చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు.. స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికీ ఇష్టమైన ఆట క్రికెట్. నిజానికి భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.. కబడ్డీకి మన దేశంలో చాలా చరిత్ర ఉన్నప్పటికీ.. నేడు క్రికెట్ జాతీయ క్రీడగా మారిపోయింది. ఇంతకీ దీనికిగల కారణాలు ఏమిటి?, ఎప్పటి నుంచి క్రికెట్ ప్రస్థానం మొదలైంది అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చరిత్ర
భారతదేశంలో క్రికెట్‌కు ఒక చరిత్ర ఉంది. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఈ ఆట ఇండియాలో అరంగేట్రం చేసింది. అప్పట్లో (18వ శతాబ్దంలో) ఈ ఆటను ఉన్నత వర్గాల ఆటగా పరిగణించేవారు. బ్రిటీష్ సైనికులు, అధికారులు ఆడేవారు. ఆ తరువాత కాలంలో ఇండియన్స్ కూడా ఈ ఆటలో పాల్గొనడం ప్రారంభమైంది. ఇలా క్రికెట్ ప్రస్థానం మొదలైంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు కూడా క్రికెట్‌కు పెద్ద ఆదరణ కనిపించలేదు. కానీ బ్రిటీష్ వాళ్లు భారత్ విడిచిపెట్టి వెళ్లిన తరువాత దీనికి ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో ఒక టీమ్ ఏర్పడింది. దీనికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కీలక పాత్ర పోషించింది. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప మలుపు ఏదంటే.. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడమే. ఈ విజయం దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
ఆటగాళ్ల ఆదర్శం!
క్రికెట్‌కు ఆదరణ పెరగడం.. ఆ రంగంవైపు కొత్త వాళ్ల అరంగేట్రం అన్నీ కూడా కొంతమంది ఆటగాళ్ల ప్రేరణ వల్ల సాధ్యమైంది. సచిన్ టెండుల్కర్ క్రికెట్‌లో ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఇది ఎంతోమంది యువతపై ప్రభావం చూపించింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మొదలైనవారు కూడా ఎంతమంది యువ క్రికెటర్లకు ఆదర్శనంగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం గ్రామాల్లో కూడా క్రికెట్ ఆడేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. క్రికెట్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అత్యంత ఆధారణ పొందిన ఆటగా నిలిచిపోయింది అనడంలో అటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విద్యార్థులు ఈ ఆటకు బాగా ఆకర్షితులయ్యారు. ఇందులో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
క్రికెట్ ఆటకు విపరీతమైన ఆదరణ పెరగడానికి మరో కారణం.. టీవీ అనే చెప్పాలి. ఈ ఆటను చాలామంది వినోదం కోసం చూస్తున్నారు. వరల్డ్ కప్ అని, ఐసీసీ వంటివి రావడంతో.. చూసేవారిలో మరింత ఉత్సాహం ఏర్పడింది. చాలా కుటుంబాల్లో.. ఈ ఆటను ఫ్యామిలీతో కలిసి చూస్తారు.
ఆట ఒక సెంటిమెంట్!
అప్పుడెప్పుడో బ్రిటీష్ వాళ్లు పరిచయం చేసిన ఆట.. నేడు మన ఆటగా స్థిరపడిపోయింది. టీమీడియా మ్యాచ్ ఆడుతోందంటే మనమే ఆడుతున్నట్లు, మ్యాచ్ గెలిస్తే మనమే గెలిచినట్లు, ఓడిపోతే మనం ఓడిపోయినట్లు భావించేవాళ్లు మనదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. వరల్డ్ కప్ స్టార్ట్ అయిందంటే.. టీవీలకు అతుక్కుపోయేవారు ఎంతోమంది. ఇలా కాలక్రమంలో క్రికెట్ ఒక సెంటిమెంట్ అయిపోయింది. అందుకే దీనికున్న ఆధారణ పెరిగిపోయింది. బహుశా క్రికెట్ చరిత్ర చాలా మందికి తెలియకపోయినా.. ఆటను మాత్రం బాగా అలవాటు చేసుకున్నారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.