37.1 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 43

BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

0

BYD Seal EV  Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నసీల్ ఎలక్ట్రిక్ కారును ‘బీవైడీ’ (బిల్డ్ యూర్స్ డ్రీమ్) కంపెనీ ఎట్టకేలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర ఎంత? డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయనే వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధర (BYD Seal EV Variants and Price)

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 41 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా), టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). సీల్ ఈవీ డైనమిక్, ప్రీమియం మరియు పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది.

  • బీవైడీ సీల్ ఈవీ డైనమిక్ – రూ. 41 లక్షలు
  • బీవైడీ సీల్ ఈవీ ప్రీమియం – రూ. 45.55 లక్షలు
  • బీవైడీ సీల్ ఈవీ పర్ఫామెన్స్ – రూ. 53 లక్షలు

డిజైన్ (BYD Seal EV Design)

అద్భుతమైన డిజైన్ కలిగిన బీవైడీ సీల్ ‘ఓషన్ ఈస్తటిక్స్’ డిజైన్ లాంగ్వేజ్ పొందుతుంది. ఇది ఆల్ గ్లాస్ రూఫ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, బంపర్‌లోకి విస్తరించి ఉన్న సీ షేప్ ఎలిమెంట్స్ కలిగిన స్వెప్ట్ బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ ఉన్నాయి. వెనుకవైపు వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్ చూడవచ్చు.

19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4800 మిమీ, వెడల్పు 1875 మిమీ, ఎత్తు 1460 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే మరియు కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.

ఫీచర్స్ (BYD Seal EV Features)

సీల్ ఈవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 16.6 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్‌, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లో క్రిస్టల్ టోగుల్ డ్రైవ్ సెలెక్టర్, హీటెడ్ విండ్‌స్క్రీన్, ఆడియో సిస్టమ్ కోసం వాల్యూమ్ కంట్రోల్ వంటి వాటితో పాటు రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ల వంటి ఫంక్షన్‌ల కోసం కొన్ని ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్, రేంజ్ మరియు బ్యాటరీ (BYD Seal EV Powertrain, Range And Battery)

కొత్త బీవైడీ సీల్ ఈవీ రెండు బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. అవి 61.44 కిలోవాట్ మరియు 82.56 కిలోవాట్. ఈ రెండూ కూడా కంపెనీ యొక్క పేటెంట్ బ్లేడ్ టెక్నాలజీని పొందుతాయి. 61.44 కిలోవాట్ బ్యాటరీ ఒకే మోటారును కలిగి 204 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 510 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఇక రెండో బ్యాటరీ 82.56 కిలోవాట్ విషయానికి వస్తే.. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD) మరియు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంటుంది. సింగిల్ మోటార్ RWD రూపంలో 312 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ మోటార్ AWD కాన్ఫిగరేషన్‌లో 530 హార్స్ పవర్ మరియు 670 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది సింగిల్ చార్జితో 650 కిమీ మరియు 580 కిమీ రేంజ్ అందిస్తాయి. టాప్ స్పెక్ వేరియంట్ కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Don’t Miss: మీకు తెలుసా.. Skoda లాంచ్ చేయనున్న నాలుగు కొత్త కార్లు ఇవే!

ఛార్జింగ్ & వారంటీ (BYD Seal EV Charging & Warranty)

సీల్ ఈవీ 150 kw ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అయితే స్టాండర్డ్ 11 kW ఏసీ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 8.6 గంటల సమయం పడుతుంది. కంపెనీ బ్యాటరీ మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. ఇక మోటార్ మీద 8 సంవత్సరాలు / 150000 కిమీ వారంటే అందిస్తుంది.

భారత్‌లో Ford కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త కార్లు ఇవే – చూసారా!

0

Upcoming Ford Cars For Indian Market 2024: భారత్ వదిలి వెళ్లిన అమెరికన్ బ్రాండ్ కంపెనీ ఫోర్డ్ (Ford) మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ దేశీయ మార్కెట్లో మూడు కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇందులో 2024 ఫోర్డ్ ఎండీవర్ న్యూ జనరేషన్, మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్ మరియు కాంపాక్ట్ SUV ఉన్నాయి.

2024 ఫోర్డ్ ఎండీవర్ న్యూ జనరేషన్ (Ford Endeavour New Generation)

ఫోర్డ్ కంపెనీ భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనున్న కొత్త కార్లలో ఒకటి 2024 న్యూ జనరేషన్ ఎండీవర్. ఇప్పటికే సంస్థ ఈ మోడల్ కోసం పేటెంట్‌ను దాఖలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ SUV మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ కొత్త SUV అప్డేటెడ్ డిజైన్ కలిగి సీ షేప్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, పెద్ద గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందుతుంది.

సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద అల్లాయ్ వీల్స్ మరియు క్రోమ్ యాక్సెంట్‌ల సెట్‌ను పొందుతుంది. వెనుకవైపు ఇది సరికొత్త ఎల్ఈడీ టైల్‌లైట్‌ల సెట్‌ను పొందుతుంది. మొత్తం మీద ఈ కారు డిజైన్ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుందని ఇప్పుడే అర్థమవుతోంది. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో 12 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా కొత్త స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ గేజ్ క్లస్టర్‌ను కూడా ఉంటాయి.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇది అదే పాత సింగిల్ టర్బో ఇంజన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఇంజిన్ 170 bhp పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఎంజి గ్లోస్టర్ మరియు స్కోడా కొడియాక్‌ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఫోర్డ్ మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్ (Ford Mustang Mach-E)

కంపెనీ లాంచ్ చేయనున్న రెండో మోడల్ ఫోర్డ్ మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికి మంచి అమ్మకాలు పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ SVU త్వరలోనే భారతీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ SUV ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్‌తో సొగసైన ఫ్రంట్ ఎండ్‌ను పొందుతుంది. ఇది 18 నుంచి 20 ఇంచెస్ పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది. వెనుక భాగంలో మస్టాంగ్ స్పోర్ట్స్ కారు మాదిరిగానే ఎల్ఈడీ టైల్‌లైట్‌లను పొందుతుంది.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. మస్టాంగ్ మాక్ ఎలక్ట్రిక్ కారు విభిన్న ఎంపికలతో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. రియర్ వీల్ డ్రైవ్ మోడల్‌లు 265 నుంచి 288 bhp పవర్ డెలివరీ చేస్తాయి. ఆల్ వీల్ డ్రైవ్ మోడ్స్ 344 నుంచి 470 bhp పవర్ అందిస్తాయి. రేంజ్ మరియు బ్యాటరీ వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ కారు ధర కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

ఫోర్డ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (Ford Compact SUV)

ఇక చివరగా ఫోర్డ్ కంపెనీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనున్న కారు కాంపాక్ట్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న తరుణంలో ఫోర్డ్ కంపెనీ ఆ విభాగంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి మరియు ఇండియన్ మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ SUV డిజైన్ కోసం పేటెంట్ దాఖలు చేసినట్లు ఇటీవల తెలిసింది. రానున్న రోజుల్లో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

ఫోర్డ్ కంపెనీ

అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ (Ford) కప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ప్రఖ్యాతి పొందినప్పటికీ.. కాలక్రమంలో కొత్తగా మార్కెట్లో అడుగుపెట్టిన ప్రత్యర్ధ కంపెనీల ఉత్పత్తుల వల్ల క్రమంగా క్షిణించింది. కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంతో విఫలం అవ్వడం మరియు ప్రత్యర్థులు సరైన పోటీ ఇవ్వకపోవడం కారణంగా కంపెనీ దేశీయ విఫణిలో మనుగడ సాగించలేకపోయింది. దీంతో కంపెనీ దేశాన్ని వదిలిపెట్టింది. అయితే మళ్ళీ కొత్త ఉత్పత్తుల విడుదలతో (లాంచ్) ఇండియన్ మార్కెట్లో మళ్ళీ పూర్వ వైభవం పొందటానికి సన్నద్ధమవుతోంది.

Skoda Slavia కొత్త ఎడిషన్ – కేవలం 500 మందికి మాత్రమే..

0

Skoda Slavia Style Edition launched in India: చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. స్కోడా లాంచ్ చేసిన కొత్త ఎడిషన్ పేరు ‘స్లావియా స్టైల్ ఎడిషన్’ (Slavia Style Edition). ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు ధర వంటి ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Slavia Style Edition Price)

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ‘స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్’ ధర రూ. 19.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ స్లావియా టాప్ ఎడిషన్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. అయితే కంపెనీ ఈ కారుని కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. కావున ఈ కారును కేవలం 500 మంది కస్టమర్లు మాత్రమే ఈ కారును కొనడానికి వీలుపడుతుంది.

స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్‌ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్ మరియు టోర్నాడో రెడ్ కలర్స్. ఇప్పటికే స్లావియా మ్యాట్ ఎడిషన్, ఎలిగాన్స్ ఎడిషన్ మరియు లావా బ్లూ ఎడిషన్ వంటి ప్రత్యేక ఎడిషన్‌లను పొందింది.

