30.2 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog Page 6

నిమిషాల్లో అమ్ముడైపోయిన రూ.4.25 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

0

Royal Enfield Shotgun 650 Icon Edition Sold Out: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కంపెనీ కొన్ని రోజులకు ముందు మార్కెట్లో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ (Shotgun 650 Icon Edition) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సంస్థ ఈ రోజు (ఫిబ్రవరి 12) రాత్రి 8:30 గంటలకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బైక్ అన్నీ అమ్ముడైపోయినట్లు కంపెనీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వచ్చేయండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే మొత్తం అమ్ముడైపోయాయి. ఈ బైక్ లిమిటెడ్ ఎడిషన్. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ఈ బైకును 100 మందికి మాత్రమే విక్రయిస్తుంది. అందులో భారత్ కోసం 25 బైకులను కేటాయించింది. అంటే ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ బైకులను కేవలం 25 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు.

సాధారణ షాట్‌గన్ 650 బైక్ కంటే కూడా షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ధర రూ. 65,000 ఎక్కువ. అంటే ఐకాన్ ఎడిషన్ ధర మార్కెట్లో రూ. 4.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధర ఎక్కువైనప్పటికీ.. కొనుగోలుదారులు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. మొత్తం మీద కంపెనీ లాంచ్ చేసిన స్పెషల్ ఎడిషన్ బైక్ అమ్మకాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా కంపెనీ కొనుగోలుదారులకు ధన్యవాదాలు తెలిపింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్

కంపెనీ లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్.. దాని మునుపటి అన్ని బైకుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గది కలర్ ఆప్షన్. ఎందుకంటే ఈ బైక్ వైట్, రెడ్, సీ బ్లూ రంగులతో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ యొక్క రిమ్స్ కూడా బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ బైకును కంపెనీ ప్రత్యేకంగా.. రైడింగ్ గేర్ తయారీదారు ఐకాన్ మోటార్‌స్పోర్ట్స్ సహకారంతో రూపొందించింది.

ఈ ఐకాన్ ఎడిషన్ బైకును కంపెనీ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయడానికంటే ముందు.. EICMA 2024 మరియు మోటోవర్స్ 2024లో ప్రదర్శించింది. ఆ సమయంలో ఈ బైక్ ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. ఇప్పుడు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేసేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ బైకును బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు త్వరలోనే జరుగుతాయని సమాచారం. కానీ డెలివరీలు ఎప్పుడనేది స్పష్టంగా వెల్లడికాలేదు.

డిజైన్ కాకూండా.. ఈ బైక్ యొక్క ఇంజిన్ మరియు మెకానికల్స్ ఎటువంటి మార్పు లేదు. కాబట్టి షాట్‌గన్ 650 బైకులోని అదే 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 46.6 Bhp పవర్ మరియు 5650 rpm వద్ద 52.3 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ముందు భాగం లేత నీలం మరియు తెలుపు రంగులో ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ కూడా లేత నీలం, ఎరుపు మరియు తెలుపు రంగుల్లో ఉంది. సైడ్ ప్యానెల్ 24 సంఖ్యతో ఉండటం చూడవచ్చు. రియర్ ఫెండర్ ఐకాన్ లోగోతో పాటు ఎరుపు మరియు తెలుపు రంగుల కలయికలో ఉంటుంది. గోల్డ్ కలర్ వీల్స్, రెడ్ కలర్ సీటు మరియు లేత నీలం రంగులో పెయింట్ చేయబడిన రియర్ స్ప్రింగ్ వంటివి ఈ బైకులో గమనించవచ్చు.

Also Read: ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

కంపెనీ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ బుక్ చేసుకున్న వారికి.. ప్రత్యేకంగా రూపొందించబడిన జాకెట్ కూడా ఇస్తుంది. దీని కలర్.. బైక్ రంగుకు సరిపోయేలా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ ప్రత్యేకంగా.. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. ఈ కారణంగానే చాలా తొందరగా అమ్ముడైనట్లు తెలుస్తోంది.

248 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్.. రూ.1.66 లక్షలు మాత్రమే!: దీని గురించి తెలుసా?

0

Simple One Gen 1.5 Electric Scooter Launched in India: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు దేశీయ విఫణిలో ‘సింపుల్ వన్ జెన్ 1.5’ (Simple One Gen 1.5) వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కాబట్టి దీని గురించి మరిన్ని వివరాలు, వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.

ధర

సింపుల్ వన్ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ అప్డేట్స్ పొందింది. అయితే ధరలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ ధరకు సమానంగా ఉందన్నమాట. అంటే ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్ షోరూమ్, బెంగళూరు) మాత్రమే. ఈ స్కూటర్ ఇప్పుడు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

రేంజ్

ఇక్కడ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం.. రేంజ్. ఎందుకంటే స్టాండర్డ్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జితో 121 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కానీ అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్ ఏకంగా 248 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అంటే అప్డేటెడ్ స్కూటర్ స్టాండర్డ్ స్కూటర్ కంటే రెట్టింపు రేంజ్ అందిస్తుందన్నమాట. దీంతో ఈ స్కూటర్ భారతదేశంలో అత్యధిక రేంజ్ అందించే స్కూటర్ల జాబితాలో ఒకటిగా చేరింది.

