకుండా ఉత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. కాగా బుకింగ్స్ మరియు డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. ఇవన్నీ ఈ రోజు (ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం) వెల్లడయ్యే అవకాశం ఉంది.

మహ్మద్ సిరాజ్ రూ.3 కోట్ల కారు ఇదే.. ఫోటోలు చూశారా?

0

Indian Cricketer Mohammed Siraj New Car Range Rover: క్రికెటర్లు, సినీతారలు, రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన వాహనాలను (కార్లు లేదా బైకులు) కొనుగోలు చేస్తుంటారని అందరికీ తెలుసు. గతంలో సెలబ్రిటీలు కొనుగోలు చేసిన కార్ల గురించి చాలానే తెలుసుకున్నాం. ఇటీవల ప్రముఖ క్రికెటర్ ‘మహ్మద్ సిరాజ్’ (Mohammed Siraj) ఖరీదైన ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్’ (Land Rover Range Rover) కారును కొనుగోలు చేశారు. ఈ కారు రేటు ఎంత? ఇప్పటికే ఈ కారును ఉపయోగిస్తున్న ప్రముఖులు ఎవరు అనే వివరాలు తెలుసుకుందాం.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్

ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారు ధర రూ. 3 కోట్లు అని తెలుస్తోంది. ఎన్నో రోజులుగా కలలు కన్న సిరాజ్ మొత్తానికి తాను ఇష్టపడ్డ కారును సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఈ కారును హైదరాబాద్‌లోని కంపెనీ డీలర్షిప్ నుంచి డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సిరాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా సిరాజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మహ్మద్ సిరాజ్ ల్యాండ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. కానీ ఏ మోడల్ కొనుగోలు చేసారనేది ఖచ్చితంగా తెలియడం లేదు. కానీ ఫోటోలను షేర్ చేస్తూ.. మీ కలలకు పరిమితులు లేదు. ఎందుకంటే అవి మిమ్మల్ని మరింత కస్టపడి పనిచేయడానికి ఉసిగొల్పుతాయి. నిలకడతో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కారును కొనుగోలు చేసేలా నా డ్రీమ్ నన్ను తయారు చేసింది. మీపైన మీకు నమ్మకం ఉంటే.. మీరు కోరుకున్నది సాధించవచ్చు అని సిరాజ్ వెల్లడించారు.

సిరాజ్ కొనుగోలు చేసిన కారు ఏది అనేది వెల్లడి కాలేదు, కానీ ఇప్పుడు భారతదేశంలో అసెంబుల్ చేయబడిన కారు ప్రారంభ ధర రూ. 2.98 కోట్లు. కాగా టాప్ ఎండ్ మోడల్ ల్యాండ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ట్రిమ్ కోసం రూ. 5.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇంజిన్

ల్యాండ్ రోవర్ బేస్ మోడల్ 3 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 394 Bhp పవర్ మరియు 560 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగి ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికను పొందుతుంది. సుమారు 2.5 టన్నుల బరువు కలిగిన ఈ కారు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం మరియు ఐడిల్ స్టాప్ సిస్టం వంటి వాటిని పొందుతుంది. ఇది 5.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 242 కిమీ కావడం గమనార్హం.

ఇక ల్యాండ్ రోవర్ టాప్ వేరియంట్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ విషయానికి వస్తే.. ఇది 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 Bhp పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతుంది. ఈ మోడల్ 4.7 సెకన్లలో గంటకు 0 – 100 కిమీ వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ కావడం గమనార్హం.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ 3 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 346 బ్రేక్ హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో 3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో 503 బీహెచ్పీ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.

ఫీచర్స్

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో హీటెడ్ అండ్ కూల్డ్ ఎగ్జిక్యూటివ్ రియర్ సీట్లు, 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 13.1 ఇంచెస్ రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. అంతే కాకుండా 3డీ సరౌండ్ సిస్టం, ప్రీమియం లెదర్ అప్‌హోల్స్టరీ, మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

Don’t Miss: తోబుట్టుల మనసు దోచే ‘రక్షాబంధన్’ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇది చూడండి

మహ్మద్ సిరాజ్ ఇతర కార్లు

క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గ్యారేజిలో ఇతర కార్ల విషయానికి వస్తే.. ఇందులో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ సెడాన్, టయోటా ఫార్చ్యూనర్ మొదలైన కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును తన గ్యారేజిలో చేర్చారు. ఒకప్పుడు బజాజ్ ప్లాటినా బైక్ ఉపయోగించే సిరాజ్ ఇప్పుడు ల్యాండ్ రోవర్ కొనే స్థాయికి ఎదిగారు అంటే.. అది ఆయన కృషి మరియు పట్టుదల అనే చెప్పాలి.

