30.2 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 45

పెట్రోల్ కార్లకంటే సీఎన్‌జీ కార్ల వినియోగం పెరగటానికి కారణం ఇదేనా! ఆసక్తికర విషయాలు!!

0

CNG Cars Are Safe As Petrol Engine Cars: భారతీయ మార్కెట్లో ప్రస్తుతం CNG వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అత్యధిక మైలేజ్ మాత్రమే కాకుండా.. సేఫ్టీకి పెద్ద పీట వేయడమే. ఈ CNG వాహనాలకు సంబంధించి దేశీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ‘మోహన్ సావర్కర్’ (Mohan Savarkar) కొన్ని విషయాలను వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సేఫ్టీ ప్రధానం కాబట్టి సీఎన్‌జీ ట్యాంక్స్ పెట్రోల్ ట్యాంకుల కంటే చాలా పటిష్టంగా ఉంటాయి. ఈ మెరుగైన నిర్మాణమే ప్రమాదాల సమయంలో లీక్ వంటి ప్రమాదాలను తగ్గించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడటంలో ఉపయోగపడుతుంది.

పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ దహన ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉంటుంది. కాబట్టి మంటలు లేదా జ్వలన సంభవించినప్పుడు, CNG మంటలను పట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

భద్రతకు ప్రాధాన్యం

సీఎన్‌జీ ఒక వాయువు కాబట్టి పెట్రోల్ వంటి ద్రవ ఇంధనాల మాదిరిగా కాకుండా లీక్ అయితే వాతావరణంలోకి త్వరగా వెదజల్లుతుంది. ఇది చెప్పుకోదగ్గ ఒక ముఖ్యమైన భద్రతా లక్షణం, ఎందుకంటే ఇది లీక్ అయినప్పుడు వెంటనే ప్రమాదానికి కారణం కాకుండా ఉంటుంది. తమ సీఎన్‌జీ వాహనాలు అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా టాటా మోటార్స్ తీసుకున్న భద్రతా చర్యలను లోతుగా పరిశీలిస్తూ, కంపెనీ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సావర్కర్ వివరించారు.

ఏదైనా సమస్యలు గుర్తిస్తే ఆటోమేటిక్‌గా CNG సిస్టమ్‌ను మూసివేసే టెక్నాలజీని కూడా టాటా మోటార్స్ అమలులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఏదైనా సమస్య గుర్తిస్తే.. సంస్థ దానిని వెంటనే పరిష్కరిస్తుంది. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువవుతుంది.

టాటా వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ సిలిండర్లు కఠినమైన పరీక్షలకు గురవుతాయని.. ఇందులో భాగంగానే 240 బార్ మరియు 340 బార్‌ల తీవ్ర పీడనం వద్ద నీరు మరియు నైట్రోజన్ రెండింటితో పరీక్షించబడతాయి. ఇవి సాధారణ వినియోగంలో ఎదుర్కొనే ఒత్తిడి కంటే చాలా ఎక్కువ. ఈ కఠినమైన పరీక్ష CNG సిలిండర్ల సమగ్రతకు హామీ ఇస్తుందని సావర్కర్ పునరుద్ఘాటించారు.

గవర్నమెంట్ సపోర్ట్

భారతదేశంలో సీఎన్‌జీ సమృద్ధిగా అందుబాటులో ఉండడమే CNG వాహనాల యొక్క వినియోగానికి ప్రధాన కారణమని సావర్కర్ పేర్కొన్నాడు. అంతే కాకుండా పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సీఎన్‌జీ కార్ల మైలేజ్ కూడా అధికంగా ఉండటం ఇక్కడ గమనించదలచిన విషయం.

సీఎన్‌జీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఆటో మేకర్లను ప్రోత్సహిస్తోంది. దీంతో సీఎన్‌జీ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం మునుపటికంటే ఎక్కువగా ఉంది. సిఎన్‌జి వాహనాల ఆర్థిక ప్రయోజనాల కూడా ఎక్కువగానే ఉంటాయని సావర్కర్ వెల్లడించాడు. అయితే బేస్ వేరియంట్‌లలో మాత్రమే సిఎన్‌జిని అందించే కొంతమంది తయారీదారులు, టాటా మోటార్స్ కస్టమర్లు తమ సిఎన్‌జి మోడల్‌లలో తమ పెట్రోల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే అదే ఫీచర్లను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది అని సావర్కర్ పేర్కొన్నారు.

Don’t Miss: ఫిదా చేస్తున్న హోండా (Honda) కొత్త ఎలక్ట్రిక్ కార్లు – లాంచ్ ఎప్పుడో తెలుసా?

