37.1 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 41

టయోటా ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్ వచ్చేసింది.. వివరాలు

0

Toyota Innova Crysta GX Plus Launched: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్ యొక్క ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్ ధర, వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర

ఇండియన్ మార్కెట్లో కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా మిడ్ స్పెక్ వేరియంట్‌ ‘జీఎక్స్+’ (GX+) పేరుతో లాంచ్ అయింది. దీని ధర రూ. 21.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న జీఎక్స్ మరియు వీఎక్స్ వేరియంట్ల మధ్యలో ఉంటుంది. ఇది జీఎక్స్ వేరియంట్ కంటే కూడా దాదాపు రూ. 1.40 లక్షలు ఎక్కువ.

కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్ 7 సీటర్ మరియు 8 సీటర్ ఎంపికలలో లభిస్తుంది. 7 సీటర్ ధర రూ. 21.39 లక్షలు, కాగా 8 సీటర్ ధర రూ. 21.44 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

డిజైన్ & కలర్ ఆప్షన్స్

చూడటానికి మునుపటి మోడల్ మాదిరిగా ఉన్న ఈ కారు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది అదే ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ కలిగి ఉంటుంది. కాబట్టి చూడగానే ఇది కొత్త వేరియంట్ అని చెప్పడం కొంత కష్టమే. అయితే ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ కారణంగా దీనిని కొత్త వేరియంట్ అని తెలుసుకోవచ్చు.

ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి సూపర్ వైట్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు సిల్వర్ మెటాలిక్ కలర్స్. క్రిస్టా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

ఫీచర్స్

కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్లో తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం కొత్త ఫీచర్స్. ఈ కొత్త మోడల్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్స్‌తో పాటు అదనంగా 14 ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. అవి రియర్ కెమెరా, ఆటో ఫోల్డ్ మిర్రర్స్, డాష్ క్యామ్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వుడ్ ప్యానెల్స్, మరియు ఫ్రీమియం ఫాబ్రిక్ సీట్లు, ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

ఇంజిన్

టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్ 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 150 హార్స్ పవర్ మరియు 343 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది ఎకో అండ్ పవర్ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. మొత్తం మీద ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

మార్కెట్లో కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్ లాంచ్ చేసిన సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. 2005లో ప్రారంభమైనప్పటి నుంచి, ఇన్నోవా బ్రాండ్ ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. తద్వారా ఇది సెగ్మెంట్ లీడర్‌గా తిరుగులేని రికార్డ్ క్రియేట్ పొందింది. కంపెనీ ఇప్పుడు లాంచ్ చేసిన ఈ కారు కూడా మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యర్థులు

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు. కానీ మార్కెట్లో కియా కారెన్స్, మరియు మహీంద్రా మొరాజో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: మారుతి సుజుకి అద్భుతమైన డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు బెనిఫీట్స్

భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే దాదాపు చాలా వాహన తయారీ సంస్థలు ఆధునిక ఉత్పత్తులకు లాంచ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో టయోటా కూడా ఓ కొత్త వేరియంట్ విడుదల చేసి.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ కారు మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

మారుతి సుజుకి అద్భుతమైన డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు బెనిఫీట్స్

0

Maruti Suzuki May 2024 Discounts: ఆధునిక భారతదేశంలో వాహన వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇంటికో బైక్ ఉన్నట్లు.. నేడు ఇంటికో కారు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓ కారు ఉంటుంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దానికి తోడు కంపెనీలు కూడా అప్పుడప్పుడు అద్భుతమైన ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మారుతి సుజుకి వంతు వచ్చేసింది.

దేశీయ విఫణిలో అత్యంత పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో గ్రాండ్ విటారా, బాలెనొ, జిమ్నీ, ఇగ్నీస్, సియాజ్, ఎక్స్ఎల్6 మరియు ఫ్రాంక్స్ ఉన్నాయి. కంపెనీ ఈ కార్ల కొనుగోలు మీద క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కార్లను కస్టమర్లు నెక్సా డీలర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మారుతి ఫ్రాంక్స్

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కొనుగోలు మీద కస్టమర్ రూ.58000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.15000 క్యాష్ డిస్కౌంట్, రూ.30000 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీ కిట్, రూ.10000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.3000 విలువైన కార్పొరేట్ బెనిఫీట్స్, లభిస్తాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనుగోలు మీద రూ.23000 ప్రయోజనాలు, CNG వేరియంట్ కొనుగోలు మీద రూ.13000 వరకు బెనిఫీట్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మారుతి గ్రాండ్ విటారా

గ్రాండ్ విటారా కొనుగోలు మీద మారుతి సుజుకి ఏకంగా రూ.74000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20000 క్యాష్ డిస్కౌంట్, రూ.50000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.4000 కార్పొరేట్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక డెల్టా పెట్రోల్ వేరియంట్ కొనుగోలు మీద రూ.44000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జీటా పోట్రోల్, ఆల్పా పెట్రోల్ కొనుగోలుపైన రూ. 59000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. సిగ్మా పెట్రోల్ మరియు CNG వేరియంట్ల మీద కేవలం రూ.4000 మాత్రమే ప్రయోజనాలను పొందవచ్చు.

