HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్.. పెరిగిన FD వడ్డీ రేట్లు

HDFC బ్యాంక్ 2025 డిసెంబర్‌లో కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్(FD)లపై వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత, మర్చి 2026లో మళ్లీ వడ్డీ రేట్లను పెంచింది. ఈ మార్పు కొత్త పెట్టుబడిదారులకు వర్తిస్తుంది. ఇప్పటివరకు.. సాధారణ ఖాతాదారులకు FD వడ్డీ 2.75 శాతం నుంచి 6.50 శాతం ఉండగా, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం వరకు అందుబాటులో ఉంది.

గత FD రేట్లు

మునుపటి రివిజన్‌లో..సాధారణ ఖాతాదారుల కోసం FD రేట్లు 2.75% – 6.45%, సీనియర్ సిటిజన్లకు 3.25% – 6.95% వరకు ఉండేవి. బ్యాంక్ FD విస్తృత కాలపరిమితుల కోసం 7 రోజులు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ రేట్లు అందిస్తోంది. HDFC బ్యాంక్ వడ్డీ మార్పులు పెట్టుబడిదారుల నిధుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి.

3ఏళ్ల FDపై వడ్డీ పెంపు

ప్రస్తుతం మూడు సంవత్సరాల 1 రోజు నుంచి నాలుగు సంవత్సరాల 7 నెలల మధ్య FDకు సాధారణ ఖాతాదారులకు వడ్డీ 6.40% నుండి 6.50%కి పెంచారు. అదే కాలపరిమితిలో సీనియర్ సిటిజన్లకు వడ్డీ 6.90% నుంచి 7%కి పెరిగింది. ఈ 10 బేసిస్ పాయింట్ల పెంపు కొత్త పెట్టుబడిదారులకు మంచి ఆదాయ అవకాశాన్ని ఇస్తుంది.

HDFC FD లేటెస్ట్ వడ్డీ రేట్లు: సాధారణ ఖాతాదారులకు వడ్డీ

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: 2.75%
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకు: 3.50%
  • 180 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు: 4.50%
  • 1 సంవత్సరం 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: 5.50%
  • 3 ఏళ్ల 1 రోజు నుంచి 4 ఏళ్ల 7 నెలల వరకు: 6.50%
  • 4 ఏళ్ల 8 నెలల నుంచి 10 సంవత్సరాలు: 6.50%

సీనియర్ సిటిజన్లకు వడ్డీ

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: 3.25%
  • 46 రోజుల నుంచి 179 రోజుల వరకు: 4.00%
  • 180 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు: 5.00%
  • 1 సంవత్సరం 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: 6.00%
  • 3 ఏళ్ల 1 రోజు నుంచి 4 ఏళ్ల 7 నెలల వరకు: 7%
  • 4 ఏళ్ల 8 నెలల నుంచి 10 సంవత్సరాలు: 7%

పెట్టుబడిదారుల కోసం సూచనలు

HDFC బ్యాంక్ FD రేట్ల పెంపు అనేది, మార్కెట్ వడ్డీ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. పెట్టుబడిదారులు తాజా రేట్లను తనిఖీ చేసి, సాధ్యమైన ఉత్తమ FD పెట్టుబడిని ఎంచుకోవడం మంచిది. ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని బ్రాంచ్ సందర్శించి తెలుసుకోవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వల్ల ఉపయోగాలు

నిజానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) ఒక భద్రమైన & స్థిరమైన పెట్టుబడి మార్గం. వీటి ద్వారా మనం ఒక నిర్ధిష్ట కాల వ్యవధికి.. ఒక నిర్ధారిత వడ్డీ రేటుతో పెట్టుబడి పెడతాము, దాంతో మనకు అప్పటి వరకు స్థిరమైన లాభం వస్తుంది. FDలలో రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి, నష్టాలు ఉండవు. ముఖ్యంగా ఆర్థిక భవిష్యత్తుకు తగిన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలంటే.. అలంటి వారికి FDలు సరైన ఎంపిక అవుతాయి. అంతేకాక.. వడ్డీపై టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందగల అవకాశం ఉంటుంది. ఇది మొత్తం లాభాన్ని మరింత పెంచుతుంది.

Also Read: డిగ్రీ అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగం.. అర్హతలు, జీతం వివరాలు ఇవే!