మొదలైన ‘టాటా కర్వ్ ఈవీ’ బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?

0

Tata Curvv EV Bookings Test Drive And Delivery: సుదీర్ఘ నిరీక్షణ తరువాత దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు తన ‘కర్వ్ ఈవీ’ (Curvv EV) లాంచ్ చేసింది. అయితే బుకింగ్స్ మాత్రం ఇప్పుడు ప్రారంభించింది. ఈ సందర్భంగానే కంపెనీ డెలివరీలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.

బుకింగ్ ధర & డెలివరీలు

టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త కర్వ్ ఈవీ కారును బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందుగా రూ. 21000 చెల్లించి కంపెనీ అధీకృత డీలర్‌షిప్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఆగష్టు 23 నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే ఈ నెలాఖరు నాటికి డెలివరీ పొందవచ్చని తెలుస్తోంది.

ధరలు & వేరియంట్స్

టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త టాటా కర్వ్ ఈవీ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ. వీటి ధరలు రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ధర అనేది ఎంచుకునే వేరియంట్ మరియు బ్యాటరీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది.

డిజైన్ మరియు ఫీచర్స్

చూడగానే టాటా నెక్సాన్ ఈవీ కారు మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కనెక్టెడ్ టెయిల్ లాంప్, ఎల్ఈడీ లైట్ బార్, ఫాగ్ లాంప్, కర్నరింగ్ ఫంక్షన్, ఆటో వైపర్లు మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కారును చాలా ఆకర్షనీయంగా చేయడంలో సహాయపడతాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. బేస్ మోడల్ 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, కీలెస్ గో, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉంటాయి. అయితే టాప్ ఎండ్ మోడల్ 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రియర్ సీట్ల కోసం రిక్లైన్ ఫంక్షన్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.

పవర్‌ట్రెయిన్

ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం బ్యాటరీ మరియు రేంజ్. టాటా కర్వ్ ఇవే 45 కిలోవాట్ మరియు 55 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. బేస్ మోడల్ యూనిట్ 45 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది, అదే టాప్ వేరియంట్స్ 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.

45 కిలోవాట్ బ్యాటరీ కలిగిన టాటా కర్వ్ ఈవీ ఒక సింగిల్ ఛార్జ్ ద్వారా 502 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే విధంగా 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన కారు ఒక ఫుల్ ఛార్జ్ ద్వారా 585 కిమీ రేంజ్ అందిస్తుంది. టాటా కర్వ్ ఈవీ 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.

సేఫ్టీ ఫీచర్స్

టాటా అంటేనే సేఫ్టీ. ఎక్కువ మంది టాటా కార్లను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ప్రజలకు నమ్మికయిన టాటా మోటార్స్ ఇప్పుడు తన కర్వ్ ఈవీలో కూడా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ అందిస్తోంది. ఇందులో భాగంగానే టాటా కర్వ్ ఇవే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి మరిన్నో ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

టెస్ట్ డ్రైవ్స్

టాటా కర్వ్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ కూడా కంపెనీ ఆగష్టు 14 అంటే రేపటి నుంచి ప్రారంభిస్తోంది. కాబట్టి ఆసక్తి కలిగిన కస్టమర్లు టెస్ట్ డ్రైవ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ కోసం కస్టమర్లు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

Don’t Miss: టాటా సరికొత్త ఎలక్ట్రిక్ కారు ‘కర్వ్’ ధరలు తెలిసిపోయాయ్.. ఇక్కడ చూడండి

ప్రత్యర్థులు

టాటా కర్వ్ ఈవీ దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎంజీ మోటార్స్ యొక్క జెడ్ఎస్ ఈవీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నాము. అయితే టాటా కర్వ్ ఈవీ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.

