ఏపీ డిజీ లక్ష్మి స్కీమ్ 2025: నెలకు రూ. 30వేలు సంపాదించుకునే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి మాత్రమే కాకుండా.. ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతోంది. ఇందులో భాగంగానే మహిళలు ఉన్నతి కోసం ఏపీ డీజీ లక్ష్మి స్కీమ్ ప్రారంభించింది. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు?, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి?, దీని ద్వారా ఎంత సంపాదన వస్తుంది అనే విషయాలను పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.

డీజీ లక్ష్మి స్కీమ్ 2025

మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడంలో భాగంగా ప్రారంభించిన డీజీ లక్ష్మి స్కీమ్ ద్వారా.. డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారాలు, ఆన్‌లైన్ ఆదాయ మార్గాలను ఎలా ఆర్జించాలో నేర్చుకోవచ్చు. దీని ద్వారా ఆర్థికంగా ఎదుగుతారు. టెక్ బేస్డ్ అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద మహిళలు తమ రోజువారీ జీవితంలో కూడా డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలనుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పథకానికి అర్హులు

  • ఏపీ డీజీ లక్ష్మి పథకానికి అప్లై చేసుకోవాలనుకునేవారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.
  • మహిళా సంఘాల్లో (డ్వాక్రా సంఘం) కనీసం మూడేళ్ళ సభ్యత్వం ఉండాలి.
  • దరఖాస్తుదారుల వయసు 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఏదైనా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • పట్టణాల్లో నివసిస్తూ ఉండాలి. అదేవిధంగా కొంత కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

డిజీ లక్ష్మి స్కీమ్ ఉద్దేశ్యం ఏమిటంటే?

  • ఆధునిక కాలంలో మహిళలో డిజిటల్ నైపుణ్యాలను పెంచడం. ఆన్‌లైన్ ద్వారా కొంత ఆదాయం సంపాదించేలా చేయడం.
  • చిన్న వ్యాపారాలు ప్రారభించడానికి ఆర్ధిక చేయూతను అందించడం.
  • మహిళలకు డిజిటల్ సేవలపై అవగాహన కల్పించడం.
  • స్త్రీలకు ఆర్ధిక భరోసాను కల్పించి.. వారిని ఎదిగేలా చేయడం.

ఈ స్కీమ్ ద్వారా ఉపయోగాలు

  • డిజీ లక్ష్మి స్కీమ్ ద్వారా.. మహిళలు నెలకు రూ. 10వేలు నుంచి రూ. 30వేలు వరకు ఆదాయం పొందవచ్చు.
  • ఈ స్కీమ్ ద్వారా.. డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఇంటివద్దనే ఉంటూ.. మహిళలు ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
  • చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి.. అవసరమైన పెట్టుబడి.
  • స్వయం ఉపాధితో.. మహిళలు ఎదగడంతో పాటు కుటుంబం కూడా ఎదుగుతుంది.
  • డిజిటల్ ప్రపంచంలో.. స్కిల్స్ మరియు ఇతర ఉద్యోగావకాశాలపై అవగాహన పొందటం.

ఏపీ ప్రభుత్వం.. ప్రారంభించిన డిజీ లక్ష్మి స్కీమ్ కోసం ఎవరైనా ఏపీ వాసులు అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ప్రత్యేక డిజిటల్ సర్వీస్ సెంటర్లు ప్రారంభించనుంది. ఈ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు ప్రారంభంలో 20 రకాల డిజిటల్ సర్వీసులను అందించనున్నట్లు సమాచారం.

స్త్రీ ఆర్థికంగా అభివృద్ధి చెందితే..

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే.. ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఇల్లు అభివృద్ధి చెందినప్పుడే.. ప్రగతి సాధ్యమవుతుంది. ఒక పురుషుడు ఎదిగితే.. కుటుంబం ఎదుగుతుందో లేదో పక్కన పెడితే.. మహిళలు ఎదిగితే.. తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. అందులోనూ.. ప్రభుత్వం కూడా కొత్త పథకాలను ప్రవేశపెట్టడం అనేది తప్పకుండా ప్రశంసనీయం. దీనిని అర్హత కలిగిన అందరూ తప్పకుండా వినియోగించుకోవాలి. ఇలాంటి మరిన్ని పథకాలు అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి.