30.2 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 39

ఇలాంటి డిస్కౌంట్స్ కదా ప్రజలు కోరుకునేది!.. ఈ కారుపై రూ.1.35 లక్షల బెనిఫీట్

0

Tata Motors June 2024 Discounts: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) 2024 జూన్ నెలలో కొన్ని ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ జాబితాలో టాటా టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ మరియు పంచ్ ఈవీ ఉన్నాయి. ఈ నెలలో ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది కొనుగోలు చేసిన డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ వంటివి లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)

టియాగో ఈవీ కొనుగోలు మీద కంపెనీ ఈ నెలలో రూ. 95000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. లాంగ్ రేంజ్ ఈవీ వేరియంట్ కొనుగోలుపైన రూ. 75000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. గత నెలలో కంపెనీ ఇదే కారు మీద రూ. 52000 నుంచి రూ. 60000 వరకు తగ్గింపులను అందించింది.

దేశీయ మార్కెట్లో టాటా టియాగో ఈవీ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.89 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు భారతీయ విఫణిలో అత్యుత్తమ అమ్మకాలు పొందిన వాహనాల జాబితాలో ఒకటిగా ఉంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా కూడా అద్భుతంగా ఉంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)

భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న ‘టాటా నెక్సాన్ ఈవీ’ కొనుగోలు మీద కస్టమర్ ఏకంగా రూ. 1.35 లక్షల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. 2024 నెక్సాన్ ఈవీ క్రియేటివ్ ప్లస్ ఎంఆర్ వేరియంట్ మీద రూ. 85000 వరకు తగ్గింపు లభిస్తుంది.

దేశీయ విఫణిలో నెక్సాన్ ఈవీ ధరలు రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికి కూడా ఈ కారు అత్యుత్తమ అమ్మకాలను పొందుతూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారును కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంత ఆసక్తి చూపుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.

నెక్సాన్ ఈవీ మిడ్ రేంజ్ వెర్షన్ 30 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. కాగా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ మోడల్ 40.5 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో 465 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో.. వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా కొంత తగ్గే అవకాశం ఉంది.

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)

భారతదేశంలో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన మైక్రో SUV టాటా పంచ్.. ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు కొనుగోలు మీద కస్టమర్ కేవలం రూ. 10000 విలువైన ప్రయోజనాలను మాత్రమే పొందగలడు. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 25 కిలోవాట్ యూనిట్, మరొకటి 35 కిలోవాట్ యూనిట్. ఇవి రెండూ 315 కిమీ (25 kWh) మరియు 421 కిమీ (35 kWh) రేంజ్ అందిస్తాయి.

అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన టాటా పంచ్ ఈవీ ధరలు దేశీయ విఫణిలో రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ కూడా మార్కెట్లో కూడా మంచి అమ్మకాలు పొందుతున్న ఉత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Don’t Miss: నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!

గమనిక: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల మీద అందిస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత బహుశా అందుబాటులో ఉండకపోవచ్చు. అంతే కాకుండా డిస్కౌంట్స్ అనేవి ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కాబట్టి కస్టమర్లు కచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.

నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!

0

Nitin Gadkari Unique Car Collection: నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి అఖండ విజయంతో గెలుపొందిన ‘నితిన్ గడ్కరి’ (Nitin Gadkari) ఈ రోజు (జూన్ 9)న కేంద్ర మంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. భారతదేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో.. ఆటోమోటివ్ రంగాన్ని ప్రగతి మార్గంలో పయనించడానికి దోహదపడిన గడ్కరీ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారు? వాటి ప్రత్యేకతలు ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. రండి.

1994 హిందూస్తాన్ అంబాసిడర్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉపయోగించే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు 1994 హిందూస్తాన్ అంబాసిడర్. ఒకప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టించిన ఈ కారును ఇప్పటికి కూడా కొంతమంది వాహన ప్రియులు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ వాహనంగా ప్రసిద్ధి చెందిన అంబాసిడర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలువబడిన ఈ కారును చాలా సంవత్సరాలుగా గడ్కరీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

1994 హిందూస్తాన్ అంబాసిడర్ అందరికి నచ్చే డిజైన్ కలిగి, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును ఉపయోగించడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు.

2016 హోండా సీఆర్-వీ

నితిన్ గడ్కరీ అంబాసిడర్ కారు తరువాత ఉపయోగించిన కారు హోండా సీఆర్-వీ. తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా.. గడ్కరీ ఈ కారును ప్రస్తావించారు. ఈ కారు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ కారు 185 Bhp పవర్ ప్రొడ్యూస్ చేసే 2.4 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ పొందింది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మల్టి యాంగిల్ రియర్ వ్యూ కెమరా, హోండా సెన్సింగ్ సేఫ్టీ సూట్ వంటి ఇతర ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.

ఇసుజు డీ-మ్యాక్స్

అంబాసిడర్, హోండా సీఆర్-వీ కార్లను మాత్రమే కాకుండా ఇసుజు డీ-మ్యాక్స్ కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కారులో ఎప్పుడూ గడ్కరీ కనిపించలేదు. అయినప్పటికీ ఈ కారు తన గ్యారేజిలో ఉన్నట్లు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కారును ఎక్కువగా ఆఫ్-రోడింగ్ చేసేవారు కూడా ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు 1.9 లీటర్ మరియు 3.0 లీటర్ అనే రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. దీనిని చాలామంది కేవలం వ్యక్తిగత వినియోగానికి మాత్రమే కాకుండా.. వాణిజ్య పరమైన ఉపయోగానికి కూడా ఉపయోగిస్తారు.

