ఒక మనిషి ఆహారం తీసుకోకుండా అయినా ఉండగలడు, కానీ నీళ్లు తాగకుండా ఒక్క రోజు ఉండటం కూడా కష్టమే. అయితే కొంతమంది రోజుకు ఐదు లీటర్ల నీరు తీసుకోండి అని చెబుతారు, మరికొందరు మీకు నీళ్లు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగండి అని చెబుతారు. ఏదైతే ఏం నీళ్లు తప్పకుండా తాగాల్సిందే. కానీ ఎండాకాలంతో పోలిస్తే.. చాలామందికి శీతాకాలంలో నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ కథనంలో శీతాకాలంలో ఎంత నీరు తాగాలి?, ఎంత నీరు అవసరం అనే విషయాలను తెలుసుకుందాం.
శీతాకాలం చెమట అంతగా పట్టదు!
నిజానికి నీరు అనేది ఒక అవసరం. శరీరం తన విధులను సరిగ్గా నిర్వహించుకోవడానికి నీరు తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందే. వేసవి కాలంలో మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కువ దాహం వేస్తుంది. అయితే శీతాకాలంలో శరీరానికి చెమట అంతగా పట్టదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. దీనివల్ల మన శరీరం ఉప్పు శాతం (సోడియం లెవెల్స్) కోల్పోదు. దీనివల్లనే చాలామందికి దాహం అనిపించదు.
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే?
అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. శీతాకాలమైన, వేసవికాలమైన శరీరం తన పని సక్రమంగా చేసుకోవాలంటే.. నీరు అవసరం. వింటర్ సీజన్ కదా.. మాకు దప్పిక లేదు, నీరు తాగము అంటే మాత్రం డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదే జరిగితే శీతాకాలంలో మరీ ప్రమాదం. ఎందుకంటే చలికాలంలో చర్మం, శ్వాసకోశం తేమను కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి లోపం వంటివి జరుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. అంతే కాకుండా.. తక్కువ మొత్తంలో నీటిని తీసుకునేవారిలో మూత్రపిండ వ్యాధులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
డీహైడ్రేషన్ వ్యాధి కానప్పటికీ.. శరీరాన్ని బలహీనపరుస్తుంది. శరీరానికి కావలసిన నీటిని మీరు తీసుకోనప్పుడు.. జీవక్రియ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో కూడా తగినంత నీరు తాగడం చాలా అవసరం.
డీహైడ్రేషన్‌పై చల్లని వాతావరణం ప్రభావం!
చలికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే.. శరీరంలో వణుకు పుడుతుంది. బ్రౌన్ ఫ్యాట్ థర్మోజెనిసిస్ వంటి విధానాల ద్వారా వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల శరీరంలో శక్తి వినియోగం పెరుగుతుంది.. నీటి నష్టాన్ని పెంచుతుంది. దీనివల్ల తలనొప్పి రావచ్చు, కొంతవరకు దృష్టిలోపం కూడా కలిగే అవకాశం ఉంటుంది.
శీతాకాలంలో ఎంత నీరు తీసుకుంటే మంచిది!
- చలికాలంలో నీటిని తీసుకోవడం అనేది లింగం (స్త్రీ, పురుషులు), ఆరోగ్య స్థితిని బట్టి మారే అవకాశం ఉంటుంది.
- పురుషులు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగాలి.
- మహిళలు 6 నుంచి 8 గ్లాసుల నీరు తీసుకోవాలి.
- శారీరకంగా చురుకుగా ఉండే పురుషులు రోజుకు 10-14 గ్లాసుల నీరు తీసుకోవాలి.
- శారీరకంగా చురుకుగా ఉండే స్త్రీలు రోజుకు 8-12 గ్లాసుల నీరు తీసుకోవాలి.
- పాలిచ్చే తల్లులు (స్త్రీలు) రోజుకు 7-10 గ్లాసుల నీరు తాగాలి.
- చలికాలంలో డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే?
- శీతాకాలంలో శరీరం డీహైడ్రేట్ అయినట్లు అనిపించదు. కానీ మీరు ఎప్పటికప్పుడు శరీరం యొక్క నీటి శాతాన్ని పెంచుకుంటూ ఉండాలి.
- శరీరం వెచ్చగా ఉండాలంటే.. గోరువెచ్చని నీరు తాగండి, హెర్బల్ టీ తీసుకోండి & వీలైనంత వెచ్చని ద్రవాలను తీసుకోండి.
- దాహం వేయకపోయినా.. మీతోపాటు ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ నీరును ఉంచుకోవాలి. రోజంతా.. అప్పుడప్పుడూ నీరు తాగుతూ ఉండాలి.
- నారింజ, టమోటా, స్ట్రాబెర్రీ, దోసకాయ, లెట్యూస్ వంటి హైడ్రేటింజి పండ్లు, కూరగాయలు తీసుకోండి. నిద్ర నుంచి మేల్కొనే సమయంలో కూడా ఒక గ్లాస్ నీటిని తీసుకోవడం మంచిది.
- తక్కువ మోతాదులో ఉప్పు ఉన్న సూప్ తీసుకోండి. వీలైనంత వరకు ఉప్పు వినియోగం తగ్గించుకోవడం మంచిది. మీరు తీసుకునే.. ఆహారంలోనే దాదాపు 20 శాతం నీరు వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా పానీయాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవడం కూడా మీకు సహాయంగా ఉంటుంది.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.