ప్రపంచ కుబేరులు.. వేలకోట్ల సంపద: వీళ్ళు వాడే కార్లు మాత్రం ఇవే

0

Billionaires Prefer to Drive These Affordable Cars: సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు, క్రికెటర్ల నుంచి రాజకీయ నాయకలు దాకా.. పారిశ్రామిక వేత్తల నుంచి బిలినీయర్ల వరకు అందరికి వాహాలంటే ఇష్టమే. అయితే ఆర్థిక స్థోమతను బట్టి ఎవరికి వారు తమకు కావలసిన వాహనాలను ఉపయోగిస్తున్నారు. అయితే బిలినీయర్లు లేదా ప్రపంచ కుబేరులు కావాలనుకుంటే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించవచ్చు. కొందరు ఉపయోగిస్తున్నారు కూడా. ఎవరెన్ని ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నా.. వారి గ్యారేజీల్లో కోట్ల రూపాయల విలువ చేసే కార్లున్నా కొందరు ధనవంతులు మాత్రం సాధారణ కార్ల వాడకానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో అమెజాన్ ఫౌండర్ దగ్గర నుంచి ఫేస్‌బుక్ స్థాపించడానికి సహాయపడిన డస్టిన్ మోస్కోవిట్జ్ వరకు ఉన్నారు.

జెఫ్ బెజోస్ (Jeff Bezos)

ప్రపంచ కుబేరులలో ఒకరు.. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గురించి అందరికి తెలుసు. వేలకోట్ల సామ్రాజ్యానికి నాయకుడైన ఈయన గ్యారేజిలో ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. కానీ ఈయన మాత్రం 1999నాటి హోండా అకార్డ్ ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఎక్కువగా ఆ కారును డ్రైవ్ చేయడానికి బెజోస్ ఆసక్తి చూపుతారు. వేలకోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన బెజోస్ ఎందుకు ఈ కారును ఉపయోగిస్తారు అని ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు.. ఇది చాలామంది డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని నవ్వుతూ సమాధానమిచ్చారు.

మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)

ఖరీదైన కార్లను ఉపయోగించడం కంటే సరసమైన కార్లను వినియోగించడానికి ఇష్టపడే మరో బిలినీయర్ ఫేస్‌బుక్ ఫౌండర్ మరియు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒకరు. కారు విషయంలో మాత్రమే కాకుండా ఈయన దుస్తుల విషయంలో కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. రూ. 81వేలకోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన మార్క్ గ్యారేజిలో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ ఈయనకు నచ్చిన కారు మాత్రం బ్లాక్ అకురా టీఎస్ఎక్స్. ఈ మోడల్ భారతీయ మార్కెట్లో జాజ్ పేరుతో విక్రయిస్తున్నారు.

అకురా కారు మాత్రమే కాకుండా మార్క్ జుకర్‌బర్గ్ గ్యారేజిలోని మరో సరసరమైన కారు పగని హుయ్రా. ఓ సందర్భంలో అకురా కారును ఎందుకు ఉపయోగిస్తున్నారు అని మార్క్‌ను ప్రశ్నించినప్పుడు.. ఇది చాలా సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఆడంబరం లేని అనుభూతిని ఇస్తుందని ఆయన వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే వీరికి ఖరీదైన వాహనాల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్లను ఉపయోగించడమే ఇష్టమని అర్థమవుతోంది.

ఆలిస్ వాల్టన్ (Alice Walton)

లక్షల కోట్లకు అధినేత్రి వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె ‘ఆలిస్ వాల్టన్’ కూడా లగ్జరీ కార్ల కంటే సరసమైన కార్లను ఉపయోగించడానికి ఇష్టపడతారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఒకరైన ఈమె చాలా పొదుపుగా ఖర్చు చేస్తారని చాలామంది చెబుతాను. ఈమె వాడే కారు 2006 ‘ఫోర్డ్ ఎఫ్-150 కింగ్ రాంచ్’.