డిజైన్ (Skoda Slavia Style Edition Design)

కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ చూడటానికి మంచి డిజైన్ కలిగి అద్భుతంగా ఉంటుంది. స్టైల్ ఎడిషన్ యొక్క వింగ్ మిర్రర్స్, బీ పిల్లర్లు మరియు రూఫ్ వంటివి బ్లాక్ అవుట్ చేయబడ్డాయి. బీ పిల్లర్ మరియు స్టీరింగ్ వీల్‌పై ‘ఎడిషన్’ బ్యాడ్జింగ్ మరియు స్కఫ్ ప్లేట్‌లపై ‘స్టైల్’ బ్రాండింగ్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ (Slavia Style Edition Features)

స్కోడా స్లావియా స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే స్లావియాలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇందులో డ్యూయల్ డ్యాష్‌బోర్డ్ కెమెరాను అందించారు. ఈ ఫీచర్ వోక్స్‌వ్యాగన్ టైగన్ ట్రైల్ ఎడిషన్‌లో పరిచయం చేయబడింది. ఈ ఫీచర్ మాత్రమే కాకుండా స్లావియా స్టైల్ ఎడిషన్‌లో సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ (Slavia Style Edition Engine)

కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ ఒకే పవర్‌ట్రెయిన్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. అదే 1.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 150 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ DSG ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది కేవలం 8.96 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ప్రత్యర్థులు (Slavia Style Edition Rivals)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ‘స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్’ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ వెర్నా , ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ మరియు మారుతి సియాజ్ వంటి మిడ్ సైజ్ సెడాన్‌లకు ప్రత్యర్థిగా ఉంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

స్కోడా కంపెనీ లాంచ్ చేసిన కొత్త కారు స్టైల్ ఎడిషన్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. అయితే మార్కెట్లో రోజు రోజుకి కొత్త కొత్త కార్లు పుట్టుకొస్తున్న సమయంలో ఈ లేటెస్ట్ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అయితే ఈ ఆధునిక ఎడిషన్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

మార్కెట్లో అడుగుపెట్టిన Hero Mavrick 440 – ధర ఎంతో తెలుసా!

0

Hero Mavrick 440 Launched in India: భారతదేశంలో అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’ (Hero Motocorp) దేశీయ విఫణిలో ఎట్టకేలకు ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘మావ్రిక్ 440’ (Mavrick). ఈ బైక్ ధర, వేరియంట్స్ మరియు ఇతర వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Hero Mavrick 440 Price)

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త హీరో మావ్రిక్ 440 మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి బేస్, మిడ్ మరియు టాప్ వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 1.99 లక్షలు, రూ. 2.14 లక్షలు, రూ. 2.24 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా).

  • హీరో మావ్రిక్ 440 బేస్ – రూ. 1.99 లక్షలు
  • హీరో మావ్రిక్ 440 మిడ్ – రూ. 2.14 లక్షలు
  • హీరో మావ్రిక్ 440 టాప్ – రూ. 2.24 లక్షలు

ఇంజిన్ (Hero Mavrick 440 Engine)

హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మాదిరిగానే కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ అదే 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 6000 rpm వద్ద 26 హార్స్ పవర్ మరియు 4000 rpm వద్ద 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. కావున ఈ బైక్ మంచి పనితీరును అందించే అవకాశం ఉంది.

డిజైన్ అండ్ ఫీచర్స్ (Hero Mavrick 440 Design & Features)

మంచి డిజైన్ కలిగిన ఈ బైక్ రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, బార్ ఎండ్ మిర్రర్స్ మరియు చిన్న టెయిల్ సెక్షన్‌తో కూడిన సింగిల్ పీస్ సీట్ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ మరియు మెసేజ్ అలర్ట్‌లకు సపోర్ట్ చేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి. ఇందులో USB C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

బుకింగ్స్ అండ్ డెలివరీ (Hero Mavrick 440 Bookings And Delivery)

హీరో మోటోకార్ప్ కంపెనీ ఈ కొత్త బైక్ కోసం రూ. 5000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున డెలివరీలు 2024 ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చి 15 లోపల ఈ బైక్ బుక్ చేసుకున్నవారు కంపెనీ అందించే రూ. 10000 విలువైన యాక్ససరీస్ ఉచితంగా పొందవచ్చు. ఆ తరువాత (మర్చి 15 తరువాత) బుక్ చేసుకున్న వారికి ఈ యాక్ససరీస్ లభించే అవకాశం లేదు.

Don’t Miss: Skoda Slavia కొత్త ఎడిషన్ – కేవలం 500 మందికి మాత్రమే..

