34.4 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 3

ఈ రోజు రాశిఫలాలు: 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

0

Today Horoscope 2025 March 6th Thursday: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గుణ మాసం, శిశిర ఋతువు, గురువారం (6/03/2025). రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6: గంటల నుంచి 7:30 వరకు. వర్జ్యం రాత్రి 9:01 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:02 వరకు.

మేషం

ఈ రాశివారికి శుభయోగం నడుస్తోంది. ఆర్ధిక పురోగతి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు.. ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహకందని మార్పులు జరగవచ్చు. ముఖ్యమైన పనులు కూడా సజావుగా సాగవు. సన్నిహితులతో వివాదాలు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. చేసేపనిలో భారం పెరుగుతుంది. పనికి తగ్గ గుర్తింపు లభించదు. దైవ చింతన అవసరం.

మిథునం

ఈ రాశి వారు చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో మాటపట్టింపులు. మానసికంగా బాధపడుతుంటారు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కొంత వ్యతిరేఖత. వృత్తి వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం. తొందరపడి నోరు జారకూడదు.

కర్కాటకం

నూతనోత్సాహంతో ముందుకుసాగుతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభయోగం.. శ్రమ ఫలిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో.. సమయం గడుపుతారు.

సింహం

వృధా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుకు తగ్గ డబ్బు సమకూరదు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. దైవ చింతన అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి తప్పా.. ఫలితం శూన్యం. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకును కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా. ఇంటా బయటా ఆందోళన.

కన్య

ఉద్యోగులకు అనుకూల వాతావరణం. స్థిరాస్తి క్రయ, విక్రయాలు లాభాలను పెంచుతాయి. మొండిబాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారులకు శుభయోగం.. మెరుగైన లాభాలను పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచింది. రాజకీయ సభలకు, సమావేశాలకు హాజరవుతారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంది.

తుల

చేపట్టిన పనులు.. కొంత కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మాత్రమే కాకుండా.. ఉద్యోగాలలో కూడా కొంత ప్రతికూల వాతావరణం. స్థిరాస్తి సంబంధిత వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల చేసేటప్పుడు అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

వృశ్చికం

ఈ రాశివారు ఈ రోజు చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంతా బయట అనుకూల వాతావరణం. ఉద్యోగులకు పదోన్నతులు ఉన్నాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

ధనుస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడమే కాకుండా.. లాభాలను పొందుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. మిత్రులతో కాలం గడుపుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం.

మకరం

ఈ రాశివారు తొందరపడి మాట్లాడవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు సైతం ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి.

కుంభం

కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులకు తగ్గ, ఆదాయం సమకూరదు. ఉద్యోగులకు స్థానచలనం ఉంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణాల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రం ఫలితాలను ఇస్తాయి. దైవ దర్శనం శుభాలను కలిగిస్తుంది.

మీనం

అన్ని రంగాల వారికి శుభయోగం. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వాహన కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి కాలం నడుస్తోంది.

Also Read: ఎండాకాలంలో అందమైన ముఖం కోసం.. అద్భుతమైన టిప్స్: మొటిమలు సైతం మాయం!

గుర్తుంచుకోండి: రాశిఫలాలు అనేవి కేవలం గ్రహాల ఆధారంగా చేసుకుని నిర్ణయించేవి. కాబట్టి చెప్పినవన్నీ జరుగుతాయని ఖచ్చితంగా నిర్దారించలేము. ఎందుకంటే గ్రహాల కదలికలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ నిమిషం ఏమి జరుగుతుందనేది భగవంతుడి ఆధీనం మాత్రమే. రాశిఫలాలు అనేవి కేవలం ఓ అవహగాన కోసం మాత్రమే అని పాఠకులు గుర్తుంచుకోవాలి.

పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం: ఆ పదవికి నాగబాబు పేరు ఖరారు

0

Janasena Finalised Nagababu as MLA Quota MLC Candidate: జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో జనసేనకు 21 ఎంఎల్ఏ సీట్లను కేటాయించారు. అయితే పార్టీ అధినేత ‘పవన్ కళ్యాణ్’ అభ్యర్థన మేరకు ‘నాగబాబు’ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి.. నాగబాబు వార్తల్లో వినిపిస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. అవన్నీ అబద్దమని తేలిపోయింది. కానీ ఇప్పుడు నాగబాబును ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.

నిజానికి ప్రస్తుతం ఉన్న ఎంఎల్సీలు ఐదుమంది టీడీపీ అభ్యర్థులే. అందులో ఈ సారి జనసేనకు ఒకటి కేటాయించారు. దానికి నాగబాబు పేరును ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి ఎంతోమంది సీనియర్ టీడీపీ నాయకులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి లోకేష్‌ను, సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

టీడీపీ ఇంకా తమ నలుగురు ఎంఎల్సీ అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. అయితే ఇప్పుడు యనమల రామకృష్ణుడు, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తిల పదవీకాలం ఈ నెల 28తో ముగుస్తుంది. వీరి స్థానంలో కొత్తవారు రానున్నారు. ఎవరు వస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

జనసేన పార్టీ అధికారిక ప్రకటన

ఇటీవలే గ్రాడ్యుయేట్స్, పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో.. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ అభ్యర్థుల నామినేషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగానే.. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎంఎల్సీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వంలో భాగంగా.. కొణిదెల నాగబాబు పేరును, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న నాగబాబు.. ఎంఎల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు ఇప్పటికే సమాచారం అందించారు. నామినేషన్ వేయడానికి కావలసిన పాత్రలను సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు.. జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు.

కొణిదెల నాగబాబు

సినీ నటుడు, ప్రొడ్యూసర్ అయిన నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు సినిమాల్లో అరుదుగా కనిపించి.. ఆ తరువాత ప్రొడ్యూసర్ అయ్యారు. ఆ తరువాత కాలంలో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు జడ్జ్(నాయనిర్ణేత)గా వ్యవహరించారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తరువాత, కొన్ని రోజులు ‘గల్లీ బాయ్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.

Also Read: మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత, తమ్ముడికి అండగా నిలబడి.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఏ పదవీ ఆశించకుండా.. వయసులో పెద్దవాడైన తమ్ముడి కోసం ఎంఎల్ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకున్నారు. ఇప్పుడు ఆయన్నే ఎంఎల్సీగా పోటీ చేయమని పార్టీ అధినేత కోరారు. దీనిపైన నాగబాబు ఎలా స్పందిస్తారు?.. ఆ తరువాత జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా? అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. మొత్తానికి నాగబాబును త్వరలోనే ఎంఎల్సీగా చూడబోతున్నారు. ఇది మెగా అభిమానవులకు ఓ మంచి శుభవార్త.

ఎండాకాలంలో అందమైన ముఖం కోసం.. అద్భుతమైన టిప్స్: మొటిమలు సైతం మాయం!

0

Simple and Natural Tips For Get Rid Of Pimple: ఎప్పుడూ యువతను (అమ్మాయిలు, అబ్బాయిలు) వేదించే సమస్య మొటిమలే. ఈ ఎండాకాలమైతే.. సమస్య వర్ణనాతీతం అవుతుంది. అందంగా కానించాల్సిన మొహం మీద ఎర్రని మొటిమలు మనకు ఇబ్బందిని కలిగిస్తుంటే.. చూసేవారికి కూడా కొంత వెగటు కలిగిస్తాయి. కొంతమంది మొటిమలను పోగొట్టుకోవడానికి అనేక క్రీములు, టాబ్లెట్స్ వాడేస్తుంటారు. వీటివల్ల సమస్య తీరకపోగా.. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తుంటాయి. అలంటి ఇబ్బందులకు చెక్ పెట్టడానికి.. ఇంట్లో దొరికే వస్తువులతోనే, మొటిమలను ఎలా మాయం చేయొచ్చో ఈ కథనంలో చూసేద్దాం..

టమాటోతో ఇలా

నిజానికి టమాటో వంట రుచిని పెంచడానికే కాదు, ముఖాన్ని కాంతివంతం చేయడంలో కూడా.. ఉపయోగపడుతుంది. టమాటో గుజ్జులో.. నిమ్మ రసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మొటిమల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. ముఖం మరింత కాంతివంతంగా మారిపోతుంది. రోజూ చేస్తూ ఉంటే తేడా మీకే కనిపిస్తుంది. టమాటోలో ఉండే కూలింగ్ మరియు యాస్ట్రింజెంట్ గుణాలు మొటిమలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఆలివ్ ఆయిల్

మొటిమలను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ఔషధంగా పనిచేస్తుంది. ఈ నూనెతో ప్రతి రోజూ ఉదయం, రాత్రి మర్దన చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. చర్మ కణాలు కూడా చాలా ఆరోగ్యాంగా ఉంటాయి. కాబట్టి మొటిమల సమస్య దూరమవుతుంది. రోజూ మర్దన చేస్తూ ఉంటే.. మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా మాయమవుతాయి.

నిమ్మ రసం & వేపాకు

చర్మ రక్షణలో వేపాకుది ప్రత్యేకమైన పాత్ర ఉంది. హిందువులు శక్తి రూపంగా భావించే వేపలో ఔషధ గుణాలు కోకొల్లలుగా ఉంటాయి. కాబట్టి మొటిమలను మాయం చేసే శక్తి వేపాకుకు ఉంది. వేపాకును మెత్తని పేస్ట్ మాదిరిగా చేసుకుని అందులో కొంచెం నిమ్మ రసం, కొంచెం పసుపు కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుని.. ఓ 20 నిముషాలు బాగా ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే ఫలితం మీకే కనిపిస్తుంది.