అప్డేటెడ్ ఫీచర్స్

కొత్త సింపుల్ వన్ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది యాప్ ఇంటిగ్రేషన్, నావిగేషన్, అప్డేటెడ్ రైడింగ్ మోడ్స్, పార్క్ అసిస్ట్, ఓటీఏ అప్డేట్స్, రీజనరేటివ్ బ్రేకింగ్, ట్రిప్ హిస్టరీ మరియు స్టాటిస్టిక్స్ వంటివి పొందుతుంది. ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో ఫైండ్ మై వెహికల్ ఫీచర్, ఆటో బ్రైట్‌నెస్ మరియు సౌండ్ వంటి మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఫాస్ట్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఈ అప్డేటెడ్ స్కూటర్‌లో ఉన్నాయి.

కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్‌ను స్టాండర్డ్ మోడల్ ధర వద్దనే లాంచ్ చేసింది. కాబట్టి ఇప్పటికే స్టాండర్డ్ మోడల్ లేదా సాధారణ సింపుల్ వన్ కొనుగోలు చేసిన కస్టమర్లు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కూడా పొందవచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. కొత్త జెన్ 1.5 సిఎంపీల వన్ కొనుగోలు చేసినవారు 750 వాట్స్ ఛార్జర్ కూడా పొందవచ్చు.

ఇతర వివరాలు

అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్ పార్క్ అసిస్ట్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల.. ముందుకు మరియు వెనుకకు వెళ్లగలదు. ఈ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కూడా పొందుతుంది. కాబట్టి ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కావాలనుకునే వారికి సింపుల్ వన్ జెన్ 1.5 మోడల్ ఓ ఉత్తమ ఎంపిక అనే చెప్పాలి.

సింపుల్ ఎనర్జీ కంపెనీకి దేశ వ్యాప్తంగా 10 స్టోర్స్ మాత్రమే ఉన్నాయి. అవి బెంగళూరు, హైదరాబాద్, గోవా, పూణే, వైజాగ్ మరియు కొచ్చి ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంస్థ 2026 ఆర్ధిక సంవత్సరం నాటికి 150 కొత్త స్టోర్లను మరియు 200 సర్వీస్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

Also Read: ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

నిజానికి ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు మరియు కార్లు ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో ఎన్నెన్ని స్కూటర్లు ఉన్నా.. సింపుల్ ఎనర్జీ స్కూటర్లకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బ్రాండ్ స్కూటర్ల మీద ఒక్క కంప్లైంట్ (పిర్యాదు) లేదు. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్.. అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. పేరు సింపుల్ అయినప్పటికీ.. దీనికున్న ఫ్యాన్స్ మాత్రం చాలా ఎక్కువే అని తెలుస్తోంది.

ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

0

BYD Sealion 7 To Launch in India On February 17: 2025 గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఈ నెల 17న (ఫిబ్రవరి 17) భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని కంపెనీ ధ్రువీకరించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన కారు కానుంది. దీని దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

బుకింగ్స్ & డెలివరీలు

కంపెనీ లాంచ్ చేయనున్న బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి రూ. 70000 చెల్లించిన దీనిని బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025 మార్చి 7న ప్రారంభమవుతాయి. కంపెనీ మొదటి దశలో కేవలం 70 యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనుంది. ఈ కారు కొనుగోలుపైన సంస్థ 7 సంవత్సరాలు లేదా 1,50,000 కిమీ వారంటీ మరియు ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో కాంప్లిమెంటరీ 7kW ఏసీ హోమ్ ఛార్జర్ అందిస్తుంది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

వేరియంట్స్ మరియు బ్యాటరీ & రేంజ్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం మరియు పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. రేంజ్ విషయానికి వస్తే ప్రీమియం మోడల్ 567 కిమీ, పర్ఫామెన్స్ మోడల్ 542 కిమీ అందిస్తాయి.

ప్రీమియం మోడల్ రియర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది, ఇది 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ వేరియంట్ 313 హార్స్ పవర్, 318 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే మోటారును కలిగి ఉంటుంది. పర్ఫామెన్స్ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. ఇది 0 నుంచి 100 కిమీ / గం వేగవంతం కావడానికి పట్టే సమయం 4.5 సెకన్లు మాత్రమే. ఇందులోని మోటార్ 530 హార్స్ పవర్ మరియు 690 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ఫీచర్స్

కొత్త బీవైడీ సీలియన్ 7.. బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగానే ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్.. డాష్‌బోర్డ్ మధ్యలో ఉంటుంది. హెడ్స్ ఆప్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైట్స్, 12 స్పీకర్లు, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ మరియు పవర్ టెయిల్‌గేట్ వంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Also Read: సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ధర ఎంతో తెలుసా?

