టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఆయన భార్య & నటి నటాషా స్టాంకోవిచ్ కొన్ని అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలుగా విడిపోయారు. కానీ తమ బిడ్డ అగస్త్య విషయంలో మాత్రం తల్లిదండులుగా వారి బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే హార్థిక్ పాండ్య ఇప్పుడు తన కుమారునికి కోట్ల రూపాయల విలువ చేసే కారును గిఫ్ట్ ఇచ్చారు.
బిడ్డకు ఖరీదైన గిఫ్ట్!
హార్దిక్ పాండ్యా.. తన బిడ్డ అగస్త్యకు ఇచ్చిన కారు విలువ రూ. 4 కోట్లు. ఇది ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్. ఈ కారును తీసుకోవడానికి నటాషా & అగస్త్య ఇద్దరు ముంబైలోని డీలర్‌షిప్‌కు చేరుకున్నారు. కారును డెలివరీ చేసిన విషయాన్ని డీలర్షిప్ కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది.
నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ. 2.60 కోట్ల నుంచి రూ. 3.02 కోట్ల మధ్యలో ఉంటుంది. హార్థిక్ పాండ్య కొనుగోలు చేసిన కారు టాప్ వేరియంట్ & కస్టమైజేషన్ మోడల్ అని సమాచారం. ఈ కారణంగానే దీని ధర రూ. 4 కోట్లు వరకు ఉందని తెలుస్తోంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్
ఎక్కువమంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, క్రికెట్సర్స్ ఇష్టపడే కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒకటి. కాగా హార్దిక్ పాండ్యా తన కుమారునికి గిఫ్ట్ ఇచ్చిన కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన మోడల్ అనే విషయం వెల్లడికాలేదు. ఇది 2.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అయితే డిఫెండర్ ఆక్టా వేరియంట్ 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికతో లభిస్తుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ / గం కావడం గమనార్హం. ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ ప్రీమియం కారు, ధరకు తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ప్రీమియం ఫీచర్స్
దృఢమైన నిర్మాణం కలిగిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు 10 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇవి కాకుండా మెరిడియన్ ప్రీమియం ఆడియో సిస్టం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమెరా, హీటెడ్ సీట్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లెదర్ అపోల్స్ట్రే, రబ్బర్ ఫ్లోరింగ్, ఆరు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికులకు ఎక్కువ రక్షణ అందిస్తాయి.
హార్దిక్ పాండ్యా గురించి
టీమిండియా ఆల్ రౌండర్ క్రికెటర్ అయిన హార్దిక్ పాండ్యా 2020లో నటాషాను పెళ్లి చేసుకున్నారు. వీరు 2024లో విడాకులు తీసుకున్నారు. కాగా అప్పటికే ఈ జంటకు అగస్త్య అనే ఒక బాబు ఉన్నాడు. ప్రస్తుతం మహీకా శర్మతో రిలేషన్లో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ.. తన బిడ్డ కోసం కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.