ప్రత్యర్థులు (Hero Mavrick 440 Rivals)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సీబీ350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఈ మావ్రిక్ 440 అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

Mercedes Benz: రూ.50.50 లక్షల కారు లాంచ్ చేసిన బెంజ్ కంపెనీ – పూర్తి వివరాలు

0

Mercedes Benz GLA Facelift Launched In India: భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ తన ఉనికిని మరింత విస్తరించడంతో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లేదా అప్డేటెడ్ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ కొత్త బెంజ్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త కారు 2024 GLA (2024 జీఎల్ఏ). ఇది చిన్న కాస్మెటిక్ ట్వీక్‌లతో మరియు కొంత అప్డేటెడ్ ఇంటీరియర్‌ పొందుతుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 50.50 లక్షలు (ఎక్స్ షో రూమ్ ఇండియా). ఇది మూడు ట్రిమ్‌లలో.. రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

వేరియంట్స్ & ధరలు (Mercedes Benz GLA Facelift Variants & Price)
  • GLA 200 – రూ. 50.50 లక్షలు
  • GLA 220d 4Matic – రూ. 54.75 లక్షలు
  • GLA 220d 4Matic AMG లైన్ – రూ. 56.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్, ఇండియా)
డిజైన్ (Mercedes Benz GLA Facelift Design)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. అయితే ఇది అప్డేటెడ్ మోడల్ కాబట్టి చిన్న చిన్న సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో హెడ్‌ల్యాంప్‌లు, కనుబొమ్మల వంటి ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌ వంటివి ఉంటాయి. అంతే కాకుండా రివైజ్డ్ బంపర్‌లోని ఆప్రాన్ మరియు వీల్ ఆర్చ్ క్లాడింగ్ బాడీ కలర్‌లో పూర్తి చేయబడ్డాయి. వెనుక వైపున ఉన్న టెయిల్ ల్యాంప్‌లు ఎల్ఈడీ ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి.

ఫీచర్స్ (Mercedes Benz GLA Facelift Features)

కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ ఇప్పుడు స్పెక్ట్రల్ బ్లూ అనే కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక లోపలి భాగంలో చెప్పుకోదగ్గ పెద్ద అప్డేట్స్ లేదనే చెప్పాలి. కాబట్టి ఇందులో టచ్ బేస్డ్ కంట్రోల్‌లతో కొత్త AMG స్పెక్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ ప్యాసింజర్ సైడ్ కార్బన్ ఫైబర్ లాంటి ఇన్సర్ట్‌ను పొందుతుంది. సెంటర్ కన్సోల్ రివైజ్ చేయబడిన స్విచ్ గేర్ మరియు మరింత స్టోరేజ్‌తో చక్కగా ఉంది.

ఈ అప్డేటెడ్ మోడల్ దాని మునుపటి కారులో రెండు 10.25 ఇంచెస్ కనెక్టెడ్ స్క్రీన్‌లు ఉంటాయి. ఈ స్క్రీన్‌లు అప్‌డేట్ చేయబడిన MBUX సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ట్విన్ పేన్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, మెమరీతో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త డిజిటల్ కీ వంటివి ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటో హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

ఇంజన్ & స్పెక్స్ (Mercedes Benz GLA Facelift Engine & Specs)

2024 మెర్సిడెస్ బెంజ్ GLA కారు 163 హార్స్ పవర్ మరియు 270 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ యూనిట్ మరియు 190 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ యూనిట్ పొందుతుంది.

పెట్రోల్ యూనిట్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే. డీజిల్ ఇంజిన్ 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Don’t Miss: Volkswagen: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం! ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావండోయ్..

ప్రత్యర్థులు (Mercedes Benz GLA Facelift Rivals)

ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త బెంజ్ కారు ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3 మరియు వోల్వో XC40 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

కేవలం 660 మందికి మాత్రమే ఈ Audi కారు.. ఎందుకంటే?

0

Audi RS6 Avant GT Limited Edition Revealed: ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘ఆడి’ (Audi) విఫణిలో ‘ఆర్ఎస్6 అవంత్ జీటీ’ (RS6 Avant GT) ఆవిష్కరించింది. వైడ్ రీచింగ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సమయంలోనే సంస్థ ఈ కొత్త ఎడిషన్ ప్రారంభించింది. ఆడి కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

660 యూనిట్లు (660 Units Only)

