33.2 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 40

రూ.23 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన పక్షి ఈక – ఎందుకింత స్పెషల్ తెలుసా?

0

Most Expensive Feather in The World: ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి ఏవి? అనే ప్రశ్న వస్తే.. బంగారం, వజ్రాలు లేదా బంగ్లాలు ఇతరత్రా సమాధానాలు వినిపిస్తుంటాయి. పక్షి ఈకలు ఖరీదైనవేనా.. అని అడిగితే? హా.. ఏముందిలే ఈకే కదా అదేం పెద్ద ధర ఉంటుందా.. ఎక్కడైనా దొరికేస్తుంది, అని చెబుతారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి తెలిస్తే.. మాత్రం ఖచ్చితంగా షాకవుతారు. ఎందుకంటే ఓ పక్షి ఈక లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఇంతకీ ఆ పక్షి ఏది? దాని ఈక ఎందుకు అంత రేటుకు అమ్ముడైందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

రూ.23 లక్షల కంటే ఎక్కువ

నివేదికల ప్రకారం.. వెబ్స్ ఆక్షన్ హౌస్ పేరుతో విక్రయాలను నిర్వహిస్తున్న వేలం సంస్థ, ‘హుయా’ (Huia) పక్షి ఈకను ఏకంగా 46521.50 న్యూజిలాండ్ డాలర్లకు విక్రయించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 23,66,374. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షి ఈకగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రారంభంలో ఇది 3000 డాలర్లకు విక్రయించబడే అవకాశం ఉందని భావించారు. కానీ చివరకు ఎవరూ ఊహించని విధంగా అమ్ముడై.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎందుకింత రేటు?

ప్రస్తుతం అరుదైన పక్షులలో లేదా అంతరించిపోయిన పక్షుల జాబితాలో ‘హుయా’ ఒకటి. ఈ పక్షి చివరి సారి 1907లో కనిపించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆ తరువాత దీని జాడ ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఈ పక్షి ఎక్కడైనా ఉందా? లేక పూర్తిగా అంతరించిపోయిందా అనే విషయాలు స్పష్టంగా వెల్లడి కాలేదు.

గడచిన 20, 30 సంవత్సరాల్లో ఈ హుయా పక్షి జాడ ఎక్కడా కనిపించలేదని మ్యూజియం ఆఫ్ నియోజిలాండ్ వెల్లడించింది. ఇది అరుదైన జాతికి చెందిన జీవి కాబట్టి.. దీని ఈకలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అంతే కాకుండా ఈ పక్షి ఈకలను చాలా అపురూపంగా చూస్తారని కొందరు చెబుతారు.

న్యూజిలాండ్ దేశానికీ చెందిన హుయా పక్షి.. వాటెల్ బర్ద్ కుటుంబానికి చెందిన ఓ చిన్న పక్షి అని నిపుణులు చెబుతున్నారు. గెంతుకుంటూ వెళ్లే సామర్థ్యం కలిగిన ఈ పక్షి తోకలోని ఈకల చివరి భాగం తెల్లగా ఉంటుంది. పక్షి మొత్తం ఒక రంగులో ఉంటే.. తోక చివరి భాగం మాత్రం తెల్లగా ఉండటం తీణి ప్రత్యేకత.

హుయా పక్షి ఈకను ఎక్కడ ఉపయోగించేవారు?

ప్రాచీన కాలంలో న్యూజిలాండ్ సాంస్కృతి ప్రకారం అపురూపమైన హుయా పక్షి ఈక ఓ ప్రాముఖ్యతను కలిగి ఉండేది. అప్పట్లో ఉన్న వస్తుమార్పిడి సమయంలోనే ఈ ఈకలను విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించేవారు. అంతే కాకుండా దీనిని స్నేహానికి గుర్తుగా ఇచ్చి పుచ్చుకునేవారు. ఎదుటివారి మీద గౌరవాన్ని ప్రదర్శించడానికి బహుమతులను ఇచ్చి పుచ్చుకునేవారు.

వేలంలో అమ్ముడుపోయిన ఈక విశేషాలు

న్యూజిలాండ్ వేలంలో అమ్ముడుపోయిన హుయా పక్షి ఈక చాలా అద్భుతంగా ఉందని వెబ్స్ ఆక్షన్ హౌస్‌లోని డెకరేటివ్ ఆర్ట్స్ హెడ్ ‘లేహ్ మోరిస్’ పేర్కొన్నారు. ఈ ఈకకు కీటకాల వల్ల కూడా ఎటువంటి హాని జరగలేదని కూడా పేర్కొన్నారు. ఈక ఇప్పటికి కూడా అదే మెరుపును కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఈకకు ఎలాంటి నష్టం జరగకుండా.. ఆల్ట్రావయొలెట్ కిరణాల నుంచి రక్షణ కల్పించడానికి ఆర్కైవల్ పేపర్ మీద ప్రేమ్ చేసినట్లు సమాచారం. దీని వల్ల ఆ ఈక సురక్షితంగా ఉంటుంది. వేలంలో ఈ ఈకను సొంతం చేసుకున్న వ్యక్తి కూడా దీనిని దేశం దాటించడానికి అనుమతి లేదు. ఈ ఈకను దేశం దాటించాలంటే.. ఖచితంగా ఆ దేశ సాంస్కృతిక వారసత్వ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే.