శనగపిండి

వంటకాలు చేసుకోవడానికే కాదు.. శనగపిండి శరీరాన్ని కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. శనగపిండిలో కొంచెం చందనం పొడి కలుపుకుని.. అందులో పాలు లేదా నీళ్లు వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత 10 నుంచి 20 నిముషాలు బాగా ఆరనివ్వాలి. ఆరిన తరువాత నీటితో కడుక్కోవాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా శనగపిండి అప్లై చేస్తూ ఉంటే.. మొటిమలు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు పోతాయి.

Also Read: దేవర భామ ‘జాన్వీ కపూర్’ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు

పుదీనా

మనం రోజూ చూసే పుదీనాలో కూడా ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి. ఇవి మొటిమలను పోగొట్టడంలో పాత్ర పోషిస్తాయి. పుదీనా ఆకులను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో కీరదోస రసం, కొంచెం తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని 15 నుంచి 20 నిముషాలు ఆరనిచ్చిన తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు మాయమవుతాయి.

గమనిక: మొటిమలతో ఇబ్బందిపడేవారికి ఉపశమనం కలిగించడానికి, మేము ఆరోగ్య నిపుణులు, కొన్ని అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని కథనం రూపంలో అందించాము. మొటిమలు ఈ కారణం చేత వస్తాయో ఖచ్చితంగా నిర్దారించలేము. కాబట్టి మొటిమల నివారణకు.. ఉత్తమ చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ఈ రాశి వారికి ఆర్ధిక ఇబ్బందులు తప్పవు!

0

Daily Horoscope in Telugu 2025 March 5th: శ్రీ క్రోధి నామ సంవత్సరం, బుధవారం (మార్చి 05, 2025). రాహుకాలం.. మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 8:03 నుంచి 9:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12.34 వరకు. సూర్యోదయం ఉదయం 6:20, సూర్యాస్తమయం సాయంత్రం 6:03.

మేషం

ఈ రాసి వారికి శుభయోగం నడుస్తోంది. నిరుద్యోగులకు శుభం, ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో సంతానానికి సంబంధించిన శుభకార్యాలు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూర ప్రాంత దైవ దర్శన యోగం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది.

వృషభం

ఋణ బాధలు తప్పవు, ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపించవు.

మిథునం

మానిసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు. కుటుంబంలో చికాకులు. ఉద్యోగాలలో ఇతరుల నుంచి కొంత విమర్శలు. చేపట్టిన పనులు వేగంగా ముందుకు సాగవు. దూరప్రయాణాలు వాయిదా. దైవ దర్శనం మనశ్శాంతిని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

కర్కాటకం

విలువైన వస్తు వాహనాల కొనుగోలు. ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారాల్లో లాభాలు. సంఘంలో మర్యాద పెరుగుతుంది. ఆర్ధిక బాధలు తొలగుతాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.

సింహం

సంఘంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకును కలిగిస్తుంది. ఆప్తులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభించదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యలు కొంత తగ్గుతాయి.

కన్య

స్థిరాస్తి క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. పదోన్నతులు పొందే అవకాశం. సన్నిహితులతో మాటపట్టింపులు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. దైవ కార్యక్రమాలకు సంబంధించి సేవ చేస్తారు. రాజకీయ సభలకు హాజరవుతారు.

తుల

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టినపనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఉద్యోగులు ప్రతికూల వాతావరణం ఎదుర్కోవాల్సి ఉంది. వృత్తి వ్యాపారాలు అనుకున్న విధంగా ఉండవు. విద్యార్థులకు శుభయోగం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఋణబాధలు తగ్గుతాయి.

వృశ్చికం

ఇంటా, బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్ధిక ఇబ్బందులు.. తొలగుతాయి. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. దైవ దర్శనం మరింత శుభం కలిగిస్తుంది.

ధనుస్సు

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగులకు పదోన్నతులు, అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనుకున్నవన్నీ సజావుగా ముందుకు సాగుతాయి.

మకరం

తొందరపాటు నిర్ణయాలు ప్రమాదంలో పడేస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల ప్రవర్తన కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో మాటపట్టింపులు రావొచ్చు. అలోచించి మాట్లాడాలి.

కుంభం

కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఆదాయానికి మించిన ఖర్చులున్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలున్నాయి. ఋణబాధలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉండవు.

మీనం

విద్యార్థులకు శుభయోగం, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని రంగాలవారికి అద్భుతమైన యోగం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు, సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Also Read: మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

గుర్తుంచుకోండి: రాశి ఫలాలు అనేవి కేవలం గ్రహాల స్థితిని ఆధారంగా చేసుకుని నిర్ణయించేవి. ఇందులో చెప్పినవన్నీ జరుగుతాయని కానీ, అందరికీ జరుగుతాయని కానీ ఖచ్చితంగా చెప్పలేము. ఇవన్నీ కేవలం సూచన ప్రాయం మాత్రమే. కాబట్టి ఏదో జరిగిపోతుంది అనే భయాలను వీడి, మీ మీద నమ్మకంతో ముందుకు సాగండి. నీవు నమ్మిన దైవం తప్పక సాయపడుతుంది.