బూట్ స్పేస్ ఛాలెంజ్‌

ఇక చివరగా సీఎన్‌జీ కార్లలో ఎదుర్కోవాల్సిన ఓ చిన్న సమస్య బూట్ స్పేస్. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ కార్లలో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సీఎన్‌జీ ట్యాంక్ బూట్ స్పేస్‌లో అమర్చడం వల్ల బూట్ స్పేస్ తగ్గుతుంది. అయితే దీనిని పరిష్కరించడానికి కూడా కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సీఎన్‌జీ ట్యాంకుని కారు ఫ్రంట్ బంపర్‌లో ఫిక్స్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కావున రానున్న రోజుల్లో బూట్ స్పేస్ సమస్య కూడా ఉండదు.

భారత్‌లో అడుగుపెట్టిన కొత్త జర్మన్ లగ్జరీ కారు – ధర ఎంతో తెలుసా?

0

Mercedes Benz GLS Facelift Launched: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ‘జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్‌’ (GLS Facelift) లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ లగ్జరీ కారు ధర, వేరియంట్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధరలు (Variants And Price)
  • మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450 పెట్రోల్ – రూ. 1.32 కోట్లు (ఎక్స్ షోరూమ్)
  • మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డీ డీజిల్ – రూ. 1.37 కోట్లు (ఎక్స్ షోరూమ్)
కలర్ ఆప్షన్స్ (Colour Option)
  • అబ్సిడియన్ బ్లాక్
  • హై-టెక్ సిల్వర్
  • సోడలైట్ బ్లూ
  • సెలెనైట్ గ్రే
  • పోలార్ వైట్

డిజైన్ (Design)

గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ లగ్జరీ SUV ఎట్టకేలకు ఇప్పటికి మార్కెట్లో లాంచ్ అయింది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు అతిపెద్ద టాక్ పాయింట్ గ్రిల్ పొందుతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో నాలుగు క్షితిజ సమాంతర క్రోమ్ స్ట్రిప్స్, కొత్త డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (DRL), రియర్ టెయిల్ లైట్లపై కొత్త బ్లాక్ ప్యాటర్న్ సిగ్నేచర్ మరియు రీస్టైల్డ్ ఫ్రంట్ బంపర్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్షణీయంగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంటీరియర్ అపోల్స్ట్రే ఎంపికలను పొందుతుంది. అవి బ్లాక్, బేజ్ మరియు బ్రౌన్ కలర్స్. ఇవన్నీ కూడా ఫాక్స్ లెదర్‌తో పూర్తయింది. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్‌ పొందుతుంది. ఇందులో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ బటన్‌లు ఉంటాయి. సుమారు 5.2 మీటర్స్ పొడవు, 1.96 మీటర్ల వెడల్పు కలిగిన ఈ కారు 360 డిగ్రీ కెమెరా మాత్రమే కాకుండా ADAS ఫీచర్స్ పొందుతుంది.

కొత్త జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ SUV హీటెడ్ అండ్ కూల్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో హెడ్ రెస్ట్రెయింట్‌లు, స్థలాన్ని పెంచడానికి ముందు సీటు యొక్క కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్‌బ్లైండ్‌లు, రెండు 11.6 ఇంచెస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు మొదలైనవన్నీ కూడా ఇందులో లభిస్తాయి.

ఇంజన్ మరియు పవర్‌ట్రెయిన్ (Engine And Powertrain)

కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ రెండు పవర్‌ట్రైన్‌ల ఎంపికలను పొందుతుంది. అవి 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 381 హార్స్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 367 హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు కార్లు మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడ్డాయి.

ఇందులోని హైబ్రిడ్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) అదనంగా 20 హార్స్ పవర్ బూస్ట్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేయడానికి 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తుంది. ఇది 500 మిమీ వాటార్ వేడింగ్ డెప్త్‌ను కూడా కలిగి ఉంటుంది.

ప్రత్యర్థులు (Rivals)

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో వోల్వో ఎక్స్‌సీ90, ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఈ బెంజ్ కారు కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

Don’t Miss: పెట్రోల్ కార్లకంటే సీఎన్‌జీ కార్ల వినియోగం పెరగటానికి కారణం ఇదేనా! ఆసక్తికర విషయాలు!!

