ఇది వరకు మనం రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకున్నాం. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తక్కువ ధరలో లభించే.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్స్ గురించి తెలుసుకుందాం.
భారతదేశంలో పబ్లిక్ రోడ్డుపై ప్రయాణించాలంటే.. తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి తప్పకుండా కొన్ని అర్హతలు ఉండాలి. ఈ అర్హతల కారణంగా కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు. అలాంటి వారికి ఇక్కడ చెప్పే ద్విచక్ర వాహనాలు తప్పకుండా సూట్ అవుతాయి.
యులు విన్
ప్రస్తుతం బెంగళూరు వంటి నగరాల్లో ఈ యులు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.59,999 ధర వద్ద లభించే ఈ స్కూటర్.. యులు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 24.9 కిమీ మాత్రమే. తక్కువ వేగం కారణంగానే దీనిని డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది ఓకే ఫుల్ ఛార్జితో 68 కిమీ రేంజ్ అందిస్తుంది. కాబట్టి నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉండటం చేత ఛార్జింగ్ అయిపోయిన తరువాత మార్చుకోవచ్చు.
జెమోపాయ్ మిసో
డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని టూ వీలర్ల జాబితాలో ‘జెమోపాయ్ మిసో’ ఒకటి. భారతదేశానికి ప్రధాన నగరాల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ అధీకృత డీలర్షిప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.44,000 (ఎక్స్ షోరూం, ఢిల్లీ). గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జితో 60 కిమీ నుంచి 75 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ వేగం కూడా తక్కువ కావడం చేత దీనిని కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.
జెలియో లిటిల్ గ్రేసీ
రూ.49,500 వద్ద అందుబాటులో ఉండే.. జెలియో ఈ మొబిలిటీ ”లిటిల్ గ్రేసీ” డ్రైవింగ్ లైసెన్స్ అవసరం మరో ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎందుకుని వేరియంట్ను బట్టి ధర కొంత వ్యత్యాసం ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. ఒక ఫుల్ ఛార్జితో 70 కిమీ నుంచి 75 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ ఏకంగా 150 కేజీల బరువును మోయగలదు. డిజైన్ కొత్తగా ఉంది, ఫీచర్స్ రైడర్లకు అనుకూలంగా ఉన్నాయి.
హీరో ఎడ్డీ
మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. హీరో ఎడ్డీ. ఓకే ఫుల్ ఛార్జితో 85 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్ 30 యాంపియర్ బ్యాటరీ కలిగి.. 25 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ.72,000 (ఎక్స్ షోరూమ్). దీనిని రైడ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.
ఒకినావా ఆర్30 & ఒకినావా లైట్
ఒకేసారి ఛార్జ్ చేస్తే 60 కిమీ దూరం ప్రయాణించే ఒకినావా ఆర్30 కూడా డ్రైవింగ్ అవసరం లేని స్కూటర్లలో ఒకటి. రూ.61,998 (ఎక్స్ షోరూం) ధర వద్ద అందుబాటులో ఉండే ఈ స్కూటర్ 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. గంటకు 25 కిమీ/గం వరకు వేగవంతం అయ్యే ఈ స్కూటర్.. రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఒకినావా కంపెనీకి చెందిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ”లైట్”. దీని ఎక్స్ షోరూం ధర రూ.74,999. ఇందులో 1.25 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఛార్జితో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. దీని కోసం కూడా ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.