ఆలిస్ వాల్టన్ ఈ కారును ఎక్కువగా ఉపయోగించడానికి కారణం సెంటిమెంట్ అని తెలుస్తోంది. ఆమె తండ్రి 1979 ఫోర్డ్ ఎఫ్-150 ఉపయోగించేవారు. ఈ కారణంగా ఆలిస్ కూడా ఎఫ్-150 కార్లతో కొంత ఎమోషనల్ టచ్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇది ఎక్కువ సురక్షితమైనదని భావించడం కూడా మరో కారణమని చెబుతారు. 1993లో అద్దెకు తీసుకున్న జీప్ కారు కంట్రోల్ తప్పినప్పుడు కారులు దెబ్బ తగిలింది. దీంతో ఇతర కార్ల కంటే కూడా ఫోర్డ్ ఎఫ్-150 చాలా సురక్షితమైనదని భావించి తరచుగా ఈ కారునే ఉపయోగించడానికి ఇష్టపడుతోందని తెలుస్తోంది.

వారెన్ బఫెట్ (Warren Buffett)

ప్రముఖ అమెరికన్ వ్యాపార దిగ్గజం మరియు ప్రపంచ ధనవంతులలో ఒకరు వారెన్ బఫెట్ కూడా సరసమైన లేదా తక్కువ ధర కలిగిన కారును ఉపయోగించడానికి ఇష్టపడతారు. బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మెన్ మరియు సీఈఓ అయిన ఈయన 2006 కాడిలాక్ డీటీఎస్ కారును వినియోగిస్తున్నారు. ఆ తరువాత ఆ కారు ఇబ్బందిగా ఉందని తన కుమార్తె ఒప్పించడంతో 2014 కాడిలాక్ ఎక్స్టీఎస్ కారును కొనుగోలు చేశారు.

వేలకోట్లు సంపద ఉన్నప్పటికీ కొత్త కారును ఎందుకు కొనుగోలు చేయరు అనే ప్రశ్నకు బఫెట్.. నేను సంవత్సరానికి 3500 మైళ్ళు మాత్రమే డ్రైవ్ చేస్తాను. కాబట్టి కొత్త కారు కొనుగోలు చేయను అని చెప్పారు. అంతే కాకుండా 1958లో కొనుగోలు చేసిన ఇంట్లోనే ఈయన నివాసముంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు, ఎక్కడ లాభాలు వస్తాయో బాగా తెలిసిన ఈయన వాల్ స్ట్రీట్‌లో కోట్ల డబ్బు సంపాదించారు. ఎంతోమందికి ఆర్ధిక విషయాలకు సంబందించిన లేదా జీవితంలో ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ఎదగాలి అనే చాలా విషయాలను గురించి చెబుతూ ఉంటారు.

స్టీవ్ బాల్మెర్ (Steve Ballmer)

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ మరియు లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ యజమాని స్టీవ్ బాల్మెర్ కూడా లగ్జరీ కార్లను డ్రైవ్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఈయన ఫోర్డ్ కార్లను ఉపయోగిస్తారు. 2000 నుంచి 2014 వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా పనిచేసిన ఈయన చాలామంది బిలినీయర్ల మాదిరిగానే సరసమైన కార్లను ఉపయోగిస్తున్నారు.

లారీ ఫేజ్ మరియు సెర్గీ బ్రిన్ (Larry Page & Sergey Brin)

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఫౌండర్స్ లారీ ఫేజ్ మరియు సెర్గీ బ్రిన్ ఇద్దరూ కూడా కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో చెప్పుకోదగ్గ వారు. వేళా కోట్ల సంపదకు వార్సాకులైన వీరు ఎక్కువ డబ్బు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. ఈ కారణంగానే లారీ ఫేజ్ టయోటా ప్రియస్ కారును, సెర్గీ బ్రిన్ సరసమైన హైబ్రిడ్ కారును ఉపయోగిస్తారు.

Don’t Miss: 2024 క్లాసిక్ 350 వచ్చేసింది.. ప్రత్యర్థుల పని అయిపోయినట్టే!

డస్టిన్ మోస్కోవిట్జ్ (Dustin Moskovitz)

ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన డస్టిన్ మోస్కోవిట్జ్ కూడా చెప్పుకోదగ్గ ధనవంతుడు. ఫేస్‌బుక్‌లో 2.34 శాతం వాటా కలిగి, 25 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్న ఈయన ఫోక్స్‌వ్యాగన్ ఆర్32 కారును ఉపయోగించడానికి ఆసక్తి చూపుతారు. వేలకోట్ల డబ్బు ఉన్నప్పటికీ.. కార్ల విషయంలో మాత్రమే కాకుండా సాధారణ జీవితాన్ని గడపడానికే డస్టిన్ ఎక్కువ ఆసక్తి చూపుతారు.