భారతీయ మార్కెట్లో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని మెర్సిడెస్ బెంజ్ ప్రతి ఏటా కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు కూడా జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇది అద్భుతమైన అమ్మకాలు పొందుతుందని మరియు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము. బెంజ్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరించడంతో భాగంగానే కొత్త కార్లను (ఫ్యూయెల్ & ఎలక్ట్రిక్) లాంచ్ చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

కొత్త ఫీచర్లతో ప్రత్యర్థులను చిత్తుచేయనున్న ఏథర్ కొత్త స్కూటర్.. ఇదే!

0

Ather 450 Apex Launches in India: అనేక టీజర్ల తరువాత బెంగళూరు బేస్డ్ కంపెనీ ‘ఏథర్’ (Ather) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన ‘450 అపెక్స్‌’ (450 Apex) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత? రేంజ్ ఎలా ఉంది? బ్యాటరీ ఛార్జింగ్ వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్ (Price And Bookings)

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఏథర్ 450 అపెక్స్‌ ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. డెలివరీలు 2024 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

డిజైన్ (Design)

కొత్త ఏథర్ 450 అపెక్స్‌ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి సీటు ఎత్తు, వీల్‌బేస్, టైర్ సైజులు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో కొత్త ఎన్‌క్లోజ్డ్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ సిస్టం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర ఏథర్ మోడల్‌లలోకి అందుబాటులో రానున్నట్లు సమాచారం.

చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. బాడీ ప్యానెల్‌ ఓ స్పెషల్ ఇండియమ్ బ్లూ కలర్‌ను పొందుతుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే వెనుక భాగం పారదర్శకంగా ఉంటుంది. అంటే దాని లోపల ఉన్న పరికలు బయటకు కనిపిస్తాయి. కాబట్టి ఇందులో ఆరంజ్ కలర్ చాసిస్ చూడవచ్చు.

ఫీచర్స్ (Features)

2024 ఏథర్ 450 అపెక్స్‌ డిజైన్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీచర్స్ కూడా పొందుతాయి. ఇందులో ఎల్ఈడీ ఇల్యూమినేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి వాటికి సహకరించే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ఆటో బ్రైట్‌నెస్, పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్, ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్, కోస్టింగ్ రీజెనరేటివ్ బ్రేకింగ్ మరియు మ్యాజిక్ ట్విస్ట్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

మ్యాజిక్ ట్విస్ట్ అనేది రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ యొక్క ఆధునిక వెర్షన్ అని కంపెనీ చెబుతోంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ & రేంజ్ (Battery And Range)

కొత్త ఏథర్ 450 అపెక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇందులోని రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా ఈ స్కూటర్ రేంజ్ 157 కిమీ వరకు ఉంటుంది. ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ చేరుకుంటుంది. వేగం పరంగా ఇది దాని మునుపటి మోడల్ కంటే కొంత ముందు ఉంటుందని తెలుస్తోంది.

బ్రేకింగ్ సిస్టం మరియు సస్పెన్షన్స్ (Braking System And Suspension)

ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు మోనోషాక్‌ కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 200 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 190 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. ముందు మరియు వెనుక వైపు 12 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 22 లీటర్స్ వరకు ఉంటుంది. దీని బరువు 111.6 కేజీలు.

Don’t Miss: Mercedes Benz: భారత్‌లో అడుగుపెట్టిన కొత్త జర్మన్ లగ్జరీ కారు – ధర ఎంతో తెలుసా?

కొత్త ఏథర్ 450 అపెక్స్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 21000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. అయితే ఈ స్కూటర్ కొనుగోలుమీద ఎటువంటి సబ్సిడీ లభించదు. అయితే కంపెనీ ఈ స్కూటర్ మీద 5 సంవత్సరాల వారంటీ మరియు బ్యాటరీ మీద 60000 కిమీ వారంటీ అందిస్తుంది.

బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

0

Deepika Padukone Birthday Special Car Collection: ప్రముఖ నటి, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలో చెప్పుకోదగ్గ ‘దీపికా పదుకొనే’ (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ కాలంలో ఎంతో పాపులర్ సాధించిన ఈమె 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచి 2022 టైమ్100 ఇంపాక్ట్ అవార్డును సైతం కైవసం చేసుకుంది.

1986 జనవరి 05న కోపెన్‌హాగన్‌లో జన్మించింది. అయితే ఈమె బెంగళూరులో పెరిగినట్లు సమాచారం. ఈమె తండ్రి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణె. తండ్రి బ్యాడ్మింటన్ ఆడటంతో ఈమె కూడా యుక్త వయసులోనే జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో బ్యాడ్మింటన్ ఆడింది.