మారుతి జిమ్నీ

థార్ SUVకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మారుతి జిమ్నీ (2023 మోడల్) కొనుగోలుపైనా కూడా కస్టమర్లు రూ.1.50 లక్షల క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే 2024 మోడల్ కొనుగోలుపైన మాత్రం కేవలం రూ. 50000 తగ్గింపు లభిస్తుంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ మరియు 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడి ఉంటుంది.

మారుతి ఇగ్నీస్

ఇగ్నీస్ యొక్క ఆటోమాటిక్ వేరియంట్స్ కొనుగోలు మీద రూ.53100 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ.48100 తగ్గింపు పొందవచ్చు. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హార్స్ పవర్ మరియు 113 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది.

మారుతి బాలెనో

బాలెనొ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ కొనుగోలు మీద కంపెనీ ఈ నెలలో రూ.50000 తగ్గింపు అందిస్తోంది. అదే సమయంలో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మీద రూ.45000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. CNG కారు కొనుగోలుపైన మారుతి సుజుకి రూ.35000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది. ఈ డిస్కౌంట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే లభిస్తాయి.

మారుతి సియాజ్

సియాజ్ యొక్క అన్ని వేరియంట్ల కొనుగోలు మీద కంపెనీ రూ.48000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఇందులో రూ.20000 క్యాష్ డిస్కౌంట్, రూ.25000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.3000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సెడాన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మరియు హోండా సిటీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ కొత్త బైక్ లాంచ్.. ధర & వివరాలు

మారుతి ఎక్స్ఎల్6

ఎక్స్ఎల్6 కొనుగోలు మీద మారుతి సుజుకి రూ.20000 మాత్రమే ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద అందిస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (103 హార్స్ పవర్) పొందుతుంది. అయితే ఎక్స్ఎల్6 యొక్క CNG వేరియంట్ కొనుగోలు మీద ఎటువంటి తగ్గింపులను అందుబాటులో లేదు.

Note: మారుతి సుజుకి అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి స్థానిక డీలర్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఈ నెల(మే 31) చివరి వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బహుశా వచ్చే నెలలో ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.

దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ కొత్త బైక్ లాంచ్.. ధర & వివరాలు

0

Bajaj Pulsar NS400Z Launched in India: భారతదేశంలో యువకుల దగ్గర నుంచి పెద్దవారి వరకు దాదాపు అందరికి ఇష్టమైన బైకుల జాబితాలో ఒకటిగా నిలిచిన బజాజ్ పల్సర్ ఇప్పుడు మరో వేరియంట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు ఎన్ఎస్400జెడ్ (NS400Z). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర, బుకింగ్స్ మరియు డెలివరీ

ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బజాజ్ ఎన్ఎస్400.. తాజాగా ఎన్ఎస్400జెడ్ రూపంలో అడుగుపెట్టింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ రూ. 5000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వచ్చే నెల (2024 జూన్) ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ ఇతర పల్సర్ ఎన్ఎస్ మోడల్‌ల మాదిరిగానే అదే డిజైన్ లాంగ్వేజ్ పొందుతాయి. అయితే ఈ బైక్ ముందు భాగంలో ఒకే ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌ ఉంటుంది. దానికి ఇరువైపులా రెండు బోల్ట్ ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు ఉంటాయి. వీటికి పైన చిన్న ఫెయిరింగ్ ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి 320 మిమీ ఫ్రంట్ డిస్క్ కలిగి ఉంటుంది. షాంపైన్ గోల్డ్ కలర్ యూఎస్డీ ఫోర్క్‌ను ఇక్కడ గమనించవచ్చు. వెనుక వైపు 230 మిమీ డిస్క్ ఉంటుంది. స్ప్లిట్ సీటు కలిగిన ఈ బైక్ ఎల్ఈడీ టైల్‌లైట్‌లను పొందుతుంది. మొత్తం మీద డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుందని అనిపిస్తోంది. అయితే కొన్ని మార్పులు గమనించవచ్చు.

