Aston Martin Vantage Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ (Aston Martin) భారతీయ మార్కెట్లో ‘వాన్టేజ్’ (Vantage) పేరుతో ఓ సరికొత్త కారును అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత, డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి.. ఇంజిన్ పనితీరు ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర (Price)
భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్’ కారు ప్రారంభ ధర రూ. 3.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కారు ప్రపంచ మార్కెట్లో రెండు నెలల క్రితమే ఆవిష్కరించబడింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉండటం వల్ల, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
డిజైన్ (Design)
ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ కూపే మాదిరిగా చాలా విస్తృతంగా ఉంటుంది. ముందువైపు బంపర్ యొక్క వెడల్పు అంతటా విస్తరించి ఉండే పెద్ద గ్రిల్, అంచుల వద్ద కొత్త ఇన్‌టేక్‌లు ఉన్నాయి. గుండ్రంగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు మునుపటి మోడల్స్ కంటే పెద్దవిగా ఉన్నాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్ కూడా కొత్తగా ఉంది. ఇది దాదాపు చూడటానికి వన్ 77 సూపర్ కారును పోలి ఉంటుందని తెలుస్తోంది.
అప్డేటెడ్ డిజైన్ పొందిన రియర్ ప్రొఫైల్, బంపర్ మరియు డిఫ్యూజర్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే 30 మిమీ ఎక్కువ వెడల్పును పొందుతుంది. ఫ్రేమ్‌లెస్ మిర్రర్లు, ఫ్లష్ ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ వంటివి ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఈ కారు డిజైన్ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది.
ఫీచర్స్ (Features)
కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ యొక్క కాక్‌పిట్ దాదాపు డీబీ12ను పోలి ఉంటుంది. కాబట్టి ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పొందుతుంది. 3డీ లైవ్ మ్యాపింగ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ మిర్రరింగ్, లాస్ట్ మెయిల్ న్యావిగేషన్ వంటి వాటితో పాటు ఇందులో క్లైమేట్ కంట్రోల్, గేర్ సెలక్టర్, డ్రైవ్ కంట్రోల్ స్విచ్, లేన్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్ మరియు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్ వివరాలు (Engine Details)
కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ (Aston Martin Vantage) 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 665 హార్స్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ వరకు ఉంటుంది. ఇది 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
ప్రత్యర్థులు (Rivals)
కంపెనీ ఈ కారును ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో లాంచ్ చేస్తుందా? లేదా అనేదానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. అయితే హైబ్రిడ్ వెర్షన్ రూపంలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ కారు భారతీయ మార్కెట్లో బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ జీటీ మరియు పోర్షే 911 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.
Don’t Miss: ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?
భారతదేశంలో సాధారణ కార్లకు ఉన్నంత డిమాండ్ లగ్జరీ కార్లకు లేదు. ఎందుకంటే ఎక్కువ ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. అంతే కాకుండా వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖరీదైన కార్లను దాదాపు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు మరియు ఇతర ప్రముఖు మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి ఇది సాధారణ కార్ల మాదిరిగా అమ్ముడుపోవు అనేది అందరికి తెలిసిన విషయమే.