సీలియన్ 7 కారులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ డిపార్చర్ అసిస్ట్ వంటి ఏడీఏఎస్ (ADAS) సూట్ వంటి వాటితో పాటు.. 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ హోల్డ్ కంట్రోల్మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వాహనదారులకు మంచి భద్రతను అందిస్తాయి.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

కొత్త సీలియన్ 7 కారు ఒక్క చూపుతోనే.. తప్పకుండా ఆకర్శించగలదు. ఎందుకంటే ఇది చూడటానికి కొంత, ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న బీవైడీ సీల్ మాదిరిగా ఉంది. కొత్త బంపర్ డిజైన్, హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ సెటప్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 19 ఇంచెస్ మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్ పొందుతుంది.

Also Read: మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు రంగులలో లభించనుంది. అవి కాస్మోస్ బ్లాక్, అట్లాంటిస్ గ్రే, అరోరా వైట్ మరియు షార్క్ గ్రే కలర్స్. కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త కారు నాలుగు రంగులలో లభించడం వల్ల, కొనుగోలుదారు తనకు నచ్చిన కలర్ ఎందుకోవచ్చు. కాగా కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధరలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. లాంచ్ సమయంలో ఆ వివరాలు తెలుస్తాయి.

ఆర్మీలో అడుగుపెట్టిన 60 కొత్త కార్లు.. అన్నీ ఒకటే బ్రాండ్: వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

0

Maruti Jimny Replaces Gypsy in Indian Army: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన ‘జిమ్నీ’ కారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో సేవలందించడానికి సిద్ధమైంది. ఈ కార్లు త్వరలోనే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో చేరనున్నాయి. దీనికోసం కంపెనీ ఒకేసారి 60 కార్లను ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్’ (ITBT)లకు అప్పగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జిమ్నీ కార్లు లేహ్ లడక్ మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మారుతి జిప్సీ కార్లను ఉపయోగించిన సిఏపీఎఫ్.. వాటి స్థానంలో జిమ్నీ కార్లను ఉపయోగించనుంది. ఐటీబీపీ భారతదేశంలో అత్యంత కఠినమైన భూభగాల్లో పనిచేస్తుంది. ఇలాంటి భూభాగాల్లో ఆఫ్ రోడర్ కార్లను మాత్రమే ఉపయోగించడానికి సాధ్యమవుతుంది. జిమ్నీ ఆఫ్ రోడర్ మాత్రమే కాకుండా.. తేలికైన వాహనం కూడా. కాబట్టి ఇది ఆ భూభాగాల్లో ఉపయోగించడానికి ఖచ్చితంగా సరిపోతుంది.

ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో.. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. హిమానీనదాలు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.. కఠినమైన ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ లేదా సరిహద్దు కాపలాకు ఐటీబీటీ సిబ్బంది వీటిని ఉపయోగిస్తాయి.

జిమ్నీ కార్లను డెలివరీ చేసిన సందర్భంగా.. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. ఐటీబీటీకి జిమ్నీ కార్లను డెలివరీ చేయడం చాలా ఆనందంగా ఉంది. కఠినమైన భూభాగాల్లో లేదా సరిహద్దు ప్రాంతాల్లో న్యావిగేట్ చేయడానికి ఈ కార్లు మంచి ఎంపిక. మారుతి సుజుకి ఇండియన్ ఆర్మీతో దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉందని కూడా పేర్కొన్నారు.

మారుతి జిమ్నీ (Maruti Jimny)

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన ఆఫ్ రోడర్లలో ‘జిమ్నీ’ ఒకటి. ఇది ‘మహీంద్రా థార్’కు ప్రత్యర్థిగా విఫణిలో అడుగుపెట్టింది. చూడటానికి కొంత చిన్నదిగా ఉన్నప్పటికీ.. ఈ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 Bhp పవర్ మరియు 134 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పర్ఫామెన్స్ లభిస్తుంది.

మారుతి జిమ్నీ కారు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. ఈ కారణంగానే ఎలాంటి కఠినమైన భూభాగంలో అయినా.. సజావుగా ముందుకు సాగుతుంది. ఈ కారులో బ్రేక్ అసిస్టెట్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ కూడా ఉంటుంది. ఇది కారు చక్రాలకు ఎంత పవర్ అవసమయో.. అంత అందిస్తుంది.కాబట్టి ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 12.75 లక్షలు (ఎక్స్ షోరూమ్).

జిమ్నీ ఎలక్ట్రిక్ (Jimny EV)

ఇకపోతే, ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన మారుతి జిమ్నీ.. ఎలక్ట్రిక్ రూపంలో కూడా మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. కంపెనీ దీనిని ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది. జిమ్నీ ఎలక్ట్రిక్ 2028 నాటికి దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.