ఫీచర్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ ఫుల్ కలర్డ్ ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ స్క్రీన్‌ పొందుతుంది. బార్ టైప్ ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్‌తో పాటు గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడ్ తెలియజేసే పెద్ద డిస్‌ప్లే, ఓడోమీటర్ మరియు ట్రిప్ మీటర్ కోసం చిన్న రీడౌట్ వంటివి ఉన్నాయి. ఇందులోని డాట్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం ఉపయోగించబడుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇంజిన్

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ 373 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ మోటారును పొందుతుంది. ఇది 8800 rpm వద్ద 39.4 bhp పవర్ మరియు 6500 rpm వద్ద 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా పొందుతుంది. ఈ బైక్ రైడ్ బై వైర్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఇందులో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మఫ్లర్‌ ఉంటుంది.

దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్పీడ్ 400, బజాజ్ డామినార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి స్పోర్ట్స్, రోడ్, రెయిన్ మరియు ఆఫ్‌రోడ్. త్రీ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎన్ ఇందులో ఉంటుంది.

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ

కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ బరువు 174 కేజీలు. అయితే ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. ఈ బైక్ ముందు వైపు 110/70-17 సెక్షన్ టైర్, వెనుక వైపు 140/70-ఆర్17 సెక్షన్ టైర్ ఉంటాయి. సీటు ఎత్తు 807 మిమీ.. కాగా గ్రౌండ్ క్లియరెన్స్ 168 మిమీ వరకు ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన 2024 ఫోర్స్ గూర్ఖా: పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో బజాజ్ కంపెనీ యొక్క పల్సర్ బైకులకు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది. కాబట్టి ఇప్పుడు తాజాగా దేశీయ విపహానీలో అడుగుపెట్టిన ఈ కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన 2024 ఫోర్స్ గూర్ఖా: పూర్తి వివరాలు

0

2024 Force Gurkha Launched In India: భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా ఎట్టకేలకు 5 డోర్స్ రూపంలో అధికారికంగా లాంచ్ అయింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధరలు, డిజైన్ మరియు ఫీచర్స్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర, బుకింగ్స్ మరియు డెలివరీలు

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వెర్షన్ రూ. 18 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ ఆఫ్ రోడర్ కోసం కస్టమర్లు రూ. 25000 మొత్తం చెల్లించి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. అయితే డెలివరీలు ఈ నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే అంతకంటే ముందు కంపెనీ ఈ కార్లను ఈ వారంలోనే డీలర్‌లకు పంపించనుంది. ఆ తరువాత టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవుతాయి.

అయితే కంపెనీ యొక్క అప్డేటెడ్ 3 డోర్ ఫోర్స్ గూర్ఖా ధర రూ. 16.75 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ లెక్కన 3 డోర్స్ గూర్ఖా కంటే 5 డోర్స్ గూర్ఖా ధర రూ. 1.25 లక్షలు ఎక్కువని తెలుస్తోంది. 5 డోర్స్ వెర్షన్.. 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. అయితే చూడటానికి రెండూ ఒకేలాగా ఉన్నట్లు తెలుస్తోంది.

అప్డేటెడ్ 3 డోర్స్ గూర్ఖా కంటే.. మహీంద్రా థార్ AX ఆప్షనల్ 4 వీల్ డ్రైవ్ ధర రూ. 1.75 లక్షలు తక్కువ. అయితే ప్రస్తుతం ఫోర్స్ గూర్ఖా 5 డోర్ వెర్షన్‌కు దేశీయ మార్కెట్లో ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయితే రాబోయే రోజుల్లో మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ లాంచ్ అయితే.. గూర్ఖా 5 డోర్ కారుకు ప్రత్యర్థిగా ఉంటుంది.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

2024 ఫోర్స్ గూర్ఖాలో గమనించదగ్గ అప్డేట్ రివైజ్డ్ హానీకూంబ్ నోస్ ముందు భాగంలో గ్రిల్. ఇది కాకుండా ఇందులో చెప్పుకోదగ్గ మార్పులు పెద్దగా లేదనే తెలుస్తోంది. అంతే కాకుండా ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, 5 స్పోక్ 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, చుక్కలతో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్‍లతో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. కార్నరింగ్ ఫంక్షన్, స్నార్కెల్, సైడ్ స్టెప్స్ మరియు రూప్ ర్యాక్‌తో కూడిన ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

కొత్త ఫోర్స్ గూర్ఖా 5 డోర్స్ వెర్షన్ పొడవు మరియు వెడల్పు కొంత ఎక్కువగా ఉండటం చూడవచ్చు. అప్డేటెడ్ గూర్ఖా మోడల్స్ రెడ్, గ్రీన్, వైట్ మరియు బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఇందులో తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఫీచర్స్

కొత్త 2024 ఫోర్స్ గూర్ఖా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో టైల్డ్ అండ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎమ్‌, ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ షిఫ్ట్ ఆన్ ఫ్లై ఫోర్ వీల్ డ్రైవ్ సెలెక్టర్ వంటివి ఇందులో ఉన్నాయి.