ఫ్యాషన్ మీద ఉన్న మక్కువతో బ్యాడ్మింటన్ వదిలేసింది. ఆ తరువాత చలన చిత్ర సీమలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 2006లో కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత 2007లో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటించిన చిత్ర సీమలో తనదైన ముద్ర వేసి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత 2018లో తన సహనటుడు రణ్‌వీర్ సింగ్‌ను ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకుంది.

దీపిక పదుకొనె కార్ కలెక్షన్స్ (Deepika Padukone Car Collection)

సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే దీపిక పదుకొనె ఖరీదైన అన్యదేశ్య కార్లను కూడా ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఈమె వద్ద జర్మన్, ఇటాలియన్ సూపర్ కార్లు ఉన్నాయి.

ఆడి క్యూ7 (Audi Q7)

భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్ల జాబితాలో ఆడి కార్లు చెప్పుకోదగ్గవి. దీపిక పదుకొనె గ్యారేజిలో చేరిన మొదటి కారు ఆడి కంపెనీకి చెందిన క్యూ7. ఒకప్పటి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారుని చాలామంది సెలబ్రిటీలు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. దీని ధర సుమారు రూ. 80 లక్షలు. అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ SUV మంచి పనితీరుని అందిస్తుంది. దీపిక వద్ద ఉన్న ఆడి క్యూ7 సిల్వర్ కలర్ షేడ్ పొందిన ఉండటం గమనించవచ్చు. ఈ కారు మార్కెట్లో 2007 నుంచి 2015వరకు భారతీయ మార్కెయిలో అందుబాటులో ఉంది.

ఆడి ఏ8ఎల్ (Audi A8L)

దీపిక పదుకొనె వద్ద ఉన్న మరో ఆడి కంపెనీ కారు ఏ8ఎల్. సుమారు రూ. 1.20 కోట్లు ఖరీదైన ఈ కారు సీబీయూ మార్గం ద్వారా భారతీయ తీరాల్లో అడుగుపెట్టింది. ఏ8 అనేది లాంగ్ వీల్‌బేస్ వెర్షన్. ఈ సెడాన్ పరిమాణం పరంగా విశాలంగా ఉండి, మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఆడి ఏ8ఎల్ కూడా ఒకటి కావడం విశేషం.

మినీ కూపర్ కన్వర్టిబుల్ (Mini Cooper Convertible)

నటి దీపిక గ్యారేజిలోని మరో ఖరీదైన కారు ‘మినీ కూపర్ కన్వర్టిబుల్’. రూ. 45 లక్షల ఖరీదైన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారుని డ్రైవ్ చేస్తూ దీపిక పలుమార్లు కనిపించింది. ఎలక్ట్రిక్ బ్లూ కలర్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు కస్టమ్-మేడ్ వైట్ కలర్ ఇంటీరియర్‌లతో వస్తుంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండు డోర్లు కలిగి ఉన్న ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes Maybach S500)

దీపిక పదుకొనె గ్యారేజిలోని మరో జర్మన్ బ్రాండ్ కారు ‘మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500’. సుమారు రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ మొత్తం లైనప్‌లో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన సెడాన్. ఈ కారు కొనుగోలు చేసిన మొదటి నటి దీపిక కావడం విశేషం. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

Don’t Miss: Mahindra కార్లపై భారీ డిస్కౌంట్స్ – ఏకంగా రూ.1.25 లక్షల వరకు..

మొత్తం ఆస్తి (Networth)

దీపికా పదుకొణె నికర విలువ 2023 నాటికి సుమారు 60 మిలియన్ డాలర్లు అని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 499 కోట్లు కంటే ఎక్కువ. ఈమె లోరియల్, నైక్ మరియు తనిష్క్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లతో పని చేసింది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 12 నుంచి రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంటుందని సమాచారం.

2023లో ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు – ఎందుకంటే?

0

Top 5 Best Electric Cars in India 2023: భారతీయ మార్కెట్లో ఈ ఏడాది (2023) లెక్కకు మించిన కార్లు లాంచ్ అయ్యాయి. అందులో పెట్రోల్, డీజిల్, CNG కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ సంవత్సరం దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎంజి కామెట్ ఈవీ (MG Comet EV)

దేశీయ మార్కెట్లో 2023లో లాంచ్ అయిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో ‘ఎంజి మోటార్స్’ (MG Motors) కంపెనీకి కామెట్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ. 7.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో ఏకంగా 230 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను సాధించి టాటా టియాగో ఈవీకి ప్రత్యర్థిగా నిలిచింది.