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు: విద్యార్థులకు కవిత సందేశమిదే..

0

MLC Kavitha Tweet For Telangana Inter Students: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరీక్షల సమయం వచ్చేసింది. రేపటి నుంచి (2025 మార్చి 5) తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తును పగడ్బందీగా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎంఎల్సీ ‘కవిత’ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎంఎల్సీ కవిత తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో.. విద్యార్థులను ఉద్దేశించి, కష్టంతో కాకుండా ఇష్టంతో.. ఆత్మ విశ్వాసంతో ఎలాంటి ఒత్తిడికి తావివ్వకుండా.. పారీక్షలు రాసి, మంది ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:45 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలి. అనుకోని సంఘటన వల్ల ఆలస్యమైతే 9:00 గంటల వరకు వచ్చినా.. పరీక్ష రాయడానికి అనుమతివ్వనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి ‘కృష్ణ ఆదిత్య’ వెల్లడించారు. అయితే ఇప్పటికే అందించిన హాల్‌టికెట్లపై ప్రింట్ చేసినట్లు.. ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామని ఉంది. కానీ విద్యార్థులందరూ.. తప్పకుండా పరీక్షకు హాజరు కావాలనే ఉద్దేశ్యంతో.. 9:00 లోపు వచ్చినా అనుమతిస్తామని చెబుతున్నారు. అయితే విద్యార్థులందరూ.. తప్పకుండా ముందుగా రావడానికే ప్రయత్నించాలి. ఆలస్యంగా వస్తే.. టెన్షన్ పడి చదివింది మర్చిపోవడం, లేదా పరీక్ష సరిగ్గా రాయకపోవడం వంటివి జరుగుతాయి.

పరీక్షల సమయం

మార్చి 5 బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రేపు (మార్చి 5) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి, ఆ తరువాత రోజు (మార్చి 6) నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. మార్చి 25 నాటికి పరీక్షలు పూర్తవుతాయి. ఫలితాలు ఏప్రిల్ మూడోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మార్గదర్శకాలు

పరీక్ష రాసే విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా తమతోపాటు తీసుకెళ్లాలి. హాల్ టికెట్లలోనే పరీక్ష కేంద్రం, రిపోర్టింగ్ టైమ్, పరీక్షలకు సంబంధించిన ఇతర సమాచారం మరియు మార్గదర్శకాలు అన్నీ కూడా ఉంటాయి. ఈ ఏడాది 9.96 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు.

Also Read: మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

2024లో మొత్తం 9.81 లక్షల మంది పరీక్ష రాస్తే.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. 64.19 శాతం సెకండ్ ఇయర్ విద్యార్థులు పాసయ్యారు. అంతకు ముందు ఏడాది 9.48 లక్షలమంది పరీక్ష రాస్తే.. అందులో పాసైన మొదటి సంవత్సరం విద్యార్థులు 61.68 శాతం కాగా.. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 67.16 శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది ఎంతమంది పాసయ్యారు అనేదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

ఈ రాశివారికి అన్నింటా శుభమే.. ఆకస్మిక ధనలాభం

0

Daily Horoscope in Telugu 2025 March 4th: మనిషి జీవితం రాశులు, నక్షత్రాలు గమనం వల్ల అనేక మార్పులకు లోనవుతుంది ఖగోళ శాస్త్రం చెబుతోంది. దీనికి ఖచ్చితమైన ఆధారాలు తక్కువే.. కానీ మనిషి నమ్మకం మాత్రం ఎక్కువ. దీంతో చాలామంది ప్రతిరోజూ తమ రాశి ఎలా ఉందని చూస్తుంటారు. ఈ కథనంలో నేటి (2025 మార్చి 04) రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం..

మేషం (Aries)

వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. నిరుద్యోగులు.. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. బంధువులు, ఆప్తులతో విభేదాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నవగ్రహ ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం.

వృషభం (Taurus)

మానసిక చికాకులు ఉన్నాయి. మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు కొంత ప్రతికూల పరిస్థితి. చేస్తున్న పనిలో ఆశించిన ఫలితాలు కనిపించవు. కష్టానికి తగిన ఫలితం లభించదు. బంధువులతో స్థిరాస్తి తగాదాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ‘ఓం నమఃశివాయ’ పంచాక్షరి మంత్రోచ్చారణ వల్ల కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.

మిథునం (Gemini)

శ్రమ తప్పా ఫలితం కనిపించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులు. విష్ణు నామ మంత్రోచ్చారణ శుభం కలిగిస్తుంది

కర్కాటకం (Cancer)

నూతన వ్యవహారాలకు తగిన సమయం. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఒక వ్యవహారంలో అధికారుల నుంచి ముఖ్యమైన సమాచారం అందనుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విందు, వినోదాలకు ఆహ్వానం లభిస్తుంది. హనుమాన్ చాలీసా పాటించడం వల్ల శత్రు భయం పోతుంది.

