ఇలా చేయండి.. ఇంగ్లీష్ మాట్లాడటం ఎందుకు రాదో చూసేద్దాం!!

డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినవారికి కూడా ఇంగ్లీష్ మాట్లాడటం ఒక సమస్యగా మారిపోయింది. దీనిని అధిగమించడానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్లడం, ఆన్లైన్ కోర్సులలో జాయిన్ అవ్వడం వంటివి చేస్తుంటారు. కానీ మనం రోజు కొన్ని విషయాలను సరిగ్గా పాటిస్తే.. తప్పకుండా.. సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

ప్రతిరోజు చదవడం

చదువుతూ ఉండటం వల్ల.. వాక్య నిర్మాణం, పదజాలం ఎలా ఉన్నాయనే విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. న్యూస్ పేపర్, చిన్న కథలు చదవడం ప్రారంభించండి. చదువుతున్నప్పుడే.. వాక్యాలు ఎలా ఏర్పడుతున్నాయి, విరామ చిహ్నాలు ఎక్కడ, ఎలా ఉపయోగిస్తున్నారనే విషయం పరిశీలించండి. ప్రారంభంలో సులభమైనవాటినే ఎంచుకోండి.

చిన్న చిన్న పేరాలను రాయడం

రోజు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే.. పద నిర్మాణం సులభంగా అర్థమవుతుంది. కాబట్టి రెండో దశలో చిన్న చిన్న పేరాలు రాయడం స్టార్ట్ చేయండి. మీరు ఏమి ఆలోచిస్తున్నారో.. దానినే ఇంగ్లీషులో రాయండి. ప్రారంభంలో తప్పులు రావడం సహజమే. కానీ అలవాటు చేసుకుంటూ.. తప్పులను సరిదిద్దుకుంటూ ఉంటే మాత్రం తప్పకుండా అనర్గళమైన ఇంగ్లీష్ మీ సొంతం అవుతుంది.

బేసిక్ రూల్స్ పాటించడం

చాలామంది ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత బేసిక్ రూల్స్ మర్చిపోతుంటారు. టెన్సెస్, సబ్జెక్ట్ – వర్బ్, ప్రిపోజిషన్ అండ్ ఆర్టికల్స్ వంటివన్నమాట. బేసిక్ రూల్స్ ఎప్పుడైతే పాటిస్తూ ఉంటారో.. సులభంగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కొత్త భాష నేర్చుకోవాలంటే.. ప్రాధమిక సూత్రాలు పాటించాలన్నమాట.

గ్రామర్ చెక్ చేసుకోవడం

భాషకు వ్యాకరణం చాలా అవసరం. స్పష్టమైన భాషకు ఇదే (గ్రామర్) ప్రధానం. పద నిర్మాణం జరిగే సమయంలో ఎక్కడ, ఎందుకు తప్పు జరిగింది?, ఏది మిస్ అయిందనే విషయాలను తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. ఇది మీ భాషపై పట్టును పెంచుతుంది.

ఇంగ్లీష్ మాటలు వినండి

చదవడం, రాయడం వంటి దశలు పూర్తయిన తరువాత.. ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉన్నవారి మాటలు వినాలి. ఉదాహరణకు.. పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు, వార్తా ఛానెల్‌లు, సినిమాలు మొదలైనవన్న మాట. అనుభవజ్ఞుల మాటలు మీకు గ్రామర్ మీద పట్టు సాధించేలా చేస్తాయి. వీలున్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి.

తప్పుల నుంచి నేర్చుకోవడం

ఏదైన పని ప్రారభించినప్పుడు.. తప్పులు దొర్లుతాయి. ఆ తప్పుల నుంచే నేర్చుకోవడం ప్రారంభించాలి. మీరు చేసే తప్పులను ఒక నోట్‌బుక్ లేదా డిజిటల్ నోట్‌లో రాసుకోండి. వాటిని సరిచేసుకోవడం వల్ల.. మళ్లీ మళ్లీ అదే తప్పు పునరావృతం కాకుండా ఉంటుంది. ఇది నేర్చుకునే క్రమంలో ముఖ్యమైన అంశం అని మర్చిపోకూడదు.

నిరంతర సాధన (ప్రాక్టీస్)

ఏదైనా పని రావాలంటే.. నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే సాధన చేయాలి. నేర్చుకున్నాం.. మాకు వచ్చేసింది అనుకోవడం చాలా తప్పు. దానిని మననం చేసుకుంటూ ఉంటే.. భాషపై పట్టు వస్తుంది. రోజుకు 10 నిమిషాలైన ప్రాక్టీస్ చేయాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

పైన చెప్పిన లేదు అంశాలను.. మీరు క్రమం తప్పకుండా, రోజూ చేస్తూ ఉంటే.. ఇంగ్లీష్ భాష రాదనుకునే ఎవరికైనా అనర్గళమైన ఇంగ్లీష్ సాధ్యమవుతుంది. ఇంకా కొంచెం కష్టపడితే.. ఇంగ్లీష్ భాషలోనే నవలలు, కవితలు చెప్పే స్థాయికి ఎదుగుతారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.