రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య: హరిణ్య రెడ్డి బ్యాగ్రౌండ్ తెలుసా?

కష్టపడితే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. నిజానికి ఈ మాట చెప్పడానికి చాలా సులభంగా ఉన్నప్పటికీ సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అహర్నిశలు శ్రమపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఇలాంటి కోవకు చెందినవారిలో పాటల రచయిత, ప్లేబ్యాక్ సింగర్ ‘రాహుల్ సిప్లిగంజ్‘ ఒకరు. ఈయన ఇటీవలే తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. అయితే నెటిజన్లు మాత్రం రాహుల్ నిశ్చితార్థం చేసుకున్న యువతి ఎవరనే విషయం తెలుసుకోవడానికి అంతర్జాలంలో (ఇంటర్నెట్) తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ హరిణ్య రెడ్డి?

రాహుల్ సిప్లిగంజ్ పెళ్లిచేసుకోబోయే యువతి పేరు.. ‘హరిణ్య రెడ్డి‘. ఈమె తెలుగుదేశం పార్టీ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్ కోటంరెడ్డి శ్రేనివాసులు రెడ్డి అన్న కుమార్తె. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న.. హరిణ్య బిగ్‌బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా అనే కంపెనీలో ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లో పుట్టిన ఈమె బీఏ మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం పూర్తి చేసినట్లు సమాచారం. చదువు పూర్తయిన తరువాత ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ.. రాహుల్ సిప్లిగంజ్ రాసే పాటలకు నిర్మాతగా కూడా వ్యవరించినట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ 2020 నుంచి మొదలైనట్లు.. ఎట్టకేలకు ఈ నెల 17న (2025 ఆగస్టు 17) కొంతమంది సన్నిహితులతో నిశ్చితార్థం చేసుకున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ గురించి

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాత ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు. ఈ పాట రాసింది రాహుల్ సిప్లిగంజ్. ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో.. సిప్లిగంజ్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ ఘనతకు మెచ్చిన 2025 ఆగస్టు 15న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందించారు.

అక్కినేని నాగ చైతన్య నటించిన జోష్ సినిమాలో.. కాలేజీ బొల్లోడా పాటను అందించిన రాహుల్ సిప్లిగంజ్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా నాలుగు పాటలు అందించారు. పాటలు రాస్తూ, ప్లేబ్యాక్ సింగర్‌గా వ్యవరిస్తూ.. రంగ మార్తాండ వంటి సినిమాల్లో కూడా నటించారు. దీన్నిబట్టి చూస్తుంటే.. రాహుల్ ఏ స్థాయికి ఎదిగారో స్పష్టంగా అర్థమవుతోంది.

పెళ్లి ఎప్పుడు?

టాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ.. ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ మొత్తానికి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హరిణ్య రెడ్డితో ఏడడుగులు నడువబోతున్నాడు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే మాట మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ త్వరలోనే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా పోస్ట్

నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వ్యక్తి. కాబోయే భార్య హరిణ్య రెడ్డితో ఉన్న ఫొటోలు షేర్ చేశారు. మా కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెబుతూ.. హరిణ్య చేతికి ఉంగరం తొడిగి, ముద్దాడిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక పెళ్లి కోసం వేచి చూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Comment