2024 ఫోర్స్ గూర్ఖా మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కాబట్టి ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇవి ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి.

Don’t Miss: మారుతి ప్రియులకు గుడ్ న్యూస్.. మొదలైన కొత్త ‘స్విఫ్ట్’ బుకింగ్స్

ఇంజిన్

కొత్త ఫోర్స్ గూర్ఖా మెర్సిడెస్ బెంజ్ నుంచి తీసుకున్న 2.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 138 Bhp పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఎకో మరియు పవర్ అనే రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది థార్ కంటే శక్తివంతమైనదని తెలుస్తోంది.

మారుతి ప్రియులకు గుడ్ న్యూస్.. మొదలైన కొత్త ‘స్విఫ్ట్’ బుకింగ్స్

0

Maruti Swift Bookings Open: గత కొన్ని రోజుల నుంచి ‘మారుతి సుజుకి’ తన కొత్త ‘స్విఫ్ట్’ కారును లాంచ్ చేస్తుందని అని తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేయడానికి ముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకోవడానికి టోకెన్ మొత్తం ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బుకింగ్ ప్రైస్ & లాంచ్ డేట్

చాలా రోజుల నుంచి భారతీయ మార్కెట్లో టెస్టింగ్ దశలోనే ఉన్న మారుతి స్విఫ్ట్.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. మే 9న అధికారికంగా లాంచ్ కానున్న ‘మారుతి స్విఫ్ట్’ (Maruti Swift) కోసం కస్టమర్లు రూ. 11000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. కొత్త స్విఫ్ట్ కారును బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌ వద్ద బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు లాంచ్ తరువాత ప్రారంభమవుతాయి.

త్వరలో లాంచ్ కానున్న కొత్త మారుతి స్విఫ్ట్, దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న నాల్గవ జనరేషన్ మోడల్ అని తెలుస్తోంది. నిజానికి కంపెనీ భారతీయ విఫణిలో స్విఫ్ట్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి.. ఇప్పటి వరకు గొప్ప అమ్మకాలను పొందుతోంది. కాగా త్వరలోనే ఆధునిక హంగులతో కొత్త తరం కారును లాంచ్ చేయనుంది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని సమాచారం.

డిజైన్

విడుదలకు సిద్దమవుతున్న కొత్త తరం మారుతి స్విఫ్ట్ అప్డేటెడ్ డిజైన్ చూపరులను తప్పకుండా ఆకర్షిస్తుంది. కొత్త బంపర్, లేటెస్ట్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయి. అంతే కాకుండా ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంచెం పొడవుగా ఉంటుంది. హెడ్‌లైట్స్‌ మధ్యలో బ్రాండ్ లోగో ఉండటం ఇక్కడ గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ కూడా కొన్ని అప్డేట్స్ పొంది ఉంటుందని సమాచారం.

ఫీచర్స్

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఇంటీరియర్ డిజైన్ కొత్తగా ఉంటుంది. ఇది కొంత మారుతి బాలెనొ మరియు ఫ్రాంక్స్‌ వంటివాటిని తలపిస్తుందని సమాచారం. కొత్త డ్యాష్‌బోర్డ్ ప్యానెల్, 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా టోగుల్ స్విచ్‌లతో HVAC కంట్రోల్స్, స్టీరింగ్ వేల మరియు డోర్స్ వంటి వాటి మీద కొన్ని కంట్రోల్ బటన్స్ ఉన్నాయి.

ఇంజిన్

2024 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త 1.2 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 90 హార్స్ పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయని సమాచారం. ఖచ్చితమైన గణాంకాలు తెలియాల్సి ఉంది. ఈ కొత్త వెర్షన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్ వంటి వాటిని పొందుతుందని తెలుస్తోంది. అయితే ఆటోమాటిక్ కూడా కొనసాగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌కి గేర్‌బాక్స్‌ను జత చేస్తుందా.. అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇది తప్పకుండా మంచి పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

సేఫ్టీ ఫీచర్స్

భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్న మారుతి స్విఫ్ట్.. సేఫ్టీ పరంగా అంత ఆశాజనకంగా లేదు. కానీ రాబోయే కొత్త జనరేషన్ స్విఫ్ట్ మాత్రం తప్పకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ మోడల్ క్రాష్ టెస్టులో మంచి స్కోరింగ్ సాధించింది. కాబట్టి ఇండియన్ మార్కెట్లో కూడా ఈ కారు తప్పకుండా మంచి స్కోర్ చేస్తుందని భావిస్తున్నాము. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ ఎన్నో లభించనున్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Don’t Miss: మహీంద్రా లాంచ్ చేసిన కొత్త కారు ఇదే.. ధర వివరాలు ఇక్కడ చూడండి

అంచనా ధర

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి స్విఫ్ట్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ దీని ధర రూ. 6.24 లక్షల నుంచి రూ. 8.83 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం. బహుశా ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఖరీదైనదిగా ఉంటుందని భావిస్తున్నాము. ఈ కొత్త కారు దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో మరియు సిట్రోయెన్ సీ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.