10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులోనే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో వన్ టచ్ తాంబూలం అండ్ ఫోల్డ్ ఫీచర్స్ లభిస్తాయి. రియర్ సీట్లు 50:50 స్ప్లిట్ పొందుతాయి. ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Nexon EV Facelift)

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క ‘నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్’ చెప్పుకోదగ్గ మోడల్. రూ. 14.74 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఒక సింగిల్ ఛార్జి మీద 465 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు ప్రారంభం నుంచి కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొంది, మంచి అమ్మకాలు పొందుతూ సాగుతోంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్.

సిట్రోయెన్ ఈసీ3 (Citroen eC3)

ఇండియన్ మార్కెట్లో ఈ ఏడాది విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ యొక్క ‘ఈసీ3’ కూడా చెప్పుకోదగ్గ మోడల్. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఒక సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది.

సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 107 కిమీ వరకు ఉంటుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5)

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల జాబితాలో ఒకటైన హ్యుందాయ్ కంపెనీకి చెందిన ‘ఐయోనిక్ 5’ ఎలక్ట్రిక్ కారు కూడా ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన పాపులర్ మోడల్. రూ.44.95 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ కారు కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారుని ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ కలిగి 214 Bhp పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 631 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

Don’t Miss: Mahindra కార్లపై భారీ డిస్కౌంట్స్ – ఏకంగా రూ.1.25 లక్షల వరకు..

మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400)

ఎక్స్‌యూవీ400 కూడా ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు. మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు సింగిల్ చార్జితో ఏకంగా 456 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

2023లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్.. వీరే!

0

Top Actress Remuneration in 2023 Nayanthara To Sreeleela: ఆధునిక కాలంలో చాలామంది సినిమా హీరోలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వందల కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదలైన వారు ఉన్నాయి. అయితే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయికలు ఎవరు, వారి రెమ్యునరేషన్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హీరోయిన్స్ రెమ్యునరేషన్స్

త్రిష (Trisha)  ప్రారంభం నుంచి ఓ మంచి క్రేజుతో ముందుకెళ్లిన ఈ భామ దాదాపు రెండు దశాబ్దాలు తిరుగు లేకుండా టాలీవుడ్ చిత్ర సీమలో చక్రం తిప్పింది. ఆ తరువాత కొన్ని రోజులు అంతగా అవకాశాలు లేకపోవడంతో చిన్న బ్రేక్ తీసుకుంది. అయితే 96 అనే తమిళ సినిమాతో మళ్ళీ పూర్వ వైభవం పొందింది. కాగా పొన్నియన్ సెల్వన్ మూవీతో మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు ఆరు సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఈమె ఒక సినిమాకు ఏకంగా రూ. 12 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం.

నయనతార (Nayanthara) – ఈ పేరుకి సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయమే అవసరం లేదు. తెలుగులో లక్ష్మీ, బాస్ వంటి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించింది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం.

అనుష్క శెట్టి (Anushka Shetty) – కర్ణాటకలో పుట్టిన అనుష్క అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ పరిశ్రమలో ఎనలేని పాపులారిటీ పొందింది. బాహుబలి సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న స్వీటీ ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో సినిమాకు ఈమె రూ. 6 కోట్లు వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

సమంత (Samantha) – ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఇటీవల ఖుషి సినిమాతో సక్సెస్ కొట్టేసింది. విజయ దేవరకొండ సరసన నటించిన ఈమె చాలా రోజుల తరువాత మళ్ళీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్లు వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

రష్మిక మందన్న (Rashmika Mandanna) – అటు తెలుగు ఇటు హిందీ సినిమాల్లో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక ప్రారంభం నుంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. గీత గోవిందం సినిమాతో ఎంతో ఫేమస్ అయిన ఈమె పుష్ప సినిమాతో మరో మెట్టు సక్సెస్ సొంతం చేసుకుంది. కాగా ఈమె ఒక్కో సినిమాకు రూ. 7 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

కీర్తి సురేష్ (Keerthy Suresh) – నేను శైలజ సినిమాతోనే భారీ క్రేజు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాగా ఇప్పటికి మహా నటి సినిమాతో మహానటిగా గుర్తింపు పొందిన కీర్తి ఇప్పులు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈమె ఒక్కో సినిమాకు రూ. 2.5 కోట్లు నుంచి రూ. 4 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

తమన్నా భాటియా (Tamannaah Bhatia) – తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో తనదైన రీతిలో ప్రేక్షలకున మైమరిపిస్తున్న తమన్నా ఇటీవల భోళా శంకర్ మరియు జైలర్ సినిమాలతో సందడి చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