సింహం (Leo)

ఈ రాసి వారికి శుభయోగం నడుస్తోంది. చేపట్టిన పనులలో మెరుగైన లాభాలు. ఉద్యోగులకు.. ప్రమోషన్స్. ముఖ్యమైన వ్యవహారాలు కొంత మందకొడిగానే ఉంటాయి. వ్యాపారులు లాభాలను గడిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో.. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నమో భగవతే వాసుదేవాయ మంత్రం మనశ్శాంతిని ఇస్తుంది.

కన్య (Virgo)

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు శుభయోగం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బంధువులు, స్నేహితులతో వివాదాలు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చెప్పటిన కొన్ని పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు వృధా అవుతాయి. నమో నారాయణాయ మంత్రోచ్చారణ శుభాలను చేకూరుస్తుంది.

తుల (Libra)

ఉద్యోగులకు.. అధికారుల నుంచి ఒత్తిడి. చేపట్టిన పనులకు అంతరాయం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆలోచన అవసరం. ఏ మాత్రం తొందరపాటు పనికిరాదు. చిన్న నాటి మిత్రుల కలయిక. బంధువులతో చిన్న పాటి వివాదాలు. విద్యార్థులు శ్రమ ఫలిస్తుంది. గో పూజ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది.

వృశ్చికం (Scorpio)

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా, బయట సంతోషం. ఆత్మీయుల నుంచి ఆహ్వానం. ఉద్యోగులకు ప్రమోషన్స్. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి. వాహన కొనుగోలుకు మంచి సమయం. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి. నవగ్రహారాధన మంచిది.

ధనుస్సు (Sagittarius)

ఉద్యోగులకు.. అధికారులతో కొన్ని చిన్నపాటి సమస్యలు. ఆర్ధిక పరిస్థితి నిరాశగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి విభేదాలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదం. శివారాధన మంచిని చేకూరుస్తుంది.

మకరం (Capricorn)

శుభయోగం నడుస్తోంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు. దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకు పదోన్నతులున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్న నాటి మిత్రులను కలుస్తారు. సూర్య నారాయణ మంత్రం శుభం కలిగిస్తుంది.

కుంభం (Aquarius)

పనులలో ప్రతికూల ప్రభావాలు, కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆర్ధిక ఇబ్బందులు, ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. ఉద్యోగుల ఓపిగ్గా ఉండాల్సిన సమయం. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. మహా లక్ష్మి మంత్రం ఆర్ధిక కష్టాల నుంచి బయటపడేస్తుంది.

Also Read: మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

మీనం (Pisces)

ఇంటా, బయట శుభ సూచకం. చేపట్టిన పనులలో పురోగతి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. దైవారాధన మంచిది.

మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు

0

Mega DSC Notification Soon in AP: మెగా డిఎస్సీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్‘ (Nara Lokesh) శుభవార్త చెప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. ఎంఎల్ఏల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 16,347 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇప్పటికే పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులు మరింత గట్టిగా ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఎందుకంటే పోటీ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

మార్చి నెలలో డిఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి.. ప్రభుత్వం సర్వత్రా సిద్దమవుతున్నట్లు సమాచారం. మొత్తం 16,347 పోస్టులలో.. 6371 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 7725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు, 52 ప్రిన్సిపాల్ పోస్టులు మరియు 132 పీఈటీ పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు భర్తీ చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే.. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. కానీ నోటిఫికేషన్ జారీకి సంబంధించిన తేదీ వంటివి ప్రకటించలేదు. బహుశా ఈ నెలలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు పండుగే అని చెప్పాలి.

మెగా డిఎస్సీని ప్రకటించి.. వచ్చే ఏడాది నాటికి పోస్టింగ్ వంటివి కూడా ఇవ్వనున్నట్లు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడు నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి వ్యాఖ్యానించారు.

ఇతర కార్యక్రమాలు

డిఎస్సీ నోటిఫికేషన్ గురించి మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణానికి రూ. 3,000 కోట్లు అవసమని మంత్రి లోకేష్ తెలిపారు. ‘మన బడి – మన భవిష్యత్’ కార్యక్రమంలో భాగంగా.. దశలవారీగా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో సమయంలో.. స్టార్ రేటింగ్‌ల ఆధారంగా పాఠశాల సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రణాళికలను చేపట్టనున్నారు. పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించారు.

Also Read: మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..

రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడానికి.. ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించింది. దీనికి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అని పేరుపెట్టారు. ఈ చొరవతో భాగంగా విద్యార్థులు మరకద్రవ్యాలకు (డ్రగ్స్) దూరంగా ఉండటానికి.. ప్రతి పాఠశాలలోనూ ఈగల్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు.

ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయడానికి.. మరోవైపు పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మెగా డిఎస్సీతో పాటు.. ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా జారీచేసే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు.. ఏ నోటిఫికేషన్ జారీ చేస్తుందనే విషయం మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా.. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా పరీక్ష రాయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. కాబట్టి యుద్దానికి సిద్దమైన సైనికుడిగా అభ్యర్థి సిద్ధమవ్వాలి.

ఈ నెలలో (మార్చి) మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే..

0

Upcoming Cars and SUV Launches in 2025 March: 2025 ప్రారంభం నుంచి మార్కెట్లో కొత్త కార్లు లేదా అప్డేటెడ్ కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మూడో నెల కూడా ప్రారంభమైపోయింది. మార్చి 2025లో దేశీయ విఫణిలో లాంచ్ కానున్న కొత్త కార్లను గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ (Volvo XC90 Facelift)

స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో.. మార్చి 4న తన ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేయనుంది. 2016లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, ఆ తరువాత కాలంలో అనేక అప్డేట్స్ పొందింది. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఈ కొత్త కారు చూడటానికి కొంత.. స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గమనించవచ్చు.

కొత్త వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ కారులో.. మోడిఫైడ్ గ్రిల్, సన్నని హెడ్‌లైట్స్, రిఫ్రెష్ చేయబడిన గ్రిల్, టెయిల్ ల్యాంప్, కొత్త అల్లాయ్ వీల్స్ అన్నీ కూడా ఇందులో చూడవచ్చు. కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువే అని తెలుస్తోంది. ఇది బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మరియు ఆడి క్యూ7 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

వోల్వో ఎక్స్‌సీ90 ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 11.2 ఇంచెస్ గూగుల్ బేస్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం.. ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లను పొందుతోంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా.. 250 హార్స్ పవర్, 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ (Mercedes Maybach SL 680 Monogram Series)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో సరికొత్త.. ‘మేబ్యాచ్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్’ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనిని కంపెనీ మార్చి 17న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ కారును కంపెనీ గత ఏడాది.. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి తయారవుతోంది.

మేబ్యాచ్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందుతుందని తెలుస్తోంది. నిలువుగా ఉండే స్లాట్‌లు, మల్టీ స్పోక్ వీల్స్‌తో కూడిన కోట్ గ్రిల్ వంటివి ఇందులో కనిపిస్తాయి. ఈ కారు ధరలను కంపెనీ ప్రకటించలేదు, కానీ ఇది ఎస్ఎల్ 55 రోడ్‌స్టర్ (రూ. 2.35 కోట్లు) కంటే కొంత ఎక్కువ ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో నప్పా లెదర్ సీట్లు, వైట్ డాష్‌బోర్డ్, శాటిన్ సిల్వర్ కలర్ స్టీరింగ్ వీల్ చూడవచ్చు. అంతే కాకుండా ఎస్ఎల్ రోడ్‌స్టర్ కంటే అద్భుతమైన ఎగ్జాస్ట్ సిస్టం ఈ కారు పొందుతుంది. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 585 హార్స్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ కారు 4.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

మారుతి సుజుకి ఈ విటారా (Maruti Suzuki e Vitara)

కంపెనీ తన మొట్ట మొదటి ఈ విటారా ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని ఈ నెలలోనే (2025 మార్చి) విడుదల చేస్తుందని సమాచారం. అయితే డేట్, టైమ్ వంటి విషయాలను సంస్థ వెల్లడించలేదు. ఇది కంపనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది చూడటానికి కొంత ఈవీఎక్స్ మాదిరిగా ఉంటుంది. అయితే ఇందులో పెద్ద ఎల్ఈడీ హెడ్‌లైట్స్, చుట్టూ చంకీ క్లాడింగ్, 18 ఇంచెస్ వీల్స్ వంటి వాటితో పాటు వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి ఈ విటారా.. ప్లోటింగ్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.1 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫిక్స్‌డ్ పనోరమిక్ సన్‌రూఫ్, 10 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మొదలైనవి ఉన్నాయి.

Also Read: కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్.. మునుపటి కంటే మరింత కొత్తగా: రేటెంతో తెలుసా?

సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు భద్రతను అందిస్తాయి.

మారుతి ఈ విటారా.. రెండు ఎల్ఎఫ్పీ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి 49 కిలోవాట్ బ్యాటరీ మరియు 61 కిలోవాట్ బ్యాటరీ. టార్క్ అవుట్‌పుట్ రెండింటికీ.. 192.5 ఎన్ఎమ్ వద్ద ఒకేలా ఉంటాయి. కానీ చిన్న బ్యాటరీ 143 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ ప్యాక్ 173 హార్స్ పవర్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ 500 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధరలు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ మరియు మహీంద్రా బీఈ 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

అందరికీ ఇష్టమైన కారు.. ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులతో: రేటెంతంటే?