మహీంద్రా లాంచ్ చేసిన కొత్త కారు ఇదే.. ధర వివరాలు ఇక్కడ చూడండి

0

Mahindra XUV 3XO Launched in India: దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఎట్టకేలకు మార్కెట్లో కొత్త ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ (XUV 3XO) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? బుకింగ్స్ మరియు డెలివరీ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్ & ధర

భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర లేదా బేస్ వేరియంట్ XUV 3XO MX1 ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). టాప్ వేరియంట్ AX7 L ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). మహీంద్రా కొత్త కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.

బుకింగ్స్ మరియు డెలివరీ

దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైన మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ బుకింగ్స్ 2024 మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు మే 26 నుంచే ప్రారంభమవుతాయని సమాచారం. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు అత్యద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

మహీంద్రా యొక్క కొత్త XUV 3XO చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు బంపర్‌పై పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌తో కూడిన రెండు భాగాలుగా ఉన్న గ్రిల్.. బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. వేణు భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్, సీ ఆకారంలో ఉండే టెయిల్ లాంప్ డార్క్ క్రోమ్‌లో పూర్తి చేయబడిన కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి ఉందులో చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్లేట్ ఇప్పుడు టెయిల్‌గేట్‌కు కాకుండా రియర్ బంపర్ మీద అమర్చబడి ఉండటం చూడవచ్చు.

కొత్త మహీంద్రా XUV 3XO కారు మొత్తం 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి సిట్రిన్ ఎల్లో, డోన్ డస్ట్, నెబ్యులా బ్లూ, డీప్ ఫారెస్ట్, స్టెల్త్ బ్లాక్ మరియు ఎవరెస్టు వైట్ కలర్స్. టాప్ వేరియంట్స్ డ్యూయెల్ టన్న కలర్ ఆప్షన్‌లను పొందుతాయి.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

మహీంద్రా XUV 3XO ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏడు స్పీకర్ హర్మాన్, 380W యాంప్లిఫైయర్‌తో కూడిన కార్టాన్ సిస్టం, అడ్రినాక్స్ కనెక్ట్ ఇన్ కార్ కనెక్టివిటీ సూట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటితో పాటు.. వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ టైప్ సీ ఛార్జర్ మొదలైనవి ఉన్నాయి. మహీంద్రా XUV 3XO బూట్ స్పేస్ 295 లీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది.

ఇంజిన్

XUV 3XO పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 112 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2 లీటర్ T-GDi ఇంజిన్ 130 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. 117 పీఎస్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవన్నీ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి.

Don’t Miss: సింగిల్ ఛార్జ్‌తో 530 కిమీ రేంజ్ అందించే కారుపై రూ.2 లక్షలు డిస్కౌంట్ – పూర్తి వివరాలు

సేఫ్టీ ఫీచర్స్

కొత్త మహీంద్రా XUV 3XO సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), ఐసోఫిక్స్ యాంకర్లు, ఆటో హోల్డ్, హిల్ స్టార్ట్, హిల్ డిసెంట్ అసిస్ట్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు లెవెల్ 2 ఏడిఏఎస్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

సింగిల్ ఛార్జ్‌తో 530 కిమీ రేంజ్ అందించే కారుపై రూ.2 లక్షలు డిస్కౌంట్ – పూర్తి వివరాలు

0

Volvo C40 Recharge Discount:  స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారతీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఇప్పటికే పలు కార్లను లాంచ్ చేసి మంచి అమ్మకాలు పొందుతూ.. దూసుకెళ్తున్న కంపెనీ ఇప్పుడు తన ‘సీ40 రీఛార్జ్’ (C40 Recharge) ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద కస్టమర్లకు ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

డిస్కౌంట్స్

వోల్వో కంపెనీ యొక్క సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ధర రూ. 62.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఇప్పుడు అందిస్తున్న ఈ డిస్కౌంట్ కారణంగా ఈ కారును రూ. 60.95 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ వోల్వో సీ40 రీఛార్జ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తుంది. 2024 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఈ కారు కొనుగోలు మీద రూ. 1 లక్ష తగ్గింపును అందించింది.

నిజానికి వోల్వో కంపెనీ తన సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును రూ. 61.25 లక్షల ప్రారంభ ధరలో లాంచ్ చేసింది. ఆ తరువాత అక్టోబర్ 2023లో ఈ ధర రూ. 62.95 లక్షలు చేరింది. ప్రస్తుతం కంపెనీ రూ. 2 లక్షలు డిస్కౌంట్ అందిస్తుండంతో.. ధర రూ. 60.95 లక్షల వద్ద నిలిచింది.

