అల్లు రామలింగయ్య మనువడు, అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం కూడా పూర్తయింది. ఇప్పుడు పెళ్లి పత్రికలు పంచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తొలి పత్రిక చిరంజీవికి
శిరీష్ తన పెళ్లి పత్రికను ముందుగా మెగాస్టార్ చిరంజీవి దంపతులకు అందించారు. మొదటి పత్రిక చిరంజీవి మావయ్యకే అందించినట్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ ఫోటోలలో గమనిస్తే.. చిరంజీవి చేతికి ఒక షోల్డర్ బ్యాగ్ ఉండటం కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు చిరంజీవికి ఏమైంది?, చేతికి ఆ బ్యాగ్ ఏమిటి? అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
చిరంజీవికి గాయమా?
బహుశా ఏదైనా గాయం అయిందా?, లేక సర్జరీ ఏమైనా జరిగిందా? అని కొందరు అనుకుంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీని గురించి తెలుసుకోవాలంటే.. చిరంజీవి లేదా ఆయన సన్నిహితులు స్పందించాల్సిందే. అయితే.. అల్లు శిరీష్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి.. అల్లు అరవింద్, ఆయన భార్య నిర్మల కూడా చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
అల్లు శిరీష్ మ్యారేజ్ డేట్
నటుడు అల్లు శిరీష్, నయనికల పెళ్లి మార్చి 6న జరగనుంది. గత ఏడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. నిజానికి వీరి ప్రేమ.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లిలో మొదలైంది. నితిన్ భార్య షాలినితో కలిసి ఉన్నప్పుడు నయనికను చూసినట్లు.. ఆ తరువాత వారి మధ్య జరిగిన పరిచయం ప్రేమగా మారింది.. త్వరలో పెళ్లి జరగనుంది.
ఎవరీ నయనిక
నయనిక హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె అని సమాచారం. ఇంతకు మించి ఆమెకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేదు. బహుశా పెళ్లి తరువాత ఈమెకు సంబంధించిన చాలా వివరాలు తెలిసే అవకాశం ఉంది.
అన్నయ్య పెళ్లిరోజే.. తమ్ముడి పెళ్లి
శిరీష్, నయనికల పెళ్లి.. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లి రోజున జరగనుంది. అల్లు అర్జున్, స్నేహల పెళ్లి 2011 మార్చి 6న జరిగింది. అదే తేదీన శిరీష్, నయనికల పెళ్లి జరగనుంది. అయితే ఈ జంట ఎక్కడ పెళ్లి చేసుకోబోతుంది వెల్లడికాలేదు, హైదరాబాద్ నగరంలోనే జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అల్లు అరవింద్ ఇంట జరగబోయే పెళ్లికి అటు సినీ పెద్దలు, ఇటు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మొదటి పత్రికను చిరంజీవికి అందించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. పసుపు దంచడం పూర్తయింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ, పవన్ కళ్యాణ్ భార్య మొదలైనవారు పాల్గొన్నారు. ఇక హల్దీ ఫంక్షన్, ఇతరత్రా వేడుకలు జరగాల్సి ఉన్నాయి. మొత్తానికి అల్లు అరవింద్ తన చిన్న కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.