కాజల్ అగార్వల్ (Kajal Aggarwal) – తెలుగు చితా సీమలో యువరాణిగా ప్రసిద్ధి పొందిన కాజల్ ప్రస్తుతం పెళ్ళై కొడుకు పుట్టిన తరువాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు ఈమె భగవంత్ కేసరి మరియు ఇండియన్ 2 అనే చిత్రాల్లో నటిస్తోంది. కాగా కాజల్ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

శ్రీలీల (Sreeleela) – లేటెస్ట్ తెలుగు సినిమాల్లో ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తోంది. గత ఏడాది కాలంలోనే రెండు మూడు సినిమాల్లో నటించి ఎంతో పాపులర్ కథానాయకిగా పేరు తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 2 నుంచి రూ. 2.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

భారత్‌లో విడుదలయ్యే కొరియన్ బ్రాండ్ కార్లు ఇవే.. ధరలు ఎలా ఉన్నాయంటే?

0

Upcoming Kia Cars In India 2024: సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. సెల్టోస్, కారెన్స్, సోనెట్ మొదలైన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న కంపెనీ వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త కియా కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ (Kia Sonet Facelift)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కియా సోనెట్ వచ్చే ఏడాది ప్రారంభంలో.. అంటే 2024 జనవరి నెలలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ధర వద్ద ఈ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. కంపెనీ ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది, ఆసక్తికలిగిన ప్రజలు రూ. 25వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు లాంచ్ అయిన తరువాత మొదలవుతాయి.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఏడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా 10 కలర్ ఆప్షన్లలో లభించనున్నట్లు సమాచారం. ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్, 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కియా ఈవీ9 (Kia EV9)

ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన అమ్మకాలు పొందుతున్న కియా ఈవీ6 మాదిరిగానే కంపెనీ మరో ఎలక్ట్రిక్ కారుని ఈవీ9 రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2024 ఏప్రిల్ – మే మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. కోటి వరకు ఉండవచ్చు.

నిజానికి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ లేటెస్ట్ మోడల్ 77.4 కిలోవాట్ మరియు 99.8 కిలోవాట్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్ పొందనున్నట్లు సమాచారం. ఇది ఒక సింగిల్ చార్జితో సుమారు 563 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది ఈ ఎలక్ట్రిక్ కారు రియర్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికలో రానున్నట్లు సమాచారం.

కియా కార్నివాల్ (Kia Carnival)

బిఎస్6 2.0 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందకపోవడం వల్ల కియా కార్నివాల్ ఈ ఏడాది మార్కెట్లో నిలిపివేయబడింది. అయితే కంపెనీ దీనినే నిర్దిష్ట షరతులకు అనుగుణంగా 2024 మధ్యలో రూ. 25 లక్షల నుంచి రూ. 26 లక్షల ధర మధ్య ‘కియా కేఏ4’ (Kia KA4) రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండనున్నట్లు సమాచారం. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు రెండు 12.3 ఇంచెస్ డిస్‌ప్లేల వంటి వాటితో అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లో 7 సీటర్, 9 సీటర్ మరియు 11 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభించనున్నట్లు సమాచారం.

Don’t Miss: షాట్‌గన్ 650 లాంచ్ చేసిన Royal Enfield – ఇక ప్రత్యర్థులకు చుక్కలే..

కియా క్లావిస్ – ఏవై (Kia Clavis – AY)

దేశీయ మార్కెట్లో కియా మోటార్స్ లాంచ్ చేయనున్న సరి కొత్త మోడల్ ‘కియా క్లావిస్-ఏవై’ దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండనున్నట్లు సమాచారం. ఈ కారు 2024 చివరలో లేదా 2025 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

భారతీయ విఫణిలో అడుగుపెట్టనున్న ఈ కారు సోనెట్ మరియు సెల్టోస్ మధ్యలో ఉండనుంది. కియా క్లావిస్ – ఏవై కారు డిజైన్ మరియు ఫీచర్స్ గురించి కంపెనీ మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందించేలా కంపెనీ తాయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

దివికేగిన ‘కెప్టెన్’ – విజయకాంత్ గురించి ఆసక్తిర విషయాలు

0

Interesting Facts About Captain Vijayakanth: విజయకాంత్‌ (Vijayakanth).. ఈ పేరు కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు కూడా సుపరిచయమే. 1952 ఆగష్టు 25న మధురైలో కేఎన్ అళగర్‌స్వామి మరియు ఆండాళ్ అళగర్‌స్వామి దంపతులకు జన్మించిన విజయకాంత్ అసలు పేరు ‘నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి’. అయితే ఈయన సినిమాల్లోకి వచ్చిన తరువాత ‘విజయకాంత్’అనే పేరుతోనే అందరికి పరిచమయ్యారు.

