బ్యాంకింగ్ సెక్టార్ వైవు వెళ్లాలనుకునే వారు లేదా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి Industrial Development Bank of India (IDBI) శుభవార్త చెప్పింది. ఏకంగా 1300 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు మార్చి 19 చివరి తేదీగా నిర్ణయించారు.
అందుకే భారీ నోటిఫికేషన్!
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో అవకాశాలను పెంచే దిశగా IDBI బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ (హైదరాబాద్) సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంక్ శాఖలు విస్తరిస్తున్న సమయంలో.. కొత్త ఉద్యోగాల అవసరం ఏర్పడింది. ఈ కారణంగానే.. ఈసారి భారీ సంఖ్యలో పోస్టులను ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలని చూస్తున్న యువతకు.. IDBI నోటిఫికేషన్ మంచి అవకాశం. ముఖ్యంగా హైదరాబాద్‌లో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు.
1300 పోస్టుల వివరాలు
- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్: 1,100 పోస్టులు
- అసిస్టెంట్ మేనేజర్: 200 పోస్టులు
IDBI ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను బ్యాంక్‌కు చెందిన వివిధ శాఖల్లో నియమించే అవకాశం ఉంది.
అర్హతలు & వయస్సు పరిమితి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే.. ప్రభుత్వ నియమాల ప్రకారం.. రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
IDBI బ్యాంక్.. ఉద్యోగాలకు నియామక ప్రక్రియను మూడు దశల్లో (రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ) నిర్వహించనుంది. ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను తదుపరి దశలకు ఆహ్వానిస్తారు. చివరగా ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగాలు కేటాయిస్తారు.
అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్యాంకింగ్ రంగంలో పోటీ ఎక్కువగా ఉండటంతో, అభ్యర్థులు ముందుగానే సిలబస్‌పై స్పష్టమైన అవగాహనతో సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2026 మార్చి 19. ఆలస్యం చేయకుండా ముందుగా అప్లై చేసుకోవడం మంచిది.
అప్లై విధానం ఇలా
- ముందు అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్మెంట్ సెక్షన్‌ను ఓపెన్ చేయాలి.
- అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
- సూచించిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తును పూర్తి చేయాలి.
బ్యాంకింగ్ ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి
గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగంలో వైపు యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మంచి జీతం, కెరీర్ గ్రోత్ అవకాశాలు ఉండటం వల్ల ఈ ఉద్యోగాలకు పోటీ భారీగా పెరిగిపోయింది. హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
Also Read: కాలేజీ విద్యార్థినులకు EV స్కూటీలు – సీఎం కీలక నిర్ణయం!
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.