హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతోంది. కూకట్‌పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఫాషన్ డిజైనింగ్ సంస్థ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందిస్తోంది. 15 రోజులపాటు నిర్వహించే ఈ కోర్సులో ప్రాథమిక టైలరింగ్ నైపుణ్యాలను నేర్పించనున్నారు.
16వ తేదీ నుంచి మొదలు
ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం, స్వయం ఉపాధి మార్గాలను చూపించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. కూకట్‌పల్లిలో నివసించే మహిళలకు ఇది మంచి అవకాశం అవుతుందని వారు పేర్కొన్నారు.
టైలరింగ్ వంటి నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న స్థాయిలో బట్టలు కుట్టడం, బుటిక్ ప్రారంభించడం వంటి అవకాశాలు కూడా లభిస్తాయి. అందుకే ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.
15 రోజుల శిక్షణ!
ఈ ఉచిత టైలరింగ్ శిక్షణ మొత్తం 15 రోజులపాటు కొనసాగుతుంది. ప్రతిరోజూ మూడు గంటల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమయంలో ప్రాథమిక టైలరింగ్ టెక్నిక్స్, కొలతలు తీసుకోవడం, బట్టలు కట్ చేయడం, కుట్టే విధానం వంటి అంశాలను ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు. ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభించి చిన్నపాటి డ్రెస్‌లు కుట్టడం వరకు పలు అంశాలను పరిచయం చేస్తారని నిర్వాహకులు తెలిపారు. కొత్తగా నేర్చుకునే మహిళలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా శిక్షణను రూపొందించినట్లు చెప్పారు.
రెండు బ్యాచ్‌లలో ట్రైనింగ్!
శిక్షణకు వచ్చే మహిళల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు బ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం మరియు మధ్యాహ్నం విడిగా క్లాసులు నిర్వహించనున్నారు.
మొదటి బ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. రెండో బ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మహిళలు తమకు అనుకూలమైన బ్యాచ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కూకట్‌పల్లిలో నివసించే మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. పరిమిత సీట్లు మాత్రమే ఉండటంతో ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు
టైలరింగ్ శిక్షణ పొందిన తర్వాత మహిళలు చిన్న స్థాయి వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇంటి వద్దే బట్టలు కుట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అలాగే బుటిక్‌లు లేదా గార్మెంట్ షాపుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంటుంది.
కూకట్పల్లి ప్రాంతంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. శిక్షణలో పాల్గొనాలనుకునే మహిళలు కూకట్‌పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఫాషన్ డిజైనింగ్ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
మహిళా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఆసక్తిగల మహిళలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఉపాధి కూడా పొందవచ్చు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని మహిళలు 15 ట్రైనింగ్ తీసుకోవచ్చు.
Also Read: హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ పంజా.. AIతో నేరగాళ్ల గుట్టు రట్టు!
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.