ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025లో ”ఈపీఎఫ్ఓ 3.0”ను ప్రారంభించడానికి సర్వత్రా సిద్ధమవుతోంది. యాక్సెసిబిలిటీని.. పారదర్శకతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుని ఈపీఎఫ్ఓ ఈ కొత్త విధానం ప్రారంభించనుంది. ఈ కొత్త సిస్టం ఏకంగా 8 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ 3.0 అనేది సేవలను వేగవంతం చేస్తుంది. ఇది యోజార్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ కొత్త విధానం కోసం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహణ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తోంది. జూన్ 2025లో ఈపీఎఫ్ఓ 3.0ను లాంచ్ చేయాలని అనుకున్నప్పటికీ.. టెక్నికల్ సమస్యల కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది. కాగా ఈ విధానం ఇంకెప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఈపీఎఫ్ఓ 3.0 వల్ల ఉపయోగాలు
ఏటీఎమ్ నుంచి నేరుగా పీఎఫ్ తీసుకోవడం
నిజానికి ఈపీఎఫ్ఓ అమౌంట్ తీసుకోవాలంటే.. అప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై పీఎఫ్ అమౌంట్ తీసుకోవాలంటే.. నేరుగా ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికోసం యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్)ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. ఆధార్ నెంబరును బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుందని మర్చిపోకూడదు. ఈ కొత్త ఫీచర్ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువైపోయాయి. ఈ రోజు ఒక్క రూపాయి వస్తువు తీసుకున్నా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ 3.0 ను తీసుకొస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆన్లైన్ క్లెయిమ్‌లు & సులభమైన కరెక్షన్స్
గతంలో ఈపీఎఫ్ఓలో ఏదైనా సవరణలు లేదా క్లెయిమ్ అప్డేట్ చేయాలంటే.. ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఖాతాదారులు ఈపీఎఫ్ఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఓటీపీ ద్రువీకరణతో.. ఆన్లైన్లోనే కరెక్షన్స్ చేసుకోవచ్చు. అంతే కాకుండా క్లెయిమ్ స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చు. ఇది ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఆలస్యాన్ని తగ్గిస్తుంది.
మెరుగైన డిజిటల్ అనుభవం
ఈపీఎఫ్ఓ 3.0 అనే కొత్త ప్లాట్‌ఫామ్.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్లెయిమ్‌లు, ఖాతా వివరాలను ట్రాక్ చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. డిజిటల్ విధానం ద్వారా అన్నీ పారదర్శకంగా ఉంటాయి. ఉద్యోగుల సమయం కూడా ఈ విధానంలో చాలా ఆదా అవుతుంది.
ప్రస్తుతం దేశంలో 73.7 మిలియన్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఉన్నారు. వీరందరిని దృష్టిలో ఉంచుకుని.. కేంద్రం ఈపీఎఫ్ఓ విత్‌డ్రా విధానాన్ని సులభతరం చేయాలని భావించింది. ఇందులో భాగంగానే.. ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురావడానికి సన్నద్ధమైంది. ఇది తప్పకుండా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విత్‌డ్రా ప్రక్రియ చాలా ఈజీ అవుతుంది. అయితే ఈపీఎఫ్ఓ 3.0 లో కొన్ని నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.