Also Read: మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో

మారుతి జిమ్నీ ఎలక్ట్రిక్ కారు.. చూడటానికి కొంత సాధారణ జిమ్నీ మాదిరిగా ఉన్నప్పటికీ, ముందు భాగం మొత్తం క్లోజ్ చేయబడి ఉంటుంది. అక్కడ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ ఇందులో ఫిక్స్ చేయనున్న బ్యాటరీ.. రేంజ్ వంటి వాటిని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి కావలసిన అన్ని ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 18 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా రాబోయే రోజుల్లో వెల్లడవుతాయి. ఈ కారు తప్పకుండా మార్కెట్లో వాహన ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో

0

Wife Surprises Royal Enfield Himalayan 450 Gift To Husband: సాధారణంగా తల్లిందండ్రులు.. పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం గురించి, గతంలో చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇంకొన్ని సంఘటనలలో భర్తలు.. భార్యలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటారు. కానీ భార్య.. భర్తకు గిఫ్ట్ ఇస్తే.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలంటి ఘటనే ఇప్పుడు తెరమీదకు వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఆ కథనం చదివేయాల్సిందే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. ఒక మహిళ తన భర్తకు ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట.. భార్య, భర్త తమ కుమార్తెతో కలిసి రోడ్డుపై కనిపిస్తారు. వారు సరిగ్గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ షోరూమ్ దగ్గర నిలబడి.. గుడికి పోదాం అనుకుంటారు. కానీ భార్య ముందు బైక్ చూద్దాం అని చెబుతుంది. సరే అని భర్త షోరూమ్ లోపలి కదులుతాడు.

భార్య, భర్తలు ఇద్దరూ.. షోరూం లోపలికి వెళ్ళగానే, అక్కడున్న డీలర్ సిబ్బంది, అతనికి కంగ్రాట్యులేషన్ చెబుతారు. అయితే అతనికి వారు ఎందుకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారో అర్థం కాలేదు. కొంతసేపటికి.. భార్య ఇస్తున్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని తెలుస్తుంది. భర్త ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇదంతా కల మాదిరిగా ఉందని చెబుతాడు. ఆ తరువాత బైక్ మీద ఉన్న గుడ్డ తొలగిస్తాడు. అక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.

తనకు ఇష్టమైన బైక్ గిఫ్ట్ ఇచ్చినందుకు.. భర్త ప్రేమతో భార్య నుదుటిపై ముద్దుపెడతాడు. చివరకు బైక్ సొంతం చేసుకుంటారు. ఈ వీడియోలో వారు తమిళంలో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి బహుశా ఈ ఘటన తమిళనాడులో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450)

భారతదేశంలో ఎక్కువమంది బైక్ ప్రేమికులకు ఇష్టమైన బైకులతో హిమాలయన్ ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనినే కొన్ని ఆధునిక హంగులతో.. సరికొత్త ఫీచర్లతో హిమాలయన్ 450 రూపంలో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర సుమారు రూ. 3 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.

హిమాలయన్ 450 బైక్ బేస్, పాస్ మరియు సమ్మిట్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఈ బైక్ 452 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 39.5 Bhp పవర్, 5500 rpm వద్ద 40 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ సాధారణ రోడ్డు ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

పరిమాణం పరంగా ఇది కొంత పెద్దదిగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పవచ్చు. సస్పెన్షన్ సెటప్‌లో షోవా యూనిట్స్ ఉన్నాయి. ఆ బైక్ ముందు భాగంలో లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ సెటప్ ఉన్నాయి. కాబట్టి కఠినమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Also Read: భారత్‌లో కేటీఎమ్ లాంచ్ చేసిన మూడు కొత్త బైకులు ఇవే: చూశారా?

ఆఫ్ రోడింగ్ ప్రియుల మనసు దోచే.. సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ కొంత ఎత్తైన సీటును కలిగి ఉంటుంది. కాబట్టి రైడ్ చేసేవారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది అడ్వెంచర్ బైక్.. కాబట్టి హైవేలమీద కూడా వేగంగా వెళ్ళడానికి అనుమతిస్తుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా, అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న అడ్వెంచర్ బైకుల జాబితాలో హిమాలయన్ కూడా ఒకటి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి రైడర్ సులభంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళవచ్చు. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా.. దాని ప్రత్యర్థుల కంటే ఉత్తమంగా ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Gautham Nags (@safetyfreakbiker)

భారత్‌లో కేటీఎమ్ లాంచ్ చేసిన మూడు కొత్త బైకులు ఇవే: చూశారా?

0

KTM New Adventure Bikes Launched in India: ప్రముఖ ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎమ్ (KTM) ఇండియన్ మార్కెట్లో ఒకేసారి మూడు బైకులు లాంచ్ చేసింది. ఇందులో 2025 అప్డేటెడ్ 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ మరియు 390 అడ్వెంచర్ వంటివి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ మూడు బైకులు గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

2025 కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)

కంపెనీ లాంచ్ చేసిన బైకులలో అప్డేటెడ్ 250 అడ్వెంచర్ ఒకటి. ఈ బైక్ ధర రూ. 2.60 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ధర దాని పాత మోడల్ కంటే కూడా రూ. 12000 ఎక్కువ. ఇది కొత్త ఇంజిన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందింది. ఈ కారణంగానే ధర కొంత ఎక్కువగా ఉంది.

