Brixton Bikes Launched in India: ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల.. ఏదో ఒక వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. భారతదేశంలో కూడా ఇదే వరుస కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో అగ్ర ఆటోమొబైల్ మార్కెట్ల సరసన చేసిన ఇండియాలో వాహనాలు విరివిగా లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ‘బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిల్స్’ (Brixton Motorcycle) దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే?.. ఈ కథనం చదివేయాల్సిందే..
బ్రిక్స్‌టన్ బైకులు
- క్రాస్‌ఫైర్ 500ఎక్స్
- క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ
- క్రోమ్‌వెల్ 1200
- క్రోమ్‌వెల్ 1200 ఎక్స్
బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్ (Brixton Crossfire 500X)
కంపెనీ లాంచ్ చేసిన బైకులలో ఒకటి ఈ క్రాస్‌ఫైర్ 500ఎక్స్. దీని ధర రూ. 4.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది బ్రిక్స్‌టన్ లాంచ్ చేసిన బైకులలో అత్యంత సరసమైన మోడల్. నియో రెట్రో స్టైల్ కలిగిన ఈ బైక్ చూడటానికి హస్క్‌వర్నా విట్‌పిలెన్ మాదిరిగా ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్, అడ్జస్టబుల్ కేవైబీ సస్పెన్షన్ వంటివి ఈ బైకులో ఉంటాయి.
క్రాస్‌ఫైర్ 500ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్ 486 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47.6 హార్స్ పవర్, 43 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 13.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ 190 కేజిల బరువుంటుంది. ఇది సింగిల్ పిస్టన్ యూనిట్. ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ కలిగి.. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా పొందుతుంది.
బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సీ (Brixton Crossfire 500XC)
కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సీ విషయానికి వస్తే.. ఇది చూడటానికి 500ఎక్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 5.19 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ అదనపు కాస్మొటిక్ అప్డేటెడ్స్ కలిగి ఉండటం వల్ల ధర కొంత ఎక్కువగా ఉంటుంది. 195 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్రంట్ పెండర్, 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్ వంటివి పొందుతుంది. ఇది 500ఎక్స్ మాదిరిగే అదే ఇంజిన్ పొందుతుంది, కాబట్టి పర్ఫామెన్స్ ఆ బైక్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.
బ్రిక్స్‌టన్ క్రోమ్‌వెల్ 1200 (Brixton Cromwell 1200)
క్రోమ్‌వెల్ 1200 బైక్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ట్రయంఫ్ బోన్‌విల్లే మాదిరిగా ఉండే ఈ బైక్ లిక్విడ్ కూల్డ్ 1222 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్, 108 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో 16 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. దీని బరువు 235 కేజీలు కావడం గమనార్హం.
బ్రిక్స్‌టన్ క్రోమ్‌వెల్ 1200 బైక్ ఎల్ఈడీ లైటింగ్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ సిస్టం వంటివి కూడా పొందుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ స్పోక్డ్ రిమ్స్, ట్యూబ్డ్ టైర్‌లను పొందుతుంది. కాబట్టి దీని ద్వారా ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
క్రోమ్‌వెల్ 1200ఎక్స్ (Brixton Cromwell 1200X)
ఇక చివరగా బ్రిక్స్‌టన్ యొక్క నాలుగో బైక్ లేదా చివరి బైక్ క్రోమ్‌వెల్ 1200ఎక్స్. దీని ధర ఏకంగా రూ. 9.11 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి స్క్రాంబ్లర్ మాదిరిగా ఉన్న ఈ బైక్ క్రోమ్‌వెల్ 1200 బైక్ కంటే కూడా రూ. 1.27 లక్షలు ఎక్కువ. ఇది చిన్న ఫ్లైస్క్రీన్, ట్యాన్ బ్రౌన్ సీటు, హెడ్‌లైట్ గ్రిల్ వంటివి పొందుతుంది.
Also Read: మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్.. ఎందుకంటే?
ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకుంటున్న బ్రిక్స్‌టన్ వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో మరో ఎనిమిది (అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే, థానే, కొల్హాపూర్, గోవా మరియు బెంగళూరు) నగరాలలో విస్తరించనున్నట్లు సమాచారం. మొత్తానికి బ్రాండ్ దేశీయ విఫణిలో తన హవా చాటుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.