టయోటా మిరాయ్

నితిన్ గడ్కరీ గ్యారేజిలోని ప్రత్యేకమైన కార్లలో టయోటా కంపెనీకి చెందిన ‘మిరాయ్’ ఒకటి. ఈ సెడాన్ దేశంలోనే మొట్ట మొదటి హైడ్రోజన్‌ బేస్డ్ మోడల్. గ్రీన్ ఎనర్జీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమే ఈ టయోటా మిరాయ్ కారు. దీనికి కంపెనీ టీఎన్జీఏ ప్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. దీనిని కంపెనీ 2021లో ప్రవేశపెట్టింది.

మిరాయ్ 4జేఎమ్ ఎలక్ట్రిక్ మోటారును శక్తిని ఇచ్చే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ సిస్టం కలిగి ఉంటుంది. ఇది 182 Bhp పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మిరాయ్ సెడాన్ ఒక ఫుల్ ట్యాంక్ హైడ్రోజన్‌తో ఏకంగా 647 కిమీ పరిధిని అందిస్తుంది. భవిష్యత్తులో ఈ కార్ల వినియోగం ఎక్కువగా జరగాలని.. దేశంలో మరింత మంది ఈ కారు ఉపయోగించాలని ఆశిస్తున్నారు.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్

హైడ్రోజన్ బేస్డ్ మిరాయ్ మాత్రమే కాకుండా నితిన్ గడ్కరీ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును కూడా ఉపయోగిస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను ప్రోత్సహించడానికి గడ్కరీకి కంపెనీ ఈ ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును అందించింది. ఈ హైబ్రిడ్ కారు 100 శాతం పెట్రోల్ లేదా 100 శాతం ఇథనాల్‌తో పనిచేయగలదు. పెట్రోల్ ఖర్చుకంటే ఇథనాల్ ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా కొంత పర్యావరణ హితం కూడా. ఖర్చులను తగ్గించుకోవడానికి మోడల్ కార్లు చాలా ఉపయోగపడతాయి.

Don’t Miss: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సెలబ్రిటీలు.. వీరే – ఇక్కడ చూడండి

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ చూడటానికి.. సాధారణ హైక్రాస్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో సరికొత్త టెక్నలజీని నిక్షిప్తం చేశారు. ఇలాంటి కారు ప్రస్తుతానికి కేవలం నితిన్ గడ్కరీ దగ్గర మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఇలాంటి కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సెలబ్రిటీలు.. వీరే – ఇక్కడ చూడండి

0

Celebrities Who Contested 2024 Lok Sabha Elections: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు కూడా వచ్చేసాయి. జరిగిన ఎన్నికల్లో కేవలం రాజకీయ అనుభవం ఉన్న ఉద్దండులు మాత్రమే కాకుండా.. పలువురు సినీ, టీవీ నేపథ్యమున్న ఎందరో.. ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో కొంత పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు.. మొదటి సారి అదృష్టాన్ని పరిక్షిచుకోవడానికి రంగంలోకి దిగినవారు కూడా ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు, వ్యాపారవేత్తలు కూడా ఎన్నికల్లో నిలబడి.. మేము సైతం అంటూ చురుగ్గా ప్రచారం చేశారు. ఈ కథనంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన సినీ నటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, వారి రాజకీయ ప్రస్థానం గురించి వివరంగా తెలుసుకుందాం..

ఎన్నికల్లో నిలబడిన సినీ ప్రముఖులు

కంగనా రనౌత్ – చిత్ర సీమలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన ‘కంగనా రనౌత్’ మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రధాని మోదీకి మద్దతుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలబడిన విక్రమాదిత్య సింగ్‌ ఓడిపోయారు.

అరుణ్ గోవిల్ – ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి టీవీ రాముడిగా ప్రజాదరణ పొందిన ‘అరుణ్ గోవిల్’ బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఓట్లను పొంది విజయం సాధించారు. ప్రత్యర్థులుగా ఇదే నియోజక వర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి దేవవ్రత్ త్యాగి, సమాజ్ వాదీ పార్టీ నుంచి నిలబడిన సునీత వర్మ ఓటమిని చవి చూడక తప్పలేదు.

రవి కిషన్ శుక్లా – రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పేరుతో బాగా ఫేమస్ అయిన నటుడు ‘రవి కిషన్’ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుచి పోటీ చేసి మరోసారి గెలుపు గుర్రాలను అధిరోహించారు. ఇప్పటికే ఈయన అక్కడ సిట్టింగ్ ఎంపీ కూడా. రవికిషన్ 585834 ఓట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులైన కాజల్ నిషాద్ (సమాజ్ వాదీ పార్టీ), జావేద్ అష్రాఫ్ (బహుజన్ సమాజ్ పార్టీ) మొదలైనవారు ఓటమిపాలయ్యారు.

రాధిక శరత్ కుమార్ – తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ‘రాధిక’ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున త‌మిళ‌నాడులోని విరుధ్‌న‌గ‌ర్ బరిలో నిలిచి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత మాణిక్యం టాగూర్ చేతిలో ఓడిపోయారు. ఈమెకు దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకర్ మద్దతు కూడా ఇచ్చారు.

నవనీత్ కౌర్ – గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం పొందిన సినీ నటి ‘నవనీత్ కౌర్’ మళ్ళీ రెండోసారి అదే నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. వాక్చాతుర్యం పట్ల సీనియర్ సభ్యులను సైతం అబ్బుర పరిచిన ఈమె.. 506540 ఓట్లను సాధించింది. కానీ తన ప్రత్యర్థి బల్వంత్ బస్వంత్ వాంఖడే చేతిలో ఓడిపోయింది.