డిజైన్

వోల్వో సీ40 రీఛార్జ్ చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రూఫ్‌లైన్ కూపే లాంటి ముగింపును పొందుతుంది. రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, సన్నని టెయిల్ లాంప్, ఎల్ఈడీ లైట్ ఎలిమెంట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇది డ్యూయెల్ టోన్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక వైపు విండో లైన్ కూపే లుక్ పొందుతుంది.

ఫీచర్స్

కంపెనీ తన వోల్వో సీ40 రీఛార్జ్ ధరలను తగ్గించడంతో.. ఫీచర్స్ ఏమైనా తగ్గాయా అనే అపోహపడాల్సిన అవసరం లేదు. ఈ కారులో ఉన్న అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 9.0 ఇంచెస్ ఆండ్రాయిడ్ బేస్డ్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టం, వైర్డ్ ఆపిల్ కార్‌ప్లే మరియు డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారులో ఉన్నాయి.

వోల్వో సీ40 రీఛార్జ్ ఈవీలో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. ఇది వాహనం గురించి కావాల్సిన సమాచారాన్ని వినియోగదారునికి అందిస్తుంది. ట్రాఫిక్ పరిస్థితులను సైతం అంచనా వేయడానికి కావలసిన ఆటో వన్ పెడల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన లెవెల్ 3 అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) కూడా ఇందులో లభిస్తుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

బ్యాటరీ & రేంజ్

ఇక బ్యాటరీ విషయానికి వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారులో 78 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 403 Bhp పవర్ మరియు 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమ వాడుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ కావడం గమనార్హం.

Don’t Miss: అమ్మకాల్లో అదరగొట్టిన Nissan Magnite.. గ్లోబల్ మార్కెట్లో కూడా తగ్గని హవా!

అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ మంచి రేంజ్ కూడా అందిస్తుంది. ఛార్జింగ్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 150 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. కాబట్టి ఛార్జింగ్ విషయంలో కూడా వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.

ప్రత్యర్థులు

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5 వంటి ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఇది దాని XC40 రీఛార్జ్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధరల పరంగా దాని కంటే కొంత ఎక్కువని స్పష్టంగా తెలుస్తోంది.

అమ్మకాల్లో అదరగొట్టిన Nissan Magnite.. గ్లోబల్ మార్కెట్లో కూడా తగ్గని హవా!

0

Nissan Magnite Sales Croses 30146 Units: నిస్సాన్ అనగానే ఆధునిక కాలంలో అందరికి గుర్తొచ్చే కారు మాగ్నైట్. ఎందుకంటే భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాల్లో ఏ మాత్రం తగ్గకుండా ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించింది. అలాంటి ఈ కాంపాక్ట్ SUV అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

నిజానికి నిస్సాన్ (Nissan) కంపెనీ దేశీయ విఫణిలో కిక్స్, సన్నీ వంటి అనేక కార్లను విడుదల చేసినప్పటికీ.. ప్రారంభంలో కొంత ఆశాజనక అమ్మకాలను పొంది, కాలక్రమంలో ప్రత్యర్థులను ఎదుర్కోలేకపోయాయి. నేడు ప్రత్యర్థులను ఎదుర్కొని, కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధించిన కారు మాగ్నైట్ (Magnite) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దేశీయ మార్కెట్లో అమ్మకాలు..

2020లో భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కారు ప్రారంభంలో విపరీతమైన అమ్మకాలు సాధించి.. నెలవారీ అమ్మకాల్లో కంపెనీకి మంచి పేరు తీసుకువచ్చింది. మొత్తం మీద కంపెనీ గత జనవరి నాటికి ఒక లక్ష (100000) యూనిట్ల అమ్మకాలను (దేశీయ మార్కెట్లో మాత్రమే) సాధించగలిగింది. జపాన్ బ్రాండ్ అయినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం అదరగొట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ 2023 – 2024 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 30146 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. ఈ సంఖ్య గత ఆర్ధిక సంవత్సరం కంటే కొంత తక్కువగా ఉంది (గత ఆర్థిక సంవత్సరంలో మాగ్నైట్ అమ్మకాలు 32546 యూనిట్లు). అంతకు ముందు లేదా 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో 33905 యూనిట్లను విక్రయించి, అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.

విదేశీ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు..

ఎగుమతుల విషయానికి వస్తే 30000 యూనిట్లకు పైగా నిస్సాన్ మాగ్నైట్ SUVలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నిస్సాన్ యొక్క మాగ్నైట్ SUVకి అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉందని స్పష్టమవుతోంది. ఈ కాంపాక్ట్ SUV ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు ఉగాండా వంటి దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.

