లగ్జరీ కార్లను ఎక్కువగా ఇష్టపడే నటుల జాబితాలో దుల్కర్ సల్మాన్ అగ్రస్థానంలో ఉంటారు. బెంజ్, ఆడి, ఫెరారీ, పోర్స్చే వంటి కార్లను కలిగి ఉన్న ఈయన, ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
రూ.2.59 కోట్ల కొత్త కారు..
దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ 110 ఓసీటీఏ. దీని ధర రూ. 2.59 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారును దుల్కర్ సల్మాన్ కొచ్చిలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ డీలర్ వద్ద డెలివరీ చేసుకున్నారు. ఇది పెట్రో కాపర్ రంగులో ఉండటం చూడవచ్చు. రూఫ్, టెయిల్ గేట్ వంటివి నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కొత్త కారును నెంబర్ ప్లేట్ లేదు. అయితే వీరి గ్యారేజిలోని కార్లకు 369 నెంబర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి కొత్త కారుకు కూడా అదే నెంబర్ ఇవ్వనున్నారు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఓసీటీఏ గురించి
2025 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన డిఫెండర్ ఓసీటీఏ కారు.. బ్రాండ్ యొక్క అత్యంత శక్తివంతమైన కారు. దృఢమైన బాడీ కలిగిన ఈ కారు.. మార్కెట్లోని మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో బెంజ్ ఏఎంజీ కారు కూడా ఉంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఓసీటీఏ కారు అత్యుత్తమ పనితీరును అందించేలా తయారు చేశారు. ఇందులో 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 635 హార్స్ పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. ఇలాంటి ఇంజిన్ బీఎండబ్ల్యు ఎం5 కారులో కూడా ఉంటుంది.
డిఫెండర్ ఓసీటీఏ ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. 22 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ మోడల్.. బయటి వైపు ఓసీటీఏ బ్యాడ్జ్‌లు పొందుతుంది. గ్రిల్ పరిమాణం కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇది కార్పాతియన్ గ్రే, చారెంటే గ్రే, ఫారో గ్రీన్, పెట్రా కాపర్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఓసీటీఏ కారులో 11.4 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, సియెన్నా సెమీ లెదర్ అపోల్స్ట్రే, ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్, సెంటర్ కన్సోల్ లోపల మినీ ఫ్రిజ్ మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.
దుల్కర్ సల్మాన్ గ్యారేజిలోని కార్లు
నటుడు దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో.. బెంజ్ ఎస్ క్లాస్, బెంజ్ ఏఎంజీ జీ63, బెంజ్ ఏఎంజీ ఏ45, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బెంజ్ మే బ్యాచ్ జీఎల్ఎస్ 600, ల్యాండ్ రోవర్ డిఫెండర్, మినీ కూపర్ ఎస్, ఇన్నోవా క్రిస్టా కార్లతో పాటు బీఎండబ్ల్యూ ఎం3 ఈ46, బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, ఫోర్చే 911 జీటీ3 వంటివి ఉన్నాయి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.