హ్యుందాయ్ లాంచ్ చేసిన సరికొత్త పెద్ద కారు: ధర ఎంతో తెలుసా

Hyundai Alcazar Facelift Launched in India: భారతదేశంలో ఇప్పటికే అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ.. అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచిన హ్యుందాయ్ కంపెనీ యొక్క ఆల్కజార్ ఎట్టకేలకు సరికొత్త రూపంలో అప్డేటెడ్ కారుగా దేశీయ విఫణిలోకి అడుగుపెట్టింది. దీని పేరు ‘హ్యుందాయ్ ఆల్కాజార్ ఫేస్‌లిఫ్ట్’ (Hyundai Alcazar Facelift). 2021లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు మొదటిసారిగా ఇప్పుడు అప్డేట్ పొందింది.

ధరలు

హ్యుందాయ్ లాంచ్ చేసిన కొత్త ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి పెట్రోల్ వేరియంట్, మరొకటి డీజిల్ వేరియంట్. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 14.99 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్ ధర రూ. 15.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

బుకింగ్స్ అండ్ డెలివరీ

హ్యుందాయ్ తన 2023 ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీనిని రూ. 25000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్నవారికి.. డెలివరీలు త్వరలోనే (పండుగ సీజన్‌కు ముందే) ప్రారంభమవుతాయి.

డిజైన్

2023 హ్యుందాయ్ ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న మోడల్ యొక్క డిజైన్స్ ఇందులో చూడవచ్చు. హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ లాంప్ వంటివి హెచ్ ఆకారంలో ఉండటం ఇక్కడ గుర్తించవచ్చు. నిటారుగా ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ సిల్వర్ ఇన్‌సర్ట్‌లు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి. వెనుక భాగంలో ఉన్న టెయిల్‌గేట్‌లో కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

కలర్ ఆప్షన్స్

కొత్త ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో ఎనిమిది మోనోటోన్ కలర్స్ (టైటాన్ గ్రే మాట్టే, స్టార్రీ నైట్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, రోబస్ట్ ఎమరాల్డ్ మాట్టే మరియు ఫైరీ రెడ్), ఒకటి డ్యూయెల్ టోన్ కలర్ (అబిస్ బ్లాక్ రూప్ విత్ అట్లాస్ వైట్). ఇందులో చెప్పుకోదగ్గ కలర్ ఏదంటే.. రోబస్ట్ ఎమరాల్డ్ మాట్టే కలర్. ఇది చూడటానికి చాలా అద్భుతంగా.. ఒక రేంజ్ రోవర్ మాదిరిగా కనిపిస్తుంది.

ఫీచర్స్

ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో లభించే ఈ హ్యుందాయ్ ఆల్కజార్ మధ్య వరుసలో కెప్టెన్ సీట్లను పొందుతుంది. క్యాబిన్ మొత్తం డ్యూయెల్ టోన్ (బ్లాక్ – బ్రౌన్) కలర్ థీమ్ పొందుతుంది. పెద్ద ప్లోటింగ్ ప్యానెల్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌తో కూడిన డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. హ్యుందాయ్ కొత్త ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ప్రాంతీయ భాషలకు సపోర్ట్ చేసే వాయిస్ కమాండ్స్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్స్ మరియు బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం, రెండో వరుసలో వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ బాస్ మోడ్ఎం డిజిటల్ కీ, యాంబియంట్ లైటింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రియర్ బ్లెండ్, టర్న్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

ఆధునిక కాలంలో కార్లను కొనుగోలు చేసేవారు ధర, ఫీచర్స్ మరియు మైలేజ్/రేంజ్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ ఫీచర్స్ కూడా గమనిస్తున్నారు. కాబట్టి వాహన తయారీ సంస్థలు తమ వాహనాల్లో అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ కంపెనీ తన ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, హిల్ అసిస్ట్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటిని అందించింది.

ఇంజిన్ వివరాలు

ఇక చివరగా చెప్పుకోవాల్సింది హ్యుందాయ్ ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంజిన్ డీటైల్స్. ఈ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 160 హార్స్ పవర్ 253 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజిన్ 116 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు స్నో, సాండ్ మరియు మడ్ అనే డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది.

Don’t Miss: విజేతకు మహీంద్రా థార్ గిఫ్ట్: ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

మైలేజ్ మరియు ప్రత్యర్థులు

కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ కారులోని పెట్రోల్ ఇంజిన్ 17.5 కిమీ/లీ (మాన్యువల్), 18 కిమీ/లీ (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్) మైలేజ్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 20.4 కిమీ/లీ (మాన్యువల్), 18.1 కిమీ/లీ (ఆటోమాటిక్) మైలేజ్ అందిస్తుంది. 2024 ఆల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే దేశీయ విఫణిలో విక్రయానికి ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ700, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.