ఆడి కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు కేవలం లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే లభిస్తుంది. అంటే ఈ కారును కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 660 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. చూడటానికి అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఏరో ట్వీక్‌లు, బెస్పోక్ కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లు, రెట్రో లివరీ వంటి వాటిని పొందుతుంది. కావున ఇది స్టాండర్డ్ కారు కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త ఆడి ఆర్ఎస్6 అవంత్ జీటీ కారు 1989 IMSA GTO రేస్ కార్ నుంచి ప్రేరణ పొందిన ఆడి అప్రెంటిస్‌ల బృందం 2020లో రూపొందించారు. ఇది ఆర్ఎస్6 యొక్క టాప్ రేంజ్ పెర్ఫామెన్స్ వెర్షన్‌పై ఆధారపడింది. బానెట్, వింగ్ మరియు వీల్స్ కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించిన మొదటి ఆడి ఆర్ఎస్6 జీటీ. ఇది చూడటానికి ఆర్ఎస్6 అవంత్ జీటీ జీటీఓ కాన్సెప్ట్‌కు వీలైనంత దగ్గరగా కనిపించేలా రూపొందించబడింది.

రూప్ రైల్స్ లేదు

ఆడి ఆర్ఎస్6 అవంత్ జీటీ లిమిటెడ్ ఎడిషన్ వైట్ అండ్ రెడ్, గ్రే కలర్ పొందుతుంది. డబుల్ వింగ్, ఫంక్షనల్ రియర్ డిఫ్యూజర్ మరియు మరింత దూకుడుగా ఉండే ఫ్రంట్ స్ప్లిటర్ వంటి ఏరో రివిజన్‌లను కూడా ఇందులో చూడవచ్చు. ఈ కారులో ఇప్పుడు రూప్ రైల్స్ లేదు. 22 ఇంచెస్ వీల్స్ ఏరో ఆప్టిమైజ్ చేయబడ్డాయి. ఇంటీరియర్‌లోని వివిధ భాగాలలో RS6 GT ఇన్స్క్రిప్షన్ చూడవచ్చు.

సీట్లు స్వెడ్ లాంటి డైనామికాలో అపోల్స్టర్ చేయబడ్డాయి. సీట్లు, స్టీరింగ్ వీల్ మరియు ఫ్లోర్ మ్యాట్‌లపై రెడ్ అండ్ బ్రాంజ్ స్టిచ్చింగ్ చూడవచ్చు. లోపలి భాగంలో మోడల్ నంబర్‌ను సూచించే ప్లేట్ ఉంటుంది. డైనమిక్ మోడ్‌లో కారును మరింత చురుకైనదిగా చేయడానికి సస్పెన్షన్ మరియు రియర్ డిఫరెన్షియల్ రీవర్క్ చేయబడ్డాయి. కాయిల్‌ఓవర్‌లు 10 మి.మీ తగ్గించి, స్టాండర్డ్ కార్ల కంటే బిగుతుగా ఉంటాయి.

ఇంజిన్ (Audi RS6 Avant GT Limited Edition Engine)

ఆర్ఎస్6 దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది పవర్ డెలివరీ చేస్తుంది. ఈ ఇంజిన్ 630 హార్స్ పవర్ మరియు 848 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కావు గరిష్ట వేగం గంటకు 305 కిమీ కావడం గమనార్హం.

Don’t Miss: మార్కెట్లో అడుగుపెట్టిన Hero Mavrick 440 – ధర ఎంతో తెలుసా!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆడి కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త వాహనాలను విడుదల చేస్తూ.. వాహన ప్రేమికులను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ మార్కెట్లో ఓ సుస్థిరమైన మరియు ప్రత్యేకమైన గుర్తింపు కూడా పొందింది. ఈ కారణంగానే ఆడి అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని ఆధునిక ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

BMW Z4 M40i: కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్

0

Mamta Mohandas Buys New BMW Z4 M40i: మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas) గురించి మలయాళీ ప్రేక్షలుకు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. యమదొంగ, చింతకాయల రవి, కృష్ణార్జున, కేడీ వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయిన ‘మమతా మోహన్‌దాస్’కు బైకులు మరియు కార్లు అంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఈమె ఖరీదైన బైకులు మరియు కార్లు కొనుగోలు చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుకి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2021లో పోర్స్చే కారును కొనుగోలు చేసిన మమతా మోహన్‌దాస్ ఇప్పుడు సుమారు రూ. కోటి విలువైన ‘బీఎండబ్ల్యూ’ (BMW) కారును కొనుగోలు చేసింది. మమతా మోహన్‌దాస్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు ‘జెడ్4’ స్పోర్ట్స్ కారు. స్పోర్ట్స్ కారు డెలివరీకి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

కేరళలోని బీఎండబ్ల్యూ కంపెనీ అధీకృత డీలర్ అయిన బీఎండబ్ల్యూ ఈవీఎమ్ ఆటోక్రాఫ్ట్ ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. నటి కొన్ని వారాల క్రితం ఈ కారును కొనుగోలు చేసింది. వీడియో మాత్రం ఇప్పుడు తెరమీదకు వచ్చింది.