0

2025 Maruti Alto K10 Launched: భారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన కారు, దశాబ్దాల చరిత్ర కలిగిన బ్రాండ్ మారుతి సుజుకి యొక్క ఆల్టో. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న సరసమైన కార్లలో ఇది కూడా ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు ‘మారుతి ఆల్టో కే10’ (Maruti Alto K10) కారుని ఆరు ఎయిర్‌బ్యాగులతో తీసుకొచ్చింది. కాబట్టి దీని ధర ఎంత? అప్డేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.

ధరలు

ఆరు ఎయిర్‌బ్యాగులు కలిగిన మారుతి ఆల్టో కే10 ధరలు.. స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 16000 ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఈ కారు ప్రారంభ ధర రూ. 4.23 లక్షలు (ఎక్స్ షోరూమ్), ధరల పెరుగుదలకు ముందు.. ఈ కారు ధర రూ. 4.09 లక్షలు. స్టాండర్డ్ వేరియంట్ ధరలు మాత్రమే కాకుండా.. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ మరియు వీఎక్స్ఐ ప్లస్ ధరలు అన్నీ కూడా పెరిగాయి.

మారుతి సెలెరియో మరియు బ్రెజ్జాలను కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అప్డేట్ చేసిన తరువాత.. ఆల్టో కే10 కారులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ధరలను కూడా ఈ సందర్భంగానే ప్రవేశపెట్టింది. కాబట్టి ఆల్టో కే10 ఎంట్రీ లెవెల్ మోడల్ ధరలు రూ. 14000, మిగిలిన వేరియంట్ల ధరలు రూ. 6000, రూ. 10000, రూ. 16000 పెరిగాయి.

డిజైన్

మారుతి సుజుకి ఆల్టో కే10 డిజైన్ మునుపటి మాదిరిగానే.. సాధారణంగా, ఆకర్షణీయంగా ఉంది. డిజైన్ మరియు ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ మరియు సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి డిజైన్ అప్డేట్స్ ఎవరూ ఆశించాల్సిన అవసరం లేదు.

ఫీచర్స్

డిజైన్ మాదిరిగానే.. ఫీచర్లలో కూడా ఎటువంటి అప్డేట్స్ లేదనే తెలుస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్ మాత్రం కాకుండా.. చెప్పుకోదగ్గ కొత్త ఫీచర్స్ కూడా లేదు. అదే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టం, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్స్

కంపెనీ ఇప్పుడు మారుతి ఆల్టో కే10 కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు.. రియర్ పార్కింగ్ సెన్సార్లు, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్స్, లగేజ్ రిటెక్షన్ క్రాస్‌బార్లు మొదలైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

2000 సంవత్సరంలో భారతదేశంలో బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ వచ్చినప్పటి నుండి మారుతి సుజుకి ఆల్టో 46 లక్షలకు పైగా అమ్ముడైంది. ఆల్టో కె10 కొనుగోలుదారులలో 74 శాతం మంది తొలిసారి కొనుగోలు చేస్తున్నవారేనని కంపెనీ సీనియర్ మార్కెటింగ్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ అన్నారు.

ఇంజిన్ డీటెయిల్స్

అప్డేటెడ్ మారుతి సుజుకి ఆల్టో కే10 కారులో ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 1.0 లీటర్ త్రీ సిలిండర్ కే10 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 Bhp పవర్, 89 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది 56 Bhp పవర్, 82 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది. ఇది కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

మారుతి ఆల్టో సేల్స్

ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఇండియన్ మార్కెట్లో.. మారుతి సుజుకి యొక్క ఆల్టో కార్లకు బలే డిమాండ్ ఉంది. ఈ కారు గతంలో మారుతి 800 పేరుతో పరిచయమైంది. ఆ తరువాత కాలక్రమంలో అనేక అప్డేట్స్ పొందుతూ.. ఇప్పుడు ‘ఆల్టో కే10’గా అమ్మకానికి ఉంది. మొత్తం మీద ఈ కారును 46 లక్షల కంటే ఎక్కువమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..

తక్కువ ధర, ధరకు తగిన ఫీచర్స్ కలిగిన మారుతి ఆల్టో కే10.. సేఫ్టీలో వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన అప్డేటెడ్ ఆల్టో కే10.. కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. కాబట్టి ఇది సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంటుంది. దీంతో ఇది గొప్ప అమ్మకాలను పొందే అవకాశం కూడా ఉందని సమాచారం. అయితే రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది. దాని ప్రత్యర్థులను అధిగమించగలదా?.. ప్రజలను ఆకర్శించగలదా? అనే విషయా తెలియల్సి ఉంది.

మారుతి ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కార్ల విభాగం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సమయంలో.. మారుతి సుజుకి తన గ్రాండ్ విటారాను, ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయనుంది. ఇది బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది తప్పకుండా దేశీయ విఫణిలో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇది ఒక సింగిల్ ఛార్జితో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..