రచనా బెనర్జీ – నటి ‘రచనా బెనర్జీ’ 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. ప‌శ్చిమ‌ బెంగాల్‌లోని హుగ్లీ నియోజక వర్గంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అఖండ విజయం సాధించారు. ఇదే నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న లాకెట్ ఛటర్జీ సుమారు లక్ష ఓట్ల తేడాతో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

హేమ మాలిని – సినీనటి హేమమాలిని మరోసారి ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సొంతం చేసుకున్నారు. 2014లో ఎంపీగా గెలుపొందిన ఈమె ఈసారి సుమారు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచింది. సమీప ప్రత్యర్థులు కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ నేతలు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

స్మృతి ఇరానీ – కేంద్ర మంత్రి, మాజీ నటి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ ఈ సీటును గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ చేతిలో ఓడిపోయారు.

పవన్‌సింగ్‌ – ప్రముఖ నటుడు, సిట్టింగ్ ఎంపీ శత్రుజ్ఞ సిన్హా.. రెండోసారి పశ్చిమ బెంగాల్‌లోని అస‌న్‌సోల్ నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఈ నియోజక వర్గంలో మొదటిసారి భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌సింగ్‌ బీజేపీ తరపున పోటీ చేశారు.

మనోజ్ తివారీ – నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ మూడోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. పార్టీ ఏడు మంది సిట్టింగ్ ఎంపీలలో ఆరుమందిని మార్చినా.. మనోజ్ తివారీని మాత్రం కొనసాగించింది. ఈయన ఇప్పటికే 2019, 2014లో గెలిచిన మనోజ్ దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

దినేష్‌లాల్ యాదవ్ – భోజ్‌పురి సూపర్ స్టార్ ‘దినేష్‌లాల్ యాదవ్’ ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. 2019లో అఖిలేష్ యాదవ్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఈయన 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ మీద గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ సమాజ్ వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ చేతిలో పరాజయం పాలయ్యారు.

Don’t Miss: రూ.23 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన పక్షి ఈక – ఎందుకింత స్పెషల్ తెలుసా?

విజయ్ వసంత్ – తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ నియోజక వర్గం నుంచి.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, తమిళ నటుడు ‘విజయ్ వసంత్’ పోటీ చేశారు. ఇక్కడ సీనియర్ అభ్యర్థి 2014లో బీజేపీ తరపున గెలిచిన రాధాకృష్ణన్ కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ వసంత్ 5.4 లక్షల కంటే ఎక్కువ ఓట్లను పొంది భారీ విజయం సొంతం చేసుకున్నారు.

వీరు మాత్రమే కాకుండా.. దీపక్ అధికారి (టీఎంసీ సిట్టింగ్ ఎంపీ), సురేష్ గోపి (కేరళ త్రిస్సూర్), మనోజ్ మిశ్రా (ఒడిశా బోలంగీర్ ), తంగర్ బచన్ (కడలూరు), కరంజీత్ అనుమోల్ (పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌) వంటి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్), వ్యాపారవేత్తలైన నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), పల్లవి డెంపో (గోవా సౌత్), ప్రవీణ్ ఖండేల్వాల్ (ఢిల్లీ చాందినీ చౌక్) వంటి వారు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు.

సంచలన ధర వద్ద లాంచ్ అయిన ‘టాటా ఆల్ట్రోజ్’ – అదరగొడుతున్న డిజైన్

0

Tata Altroz Racer Launched in India: ఏడాది కంటే ఎక్కువ రోజులు ఈ కారు కోసం వాహన ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు భారతీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ (Tata Motors) దేశీయ విఫణిలో సరికొత్త ‘ఆల్ట్రోజ్ రేషన్’ (Altroz Racer) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్

ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ రేసర్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి ఆర్1, ఆర్2 మరియు ఆర్3. వీటి ధరలు వారుగా రూ. 9.49 లక్షలు, రూ. 10.49 లక్షలు మరియు రూ. 10.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). కంపెనీ ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్ మరియు ప్యూర్ గ్రే కలర్స్. ఈ కొత్త కారు బ్లాక్ అవుట్ రూప్, బానెట్ మీద డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. హుడ్ మరియు రూప్ మీద వైట్ స్ట్రిప్, బ్లాక్ అవుట్ ఆల్ట్రోజ్ బ్యాడ్జింగ్, డార్క్ థీమ్ అల్లాయ్ వీల్స్, అక్కడక్కడా రేసర్ బ్యాడ్జ్‌లు దీనిని కొత్త కారు అని గుర్తించడానికి సహాయపడతాయి.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

మార్కెట్లో విడుదలైన కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ యొక్క ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇతర టాటా కార్లకంటే ప్రత్యేకంగా మరియు భిన్నంగా ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఉంటుంది. అంతే కాకుండా 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా ఆల్ట్రోజ్ రేసర్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్, సెగ్మెంట్ ఫస్ట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, ఏసీ వెంట్స్ చుట్టూ.. రెడ్ కలర్ హైలెట్స్, సెంటర్ కన్సోల్‌లోని గేర్ లివర్ మరియు కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో లెథెరెట్ అపోల్స్ట్రే మొదలైన లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్

కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ కంటే 10 హార్స్ పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్స్ & ప్రత్యర్థులు

అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన కొత్త టాటా ఆల్ట్రోజ్ టాటా యొక్క ఇతర మాదిరిగానే అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి స్టాండర్డ్‌గా లభిస్తాయి. అయితే ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

భారతదేశంలో లాంచ్ అయిన కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇప్పటికే మార్కెట్లో మంచి విక్రయాలు పొందుతున్న ఐ20 ఎన్ లైన్ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా అమ్మకాల పరంగా మారుతి ఫ్రాంక్స్ కారుకు కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: ఇవి కదా బెనిఫీట్స్ అంటే!.. హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్!