వీడియోలో గమనించినట్లయితే మమతా మోహన్‌దాస్ టాటా హెక్సా కారులో బిఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్ వద్దకు రావడం మనం చూడవచ్చు. హెక్సా కారులో వచ్చిన నటి డీలర్‌షిప్‌లోకి వెళ్లి ఆమె తల్లితో కలిసి సిబ్బందిని కలుస్తుంది. ఆమె సేల్స్ రిప్రజెంటేటివ్‌ని కలిసి అన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తుంది.

కారు డెలివరీలో భాగంగానే ఆమె కేక్ కట్ చేసి.. కారు మీద ఉన్న క్లాత్ తీసేస్తారు. ఆ తరువాత ఆమె కారులో కూర్చుని.. రూఫ్ (ఓపెన్ టాప్) ఓపెన్ చేస్తుంది. థండర్‌నైట్ మెటాలిక్ షేడ్‌లో కలిపించే ఈ కారు చూపరులను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటోంది.

బీఎండబ్ల్యూ జెడ్4 ఎమ్40ఐ (BMW Z4 M40i)

మమతా మోహన్‌దాస్ కొనుగోలు చేసిన కారు బీఎండబ్ల్యూ జెడ్4 ఎమ్40ఐ (BMW Z4 M40i). నిజానికి ఈ కారుని కంపెనీ 2023లోనే దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు సెరియం గ్రే పెయింటెడ్ గ్రిల్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది మిర్రర్ క్యాప్స్‌తో పాటు ట్రాపెజోయిడల్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. బోనెట్, హెక్సాగోనల్ ఇన్నర్ స్ట్రక్చర్ కలిగిన కిడ్నీ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు, స్లీకర్-లుకింగ్ హెడ్‌ల్యాంప్‌లు ఇందులో చూడవచ్చు.

బీఎండబ్ల్యూ జెడ్4 అనేది ఫాబ్రిక్ సాఫ్ట్ టాప్‌తో వస్తుంది. ఇది కేవలం 10 సెకన్లలో ఎలక్ట్రానిక్‌గా ఓపెన్ అవుతుంది లేదా క్లోజ్ అవుతుంది. ఇది 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. లోపల బ్లాక్, మాగ్మా రెడ్, కాగ్నాక్ అనే మూడు అపోల్స్ట్రే ఎంపికలను పొందుతుంది.

బీఎండబ్ల్యూ జెడ్4 ఎమ్40ఐ ఫీచర్స్  (BMW Z4 M40i Features)

ఈ కారులో డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, మెమరీ ఫంక్షన్‌ డ్రైవర్ సీట్, ముందు ప్రయాణీకుల కోసం పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Don’t Miss: Skoda Slavia కొత్త ఎడిషన్ – కేవలం 500 మందికి మాత్రమే..

కొత్త బీఎండబ్ల్యూ జెడ్ ఎమ్40ఐ స్పోర్ట్స్ కారు 3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 335 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ కావడం గమనార్హం.

Hyundai: కనీవినీ ఎరుగని బెనిఫీట్స్ – హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్

0

Hyundai Discounts On February 2024: 2024 ప్రారంభంలోనే కొన్ని సంస్థలు తమ వాహనాల ధరలను అమాంతం పెంచిన విషయాలను గతంలో తెలుసుకున్నాం. అయితే కొత్త ఏడాది ప్రారంభమై కేవలం ఒక నెల రోజులు పూర్తయిన వెంటనే.. కొన్ని సంస్థలు ధరలను తగ్గించడం మొదలెట్టేశాయి. ఇప్పటికే ఈ జాబితాలో మహీంద్రా, హోండా వంటి కంపెనీలు చేరాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఈ జాబితాలో అడుగుపెట్టింది. హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన కార్ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson)

కంపెనీ తన 2023 టక్సన్ మోడల్ మీద ఇప్పుడు 2 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ అఫ్సర్ వంటివి లభిస్తాయి. అయితే 2024 మోడల్ కొనుగోలుపైన కేవలం రూ. 50000 క్యాష్ డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.

హ్యుందాయ్ టక్సన్ కారు ADAS వంటి ఆధునిక టెక్నాలజీ కలిగి.. రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది 156 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ చేత జతచేయబడి ఉంటుంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ మాత్రం 186 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ.. 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ పొందుతుంది. టక్సన్ ధరలు మార్కెట్లో రూ. 29.02 లక్షల నుంచి రూ. 35.95 లక్షల మధ్య ఉంటాయి.

హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)

దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెర్నా కొనుగోలుపైనా సంస్థ రూ. 55000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ. 30000 క్యాష్ డిస్కౌంట్ రూ. 25000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. 2024 మోడల్ వెర్నా కొనుగోలుపైన సంస్థ 35000 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)

గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపైన హ్యుందాయ్ రూ. 48000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ. 35000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3000 ప్రయోజనాలు లభిస్తాయి. 2024 మోడల్ కొనుగోలుపైన సంస్థ రూ. 30000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది.

డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ మరియు CNG ఇంజిన్లను కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. మారుతి స్విఫ్ట్ మరియు టాటా టియాగో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.23 లక్షల మధ్య ఉంటుంది.

హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar)

అల్కజార్ కొనుగోలుపైన ఫిబ్రవరిలో రూ. 45000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 25000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది. 2024 మోడల్ కొనుగోలుపైన రూ. 35000 మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఆరా కొనుగోలుపైన రూ. 33000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.ఇందులో రూ. 20000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ వంటి వాటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.05 లక్షల మధ్య ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

ఎక్కువమంది ప్రజలకు ఇష్టమైన హ్యుందాయ్ కార్లలో ఒకటైన ‘వెన్యూ’ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 30000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు మల్టిపుల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 10.12 లక్షల నుంచి రూ. 13.43 లక్షల మధ్య ఉంది.

ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న ఖరీదైన లగ్జరీ బైక్ – కేవలం 350 మందికి మాత్రమే..

NOTE: హ్యుందాయ్ కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్‌లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ బెనిఫిట్స్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. మరిన్ని ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..

0

MG Motors Discounts: 2024 ప్రారంభం నుంచి చాలా కంపెనీలు తమ ధరలను భారీగా పెంచుకుంటూ పోతూ ఉంటే.. ‘ఎంజీ మోటార్ ఇండియా’ (MG Motor India) మాత్రం ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇంతకీ ఏ వేరియంట్ మీద, ఎంత వరకు ధరలు తగ్గించింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)

కంపెనీ ఎంపిక చేసిన కార్ల జాబితాలో ఒకటి కామెట్ ఈవీ. ఈ కార్ల ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 8.58 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ తన బేస్ మోడల్ మీద రూ. 99,000 తగ్గింపును ప్రకటించింది. కాగా ఇప్పుడు హై-స్పెక్ ప్లే మరియు ప్లష్ ట్రిమ్‌ల మీద రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు అందిస్తుంది.

ఎంజీ కామెట్ ఈవీ పేస్
➤పాత ధర – రూ. 7.98 లక్షలు
➤కొత్త ధర – రూ. 6.99 లక్షలు
➤తగ్గింపు – రూ. 99000

MG కామెట్ ఈవీ ప్లే
➤పాత ధర – రూ. 9.28 లక్షలు
➤కొత్త ధర – రూ. 7.88 లక్షలు
➤తగ్గింపు – రూ. 1.40 లక్షలు

ఎంజి కామెట్ ఈవీ ప్లస్
➤పాత ధర – రూ. 9.98 లక్షలు
➤కొత్త ధర – రూ. 8.58 లక్షలు
➤తగ్గింపు – రూ. 1.40 లక్షలు

తగ్గిన ధరలను గమనిస్తే.. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారుగా ఎంజి కామెట్ ఈవీ ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టాటా టియాగో ఈవీ ధరలతో (రూ. 8.29 లక్షల – రూ. 12.09 లక్షలు) పోలిస్తే.. కామెట్ ఈవీ ధరలు చాలా తక్కువని అర్థమవుతోంది.

రెండు డోర్స్ కలిగిన ఎంజీ కామెట్ ఈవీ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ.. అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ కారు మంచి పనితీరుని అందిస్తూ.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 42 హార్స్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని ప్రత్యర్థి టియాగో ఈవీ రేంజ్ 250 కిమీ అని తెలుస్తోంది. ఇందులో 19.2 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 61 హార్స్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)

MG మోటార్ కంపెనీ కేవలం కామెట్ ఈవీ ధర మాత్రమే కాకుండా మరో ఎలక్ట్రిక్ కారు జెడ్ఎస్ ఈవీ ధరలను కూడా భారీగానే తగ్గించింది. ప్రస్తుతం ఉన్న ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎక్స్‌క్లూజివ్ ప్రో ట్రిమ్‌ల ధరలు వరుసగా రూ. 2.9 లక్షలు, రూ. 1.02 లక్షలు మరియు రూ. 92000 తగ్గాయి.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎగ్జిక్యూటివ్
➤పాత ధర – రూ. 18.98 లక్షలు (ఈ వేరియంట్ మీద ఎలాంటి తగ్గింపు లేదు)

ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్
➤పాత ధర – రూ. 22.88 లక్షలు
➤కొత్త ధర – రూ. 19.98 లక్షలు
➤తగ్గింపు – రూ. 2.90 లక్షలు

Don’t Miss: మార్కెట్లో అడుగుపెట్టిన Hero Mavrick 440 – ధర ఎంతో తెలుసా!

ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్
➤పాత ధర – రూ. 25.00 లక్షలు
➤కొత్త ధర – రూ. 23.98 లక్షలు
➤తగ్గింపు – రూ. 1.02 లక్షలు

ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ ప్రో
➤పాత ధర – రూ. 25.90 లక్షలు
➤కొత్త ధర – రూ. 24.98 లక్షలు
➤తగ్గింపు – రూ. 92000 లక్షలు

ఒక్క చూపుతోనే ఫిదా చేస్తున్న బాలీవుడ్ సింగర్ కొత్త కారు – ఫోటోలు వైరల్

0

Bollywood Singer Shaan Buys Mercedes Benz EQS 580: సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మార్కెట్లో విడుదలయ్యే లగ్జరీ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారని విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన బాలీవుడ్ సింగర్ ‘షాన్’ (Shaan) ఒక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ధర (Mercedes Benz EQS 580 Price)

సింగర్ షాన్ కొనుగోలు చేసిన కారు ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘ఈక్యూఎస్ 580’ (EQS 580). దీని ధర రూ. 1.55 కోట్లు. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ చార్జితో ఏకంగా 857 కిమీ రేంజ్ అందిస్తుంది.

షాన్ మరియు అతని కుటుంబ సభ్యులకు.. సంబంధిత డీలర్షిప్ సిబ్బంది ఈ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారుని డెలివరీ చేశారు. సొడలైట్ బ్లూ క్లాసీ షేడ్‌ కలర్ కారుని షాన్ కొనుగోలు చేశారు. ఫొటోలలో గమనించినట్లైతే.. డీలర్‌షిప్ వద్ద కొత్త మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ సెడాన్ కవర్‌లను తీయడం, కారుకి హిందూ ఆచారాల ప్రకారం పూజ చేయడం, ఆ తరువాత కుటుంబ సమేతంగా కేక్‌ కట్‌ చేయడం వంటివి గమనించవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 (Mercedes Benz EQS 580)

సింగర్ షాన్ కొనుగోలు చేసిన బెంజ్ ఈక్యూఎస్ 580 విషయానికి వస్తే.. ఇది కంపెనీ లైనప్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు అని తెలుస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ సెడాన్.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారుని సెలబ్రిటీలు ఎగబడి మరీ కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి ఉండటమే అని తెలుస్తోంది.

రేంజ్ (Mercedes Benz EQS 580 Range)

బెంజ్ ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ సెడాన్ 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ చార్జితో 857 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 31 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరర్కు ఛార్జ్ చేసుకోగలదు.

ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ సెడాన్ రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో ఒకటి ఇరుసుపై అమర్చబడి ఉంటుంది, మరొకటి వెనుక భాగంలో ఉంటుంది. కాబట్టి ఇది ఆల్ వీల్ డ్రైవ్ సెడాన్‌గా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్లు 523 Bhp పవర్ మరియు 856 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాప్ స్పీడ్ (Mercedes Benz EQs 580 Top Speed)

బెంజ్ ఈక్యూఎస్ 580 సెడాన్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ కావడం గమనార్హం. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

Don’t Miss: కేవలం 660 మందికి మాత్రమే ఈ Audi కారు.. ఎందుకంటే?

ఈక్యూఎస్ 580 ఎలక్ట్రిక్ కారు ముందు సీట్లకు మసాజ్ ఫంక్షన్, బర్మెస్టర్ 3డి సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్ట్రేషన్, వెనుక సీటులో ఉన్నవారి కోసం MBUX టాబ్లెట్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ డిపార్చర్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి మరిన్ని ఆధునిక ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

భారతదేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి మరీ కొనుగోలు చేసే లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ కార్లు చెప్పుకోదగ్గవి. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు లేదా ప్రముఖుల మొదటి ఆప్షన్ తప్పకుండా బెంజ్ అయి ఉంటుంది. అయితే సెలబ్రిటీలు బెంజ్ కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.