నిజానికి ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిస్సాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక SUV నిస్సాన్ మాగ్నైట్. కంపెనీ ఇతర ఏ కార్లను దేశీయ విఫణిలో విక్రయించడం లేదు. ఇదే కంపెనీ యొక్క అమ్మకాలను కొంతమేర వృద్ధి చెందేలా చేసింది.. చేస్తోంది.

ధర..

నిస్సాన్ మాగ్నైట్ SUV ధర రూ. 6 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది రెనాల్ట్ కిగర్ మాదిరిగా ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరసమైన కారు. ఇది 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇవి రెండూ వరుసగా 72 హార్స్ పవర్ మరియు 100 హార్స్ పవర్ డెలివరీ చేస్తాయి. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణంగానే చాలామంది కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ..

దేశీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న కిస సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. వీటిని అన్నింటికి మాగ్నైట్ గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందగలిగిందంటే.. ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.

సిద్దమవుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్..

మార్కెట్లో ఉత్తమ అమ్మకాలను పొందిన నిస్సాన్ మాగ్నైట్ త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. పలుమార్లు టెస్టింగ్ సమయంలో కెమెరాలకు చిక్కింది. బహుశా ఇది అభివృద్ధి చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: భారత్‌లో అడుగుపెట్టిన అమెరికన్ బ్రాండ్ కారు ఇదే!.. పూర్తి వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం మీద అటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. విడుదలకు సిద్దమవుతున్న ఈ కారు అప్డేటెడ్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. కంపెనీ ఈ కారు ధర మరియు ఇతర వివరాలను వెల్లడించాల్సి ఉంది. మరిన్ని వివరాలు అధికారికంగా కంపెనీ త్వరలోనే తెలియజేస్తుందని భావిస్తున్నాము.

భారత్‌లో అడుగుపెట్టిన అమెరికన్ బ్రాండ్ కారు ఇదే!.. పూర్తి వివరాలు

0

Jeep Wrangler Facelift Launched in India: భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు, కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికన్ బ్రాండ్ ‘జీప్’ (Jeep) దేశీయ విఫణిలో ‘రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌’ (Wrangler Facelift) అనే కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, ఇతర పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర, వేరియంట్స్ & బుకింగ్స్ (Price, Variants & Bookings)

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌’ (Jeep Wrangler Facelift) ప్రారంభ ధర రూ. 67.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది అన్‌లిమిటెడ్ మరియు రూబికాన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 67.65 లక్షలు మరియు 71.61 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే రూ. 5 లక్షలు ఎక్కువ. కంపెనీ ఇప్పటికే ఈ కారు 100 కంటే ఎక్కువ ఫ్రీ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. డెలివరీలు మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

డిజైన్, కలర్ ఆప్షన్ (Design, Colour Options)

జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ యొక్క అన్‌లిమిటెడ్ వేరియంట్ బ్లాక్ అవుట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. రూబికాన్ వేరియంట్ బ్లాక్ కలర్ ఫ్రంట్ గ్రిల్ మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఫ్రంట్ విండ్ షీల్డ్ గొరిల్లా గ్లాస్‌తో తయారుచేయబడి ఉంటుంది.

కొత్త రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఫైర్‌క్రాకర్ రెడ్, సార్జ్ గ్రీన్, బ్రైట్ వైట్, బ్లాక్ మరియు గ్రానైట్ క్రిస్టల్ కలర్స్. ఇంతకు ముందు అన్‌లిమిటెడ్ వేరియంట్‌లో సర్జ్ గ్రీన్ అనే కలర్ ఆప్షన్ కూడా ఉండేది. మొత్తం మీద ఇవన్నీ చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. కాబట్టి కస్టమర్ తమకు నచ్చిన వేరియంట్ ఎంచుకోవచ్చు.

ఫీచర్స్ (Features)

జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. ఇది జీప్ యొక్క యూకనెక్ట్ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. డాష్‌బోర్డ్ డిజైన్ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడింది.అంతే కాకుండా 12వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా ఇందులో లభ్సిట్యుయి.

ఇంజిన్ (Engine)

2024 జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. ఇంజిన్ విషయంలో మాత్రం ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి ఇందులో అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 266 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)

మంచి డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగిన కొత్త ‘జీప్ రాంగ్లర్’ నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మరియు ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ప్రత్యర్థులు (Rivals)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 2024 జీప్ రాంగ్లర్ ధర కొంత ఎక్కువ అయినప్పటికీ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము.