Don’t Miss: Country Code: భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..

ఈక ధర పెరగటానికి కారణం

పక్షి ఈక రూ. 26 లక్షల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవ్వడానికి ప్రధాన కారణం.. న్యూజిలాండ్ వాసుల అమితమైన ఆసక్తి అని తెలుస్తోంది. నిజానికి వేలం వేసే యాజమాన్యం కూడా ఇది ఇంత ధరలు అమ్ముడవుతుందని ఊహించలేదు. అయితే మొత్తానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈకగా రికార్డ్ బద్దలు కొట్టింది.

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఇవే బెస్ట్ కార్లు!

0

Top Most Affordable Electric Cars India: పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉంటాయని అందరికి తెలుసు. ఈ కారణంగానే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన మరియు ఉత్తమమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎంజీ కామెట్ ఈవీ

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ ‘ఎంజీ కామెట్ ఈవీ’. ఈ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.14 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ

రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.89 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య లభించే ఈ కారు ఎక్కువమంది ప్రజలకు నమ్మికయిన మోడల్. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారు ఒక సింగిల్ చార్జితో 250 కిమీ నుంచి 315 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది ఎంచుకునే బ్యాటరీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా టియాగో ఈవీ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ భద్రతకు పెద్దపీట వేస్తాయి.

సిట్రోయెన్ ఈసీ3

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ‘సిట్రోయెన్’ భారతీయ మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ‘ఈసీ3’ కూడా ఒకటి. దీని ధర రూ. 11.61 లక్షల నుంచి రూ. 13.35 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి.. ఒక సింగిల్ చార్జితో ఏకంగా 320 కిమీ రేంజ్ అందిస్తుంది.

టాటా టిగోర్ ఈవీ

రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య లభించే టాటా మోటార్స్ యొక్క టిగోర్ ఈవీ మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది కొంచెం పొయెద్ద బ్యాటరీని కలిగి ఒక సింగిల్ చార్జితో ఏకంగా 315 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు మంచి రేంజ్ కూడా అందించడంతో ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే టాటా టిగోర్ ఈవీ అమ్మకాలు పెరుగుతున్నాయి.

టాటా పంచ్ ఈవీ

సేఫ్టీలో ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందిన టాటా మోటార్స్ యొక్క ఈవీ ‘టాటా పంచ్’ మన జాబితాలో తప్పకుండా చెప్పుకోవాల్సిన కారు. ఎందుకంటే పిట్టా కొంచెమైనా కూత ఘనం అన్నట్లు.. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన రేంజ్ అందిస్తుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 315 కిమీ నుంచి 421 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది ఎంచుకునే బ్యాటరీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు ప్రధాన కారణం

నిజానికి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఖర్చులను తగ్గించడానికి అనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన అనేక నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు, పెట్రోల్ మరియు డీజిల్ కార్ల కంటే కూడా చాలా తక్కువని తెలుస్తోంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు జీరో ఎమిషన్ కాబట్టి పర్యావరణ హితంగా కూడా ఉంటాయి.

Don’t Miss: హృతిక్ రోషన్ తండ్రి కొన్న కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..

పర్యావరణ పరిరక్షణ కోసం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనీ కేంద్రం ఫేమ్ కింద సబ్సిడీలు కూడా అందించింది. ఈ కారణాల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య బాగా పెరిగింది. దీంతో కొత్త కంపెనీలు కూడా దేశీయ విఫణిలో కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వాహన వినియోగదారులను ఆకరిస్తున్నాయి.

కల్కి 2898 ఏడీ: ‘బుజ్జి’ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు

0

Interesting Facts About Kalki 2898 AD Bujji:  ఇప్పటి వరకు సాధారణ బైకులు చూసుంటారు, కార్లను చూసుంటారు. అంతెందుకు విచ్చల విడిగా మాడిఫైడ్ చేసిన మోడిఫైడ్ వాహనాలను కూడా చూసి ఉంటారు. అయితే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కనిపించే ఓ వాహనం.. న భూతో న భవిష్యతి మాదిరిగా ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వెహికల్ పేరు ఏంటి? ఇది ఎక్కడ తయారైంది? దీని ప్రత్యేకలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాకు సంబందించి తాజాగా ఓ కొత్త టీజర్ లాంచ్ అయింది. ఇందులో ప్రభాస్ ఓ ప్రత్యేకమైన వాహనం డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీని పేరు ‘బుజ్జి’ (Bujji). పేరు బుజ్జి అయినా.. పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇది ఏఐ పవర్డ్ మెషిన్ అని తెలుస్తోంది.

బుజ్జి వెహికల్.. ఒకప్పటి బ్యాట్‌మ్యాన్ యొక్క బాట్‌మొబైల్, ఐరన్ మ్యాన్ యొక్క జార్విస్ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. దీన్ని బట్టి చూస్తే.. బుజ్జి ఎలా ఉంటుందో మీరే ఊహించేయవచ్చు. ఈ ప్రత్యేకమైన వాహనం అభిమానులను తెగ ఫిదా చేసేస్తోంది. ఇది ఓ యుద్ధ భూమి లాంటి ప్రదేశంలో చేసే విన్యాసాలు అంతా.. ఇంతా కాదు. టీజర్ చూస్తే మీకే అర్థమైపోతుంది.

‘బుజ్జి’ ఎక్కడ తయారైందంటే?