ఇండియన్ మార్కెట్లో టాటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కొత్త ఆల్ట్రోజ్ రేసర్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. ఈ కారు గత ఏడాది మొదటి సారి కనిపించినప్పుడే ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్శించింది. కాగా ఇప్పుడు అమ్మకాల పరంగా ఆకర్శించడంలో విజయం పొందుతుందా? ప్రత్యర్థులను తట్టుకుంటుందా? అనేది త్వరలోనే తెలుస్తుంది.

ఇవి కదా బెనిఫీట్స్ అంటే!.. హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్!

0

Up To Rs.70000 Discounts on Hyundai in This Month: భారతీయ మార్కెట్లో వాహన వినియోగం భారీగా పెరుగుతోంది. కొంతమంది ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు ఆఫర్స్ వచ్చినప్పుడు లేదా డిస్కౌంట్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తారు. అలాంటివారికి హ్యుందాయ్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద సంస్థ అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ ఏ కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది? ఈ డిస్కౌంట్స్ ఎప్పటి వరకు ఉంటాయి? ఇందులో ఎలాంటి బెనిఫీట్స్ ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ ఈ నెలలో తన ఆల్కజార్, గ్రాండ్ ఐ10 నియోస్, టక్సన్, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, ఐ20, ఆరా, వెర్నా మరియు ఎక్స్‌టర్ కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ బోనస్ మరియు స్క్రాపింగ్ బోనస్ వంటివి ఉంటాయి.

హ్యుందాయ్ అల్కాజార్

కంపెనీ ఈ నెలలో అల్కజార్ కొనుగోలు మీద కస్టమర్లకు రూ. 70000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫీట్స్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల కొనుగోలుపైన లభిస్తాయి. టాటా సఫారీ మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆల్కజార్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

ఆల్కజార్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ SUV సిక్స్ సీటర్ మరియు మరియు సెవెన్ సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న అల్కాజర్ ఇప్పటికి కూడా మంచి ఆదారాన్ పొందుతుంది. ఈ నెలలో అల్కాజార్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 70000 తగ్గింపు పొందవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

ఈ నెలలో గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపైన కొనుగోలుదారు రూ. 53000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ (రూ. 53000) CNG వేరియంట్ కొనుగోలుపైన మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ కలిగిన వేరియంట్ కొనుగోలుపైన రూ. 43000 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో పెట్రోల్ ఆటోమాటిక్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 33000 తగ్గింపు లభిస్తుంది.

గ్రాండ్ ఐ10 నియోస్ 83 హార్స్ పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే CNG ఆప్షన్లో కూడా లభిస్తుంది. దేశీయ విఫణిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి స్విఫ్ట్ మరియు టాటా టియాగో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

హ్యుందాయ్ టక్సన్

టక్సన్ కొనుగోలుపైన హ్యుందాయ్ ఇప్పుడు గరిష్టంగా రూ. 50000 తగ్గింపు అందిస్తోంది. ఈ డిస్కౌంట్ టక్సన్ డీజిల్ వేరియంట్ కొనుగోలుపైన మాత్రమే లభిస్తుంది. కాగా టక్సన్ పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25000 తగ్గింపు లభిస్తుంది. ఈ కారు 156 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 186 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతాయి. టక్సన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు జీప్ మెరిడియన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్

వెన్యూ మరియు వెన్యూ ఎన్ లైన్ కొనుగోలుపైన కంపెనీ గరిష్టంగా రూ. 50000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. వెన్యూ డ్యూయెల్ క్లచ్ వేరియంట్ మీద రూ. 45000 మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన వేరియంట్ మీద రూ. 40000 విలువైన బెనిఫీట్స్ లభిస్తాయి. అదే సమయంలో వెన్యూ ఎన్ లైన్ కొనుగోలు మీద రూ. 45000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నెలలో డీజిల్ వేరియంట్ కొనుగోలుపైన ఎటువంటి తగ్గింపులు లేదు.

హ్యుందాయ్ ఐ 20

2024 జూన్ నెలలో హ్యుందాయ్ ఐ20 కొనుగోలుపైన కస్టమర్లు రూ. 50000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఐ20 సీవీటీ వేరియంట్‌లపై రూ. 35000 మరియు మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 50000 తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ ఐ20 మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు మారుతి సుజుకి బాలెనొ, టాటా ఆల్ట్రోజ్ మరియు టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ ఆరా

ఈ నెలలో హ్యుందాయ్ ఆరా కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 48000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క CNG వేరియంట్ కొనుగోలుపైన రూ. 48000 తగ్గింపు మరియు పెట్రోల్ వేరియంట్స్ కొనుగోలుపైన రూ. 28000 తగ్గింపు పొందవచ్చు. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ సెడాన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి డిజైర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నా

వెర్నా కొనుగోలుపైన రూ. 40000 వరకు తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ వెర్నా యొక్క అన్ని వేరియంట్ల కొనుగోలు మీద ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నెలలో కొనుగోలు చేసిన వారికి మాత్రమే లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ కలిగిన 1.5 లీటర్ పెట్రోల్ (115 హార్స్ పవర్ మరియు 143 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్ మరియు 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ఆప్షన్ కలిగిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 హార్స్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్ పొందుతుంది. ఈ సెడాన్ మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మరియు హోండా సిటీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్

ఇక చివరగా హ్యుందాయ్ కంపెనీ ఈ నెలలో తన ఎక్స్‌టర్ కొనుగోలుపైన కేవలం రూ. 10000 తగ్గింపు అందిస్తుంది. ఇది పూర్తిగా క్యాష్ డిస్కౌంట్. ఈ ఆఫర్ ఈఎక్స్ మరియు ఈఎక్స్ (ఓ) ట్రిమ్ కొనుగోలుపైన లభించదు. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది టాటా పంచ్ మరియు సిట్రోయెన్ సీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: 73 కిమీ మైలేజ్ అందించే బైక్.. కేవలం రూ.82911 మాత్రమే..