తమిళ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయకాంత్ ఈ రోజు మదురైలో ఒక ఆసుపత్రిలో కన్ను మూసారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. అనేక సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానుల మనసుస గెలుచుకున్న ‘కెప్టెన్ విజయకాంత్’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూద్దాం..

సినీరంగ ప్రవేశం..

27 సంవత్సరాల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన విజయకాంత్ మొదటి సినిమా ‘ఇనిక్కుమ్ ఇలమై’ కాగా, ఆయన చివరి చిత్రం ‘సగప్తం’ అని తెలుస్తోంది. పదుల సంఖ్యల సినిమాల్లో నటించిన విజయకాంత్ సుమారు 20 కంటే ఎక్కువ సినిమాల్లో పోలీసుగా కనిపించారు. దేశ భక్తి, సందేశాత్మక చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపే విజయకాంత్.. అలాంటి సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.

భార్య & పిల్లలు

విజయకాంత్ 1990 జనవరి 31న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. వీరికి షణ్ముగ పాండియన్‌ మరియు విజయ్ ప్రభాకర్ అళగర్‌స్వామి అనే ఇద్దరు కుమారు ఉన్నారు. షణ్ముగ పాండియన్‌ 2015లో తెరమీదికి వచ్చిన సగప్తం మరియు 2018లో విడుదలైన మధుర వీరన్ సినిమాల్లో నటించినట్లు సమాచారం.

రాజకీయ రంగప్రవేశం

సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకున్న విజయకాంత్.. రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 2005లో DMDK (Desiya Murpokku Dravida Kazhagam) అనే పార్టీ స్థాపించి వరుసగా రెండు సార్లు ‘విరుధాచలం మరియు రిషివండియం’ నియోజకవర్గాల నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2011 నుంచి 2016 వరకు తమిళనాడు రాజకీయ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

ముక్కుసూటి తనం మరియు నిజాయితీ

కెప్టెన్ విజయకాంత్ కేవలం తమిళ నటుడు మాత్రమే కాకుండా.. నిర్మాత కూడా. ఈయన రాజకీయ నాయకుడుగా పేద ప్రజలకు తనవంతు సాయం చేశారు. మొత్తం మీద విజయకాంత్ తమిళనాడులో ప్రముఖ వ్యక్తిగా, ముక్కుసూటి తనం మరియు నిజాయితీ గల వ్యక్తిత్వానికి పేరుగాంచాడు. క్రమశిక్షణ మరియు సామాజిక న్యాయం పట్ల అతని నిబద్ధతకు కూడా చెప్పుకోదగ్గదే.

కెప్టెన్ అనే పేరు ఎందుకొచ్చిందంటే

1991లో విజయకాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకరన్ చిత్రంలో అతడి పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ సినిమాలో విజయకాంత్ అటవీ అధికారిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అప్పటి నుంచి ఈయన పేరుకు ముందు ‘కెప్టెన్’ అని చేర్చడం జరిగింది.

కార్ కలెక్షన్స్

సినిమాల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన విజయకాంత్ ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నారు. ఇందులో క్లాసిక్ కార్ల దగ్గర నుంచి ప్రీమియం కార్ల వరకు ఉన్నాయి.

  • ఆడి క్యూ7 (Audi Q7) – రూ. 87 లక్షలు
  • టయోటా ఇన్నోవా క్రిష్టా (Toyota Innova Crysta) – రూ. 25 లక్షలు
  • బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5) – రూ. 96 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ ఎస్350 (Mercedes Benz S350) – రూ. 1.2 కోట్లు
  • ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour) – రూ. 36 లక్షలు
  • వోల్వో ఎస్90 (Volvo S90) – రూ. 66 లక్షలు
  • హ్యుందాయ్ శాంటా ఎస్ఈ (Hyundai Santa SE) – రూ. 26 లక్షలు

ఆస్తులు విలువ (Networth)

నటుడు విజయకాంత్ విలాసవంతమైన జీవితం గడిపిన నటులలో ఒకరు. అయితే ఈయన మొదటి సంపాదన 1970లలో కేవలం రూ. 200 మాత్రమే కావడం గమనార్హం. ఆ తరువాత ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు నుంచి రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం విజయకాంత్ మొత్తం ఆస్తుల విలువ 6 నుంచి 7 మిలియన్ డాలర్లు ఉండవచ్చని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 50 నుంచి రూ. 60 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది.

Don’t Miss: 2023లో ఎక్కువ రెమ్యునరేషన్ (Remuneration) తీసుకున్న హీరోయిన్స్.. వీరే!

విజయకాంత్ సినిమాలు, రాజకీయాల్లో మాత్రమే కాకుండా హీరో మోటోకార్ప్, పెప్సీ మరియు పాండ్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా కూడా కొంత మొత్తంలో డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది.

స్విమ్మింగ్ పూల్ మరియు గార్డెన్‌తో కూడిన విజయకాంత్‌కు చెందిన ఖరీదైన ఇంటిని 2023 జూలైలో రూ. 4.25 కోట్లకు వేలంలో ఉంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కాలేజీ స్థలాన్ని కూడా వేలం పాడనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నుంచి రూ. 5.52 కోట్లు లోన్ తీసుకున్నట్లు.. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్యాంకు ఇంటిని వేలంలో ఉంచినట్లు సమాచారం.

సునీల్ శెట్టి మనసు దోచిన బుల్లి కారు! ధర చాలా తక్కువ..

0

Bollywood Actor Sunil Shetty New Car MG Comet EV:  సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘సునీల్ శెట్టి’ (Sunil Shetty) ఓ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సునీల్ శెట్టి కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు మోరిస్ గ్యారేజ్ (MG) కంపెనీకి చెందిన ‘ఎంజి కామెట్’ (MG Comet). దేశీయ మార్కెట్లో ఈ ఏడాది విడుదలైన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు.

నటుడు సునీల్ శెట్టి కొనుగోలు చేసిన ఈ కారుకి సంబంధించిన ఫోటోలు ఎంజి మోటార్ ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ‘నా మొదటి ఈవీ, ఎంజి కామెట్ లవ్ ఇట్’ అని చూడవచ్చు. స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్, క్యాండీ వైట్ విత్ స్టార్రి బ్లాక్ మరియు యాపిల్ గ్రీన్ విత్ స్టార్రీ బ్లాక్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో సునీల్ శెట్టి కొనుగోలు చేసిన కారు స్టార్రీ బ్లాక్ షేడ్‌లో చూడచక్కగా ఉంటుంది.

ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)

భారతీయ మార్కెట్లో విడుదలైన తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గది, ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన ‘కామెట్ ఈవీ’ ఒకటి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అయితే ఇది కేవలం రెండు డోర్లను మాత్రమే కాలిగి ఉండి, నాలుగు సీట్లను పొందుతుంది.

ఎంజి కామెట్ ఈవీ క్వాడ్రిసైకిల్ బేస్డ్ బాడీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌లైట్స్, వాహనం యొక్క వెడల్పులో విస్తరించి ఉన్న ఎల్ఈడీ ఎలిమెంట్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, పొడవైన సీ పిల్లర్ మరియు డ్యూయల్-టోన్ పెయింట్ జాబ్ వంటి ఉన్నత స్థాయి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపల భాగంలో 2 స్పోక్ స్టీరింగ్‌తో పాటు ట్విన్ 10.25 ఇంచెస్ స్క్రీన్‌లతో వస్తుంది. అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ కీ, పవర్ విండోస్, గ్రే ఇంటీరియర్ థీమ్ మరియు లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్‌ వంటివి ఉంటాయి.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది 42 పీఎస్ పవర్ 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. కామెట్ ఈవీ 3.3 కిలోవాట్ ఛార్జర్‌ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది.

Don’t Miss: దివికేగిన ‘కెప్టెన్’ – విజయకాంత్ గురించి ఆసక్తిర విషయాలు

సునీల్ శెట్టి కార్ కలెక్షన్ (Suniel Shetty Car Collection)

నటుడు సునీల్ శెట్టి గ్యారేజిలో తాజాగా చేరిన ఎంజి కామెట్ మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎమ్‌జీ (Mercedes Benz G63 AMG), ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, హమ్మర్ హెచ్2, బీఎండబ్ల్యు ఎక్స్5, జాగ్వార్ ఎక్స్ఎఫ్, జీప్ రాంగ్లర్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350, మెర్సిడెస్ ఈ క్లాస్, రేంజ్ రోవర్ వోగ్, టయోట ప్రాడో వంటి కార్లు ఉన్నాయి.  దీన్ని బట్టి చూస్తే.. నటుడు సునీల్ శెట్టికి కార్ల మీద ఎంత ఆసక్తి ఉందో ఇట్టే అర్థమైపోతుంది.