కల్కి సినిమాలో కనిపించే బుజ్జి.. ఏ జర్మన్ దేశంలోనో.. జపాన్ దేశంలోనో తయారు కాలేదు. మన ఇండియాలోనే.. తమిళనాడులోని కోయంబత్తూరులో తయారైంది. దీని బరువు ఏకంగా 6 టన్నులు, కాగా దీన్ని తయారు చేయడానికి రూ.7 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఈ వెహికల్ చూడటానికి ప్రత్యేకంగా కనిపించడానికి.. చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. దీని ముందు భాగంలో రెండు పెద్ద టైర్లు, వెనుక భాగంలో ఒకే పెద్ద టైరు ఉంటుంది. ముందు కనిపించే టైర్ రిమ్ సైజ్ 34.5 ఇంచెస్ కాగా.. పొడవు 6075 మిమీ, వెడల్పు 3380 మిమీ మరియు ఎత్తు 2186 మిమీ వరకు ఉంది. ఈ వాహనాన్ని డ్రైవ్ చేయడానికి ప్రత్యేకమైన స్టీరింగ్ వీల్ కూడా లభిస్తుంది. పైన ఒక గ్లాస్ బాడీ ఉంది. ఇందులో డ్రైవ్ చేసే వ్యక్తి కూర్చోవడానికి ఓ సీటు కూడా ఉంది. ఇది 47 కిలోవాట్ బ్యాటరీ కలిగి మంచి పనితీరును అందిస్తుంది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఈ ప్రత్యేకమైన వాహనాన్ని మహీంద్రా మరియు జయం మోటార్స్ కలిసి రూపొందించారు. ఈ వాహనం చూసిన తరువాత ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు. ఇందులో చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా టీమ్ పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్ మరియు ఆర్కిటెక్చర్ మరియు పర్ఫామెన్స్ అనుకరించడం ద్వారా ఫ్యూచరిస్టిక్ తయారైంది. కల్కి బృందానికి సాయం చేసింది. ఇక ఆట ప్రారంభిద్దాం అని పేర్కొన్నారు.

కల్కి 2898 ఏడీ

ప్రభాస్ నటించిన ఈ కల్కి 2898 ఏడీ సినిమా టీజర్‌లో కనిపించిన బుజ్జి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతోంది. ప్రభాస్ భైరవ పాత్రలో బుజ్జిని యుద్ధభూమిలో తన వ్యూహాలకు మద్దతు ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద టీజర్ చాలా ఆసక్తిగా సాగటం చూడవచ్చు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో కనిపించే క్యారెక్టర్ వేషంలో టీజర్ లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో అన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టీజర్ లాంచ్ చేయడానికి ముందే ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. తన జీవితంలోకి ఎవరో స్పెషల్ రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోజు (మే 23) ఆ స్పెషల్ రానే వచ్చేసింది.

Don’t Miss: టీవీఎస్ అపాచీ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారేమో!

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పఠాని వంటి అగ్ర తారలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న తెరమీదకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. సినిమా మంచి హిట్ సాధిస్తుందని భవిస్తున్నాము.

టాప్ 5 మోస్ట్ పవర్‌ఫుల్ బైక్స్.. ధర రూ.2.50 లక్షల కంటే తక్కువే!

0

Top 5 Best Bikes Under Rs.2.50 Lakh in India: భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు, కార్లను అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే చాలామంది ఒక రేంజ్ ధర వద్ద లభించే వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే 5 ఉత్తమ బైకులు ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సంగతులు వివరంగా తెలుసుకుందాం.

కేటీఎమ్ 250 డ్యూక్

ఎక్కువమంది కుర్రకారుకు ఇష్టమైన బైక్ బ్రాండ్ కేటీఎమ్ (KTM). ఇది దాదాపు అందరికి తెలిసిన విషయమే. అయితే ఇందులో రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే మోడల్ ‘కేటీఎమ్ 250 డ్యూక్’. దీని ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 9250 rpm వద్ద 31 హార్స్ పవర్ మరియు 7250 rpm వద్ద 25 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 249 సీసీ ఇంజిన్ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కేటీఎమ్ 250 డ్యూక్.. అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇందులో అల్యూమినియం స్వింగార్మ్ మరియు క్విక్‌షిఫ్టర్ వంటివి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర బైక్ కొనాలనుకునే వారికి కేటీఎమ్ 250 డ్యూక్ ఓ మంచి ఆప్షన్.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310

దేశీయ మార్కెట్లో ఎక్కువ మందిని ఇష్టమైన బైక్ బ్రాండ్లలో ఒకటైన టీవీఎస్ కూడా మన జాబితాలో ఉంది. టీవీఎస్ కంపెనీ యొక్క అపాచీ ఆర్‌టీఆర్ 310 రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధరలకు లభించే బైక్. దీని ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 2.43 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ. 2.63 లక్షలు (ఎక్స్ షోరూమ్).