గమనిక: హ్యుందాయ్ కంపెనీ అందించే ఈ డిస్కౌంట్స్ / బెనిఫీట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా డీలర్‌ వద్ద ఉన్న స్టాక్ మీద ఆధారపడి కూడా డిస్కౌంట్స్ ఉంటాయి. కాబట్టి కస్టమర్ హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి స్థానిక డీలర్‌ను సంప్రదించాలి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరి (జూన్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత బహుశా ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.

కేజీఎఫ్ సినిమాలో ఎన్ని కార్లు వాడారో తెలుసా? వాటి స్పెషాలిటీ ఇదే..

0

Do You Know About The Cars Seen in KGF Movie: 2018లో విడుదలైన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. రాకింగ్ స్టార్ యష్ (Yash) నటించిన ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. అతి తక్కువ కాలంలోనే వందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. బాహుబలి తరువాత అంతటి రికార్డును క్రియేట్ చేసింది.

నిజానికి కేజీఎఫ్ సినిమా చూసిన చాలామంది.. ఆ మూవీలో కనిపించే కార్లకు తప్పకుండా ఫిదా అయిపోయి ఉంటారు. సినిమా 2018లో విడుదలైనప్పటికీ.. అందులో ఉపయోగించనవన్నీ వింటేజ్ కార్లే. ఈ కారు చూడగానే కొత్తగా అనిపించడం మాత్రమే కాదు.. వాటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా ఏర్పడి ఉంటుంది. ఈ కథనంలో కేజీఎఫ్ సినిమాలో కనిపించిన కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.. రండి.

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి 1976 మస్టాంగ్ మ్యాక్ 1, 1969 ఎంజీ రోడ్‌స్టర్, 1969 ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్, 1977 మెర్సిడెస్ డబ్ల్యు-123 మరియు రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో కార్లు.

1976 మస్టాంగ్ మ్యాక్

నిజానికి ఫోర్డ్ కంపెనీ మస్టాంగ్ కార్లను ఉత్పత్తి చేస్తుందని తెలుసు. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశంలో తన ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అయితే ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎంతోమంది వాహన మనసుదోచిన ఘనత ఈ మస్టాంగ్ కార్ల సొంతం అనే చెప్పాలి. అయితే కేజీఎఫ్ సినిమాలో కనిపించిన ఫోర్డ్ మస్టాంగ్ కారు 1976 నాటి మ్యాక్ అని తెలుస్తోంది.

ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఇక్కడ కనిపిస్తున్న కారు మస్టాంగ్ మ్యాక్ మాదిరిగా అనిపించినప్పటికీ.. మస్టాంగ్ మ్యాక్ కాదు. ఎందుకంటే ఇది హిందూస్తాన్ మోటార్స్ కంపెనీకి చెందిన కాంటెస్సా అని తెలుస్తోంది. దీనిని సినిమా కోసం కస్టమైజ్ చేసుకున్నట్లు సమాచారం. ఇది ఛేజింగ్ వంటి సన్నీ వేషాల్లో కనిపిస్తుంది. ఇది చూడగానే ప్రేక్షకుల మనసులో ఇట్టే నిలిచిపోయింది.

1969 ఎంజీ రోడ్‌స్టర్

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన మరో కారు ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన రోడ్‌స్టర్ అని తెలుస్తోంది. ఎరుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారును ఉపయోగించారు. ఇది కూడా హార్డ్ టాప్ వెర్షన్ అని తెలుస్తోంది. ప్యాలెస్ నుంచి వెళ్లే సమయంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ కారును ఉపయోగించడం చూడవచ్చు.

భారతదేశంలో ప్రస్తుతం ఎంజీ మోటార్ కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే పాత కాలం నాటి మోడల్స్ ఇప్పుడు లేదు. వాటి స్థానంలో ఎంజీ హెక్టర్, ఎంజీ గ్లోస్టర్ మరియు ఎంజీ కామెట్ ఈవీ వంటి మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎంజీ మోటార్ కంపెనీ ఒకప్పటి నుంచి అధిక ప్రజాదరణ పొందుతున్నట్లు స్పష్టమవుతోంది.

1969 ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన మరో కారు 1969 ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్. ఇది చూడటానికి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఓమ్ని కారు మాదిరిగా ఉంది. అయితే ఫోక్స్‌వ్యాగన్ టీ2 క్యాంపర్.. ఓమ్ని కంటే చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ వ్యాన్ సినిమా సెకండాఫ్‌లో కనిపిస్తుంది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందిన ఈ కారు బ్లూ అండ్ వైట్ కలర్ పొందింది. ఈ కారు ఒకప్పటి పాత సినిమాల్లో కూడా విరివిగా ఉపయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మళ్ళీ కేజీఎఫ్ సినిమాలో దర్శనమిచ్చింది.