2025 కేటీఎమ్ 250 అడ్వెంచర్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ 250 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 31 హార్స్ పవర్, 25 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 14.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 177 కేజీలు కావడం గమనార్హం. అయినప్పటికీ ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

ఈ బైక్ ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సీటు ఎత్తు 825 మిమీ. ఈ బైక్ అడ్జెస్టబుల్ సస్పెన్షన్‌ను పొందుతుంది. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్ నిలువగా పేర్చబడిన బై ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్, కనెక్టెడ్ ఫీచర్లతో 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటివెన్నో ఈ బైకులో ఉన్నాయి.

2025 కేటీఎమ్ 390 అడ్వెంచర్ (2025 KTM 390 Adventure)

కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ అప్డేటెడ్ 390 అడ్వెంచర్. దీని ధర 3.68 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందింది. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బైక్ కంటే కూడా ఇది చాలా కొత్తగా ఉంటుందని.. చూడగానే తెలుస్తోంది.

ఈ బైక్ 399 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 46 హార్స్ పవర్, 39 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ మరియు బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైకులో ఇప్పుడు ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి పొందుతుంది. 183 కేజీల బరువున్న ఈ బైక్ దాని మునుపటి బైక్ కంటే 6 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంది. ఇది 14.5 లీటర్లు ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. సీటు ఎత్తు 830 మిమీ కాగా.. గ్రౌండ్ క్లియరెన్స్ 227 మిమీ.

2025 కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ (2025 KTM 390 Adventure X)

కేటీఎమ్ కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ ఈ 390 అడ్వెంచర్ ఎక్స్. దీని ధర రూ. 2.91 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఆరెంజ్ మరియు తెలుపు రంగులలో లభించే ఈ బైక్ 390 అడ్వెంచర్ మాదిరిగానే.. అదే 399 సీసీ ఇంజిన్ ద్వారా 46 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Also Read: కేవలం 25మందికి మాత్రమే ఈ ఐకాన్ ఎడిషన్: ధర తెలిస్తే షాకవుతారు

2025 కేటీఎమ్ అడ్వెంచర్ ఎక్స్ బరువు 182 కేజీలు. అంటే ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 1 కేజీ తక్కువ బరువు. చూడటానికి దాదాపు 390 అడ్వెంచర్ మాదిరిగా కనిపించే 390 అడ్వెంచర్ ఎక్స్ బైక్.. 19/17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇది కూడా టీఎఫ్‌టీ డిస్‌ప్లే పొందుతుంది. అంతే కాకుండా ఇందులో బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా ఉంటుంది. ఇది మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

కేటీఎమ్ కంపెనీ ఎప్పటికప్పుడు భారతదేశంలో కొత్త బైక్స్ లేదా అప్డేటెడ్ బైకులు లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భగంగాన గతంలో ఒకేసారి 10 బైకులను లాంచ్ చేసింది. ఇప్పుడు మరో మూడు బైకులను ఏకకాలంలో లాంచ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే కేటీఎమ్ దేశీయ విఫణిలో తన ఉనికిని ఎంతగా విస్తరించాలని అనుకుంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బ్రాండ్ బైకులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం వల్ల కూడా.. కంపెనీ ఎప్పటికప్పుడు వెహికల్స్ లాంచ్ చేస్తూనే ఉంది.

పిచ్చెక్కిస్తున్న దేవీ పుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతలా మారిపోయిందో చూశారా?

0

Venkatesh Devi Putrudu Child Artist Vega Tamotia Latest Look: ఫ్యామిలీ స్టార్.. విక్టరీ వెంకటేష్ నటించిన అద్భుతమైన సినిమాల్లో ఒకటి దేవీ పుత్రుడు. దివంగత డైరెక్టర్ కోరి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమాలో సౌందర్య, అంజలీ జవేరి కూడా నటించారు. శ్రీకృష్ణుడి ద్వారకా సముద్రం అడుగున ఉండనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందరెలా ఉన్నా.. కెరటాల అడుగున, కనుచూపు మరుగున నిదుర పోతున్నది ద్వారకా అనే పాటలో కనిపించిన చిన్న పాప ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది.

2001లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కనిపించిన ఈ చిన్న పాపకు ఓ సపరేట్ ఫ్యాన్స్ పాలోయింగ్ కూడా ఉంది. దేవీ పుత్రుడు సినిమా తరువాత ఈ అమ్మడు కనిపించలేదు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ‘వేగా తమోటియా’ (Vega Tamotia).

వేగా తమోటియా

చిన్నప్పుడే తన నటనతో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సంపాదించుకున్న వేగా తమోటియా.. 1985లో ఛత్తీస్‌గఢ్‌లో జన్మించింది. పుట్టింది ఇండియాలో అయినా.. ఈమె ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పెరిగింది. న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ నుంచి ఎకానమీ పూర్తి చేసి.. ఆ తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరులో చేరింది.