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 బైక్ 312 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9700 rpm వద్ద 35.6 హార్స్ పవర్ మరియు 6650 rpm వద్ద 28.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి ఇది బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

బజాజ్ డామినార్ 400

డామినార్ 400 బైక్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. బజాజ్ కంపెనీ యొక్క ఈ బైక్ ధర రూ. 2.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8800 rpm వద్ద 40 హార్స్ పవర్ మరియు 6500 rpm వద్ద 35 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 192 కేజీల బరువున్న ఈ బైక్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి మంచి రైడింగ్ అభుభూతిని అందిస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్

రూ. 1.85 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ‘బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్’ కూడా రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ బైకులలో ఒకటి. ఇది బజాజ్ డామినార్ 400 మాదిరిగా అదే ఇంజిన్ మరియు ఫ్రేమ్‌ పొందినప్పటికీ.. డామినార్ 400 కంటే 18 కేజీలు తక్కువ. బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ బరువు రూ. 174 కేజీలు.

Don’t Miss: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ 373 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8800 rpm వద్ద 39.4 Bhp పవర్ మరియు 6500 rpm వద్ద 35 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. తద్వారా ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

ట్రైయంఫ్ స్పీడ్ 400

ఎక్కువమందికి ఇష్టమైన మరియు రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ట్రైయంఫ్ స్పీడ్ 400 కూడా ఒకటి. దీని ధర రూ. 2.34 లక్షలు. ఇది 398 సీసీ ఇంజిన్ కలిగి 8000 rpm వద్ద 40 hp పవర్ మరియు 6500 rpm వద్ద 37.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

టీవీఎస్ అపాచీ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారేమో!

0

TVS Apache RTR 160 Black Edition Launched: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ”టీవీఎస్ మోటార్” (TVS Motor) ఎట్టకేలకు ‘అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ’ (Apache RTR 160 4V) కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్ మరియు ఇవుతర వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ డార్క్ ఎడిషన్ వేరియంట్‌ల రూపంలో విడుదలయ్యాయి. కాబట్టి ఇవి ఆల్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి. ఇది ‘అపాచీ ఆర్‌టీఆర్ 160’ మరియు ‘అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ’ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ధర

దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ అపాచీ ఆర్‌టీఆర్ ధరలు వరుసగా రూ. 1.20 లక్షలు (అపాచీ ఆర్‌టీఆర్ 160), రూ. 1.23 లక్షలు (అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ. ఈ రెండు బైకుల డిజైన్ కాకుండా.. ఎటువంటి మెకానికల్ అప్డేట్స్ లేదని తెలుస్తోంది.

డిజైన్

కొత్త అపాచీ ఆర్‌టీఆర్ డార్క్ ఎడిషన్ బ్లాక్ అవుట్ ఎగ్జాస్ట్ మరియు ట్యాంక్ మీద ఎంబోస్ చేయబడిన టీవీఎస్ లోగో వంటివి ఉన్నాయి. చూటడానికి మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్న ఈ బైకులలో ఆశించదగ్గ డిజైన్ అప్డేట్స్ లేవని తెలుస్తోంది. కాబట్టి అదే ఎల్ఈడీ హెడ్‌లాంప్, టెయిల్‌లాంప్, టర్న్ ఇండికేటర్స్ మొదలైనవన్నీ స్టాండర్డ్ బైకులలో ఉండేలా ఉంటాయి.

ఫీచర్స్

లేటెస్ట్ అపాచీ ఆర్‌టీఆర్ డార్క్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్ సిస్టమ్‌తో కూడిన వాయిస్ అసిస్ట్ ఫీచర్ ఉంటుంది. స్టాండర్డ్ బైకులో ఉన్న మిగిలిన అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

ఇంజిన్

ఆర్‌టీఆర్ 160 బైక్ 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16.04 Bhp పవర్ మరియు 7000 rpm వద్ద 13.85 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ లభిస్తాయి. పవర్ మరియు టార్క్ అనేవి ఎంచుకునే రైడింగ్ మోడ్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 97 కిమీ కావడం గమనార్హం.

ఇక ఆర్‌టీఆర్ 160 4వీ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 160 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9250 rpm వద్ద 17.35 bhp పవర్ మరియు 7250 rpm వద్ద 14.73 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో కూడా అదే రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ లభిస్తాయి. ఇంజిన్ ఐదు స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

టీవీఎస్ కంపెనీ యొక్క బైకులకు మరియు స్కూటర్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. అయితే సంస్థ ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు అపాచీ న్యూ వేరియంట్ లాంచ్ చేసింది. ఇది తప్పకుండా బైక్ ప్రియులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

టీవీఎస్ కంపెనీ సాధారణ బైకులను మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ స్కూటర్ (ఐక్యూబ్) కూడా విక్రయిస్తోంది. ఇది మార్కెట్లో ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. దేశీయ విఫణిలో దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని భావిస్తున్నాము.

Don’t Miss: మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ ఐక్యూబ్.. ధర రూ. లక్ష కంటే తక్కువే

టీవీఎస్ కంపెనీకి చెందిన ‘రైడర్ 125’ దేశీయ మార్కెట్లో గత నెలలో ఉత్తమ అమ్మకాలను పొందింది. గత నెలలో ఏకంగా 50000 యూనిట్ల అమ్మకాలను పొందింది. దీన్ని బట్టి చూస్తే టీవీఎస్ బైకులకు దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. టీవీఎస్ కంపెనీ భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో సుమారు 80 దేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ ఐక్యూబ్.. ధర రూ. లక్ష కంటే తక్కువే

0

TVS Launches New Affordable iQube Base Variant: అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘టీవీఎస్ మోటార్స్’ (TVS Motors) యొక్క ‘ఐక్యూబ్’ (iQube) ఇప్పుడు కొత్త వేరియంట్‌లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర

టీవీఎస్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘బేస్ వేరియంట్’. దీని ధర రూ. 94,999 (ఎక్స్ షోరూమ్). ఈ ధర జూన్ 30 వరకు మాత్రమే ఉంటుందని సమాచారం. ఆ తరువాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎంత పెరుగుతుందనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చిన్న 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.