0

Next Kumbh Mela Date and Place Details: భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. 2025 జనవరి 13న ప్రారంభమలైన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా మహా శివరాత్రి పర్వ దినాన (ఫిబ్రవరి 26) నిర్విఘ్నంగా పూర్తయింది. సుమారు 60 కోట్లమంది ప్రజలు త్రివేణి సంగమంలో (గంగా, యమునా, సరస్వతి) పవిత్ర స్నానాలు చేసి తరించారు. ఈ కుంభమేళాకు ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

మొత్తానికి 45 రోజులు జరిగిన కుంభమేళా.. మళ్ళీ ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు ప్రశ్న. మళ్ళీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా రావడానికి చాలా సమయం ఉన్నప్పటికీ.. ఆ మధ్యలోనే హరిద్వార్ కుంభమేళా, నాసిక్ కుంభమేళా మరియు ఉజ్జయినీ కుంభమేళా వంటివి జరగనున్నాయి. ఇవి ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే..

నాసిక్ కుంభమేళా (Nashik Kumbh Mela)

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా పూర్తయినప్పటికీ.. 2027లో నాసిక్ కుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళా కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం.. 2027 జులై 17న మొదలైన, ఆగష్టు 17న ముగుస్తుందని తెలుస్తోంది. 2015 నిరవహించబడిన ఈ కుంభమేళా 12 ఏళ్లకు మళ్ళీ జరగనుంచి. గోదావరి నది ఒడ్డున ఉన్న నాసిక్ నుంచి సుమారు 38 కిమీ దూరంలో ఉన్న త్రయంబకేశ్వరంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు.

హరిద్వార్ కుంభమేళా (Haridwar Kumbh Mela)

2027లోనే హరిద్వార్ కుంభమేళా కూడా ప్రారభం కానుంది. అయితే ఇది ఎప్పుడు నిర్వహించబడుతుందనే తేదీ అధికారికంగా వెలువడలేదు. కానీ హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు.. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు.. ఈ కుంభమేళా జరుగుతుందని సమాచారం. ఇక్కడ ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ద కుంభమేళా, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కాబట్టి అర్ధ కుంభమేళా 2021లోనే జరిగింది. ఇక 2027లో కుంభమేళా జరగనుంది.

ఉజ్జయినీ కుంభమేళా (Ujjain Kumbh Mela)

ఇతర కుంభమేళాల మాదిరిగా కాకుండా.. ఉజ్జయినిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహించబడుతుంది. అయితే 2028లో ఈ కుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళా కార్యక్రమానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం ఏకంగా 3300 హెక్టార్ల విస్తీరణంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ కుంభమేళాకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు రానున్నట్లు సమాచారం.

ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా (Prayagraj Ardh Kumbh Mela)

ఇటీవల మహా కుంభమేళా జరిగిన ప్రయాగ్‌రాజ్‌లోనే 2030న అర్థ కుంభమేళా జరగనుంది. హరిద్వార్ మాదిరిగానే.. కుంభమేళా మరియు అర్ధ కుంభమేళా రెండూ ప్రయాగ్‌రాజ్‌లోనూ జరుగుతాయి. అయితే మహా కుంభమేళాకు ఉన్నంత ప్రాధాన్యత ఈ కుంభమేళాలకు ఉండకపోవచ్చు కానీ.. ప్రజలు మాత్రం భారీగా తరలి వస్తారు.

మహా కుంభమేళా 2025 విశేషాలు (Maha Kumbh Mela 2025)

2025 జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26కు సమాప్తమైంది. ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న మహా కుంభమేళాకు సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు.. పారిశ్రామికవేత్తలు సైతం విచ్చేశారు. పుణ్యస్నానాలు చేసి తరించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా నరేంద్ర మోదీ, ముకేశ్ అంబానీ ఫ్యామిలీ నిలిచింది.

Also Read: మహా కుంభమేళా 2025: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 ఘటనలు ఇవే..

గంగా, యమునా, సరస్వతి సంగమమైన త్రివేణి సంగమంలో ఎంతోమంది పుణ్య స్నానాలు చేసి తరించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం కూడా సహకరించింది. 45 రోజులు జరిగిన మహా కుంభమేళా కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయం ఏకంగా రూ. 3 లక్షల కోట్లు అని తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

మహా కుంభమేళా కార్యక్రమంలో ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఇందులో తేనెకళ్ల సుందరి మోనాలిసా, ఐఐటీ బాబా, గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో వేప పుల్లలు విక్రయిస్తూ ఫేమస్ అయిన వ్యక్తి.. చాయ్ వాలే బాబా ఐఏఎస్ కోచింగ్ స్టీవ్ జాబ్స్ సతీమణి మొదలైనవారు ఉన్నారు. మొత్తానికి మహా కుంభమేళా పూర్తయింది. ఇక వచ్చే కుంభమేళా కోసం అందరూ వేయికళ్లతో ఎదురు చూడాల్సిందే!.