బాల్యం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న వేగాకు.. నాటకం మరియు నటన వంటి వాటి మీద ఆసక్తి కొంత ఎక్కువ. ఈ కారణంగానే పాఠశాలలో చదివే రోజుల్లోనే నాటకాల్లో పాల్గొనేది. చదువు పూర్తయిన తరువాత ముంబైలోని ప్రొఫెషనల్ థియేటర్ పూర్తి చేసింది. ఆ సమయంలోనే స్వానంద్ కిర్కిరే ఆమెను కలిసి హిందీ సంగీత నాటకంలో ఆవో సాథి సప్నా దేఖెయిన్‌లో ప్రధాన మహిళా పాత్రను పోషించడానికి ఆహ్వానించాడు. దీనికి ఆమె మెటా (మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డు సొంతం చేసుకుంది.

వేగా తమోటియా కేవలం నటి మాత్రమే కాదు. నిర్మాత కూడా. ఈమె తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లోని సినిమాల్లో కూడా నటించింది. తమిళంలో సరోజ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు సినిమాల్లో నటించి పెద్దగా పేరు సంపాదించలేకపోయినా.. తమిళం మరియు హిందీలో కొంత సక్సెస్ సాధించగలిగింది. ఆ తరువాత కాలంలో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆఫర్స్ తగ్గిపోవడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. దేవీ పుత్రుడు సినిమాలో బొద్దుగా కనిపించిన వేగా తమోటియా.. ఇప్పుడు ముద్దుగా ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

Also Read: మనసులో మాట చెప్పిన అనసూయ.. వారు కమిట్మెంట్ అడిగారు: ఎంతో కోల్పోయా..

నిజానికి.. ఒకప్పుడు బాగా పాపులర్ అయి తరువాత ఆఫర్స్ లేకుండా కనుమరుగైన హీరోయిన్స్ సినీరంగంలో చాలామందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో వేగా తమోటియా మాత్రమే కాకుండా.. ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇందులో వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చి అక్కడ నటిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరికొందరు బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగినవారు కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. సినీ రంగంలో హీరోయిన్లకు అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయని స్పష్టమవుతోంది.

కేవలం 25మందికి మాత్రమే ఈ ఐకాన్ ఎడిషన్: ధర తెలిస్తే షాకవుతారు

0

Royal Enfield Shotgun 650 Icon Edition Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) దేశీయ విఫణిలో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ సరికొత్త బైకును ఐకాన్ మోటార్‌స్పోర్ట్స్ సహకారం రూపొందించింది. ఈ బైక్ ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? సాధారణ మోడల్‌కు.. ఐకాన్ ఎడిషన్‌కు తేడా ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

ధర

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ధర రూ. 4.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి కేవలం 100 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులని కంపెనీ తెలిపింది. ఈ సంఖ్యను భవిష్యత్తులో పెంచుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఈ బైక్ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియా పసిఫిక్ దేశాలు, యూరప్, అమెరికన్ మార్కెట్లలో కూడా అమ్మకానికి ఉండనున్నట్లు సమాచారం. ఈ బైక్ కొనాలనుకునే ఎవ్వరైనా.. తొందరగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి బహుశా తొందరగా అమ్ముడైపోయే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే.. భారతదేశంలో 25 మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు. ఎందుకంటే కంపెనీ భారత మార్కెట్ కోసం 25 యూనిట్లను మాత్రమే కేటాయించింది. ఈ బైక్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ జాకెట్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ జాకెట్ బైక్ పెయింట్‌కు సరిపోయే విధంగా ఉంటుంది.

డిజైన్ & కలర్స్

చూడటానికి ప్రత్యేకంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ రెట్రో రేస్ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇది మూడు రంగుల కలయికతో ఉంటుంది. బైక్ రిమ్ బంగారు రంగులో, రియర్ సస్పెన్షన్ నీలం రంగులో ఉండటం చూడవచ్చు. మెకానికల్స్ అన్నీ కూడా ప్రత్యేక పెయింట్ స్కీమ్ పొందుతాయి. ప్లోటింగ్ సీటు ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు. బార్ ఎండ్ మిర్రర్స్ నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.

ఇంజిన్ డీటైల్స్

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్.. అధిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతాయి. యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేవు. కాబట్టి ఇందులో.. అదే 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 హార్స్ పవర్, 51 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో సాధారణ షాట్‌గన్ 650 ధర రూ. 3.59 లక్షలు మాత్రమే. కానీ ఐకాన్ ఎడిషన్ ధర స్టాండర్డ్ మోడల్ కంటే రేప్. 66000 ఎక్కువ. అయితే ధరకు తగ్గ కాస్మొటిక్ అప్డేట్స్ లభిస్తాయి. ఈ బైక్ బుక్ చేసుకోవాలనుకునే వారు.. బ్రాండ్ అధికారిక యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న 25 మంది (భారతీయులు) మాత్రమే దీనిని కొనుగోలు చేయడానికి అర్హులు. ఎవరు కొనుగోలు చేయడానికి అర్హులు అనే విషయాన్ని కంపెనీ ఫిబ్రవరి 12 రాత్రి 8:30 గంటలకు వెల్లడించనున్నట్లు సమాచారం.

కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఎలాంటి అమ్మకాలు పొందుతుంది. ధర ఎక్కువగా ఉందని కొనుకోలు చేయడానికి వెనుకడుగు వేస్తారా? కలర్ ఆప్షన్ చూసి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారా అనేది వచ్చే బుధవారం (ఫిబ్రవరి 12) రోజున తెలుస్తాయి.