2024 క్లాసిక్ 350 వచ్చేసింది.. ప్రత్యర్థుల పని అయిపోయినట్టే!

0

New Royal Enfield Classic 350 Unveiled: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చైన్నై బేస్డ్ టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) ఎట్టకేలకు తన 2024 క్లాసిక్ 350 (2024 Classic 350) బైక్ ఆవిష్కరించింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంది.

లాంచ్ డేట్ & డెలివరీలు (Launch Date and Delivery)

2009లో కంపెనీ ప్రారంభించిన క్లాసిక్ 350 బైక్ 2021లో చివరి అప్డేట్ పొందింది. కాగా ఇప్పుడు ఆధునిక హంగులను పొందింది. దీంతో ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఇతర బైకుల కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ ధరలను కంపెనీ సెప్టెంబర్ 1న అధికారికంగా వెల్లడించనుంది. డెలివరీలు కూడా ఆ సమయంలోనే ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్ (Design)

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేవని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది కొత్త బైక్ కాబట్టి సూక్షమైన కాస్మొటిక్ అప్డేట్స్ పొందిందని గమనించవచ్చు. బ్రాండ్ లోగో ఫ్యూయెల్ ట్యాంక్ మీద చూడవచ్చు. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటివి పొందుతుంది. మొత్తం మీద ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉందని స్పష్టమవుతోంది.

ఫీచర్స్ (Features)

2024 క్లాసిక్ 350 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎమ్ఐడీ స్క్రీన్, అనలాగ్ క్లస్టర్ వంటి వాటితో పాటు గేర్ పొజిషన్ ఇండికేటర్, యూఎస్బీ ఛార్జర్ వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ట్రిప్పర్ నావిగేషన్ అనేది టాప్ వేరియంట్లలో మాత్రమే ఉంటాయి. బేస్ వేరియంట్లలో ఇది ఆప్షనల్‌గా ఉంటుంది.

కలర్ ఆప్షన్స్ (Colour Options)

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మొత్తం 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఆరు కొత్త కలర్స్ (ఎమరాల్డ్, జోధ్‌పూర్ బ్లూ,మద్రాస్ రెడ్, మెడలియన్ బ్రౌన్, కమాండో సాండ్ మరియు స్టెల్త్) కాగా.. మిగిలిన ఐదు ఇప్పటికే అందుబాటులో ఉన్న కలర్స్. ఈ కొత్త కలర్ అన్నీ కూడా మునుపటి కలర్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ గ్యాస్ ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. కాగా డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ప్రామాణికంగా లభిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ యొక్క సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

ఇంజిన్ (Engine Details)

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ జే-ప్లాట్‌ఫామ్ ఆధారంగానే రూపొందించబడి ఉంది. కాబట్టి ఇప్పటికే సాధారణ క్లాసిక్ 350 బైకులోని అదే ఇంజిన్ పొందుతుంది. ఇందులోని 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6100 rpm వద్ద 20.2 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 27 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

అంచనా ధర (Expected Price)

మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ బైక్ కంటే కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మార్కెట్లో స్టాండర్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.24 లక్షలు. కాబట్టి 2024 క్లాసిక్ 350 ధర దీనికంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ధరలు అధికారికంగా సెప్టెంబర్ 1న వెల్లడవుతాయి.

Don’t Miss: భారత్‌లో అందుబాటులో ఉన్న రాయల్ బండ్లు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో స్టైల్

ప్రత్యర్థులు (Rivals)

ఆధునిక కాలంలో మార్కెట్లో లాంచ్ అయ్యే బైకుల సంఖ్య ఎక్కువవుతోంది. కొత్తగా లాంచ్ అయ్యే ఏ బైక్ అయినా తప్పకుండా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 2024 క్లాసిక్ 350 బైక్ ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న హోండా హైనెస్ 350, హోండా సీబీ 350 మరియు జావా 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ బైక్ దేశీయ విఫణిలో అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.