ఐదు వేరియంట్లు

నిజానికి కంపెనీ ఇప్పటికే మార్కెట్లో స్టాండర్డ్ (3.4 కిలోవాట్ బ్యాటరీ), ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్‌టీ (3.4 కిలోవాట్ బ్యాటరీ), ఐక్యూబ్ ఎస్‌టీ (5.1 కిలోవాట్ బ్యాటరీ) అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు, రూ. 1.57 లక్షలు, రూ. 1.55 లక్షలు మరియు రూ. 1.85 లక్షలు.

పైన వెల్లడించిన ధరలను బట్టి చూస్తే.. టీవీఎస్ కంపెనీ ఇప్పుడు లాంచ్ చేసిన బేస్ వేరియంట్ ధర అన్నింటి కంటే తక్కువ అని తెలుస్తోంది. ఇప్పటికే టాప్ స్పెక్ వేరియంట్స్ అన్నీ కూడా అమ్మకానికి మార్కెట్లో ఉన్నాయి. కాగా టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా దేశంలో ఉన్న 434 నగరాల్లో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

బ్యాటరీ, రేంజ్ మరియు ఛార్జింగ్

టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ 4.4 kW హబ్ మౌంటెడ్ BLDC మోటార్ పొందుతుంది. ఇది 140 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 2.2 కిలోవాట్ బ్యాటరీ సింగిల్ చార్జితో గరిష్టంగా 75 కిమీ (ఎకో మోడ్) అందిస్తుంది. అయితే ఈ స్కూటర్ పవర్ మోడ్‌లో 60 కిమీ రేంజ్ మాత్రమే అందిస్తుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే.. టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం రెండు గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. కాబట్టి ఛార్జింగ్ పరంగా కూడా ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

కలర్ ఆప్షన్స్

ఐక్యూబ్ బేస్ వేరియంట్ రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి వాల్‌నట్ బ్రౌన్ మరియు పెర్ల్ వైట్ కలర్స్. ఇవి రెండూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.

ఫీచర్స్

కొత్త టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ 5 ఇంచెస్ కలర్‌ఫుల్ టీఎఫ్‌టీ స్క్రీన్ పొందుతుంది. ఇది ఛార్జింగ్, వెహికల్స్ క్రాష్ అనే టో అలర్ట్ మరియు టర్న్ బై టర్న్ న్యావిగేషన్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ

ఐక్యూబ్ ఎస్‌టీ విషయానికి వస్తే.. ఇది 3.4 కిలోవాట్ బ్యాటరీ మరియు 5.1 కిలోవాట్ బ్యాటరీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 1.55 లక్షలు, రూ. 1.85 లక్షలు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు). 3.4 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ ఒక సింగిల్ చార్జితో 100 కిమీ రేంజ్ (70 కిమీ/గణ్ స్పీడ్) అందిస్తుంది. కాగా 5.1 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ రూ. గంటకు 82 కిమీ వేగంతో 150 కిమీ రేంజ్ అందిస్తుంది.

Don’t Miss: స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేసిన ఎంజీ మోటార్స్.. ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్!

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ 7 ఇంచెస్ స్క్రీన్ పొందుతుంది. ఇందులో 118 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి. అలెక్సా ద్వారా వాయిస్ అసిస్ట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి ఆధునిక ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇది కాపర్ బ్రాంజ్ మ్యాట్, కోరల్ సాండ్ శాటిన్, టైటానియం గ్రే మ్యాట్ మరియు స్టార్‌లైట్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేసిన ఎంజీ మోటార్స్.. ఫిదా చేస్తున్న కలర్ ఆప్షన్!

0

MG Motor 100 Years Special Editions: మోరిస్ గ్యారేజ్ లేదా ఎంజీ మోటార్స్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే భారతీయ మార్కెట్లో ఈ కంపెనీకి అధిక ప్రజాదరణ కూడా ఉంది. ఎంజీ మోటార్స్ కంపెనీ లాంచ్ చేసిన కార్లు కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటి వరకు లాంచ్ చేసిన కార్ల జాబితాలో పెట్రోల్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా మళ్ళీ ఇప్పుడు నాలుగు స్పెషల్ మోడళ్లను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

స్పెషల్ మోడల్స్

ఎంజీ మోటార్ కంపెనీ తన 100 సంవత్సరాల ఉనికిని పురస్కరించుకుని భారతీయ మార్కెట్లో నాలుగు స్పెషల్ మోడల్స్ లాంచ్ చేసింది. ఇందులో ఎంజీ హెక్టర్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ఎంజీ ఆస్టర్ మరియు ఎంజీ కామెట్ ఈవీ ఉన్నాయి. ఈ స్పెషల్ మోడల్స్ చూడటానికి స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత భిన్నంగా ఉన్నాయి. ఈ స్పెషల్ మోడల్స్ లిమిటెడ్ ఎడిషన్‌లుగా మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఎన్ని కార్లు అందుబాటులో ఉంటాయి.. అనేదానికి సంబంధించి ఖచ్చితమైన వివరాలు అందుబాటులో లేదు.

