ఇంధన అవసరాలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో.. వివిధ రకాల గ్యాస్ వినియోగం పెరుగుతోంది. వంట చేయడంలో, వాహన ఇంధనం, పరిశ్రమలు & విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక రంగాల్లో గ్యాస్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. అయితే చాలా మంది LPG, CNG, PNG, LNG అన్నీ ఒకే విధమైన గ్యాస్‌లు అనుకుంటారు. కానీ ఇవి తయారీ విధానం, నిల్వ విధానం, వినియోగం వంటి అంశాల్లో విభిన్నంగా ఉంటాయని బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. వీరి గురించి పూర్తి వివరాలు వివరంగా ఇక్కడ.
ఎల్పీజీ అంటే ఏమిటి?
LPG (Liquefied Petroleum Gas) అంటే ద్రవరూపంలో నిల్వ చేసే పెట్రోలియం గ్యాస్. ఇది ప్రధానంగా ఇళ్లలో వంట కోసం ఉపయోగిస్తారు. ఇది సిలిండర్లలో నిల్వ చేసి సరఫరా చేస్తారు. LPGలో ప్రధానంగా ప్రొపేన్ & బ్యూటేన్ గ్యాస్‌లు ఉంటాయి. వంటగ్యాస్‌గా ఇది భారత్‌లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇంధనం.
సీఎన్జీ ఉపయోగం ఏమిటి?
CNG (Compressed Natural Gas) ప్రధానంగా వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది సహజ వాయువును అధిక పీడనంతో కుదించి తయారు చేస్తారు. పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే CNG తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. అందువల్ల పర్యావరణానికి అనుకూలమైన ఇంధనంగా దీనిని భావిస్తారు. భారతదేశంలోని అనేక నగరాల్లో బస్సులు, ఆటోలు మరియు కార్లు CNGపై నడుస్తున్నాయి.
పీఎన్జీ ఎలా పనిచేస్తుంది?
PNG (Piped Natural Gas) అనేది పైపులైన్ల ద్వారా నేరుగా ఇళ్లకు, హోటళ్లకు, పరిశ్రమలకు సరఫరా చేసే సహజ వాయువు. ఇది సిలిండర్ అవసరం లేకుండా నేరుగా గ్యాస్ స్టౌవ్‌కు చేరుతుంది. వినియోగం మేరకు మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లింగ్ జరుగుతుంది. అందువల్ల ఇది వంటగ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ పెద్ద నగరాల్లో PNG వినియోగం వేగంగా పెరుగుతోంది.
ఎల్ఎన్జీ ఎందుకు ఉపయోగిస్తారు?
LNG (Liquefied Natural Gas) అనేది సహజ వాయువును చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో నిల్వ చేయడం ద్వారా తయారుచేస్తారు. దీనిని ముఖ్యంగా పెద్ద పరిశ్రమలలో, పవర్ ప్లాంట్లలో & భారీ ఇంధన అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఎల్ఎన్జీ నిల్వ చేయడం & రవాణా చేయడం అనేది సులభం కావడంతో ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ముఖ్య తేడాలు ఇలా..
LPG: ఇళ్లలో వంటగ్యాస్‌గా సిలిండర్లలో ఉపయోగిస్తారు
CNG: వాహనాల్లో ఇంధనంగా వాడతారు
PNG: పైపులైన్ల ద్వారా ఇళ్లకు నేరుగా సరఫరా చేస్తారు
LNG: పరిశ్రమలు, పవర్ ప్లాంట్లలో వినియోగం
ప్రతి గ్యాస్ రకం వేర్వేరు అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడుతుంది. అందువల్ల వినియోగదారులు తమ అవసరానికి సరిపడే ఇంధనాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా.. LPG, CNG, PNG, LNG మధ్య తేడా.
ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఈ సమయంలో చమురు ధరలు మాత్రమే కాకుండా.. గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగాయి. మొదటిసారి ఆయిల్ ధర వంద డాలర్లు దాటింది. భారతదేశంలో కూడా కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. దీనివల్ల దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సమస్యలు తలెత్తింది. ఈ ధరలు కొంత కాలం మాత్రమే ఉంటాయని, కేంద్ర మంత్రులు చెబుతున్నారు. అయినప్పటికీ.. రానున్న రోజుల్లో వీటి ధరలు ఇంకెంత పెరిగే అవకాశం ఉందో తెలియక వినియోగదారులు భయపడుతున్నారు.
Also Read: IDBI: హైదరాబాద్‌లో 1,300 ఉద్యోగాలు – అర్హతలివే!
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.