1977 మెర్సిడెస్ డబ్ల్యు-123

కేజీఎఫ్ సినిమాలో కనిపించిన మరో కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన డబ్ల్యు-123. సినిమాలో ఈ కారును హీరో యష్ ఉపయోగించడం చూడవచ్చు. ఒకప్పుడు భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ కారు.. ఇప్పటికి కూడా ఎంతోమందికి అభిమాన వాహనం కూడా. ఈ కారులో ఎక్కువ భాగం క్రోమ్ ఉండటం చూడవచ్చు.

Don’t Miss: కోట్లు కొల్లగొట్టిన సినిమాలో స్టార్‌ హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు.. ఎవరో తెలుసా?

రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో

ఒకప్పటి నుంచి రోల్స్ రాయిస్ కార్లకు మంచి డిమాండ్ ఉందని సినిమా చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఆధునిక కాలమో కూడా అత్యంత ఖరీదైన కార్లను తయారీలు చేస్తున్న కార్ల కంపెనీలలో రోల్స్ రాయిస్ కంపెనీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో అనేది అప్పట్లోనే అత్యంత ఖరీదైన కారు. ఇది 1965 నుంచి 1980 వరకు గొప్ప ఆదరణ పొందింది. కేజీఎఫ్ సినిమాలో ఈ కారును కూడా చూడవచ్చు. పైన పేర్కొన్న దాదాపు అన్ని కార్లు కేజీఎఫ్ 2 సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉందని సమాచారం.

తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన రాఘవ లారెన్స్ – ఫోటోలు

0

Raghava Lawrence Gift MG Hector To His Brother: ఆధునిక కాలంలో సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేయడం లేదా కావలసిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ ఇలాంటి ఘటనే తెరమీదకు వచ్చింది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు ‘రాఘవ లారెన్స్’ (Raghava Lawrence) తన తమ్ముడికి ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చాడు. రాఘవ గిఫ్ట్ ఇచ్చిన కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

రాఘవ లారెన్స్ గిఫ్ట్

నటుడు రాఘవ లారెన్స్ తన తమ్ముడు ‘ఎల్విన్’కు గిఫ్ట్ ఇచ్చిన కారు ‘ఎంజీ మోటార్’ కంపెనీకి చెందిన ‘హెక్టర్’ (Hector). దీనికి సంబంధించిన ఫోటోలను రాఘవ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో నా తమ్ముడి తొలి చిత్రం ‘బుల్లెట్’లో నటనకు ఫిదా అయ్యాను. అతని నటన నన్ను గర్వపడేలా చేసింది. అందుకే నా తమ్ముడికి కారును గిఫ్ట్ ఇస్తున్నాను. అతనికి మీ అందరి ఆశీస్సులు కావాలని పేర్కొన్నారు.

నిజానికి సినిమాల్లో మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు అనాధలకు.. ఎంతోమంది శరణార్థులకు రాఘవ తన వంతు సాయం చేస్తుంటారు. మంచి మనసున్న రాఘవ తన తమ్ముడికి మొదటి సారి ఓ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎల్విన్ నటించిన బులెట్ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఎంజీ హెక్టర్

ఇక ఎంజీ హెక్టర్ విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనా కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇప్పటికే అనేక కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలను పొందుతూ ఉంది. ఇందులో ఒకటి ఎంజీ హెక్టర్. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

రాఘవ లారెన్స్ గిఫ్ట్ ఇచ్చిన ఎంజీ హెక్టర్ నలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉండటం చూడవచ్చు. కారుతో రాఘవ, అయన తమ్ముడు ఎల్విన్ ఉండటం చూడవచ్చు. ఇందులో రాఘవ తన తమ్ముడికి ప్రేమతో ముద్దివ్వడం కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

భారతదేశంలో ఎంజీ హెక్టర్ ధర రూ. 20 నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంది. అయితే రాఘవ ఏ వేరియంట్ కొనుగోలు చేశారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది మార్కెట్లో మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఫాగ్‌లైట్, డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కారుని అద్భుతంగా కనిపించేలా చేస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్, USB సాకేట్ మొదలైనవన్నీ ఉన్నాయి. సీటింగ్ పొజిషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా ఇవి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఎంజీ హెక్టర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. కాబట్టి సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ఎక్కువ మంది సెలబ్రిటీలు కూడా ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దేశిస్తాయి.

Don’t Miss: కోట్లు కొల్లగొట్టిన సినిమాలో స్టార్‌ హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు.. ఎవరో తెలుసా?

కార్లను గిఫ్ట్‌గా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు!

నిజానికి గతంలో చాలామంది సెలబ్రిటీలు ఖరీదైన కార్లను వారి సన్నిహితులకు గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ తన ఫిట్‌నెస్ ట్రైనర్‌ లక్ష్మణ్ రెడ్డికి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. హీరో నితిన్ కూడా.. డైరెక్టర్ వెంకీ కుడుములకు రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. చలో సినిమా గొప్ప విజయం సాధించిన తరువాత హీరో నాగసౌర్య తల్లి.. అతనికి పోర్స్చే కారును గిఫ్ట్ ఇచ్చింది. హీరో మహేష్ బాబు బర్త్‌డేకు.. నమ్రత రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చింది. రామ్ చరణ్ కూడా తన తండ్రి చిరంజీవికి ల్యాండ్ క్రూయిజర్ కారును గిఫ్ట్ ఇచ్చారు.

కోట్లు కొల్లగొట్టిన సినిమాలో స్టార్‌ హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు.. ఎవరో తెలుసా?

0

Do You Remember The Boy Who Acted As Junior Yash in KGF: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కిన బ్లాక్ బ్లాస్టర్ సినిమా కేజీఎఫ్ లేదా కేజీఎఫ్ చాప్టర్ 1 గురించి అందరికి తెలుసు. పలు భాషల్లో రిలీజైన ఈ మూవీ ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించింది. యష్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా రాజమౌళి బాహుబలి తరువాత ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయగలిగింది. ఈ సినిమాలో యష్ చిన్నప్పటి పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్న ‘అన్మోల్ విజయ్ బత్కల్’ ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..