Also Read: ఈ కార్లనే ఎగబడి కొనేస్తున్నారు.. కొత్త ఏడాదిలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే!

సాధారణ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల కంటే షాట్‌గన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ ఇది వరకు ఎప్పుడూ లాంచ్ చేయలేదు. కానీ మొదటిసారి.. వాహన ప్రేమికుల కోసం కంపెనీ ఈ సరికొత్త మోడల్ లాంచ్ చేసింది. భవిష్యత్తులో కంపెనీ ఇలాంటి మరిన్ని మోడల్స్ లాంచ్ చేస్తుందా? లేదా అనే విషయాలు.. ఇప్పుడు లాంచ్ చేసిన ఈ కొత్త ఎడిషన్ అమ్మకాలే నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

రూ. 90వేలకు చేరువలో బంగారం: గోల్డ్ రేటు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా?

0

Do You Know Who Decides The Gold Rate in India: భారతదేశంలో బంగారం ధరలు (Gold Price) ఓ రోజు పెరుగుతాయి, మరో రోజు తగ్గుతాయి. ఇంతకీ బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి ఎందుకు పెరుగుతాయి? ఈ ధరలను ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు?.. అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

మన దేశంలో బంగారం కొనేవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గోల్డ్ రేటు తారాస్థాయికి చేరింది. ఇక పసిడి ధరలను ఎవరు నిర్ణయిస్తారు? అనే విషయానికి వస్తే.. ‘ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్’ (IBJA) అనే సంస్థ భారతదేశం బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఐబీజేఏ అనేది దేశంలోని అతిపెద్ద బంగారు డీలర్లతో ఏర్పడిన సంస్థ. వీరి సారథ్యంలోనే బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదల అనేది నిర్ణయించబడుతుంది.

బంగారం ధరలను ఎలా నిర్ణయిస్తారంటే?

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్.. బంగారం డీలర్లతో మాట్లుతుంది. డీలర్ల కొనుగోలు, అమ్మకాల వంటి వాటిని బేరీజు వేసుకుంటుంది. అంతే కాకుండా.. స్థానిక పన్నులు, దిగుమతి సుంకాలు.. కరెన్సీ హెచ్చు తగ్గులను చూసుకుని ఐబీజేఏ ధరలను నిర్ణయిస్తుంది. ఇదే ధరలు దేశం మొత్తం మీద వర్తిస్తాయి. ఆంటే ఆ ధరలకే బంగారం విక్రయాలు జరుగుతాయి.

బంగారం ధరల ప్రకటనలు అనధికారికంగానే ఉంటాయి. ఎందుకంటే పన్నులు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. దేశ ఆర్ధిక పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. సరఫరా డిమాండ్, దిగుమతి రేటు, రూపాయి మారకం విలువ, బంగారం ఉత్పత్తి, ఉత్పత్తికి అయ్యే ఖర్చు మరియు వడ్డీ రేట్లు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

గోల్డ్ రేటును లెక్కించే ఫార్ములా ఇదే

బంగారం మన దేశంలో బంగారాన్ని 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ మరియు 18 క్యారెట్స్ అనే మూడు విధాలుగా విభజిస్తారు. అయితే 24 క్యారెట్స్ గోల్డ్ అనేది బిస్కెట్స్ లేదా కడ్డీల రూపంలో.. ముడి పదార్థంగా లభిస్తుంది. 22 క్యారెట్స్ మరియు 18 క్యారెట్స్ గోల్డ్ ఆభరణాల రూపంలో లభిస్తుంది. దేశంలో ఎక్కువమంది 22 క్యారెట్స్ బంగారాన్నే కొనుగోలు చేస్తారు. 18 క్యారెట్స్ గోల్డ్ కొనేవాళ్ళ సంఖ్య కూడా కొంత వరుకు ఉంది.

పసిడి స్వచ్ఛతను బట్టి రెండు రకాలుగా లెక్కించవచ్చు. అవి ”స్వచ్ఛత శాతం: బంగారం విలువ = బంగారం రేటు x స్వచ్ఛత x బరువు / 24” & రెండో పద్ధతి ”క్యారెట్స్ విధానం: బంగారం విలువ = బంగారం రేటు x స్వచ్ఛత x బరువు / 100”

ఈ రోజు బంగారం ధరలు (Today Gold Price)

బంగారం ధరలు ఈ రోజు (గురువారం) కూడా పెరుగుదల దిశగానే అడుగులు వేసాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప మార్పులు జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరలు ఒకలా ఉంటే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.

ఫిబ్రవరి 6న విజయవాడ, హైదరాబాద్, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో 24 క్యారెట్ల ధర రూ. 86,510 (10 గ్రా) వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 79,300 (10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 250 మరియు రూ. 270 పెరిగినట్లు స్పష్టమవుతోంది. చెన్నైలో కూడా పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే రూ. 86510 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ. 79300 (22 క్యారెట్స్ 10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ నగరం కూడా గోల్డ్ రేటు రూ. 250 మరియు 270 రూపాయలు పెరిగిందని తెలుస్తోంది.