ధరలు

ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త స్పెషల్ ఎడిషన్స్ ధరల విషయానికి వస్తే.. ఎంజీ హెక్టర్ ప్రారంభ ధర రూ. 21.2 లక్షలు, ఎంజీ జెడ్ఎస్ ఈవీ ప్రారంభ ధర రూ. 24.18 లక్షలు, ఎంజీ ఆస్టర్ ప్రారంభ ధరలు రూ. 14.81 లక్షలు మరియు ఎంజీ కామెట్ ఈవీ ప్రారంభ ధర రూ. 9.4 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా).

ప్రత్యేకతలు ఇవే..

ఎంజీ మోటార్స్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎడిషన్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కలర్. ఎంజీ మోటార్స్ యొక్క నాలుగు స్పెషల్ ఎడిషన్స్ ‘బ్రిటీష్ రేసింగ్ గ్రీన్’ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దీనిని ‘ఎవర్‌గ్రీన్’ అని పిలిచింది. సాధారణ కార్లనుంచి వీటిని వేరు చేయడానికి వెనుకవైపు బ్యాడ్జ్‌లు ఉన్నాయి. ఇంటీరియర్ మొత్తం బ్లాక్ లుక్‌లో ఉన్నాయి. అక్కడక్కగా గ్రీన్ కలర్ హైలెట్స్ మరియు హెడ్‌రెస్ట్‌ల మీద ‘100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్’ అనే స్టిచ్చింగ్ చూడవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కూడా గ్రీన్ కలర్ థీమ్ పొందుతుంది.

డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త ఎంజీ మోటార్స్ స్పెషల్ ఎవర్‌గ్రీన్ ఎడిషన్స్ కొత్త కలర్ ఆప్షన్స్ పొందినప్పటికీ డిజైన్ దాదాపు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. అయితే 100 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ అనే బ్యాడ్జ్ చూడవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే.. లోపల గ్రీన్ కలర్ థీమ్ కాకుండా మిగిలిన దాదాపు అన్ని ఫీచర్స్ మునుపటి మోడల్లో ఉన్న మాదిరిగానే ఉన్నాయి. కాబట్టి డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో పెద్దగా మార్పులు లేదా అప్డేట్స్ లేదని తెలుస్తోంది.

ఇంజిన్ & బ్యాటరీ డీటైల్స్

ఎంజీ హెక్టర్ స్పెషల్ ఎడిషన్ అదే ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది ఐదు, ఆరు, ఏడు సీట్ల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ అదే 50.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 461 కిమీ రేంజ్ అందిస్తుంది. కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఎంజీ గ్లోస్టర్ లేదు..

దేశీయ విఫణిలో మంచి ఆదరణ పొందిన ఎంజీ గ్లోస్టర్ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో అందుబాటులో లేదు. అయితే కంపెనీ దీనిని స్పెషల్ ఎడిషన్ రూపంలో ఎందుకు లాంచ్ చేయలేదు అనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. భవిష్యత్తులో లిమిటెడ్ ఎడిషన్ రూపంలో విడుదలవుతుందా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.

Don’t Miss: టాటా రేసర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది..

ఎంజీ మోటార్స్ స్పెషల్ ఎడిషన్ లాంచ్‌పై మా అభిప్రాయం

మారుతున్న ప్రపంచంలో ఆధునిక ఉత్పత్తుల అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్ స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేయడం మంచి నిర్ణయం. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ తప్పకుండా కొత్త కార్లను కొనాలని ఎదురు చూసేవారికి ఓ మంచి ఎంపిక అనే చెప్పాలి.

టాటా రేసర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది..

0

Tata Altroz Racer Launch Details: భారతీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ (Tata Motors) గత ఆటో ఎక్స్‌పోలో ఢిల్లీ వేదికపై ప్రదర్శించిన సరికొత్త ‘ఆల్ట్రోజ్ రేసర్’ (Altroz Racer) కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయం వెల్లడించింది. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

టాటా మోటార్స్ యొక్క కొత్త ఆల్ట్రోజ్ రేసర్ వచ్చే నెలలో (2024 జూన్) లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే రెండు సార్లు ప్రదర్శించబడిన ఈ లేటెస్ట్ కారు ఇక త్వరలోనే లాంచ్ కావడానికి సిద్దమైపోయింది. ఈ కొత్త కారు ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

డిజైన్

విడుదలకు సిద్దమవుతున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు యొక్క బోనెట్ మరియు రూప్ మీద ట్విన్ రేసింగ్ స్ట్రిప్స్‌తో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ చూడవచ్చు. ఫ్రంట్ పెండర్ మీద రేసర్ బ్యాడ్జింగ్ చూడవచ్చు. కొత్తగా అప్డేట్ చేయబడిన గ్రిల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ ఇక్కడ చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగానే ఉంటుంది.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు ఇంటీరియర్ కూడా అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క డ్యాష్‌బోర్డ్‌ మీద రెడ్ కలర్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ వంటి వాటితో పాటు.. కలర్ యాక్సెంట్‌లతో కూడిన కొత్త లెథెరెట్ అపోల్స్ట్రే ఉంటుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్ద 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెగ్మెంట్ ఫస్ట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్స్ ఆప్ డిస్‌ప్లే, అల్యూమినియం పెడల్స్ మరియు వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

ఇంజిన్

కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు.. ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన నెక్సాన్ మాదిరిగానే అదే 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 120 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్

దేశంలో సేఫ్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది టాటా మోటార్స్. కాబట్టి కంపెనీ ఈ కారులో కూడా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తాయి. సేఫ్టీ ఫీచర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రత్యర్థులు మరియు అంచనా ధర

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా ఆట్రోజ్ రేసర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్‌కు ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉంది. అయితే ధరలను బట్టి ఈ హ్యాచ్‌బ్యాక్ మారుతి కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ మరియు టయోటా టైసర్ యొక్క టర్బో పెట్రోల్ వేరియంట్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త టాటా ఆట్రోజ్ రేసర్ అంచనా ధర రూ. 9.20 లక్షల నుంచి రూ. 10.10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. అయితే ఖచ్చితమైన ధరలు కంపెనీ ఈ కారును లాంచ్ చేసే సమయంలో వెల్లడిస్తుంది. అంతే కాకుండా రేసర్ యొక్క బుకింగ్స్ మరియు డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు సమాచారం.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన 2024 మారుతి స్విఫ్ట్ – ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

భారతదేశంలో టాటా కార్లు అత్యధిక అమ్మకాలను పొందుతూ.. మార్కెట్లో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ తరుణంలో టాటా కంపెనీ మరో కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో లాంచ్ కానున్న కొత్త రేసర్ తప్పకుండా కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతుందని భావిస్తున్నాము.

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన 2024 మారుతి స్విఫ్ట్ – ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

0

Maruti Swift Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతి సుజుకి నాల్గవ తరం ‘మారుతి స్విఫ్ట్’ భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ హ్యాచ్‌బ్యాక్ ధర ఎంత? ఫీచర్స్ ఎలా ఉన్నాయి. ఇంజిన్ డీటైల్స్ మరియు మైలేజ్ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్ & ధరలు

కొత్త మారుతి స్విఫ్ట్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి LXi, VXi, VXi (O), ZXi మరియు ZXi+ వేరియంట్లు. స్విఫ్ట్ బేస్ వేరియంట్ ధర రూ. 6.49 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర రూ. 9.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే డ్యూయెల్ టోన్ కలర్ వేరియంట్ ఎంచుకుంటే రూ. 15000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి టాప్ వేరియంట్ కొనుగోలు కోసం రూ. 9.65 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మారుతి సుజుకి ధరలు దాని అవుట్‌గోయింగ్ కంటే రూ. 25000 నుంచి రూ. 37000 ఎక్కువ.

ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో (రూ. 5.65 లక్షలు) మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (రూ. 5.92 లక్షలు) ప్రారంభ ధరల కంటే కూడా కొత్త స్విఫ్ట్ ధర కొంత ఎక్కువ. అయితే ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ ఉండటం గమనించవచ్చు. స్విఫ్ట్ ధర కొంత ఎక్కువైనప్పటికీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

డిజైన్

కొత్త మారుతి స్విఫ్ట్ చూడటానికి దాదాపు దాని అవుట్‌గోయింగ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని కొత్త అప్డేట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేయబడిన రేడియేటర్ గ్రిల్, అప్డేటెడ్ హెడ్‌లైట్స్ మరియు ఫాగ్ లైట్స్, రియర్ డోర్ హ్యాండిల్స్, కొత్త అల్లవ్ వీల్ డిజైన్, సీ ఆకారంలో ఉన్న కొత్త టెయిల్ ల్యాంప్స్ ఇందులో గమనించవచ్చు.

పరిమాణం పరంగా కూడా కొత్త మారుతి స్విఫ్ట్ చాలా అనుకూలంగా ఉంటుంది. స్విఫ్ట్ వీల్‌బేస్ 2450 మిమీ వద్ద దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. పొడవు మరియు వెడల్పు కొంత పెరిగి ఉండటం చూడవచ్చు. ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

కలర్ ఆప్షన్స్

దేశీయ విఫణిలో లాంచ్ అయిన మారుతి స్విఫ్ట్ మొత్తం 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఆరు సింగిల్ టోన్ కలర్స్ (లస్టర్ బ్లూ, నావెల్ ఆరెంజ్, సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే మరియు స్ప్లెండిడ్ సిల్వర్).. మూడు డ్యూయెల్ టోన్ ఆప్షన్స్ (మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో లస్టర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో సిజ్లింగ్ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్ రూఫ్‌తో పెర్ల్ ఆర్కిటిక్ వైట్). ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఫీచర్స్

నాల్గవ తరం మారుతి స్విఫ్ట్ ఇంటీరియర్ బాలెనొ మరియు ఫ్రాంక్స్‌లను పోలి ఉంటుంది. అయితే క్యాబిన్ దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. ఇందులో 9 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ ORVM మరియు ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇంజిన్

2024 మారుతి స్విఫ్ట్ జెడ్ సిరీస్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5700 rpm వద్ద 80 Bhp పవర్ మరియు 4300 rpm వద్ద 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మారుతి స్విఫ్ట్ కారులోని ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. స్విఫ్ట్ మాన్యువల్ వేరియంట్ 24.80 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. ఆటోమాటిక్ వేరియంట్ 25.75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది.

Don’t Miss: రోల్స్ రాయిస్ కల్లినన్ ఇప్పుడు మరింత కొత్తగా.. పూర్తి వివరాలు

సేఫ్టీ ఫీచర్స్

కొత్త మారుతి స్విఫ్ట్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లతో కూడిన 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

రోల్స్ రాయిస్ కల్లినన్ ఇప్పుడు మరింత కొత్తగా.. పూర్తి వివరాలు

0

Rolls Royce Cullinan Series II Facelift Revealed: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే ‘రోల్స్ రాయిస్’ కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ ‘కల్లినన్’ ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రోల్స్ రాయిస్ కల్లినన్ సుమారు ఆరు సంవత్సరాల తరువాత అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజైన్

రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్, ఆధునిక టెక్నాలజీ పొందుతుంది. ఇందులో అప్డేటెడ్ ఫాసియాను పొందుతుంది. ముందు భాగంలో అప్డేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. ఇది బంపర్ వరకు విస్తరించింది. గ్రిల్ కూడా చాలా కొత్తగా ఉండటం చూడవచ్చు. పైభాగంలో దిగువన సమాంతరంగా ఉండే క్రోమ్ బార్ ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ కూడా చాలా కొత్తగా ఉండటం చూడవచ్చు. ఇక్కడ ఒక లైన్ చూడవచ్చు. అది బ్రేక్ లైట్ నుంచి వెనుక చక్రం వరకు ఉంటుంది. రియర్ ప్రొఫైల్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన బాడీ డిజైన్ పొందుతుంది. అల్యూమినియం వీల్స్ మునుపటి కాంట్ ఒక అంగుళం పెద్దదిగా ఉన్నాయి. కాబట్టి వీల్స్ ఇప్పుడు 23 ఇంచెస్ వరకు ఉన్నాయి. బ్లాక్ డోర్ హ్యాండిల్స్, కలర్ కోడెడ్ లోయర్ బాడీవర్క్ మరియు ఎయిర్ ఇన్‌టేక్‌ల కోసం బెస్పోక్ ట్రీట్‌మెంట్‌ కలిగి సాధారణ కల్లినన్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది.

ఫీచర్స్

రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ కూడా చాలా అప్డేట్స్ పొందింది. డ్యాష్‌బోర్డ్‌లో గ్లాస్ ప్యానెల్‌ చూడవచ్చు. ప్రయాణికుల ముందు భాగంలో ప్రకాశవంతమైన సిటీస్కేప్ మోటిఫ్ ఉంటుంది. వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది. అనలాగ్ క్లాక్ మరియు దాని కింద స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ మస్కట్ వంటివి ఉన్నాయి.

కంపెనీ ఇప్పుడు దీనిని కొత్త పెయింట్ మరియు మెటీరియల్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది. ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎలిమెంట్లలో కూడా గ్రే స్టెయిన్డ్ యాష్, మెటాలిక్ ఎఫెక్ట్ ఓపెన్ పోర్ వుడ్ ట్రిమ్, డ్యూయాలిటీ ట్విల్ మరియు సీట్ ఫాబ్రిక్ వంటివి ఉన్నాయి.

ఇంజిన్

అప్డేటెడ్ రోల్స్ రాయిస్ కల్లినన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఎంత అప్డేట్స్ పొందిన ఇంజిన్ విషయంలో మాత్రం ఎటువంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి ఇది 6.75 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 600 హార్స్ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

నిజానికి రోల్స్ రాయిస్ తన మొదటి కల్లినన్ కారును 2018లో మొదటిసారి పరిచయం చేసింది. ఆ తరువాత ఇప్పుడు అందులో అప్డేట్స్ అందిస్తూ సిరీస్ II పేరుతో లేదా ఫేస్‌లిఫ్ట్ పేరుతో పరిచయం చేసింది. అయితే ఈ కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది. ధర ఎంత వరకు ఉంటుంది అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రపంచ మార్కెట్లో చాలామంది ధనవంతులు, సినీతారలు, పారిశ్రామిక వేత్తలు మరియు క్రికెటర్లు రోల్స్ రాయిస్ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ధర ఎక్కువ కావడం వల్ల రోల్స్ రాయిస్ కార్లను సాధారణ ప్రజలు కొనుగోలు చేయడానికి వెనుకాడతారు. అంతే కాకుండా రోల్స్ రాయిస్ కార్ల యొక్క మెయింటెనెన్స్ కూడా కొంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయమే. కాబట్టి రోల్స్ రాయిస్ కార్లు సాధారణ కార్ల మాదిరిగా అమ్ముడు కావు.

Don’t Miss: టయోటా ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్ వచ్చేసింది.. వివరాలు

రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ఇతర కార్లతో పోలిస్తే.. కల్లినన్ SUVని ఎక్కువమంది కొనుగోలు చేస్తారు. కంపెనీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన బోట్ టెయిల్ కారును మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కారును (రోల్స్ రాయిస్ స్పెక్టర్) కూడా ప్రవేశపెట్టింది. ఇక రాబోయే రోజుల్లో కూడా కంపెనీ కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను ప్రవేశపెడుతుందని భావిస్తున్నాము. అయితే ఎప్పుడు.. ఏ మోడల్ ప్రవేశపెడుతుందనేది తెలియాల్సి ఉంది.