అన్మోల్ విజయ్ బత్కల్

జూనియర్ యష్ పాత్రలో కనిపించిన అన్మోల్.. సినిమాలో చిన్నప్పటి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తల్లిని పోగొట్టుకున్నాడు. విలన్స్ దగ్గర చేరి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్స్‌లో దెబ్బలు తిని ఎదుగుతాడు. అన్మోల్ పాత్ర కేజీఎఫ్ సినిమాలో చాలా కీలకమనే చెప్పాలి. ఇదే సినిమాలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీనిధి శెట్టి నటించింది. విలన్ పాత్రలో గరుడ రామ్ సంచనమే సృష్టించాడని చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక త్వరలోనే కేజీఎఫ్ 2 సినిమా తెరకెక్కనుంది.

ఇక జూనియర్ యష్ విషయానికి వస్తే.. ఇతని పూర్తి పేరు ‘అన్మోల్ విజయ్ బత్కల్’. ఇతనికి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని సమాచారం. నటన కంటే కూడా డ్యాన్స్ అంటే బాగా ఇష్టపడే అన్మోల్ దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పలు కన్నడ సినిమాల్లో కూడా యితడు నటించి.. ప్రేక్షలకు దగ్గరయ్యాడు. గతంలో ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. కేజీఎఫ్ సినిమా ఇతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే చదువు కోసం అన్మోల్ ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నట్లు సమాచారం.

సన్నివేశాల కోసం 12 నెలలు

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంతోమంది అభిమానుల మనసుదోచిన అన్మోల్ కఠినమైన వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతాడు. గతంలో దీనికి సంబంధించిన వీడియోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కేజీఎఫ్ సినిమాలో అన్మోల్ (జూనియర్ యష్) పాత్ర చిన్నదే అయినా.. అది సినిమాకు ఆత్మ అనే చెప్పాలి. జూనియర్ యష్ సన్నివేశాలను చిత్రీకరించడానికి 12 నెలలు పట్టిందని సమాచారం.

నిజానికి అన్మోల్ తన తొమ్మిదేళ్ల వయసు నుంచే.. డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఇక అన్మోల్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఫోటోలు చూస్తే.. ఇతడేనా మనం చూసిన జూనియర్ యష్ అని తప్పకుండా అనిపిస్తుంది. ప్రస్తుతం హీరో కటౌట్‌తో కనిపించే అన్మోల్ ఫొటోస్ చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇతని వయసు ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం.

అన్మోల్ డ్యాన్స్ రియాలిటీ షోలో డ్యాన్సింగ్ ఛాంపియన్ ట్రోఫీ కూడా అందుకున్నారు. ఇలా ఎంతోమంది చేత ప్రశంసించబడిన అన్మోల్ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. బహుశా యితడు కన్నడ చిత్ర సీమలోనే సినిమాల్లో నటించే అవకాశం ఉంది. తెలుగు సినిమాల్లో కనిపిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు

అన్మోల్ విజయ్ బత్కల్ నటించిన కేజీఎఫ్ సినిమా రిలీజైన మొదటి రోజే ఏకంగా రూ. 134 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే.. రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు మార్కును దాటేసింది. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలకానుంది. ఇందులో కూడా దిగ్గజ తారలైన రవీనా టాండన్, సంజయ్ దత్ మొదలైనవారు నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంటుంది.

Don’t Miss: 73 కిమీ మైలేజ్ అందించే బైక్.. కేవలం రూ.82911 మాత్రమే..

కేజీఎఫ్ సినిమా

పాపులర్ యాక్షన్ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమాకు విజయ్ కిరగందర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో యష్, శ్రీనిధి శెట్టి మాత్రమే కాకుండా.. అనంత్ నాగ్, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్, అర్చన జాయిస్, అర్చన జాయిస్ లక్ష్మణ్, అయ్యప్ప పీ శర్మ, హరీష్ రాయ్, దినేష్ మంగళూరు, బీ సురేష్, బీ ఎస్ అవినాష్, వినయ్ బిడప్ప, గోవింద గౌడ మరియు తారక్ పొన్నప్ప మొదలైనవారు నటిస్తున్నారు.

73 కిమీ మైలేజ్ అందించే బైక్.. కేవలం రూ.82911 మాత్రమే..

0

Hero Splendor Plus XTEC 2.0 Launched In India: భారతదేశంలో లక్షల విలువైన బైకులు విడుదలవుతున్న సమయంలో లక్ష రూపాయలకంటే తక్కువ ధరలో ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) ఓ అద్భుతమైన బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త బైక్ ధర ఎంత? డిజైన్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

ధర

దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన బైక్ ‘స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0’ (Splendor+ XTECH 2.0). దీని ధర రూ. 82911 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఎవర్‌గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బైకును లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది.

కలర్ ఆప్షన్స్

ఇండియన్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్.. మాట్ గ్రే అనే రంగులో మాత్రమే కాకుండా గ్లోస్ బ్లాక్ మరియు గ్లోస్ రెడ్ అనే డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో కూడా లభిస్తుంది. కాబట్టి ఈ బైకులో అక్కడక్కడా రెడ్ కలర్ గ్రాఫిక్స్ చూడవచ్చు. ఇది చూడటానికి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది తప్పకుండా వాహన వినియోదాగదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

డిజైన్

కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రివైజ్డ్ గ్రాఫిక్స్ వంటివి పొందుతుంది. సైడ్ హుక్స్, ట్యూబ్యులర్ గ్రాబ్ రైల్ మరియు చిన్న టెయిల్ ర్యాక్ వంటివి కూడా ఉన్నాయి. క్రోమ్‌తో ఫినిష్ చేయబడిన ఇంజిన్ క్రాష్ గార్డ్ కూడా ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద ఈ బైక్ డిజైన్ చాలా వరకు సింపుల్‌గా ఉండటం చూడవచ్చు. డిజైన్ పరంగా పెద్దగా అప్డేట్స్ లేదని తెలుస్తోంది.

ఫీచర్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ కన్సోల్ పొందుతుంది. దీని ద్వారా కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్ అలర్ట్ నోటిఫికెషన్స్ వంటివాటిని పొందవచ్చు. ఈ బైకులో USB ఛార్జర్ కూడా ఉంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ లేటెస్ట్ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, డ్యూయెల్ రియర్ స్ప్రింగ్ మరియు రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్

కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ ఎయిర్ కూల్డ్ 97.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఒక లీటరుకు 73 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ మైలేజ్ అందించడానికి కంపెనీ ఐ3ఎస్ స్టార్ట్ – స్టాప్ సిస్టం ఉపయోగపడుతుంది.

ప్రత్యర్థులు

లేటెస్ట్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 దాని స్టాండర్డ్ ఎక్స్‌టెక్ కంటే రూ. 3000 ఎక్కువ. ధరకు తగిన విధంగానే ఈ బైక్ కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న హోండా షైన్ 100 (రూ. 64900) మరియు బజాజ్ ప్లాటినా 100 (రూ. 67808) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: బ్రిటిష్ బ్రాండ్ కారుతో కనిపించిన ‘రిషబ్ పంత్’.. దీని రేటెంతో తెలిస్తే షాకవుతారు!

మంచి మైలేజ్ అందించే బైకుల కోసం ఎదురు చూస్తున్నవారికి హీరో మోటోకార్ప్ యొక్క కొత్త స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 ఉత్తమ ఎంపిక అవుతుంది. అయితే ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ మరియు డెలివరీలకు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. బహుశా ఈ బైక్ కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అధీకృత డీలర్షిప్ వద్ద బుక్ చేసుకోవచ్చని భావిస్తున్నాము.

బ్రిటిష్ బ్రాండ్ కారుతో కనిపించిన ‘రిషబ్ పంత్’.. దీని రేటెంతో తెలిస్తే షాకవుతారు!

0

Rishabh Pant With Land Rover Defender 110: ఇప్పటి వరకు సినీతారలు కొనుగోలు చేసిన ఖరీదైన కార్లను గురించి, వారు ఉపయోగించే కార్లను గురించి తెలుసుకున్నాం. అంతే కాకుండా వారు ఖరీదైన కార్లలో కనిపించిన సందర్భాలను గురించి, ఆ కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. ఇటీవల యంగ్ క్రికెటర్ ‘రిషబ్ పంత్’ ఓ కొత్త కారులో కనిపించారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110

క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110’ కారులో ముంబై విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో వైట్ కలర్ ల్యాండ్ రోవర్ కారులో వద్ద రిషబ్ ఉండటం చూడవచ్చు. ఆ తరువాత విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలో అభిమానికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం వంటివి చూడవచ్చు.

ఇక్కడ కనిపించే కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ 110. దీని ప్రారంభ ధర రూ. 97 లక్షల నుంచి రూ. 2.35 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ఫోటోలలో కనిపించే కారు ఏ ఇంజిన్ మోడల్ అనేది స్పష్టంగా వెల్లడికాలేదు.

సెలబ్రిటీలకు ఇష్టమైన కారు

భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 చెప్పుకోదగ్గ మోడల్. ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీనికి రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

మంచి డిజైన్ కలిగిం ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కారు 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు 12.3 ఫుల్లీ డిజిటర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ప్రీమియం స్పీకర్ సిస్టం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమెరా మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 SUV బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లెదర్ అపోల్స్ట్రే మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

వేరియంట్లు

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, 110 మరియు 130 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిఫెండర్ 90 అనేది మూడు డోర్స్ కలిగిన మోడల్. డిఫెండర్ 110 మరియు 130 మోడల్స్ రెండూ 5 డోర్స్ మోడల్స్. ఇవి రెండూ డిఫెండర్ 90 కంటే పరిమాణంలో కొంత పెద్దవిగా ఉంటాయి. ఈ మూడు వేరియంట్లు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటాయి.

కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనేది మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్లు. కంపెనీ 110 మరియు 90 మోడల్స్ కోసం 5.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా పరిచయం చేసింది. అన్ని ఇంజిన్లు స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. అంతే కాకుండా వాహనంలో లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్ అండ్ యాక్టివ్ రియర్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌తో పర్మినెంట్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది.

Don’t Miss: రూ.23 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన పక్షి ఈక – ఎందుకింత స్పెషల్ తెలుసా?

రిషబ్ పంత్ మాత్రమే కాకుండా.. ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా డిఫెండర్ 110లో కనిపించారు. అయితే క్రికెటర్లు సొంతంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లను కలిగి ఉన్నట్లు స్పష్టంగా తెలియదు. అయితే సునీల్ శెట్టి, అర్జున్ కపూర్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సంజయ్ దత్, అబితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, కరీనా కపూర్, సోనమ్ కపూర్, జిమ్మీ షీర్‌గిల్, నేహా కక్కర్ మరియు మమ్ముట్టి వంటి సినీతారలు ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్నారు.