Also Read: గర్ల్‌ఫ్రెండ్ ఐడియా.. వారానికే రూ. 40వేలు సంపాదన: వైరల్ వీడియో

ఢిల్లీ నగరంలో గోల్డ్ రేటు.. దేశంలోని ఇతర నగరాల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,660 (తులం) వద్ద, 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 79,450 (10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 5 కంటే వరుసగా రూ. 250 మరియు రూ. 270 ఎక్కువని తెలుస్తోంది.

గర్ల్‌ఫ్రెండ్ ఐడియా.. వారానికే రూ. 40వేలు సంపాదన: వైరల్ వీడియో

0

Young Man Who Earns in Kumbh Mela with A Girl Friend Idea: ఏదైనా ఓ బిజినెస్ చేయాలంటే.. తప్పకుండా పెట్టుబడి పెట్టాల్సిందే. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడం కొంత కష్టమే.. అయితే ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు. ఆలోచన ఉండాలేగానే.. ఎడారిలో ఇసుకను, హిమాలయాలలో మంచును అమ్మేయొచ్చని ఏదో ఓ సినిమాలో కూడా బహుశా వినే ఉంటారు. అలాంటి ఓ సరికొత్త ఆలోచనతోనే.. ఓ యువకుడు పెట్టుబడి లేకుండానే, డబ్బు సంపాదించేస్తున్నాడు. ఎందోమంది ఔరా అనిపించేస్తున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడు చేస్తున్న బిజినెస్ ఏమిటి అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో.. ఒక యువకుడు ఎలాంటి పెట్టుబడి లేకుండా, కేవలం వారం రోజుల్లో రూ. 40,000 సంపాదించాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతడు చేసే బిజినెస్ ఏమనుకుంటున్నారా..? గ్రామీణ ప్రాంతాలలో బ్రెష్ చేసుకోవడానికి లేదా పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే ‘పుల్లల’ విక్రయం.

పళ్ళు తోమే పుల్లలు అమ్ముతూనే.. ఆ యువకుడు డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ఆ ఆలోచన తనది కాదని, తన గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతోనే ఈ వ్యాపారం మొదలు పెట్టానని పేర్కొన్నాడు. దీనికి సంబందించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. బ్లూ కలర్ జాకెట్ వేసుకున్న యువకుడు, చేతిలో పుల్లలు పట్టుకుని కనిపించడం చూడవచ్చు. అంతే కాకుండా.. ఆ యువకుడు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా ఓపిగ్గా జవాబులు ఇస్తున్నాడు. కొంత డబ్బు సంపాదించడానికి తాను కుంభమేళాకు వచ్చినట్లు చెబుతూ.. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారని అడిగితే.. సంతోషం నిండిన ముఖంతో నా గర్ల్‌ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది అని చెప్పాడు.

ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ పుల్లలు ఎలా విక్రయించవచ్చో.. చెబుతూ ఆమె వల్ల నేను చాలా సంపాదించాను అని పేర్కొంటూ.. ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. అతని నిజాయితీకి, తన గర్ల్‌ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమకు, ఆమెకు క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడని మనస్తత్వానికి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు.

ఇంతమంచి ఆలోచన ఇచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌ను ఎప్పుడూ వదులుకోవద్దు.. మోసం చేయవద్దు ఒకరు కామెంట్ చేశారు. చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడుతున్నావు. నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటావు అని మరొకరు అన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక, తప్పకుండా.. ఒక ఆడది ఉంటుందనేది నిజమని ఇంకొకరు అన్నారు.

మహా కుంభమేళా 2025 (Maha Kumbh Mela 2025)

ఎంతోమంది ప్రజలు పరమ పవిత్రంగా భావించే మహా కుంభమేళా 2025 జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26వరకు జరుగుతుంది. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమ ప్రదేశం త్రివేణి సంగమంలో ఈ సారి ఏకంగా 40 కోట్లమంది పుణ్య స్నానాలు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడికి కేవలం భారతదేశంలోని భక్తులు మాత్రమే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున విచ్చేస్తారు.

Also Read: మహా కుంభమేళా 2025: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 ఘటనలు ఇవే..

సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఎంతోమంది సాధువులు కూడా కుంభమేళాకు విచ్చేస్తారు. పాపాలు పోగొట్టుకుని, జన్మ తరింపజేసుకోవడానికి భక్తులు పవిత్ర స్నానాలు చేస్తుంటారు. మొత్తం మీద ఈ మహా కుంభమేళా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం లభించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 7000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కుంభమేళాకు మోదీ

నిరాఘాటంగా జరుగుతున్న మహా కుంభమేళాకు ఈ రోజు (బుధవారం) దేశ ప్రధానమంత్రి ‘నరేంద్ర మోదీ’ (Narendra Modi) వెళ్లనున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన తరువాత.. గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. పుణ్య స్నానాలు పూర్తయిన తరువాత మళ్ళీ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతలను కూడా ఏర్పాటు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Adarsh Tiwari (@adarshtiwari20244)