Don’t Miss: సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్ – అల్ట్రావయొలెట్ కొత్త బైక్ వచ్చేసింది

ఇండియన్ మార్కెట్లో జీప్ కంపెనీ వాహనాలకు అధిక ప్రజాదరణ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లేదా అప్డేటెడ్ వాహనాలను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే రాంగ్లర్ అప్డేటెడ్ వెర్షన్ లాంచ్ చేసింది. ఈ కారు చూడటానికి అద్భుతంగా ఉండటమే కాకుండా.. వినియోగదారులకు అంతకు మించిన ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందిస్తుంది. దేన్నీ బట్టి చూస్తే ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్ – అల్ట్రావయొలెట్ కొత్త బైక్ వచ్చేసింది

0

Ultraviolette F77 Mach 2 Launched in India: బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కంపెనీ బైకులు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఈ తరుణంలో కంపెనీ ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర ఎంత, వివరాలు, రేంజ్ వంటి వైవరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘ ఎఫ్77 మాక్ 2’ ( F77 Mach 2). ఈ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ కాస్మొటిక్ అప్డేట్స్ మరియు మెరుగైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు దాని ఎఫ్77 (F77) కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బైక్ కూడా ఎఫ్77 ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించబడింది.

ధర & బుకింగ్స్ (Price & Bookings)

అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎఫ్77 మాక్ 2 బైక్ ప్రారంభ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ బైక్ కోసం కష్టమరలు రూ. 5000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు వచ్చే నెల ప్రారంభంలో ప్రారంభమవుతాయి.

వేరియంట్స్ & కలర్ ఆప్షన్స్ (Variants & Colour Options)

కొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 బైక్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ మరియు రీకాన్. వీటి ధరలు వరుసగా రూ. 2.99 లక్షలు మరియు రూ. 3.99 లక్షలు. ఈ ధరలు కేవలం మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తరువాత ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంటుంది.

అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి లైటింగ్ బ్లూ, ఆస్టరాయిడ్ గ్రే, టర్బో రెడ్, ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, స్టెల్త్ గ్రే, కాస్మిక్ బ్లాక్, ప్లాస్మా రెడ్, సూపర్‌సోనిక్ సిల్వర్ మరియు స్టెల్లార్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో కస్టమర్ తనకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

డిజైన్ (Design)

కొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 బైక్.. డిజైన్ పరంగా దాదాపు దాని పాత్ వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే దీని ఛార్జింగ్ పోర్ట్ ప్లాటిక్ మాదిరిగా కాకుండా.. అల్యూమినియం ప్లాప్ పొందుతుంది. కాబట్టి ఇది మరింత దృఢంగా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ చూడగానే చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 5 ఇంచెస్ TFT డిజిటల్ క్లస్టర్, ఆటో డిమ్మింగ్ లైట్స్, హిల్ హోల్డ్, ఏబీఎస్ మరియు డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉంటాయి. టాప్ వేరియంట్ రీకాన్ ఫోర్ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.

మాక్ 2 బైక్ 41 మిమీ USD ఫ్రంట్ పోర్క్, వెనుకవైపు ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోశాక్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 110/70, వెనుక భాగంలో 160/60 టైర్లను కలిగి ఉన్న 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 320 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ రియర్ డిస్క్ బ్రేకులు ఇందులో ఉంటాయి. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

బ్యాటరీ అండ్ రేంజ్ (Battery and Range)

మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీతో 27 kW మోటరుతో వస్తుంది. అయితే రీకాన్ మోడల్ 30 kW మోటరుతో 10.3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ ఒక సింగిల్ చార్జితో 211 కిమీ రేంజ్ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 323 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. రీకాన్ టెన్ లెవెల్ స్విచబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ పొందుతుంది. స్టాండర్డ్ వేరియంట్ కేవలం త్రీ లెవెల్ మాత్రమే పొందుతుంది.

Don’t Miss: ఆస్టన్ మార్టిన్ కొత్త కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

ఎఫ్77 మాక్ 2ని మునుపటి కంటే సురక్షితంగా చేయడానికి సంస్థ ‘పర్ఫామెన్స్ ప్యాక్’ అందిస్తుంది. ఇందులో ఆప్టిమైజ్ చేసిన ఏబీఎస్ సిస్టం ఉంటుంది. ఇది ముందు మాత్రమే ఏబీఎస్ మోడ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ఏబీఎస్‌ను ఆఫ్ చేసి.. ముందువైపు ఏబీఎస్‌ను పనిచేసేలా చేస్తుంది. కంపెనీ ఈ బైకులో రైన్, సిటీ మరియు ట్రాక్ అనే మరో మూడు అదనపు ట్రాక్షన్ కంట్రోల్స్ ప్రవేశపెట్టింది. ‘ఫైండ్ మై ఎఫ్77’ అనే ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది.